జ – జననిగ జయములనిచ్చే
య – యజ్ఞముల కంటే యాగములకంటే
హో – హోమముల కంటే
మా – మానవులకు దానవులకు
తా – తాపసులకు
శ్రీ – శ్రీరామ రక్షగా
అ – అవనిలో నిలచిన అమ్మ అనసూయమ్మను
న – నమ్మిన వారికి
సూ – సూర్యకోటి కాంతులకంటే
యా – యావత్ ప్రపంచమంతా
రా – రాగ రంజితముగా
జ – జయ జయ ధ్వానములతో
రా రాజరాజేశ్వరిగా
జే జే లు పలుకుతూ
శ్వ – అశ్వమేధయాగములలో
ఋత్విక్కుల వేదనాదం మారు మ్రోగంగ
శ్రీ – శ్రీమాతృశ్రీగా
శ్రీ మాతగా అవతరించిన అందరి అమ్మకు
ప – పరిపూర్ణమైన భక్తి భావముతో · రారండి! రారండి!! తరలి రండి !!!
త్ప – భక్తి తత్పరతతో మనసు నిండ అమ్మను
నిల్పుకొని రి – రివ్వు రివ్వున అందరిల్లు అర్కపురికి వచ్చి,
చేయండి, చేయండి అమ్మ నామం.
జయహెూమాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీపరాత్పరి