గగనసీమను – అలంకరించే కాంతి ప్రభంజనాలు,
అఖండ విశ్వసృష్టిని – శాసించే ప్రజ్వలిత
తేజోమయ కల్యాణ ధామాలు – “అమ్మ నేత్రాలు”
ప్రపంచానికి వెలుగు నిచ్చే – చంద్రమండల కాంతులు
వినీల నీలాకాశంలో వెలిగే – శతకోటి నక్షత్ర మండలాలు – “అమ్మ నేత్రాలు”
ప్రజావాహిని – తేజోమయం – చేసే బంగారు కమలాలు
అఖిల జగత్తును – ప్రకాశింప చేసే సూర్యకోటి ప్రభంజనాలు “అమ్మ నేత్రాలు”
జనన – మరణ ప్రయాణంలో వెలుగునిచ్చే సువర్ణజ్యోతులు
సుదీర్ఘ జీవన యాత్రలో – సుందర, మకరంద పారిజాతాలు “అమ్మ నేత్రాలు”.