1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మ పాటలు

అమ్మ పాటలు

Chillara Kusuma Kumari
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 10
Month : May
Issue Number : 10
Year : 2011

ప్రేమ మయీ మా అమ్మా

అనురాగదేవత అనసూయమ్మ

మన్నవవారి పట్టిగ పుట్టి

బ్రహ్మాండమ్మున మెట్టిన తల్లి ॥మన్నవ

బిడ్డల నిలలో ఒడి చేర్చుకొని

అలరించేది అమ్మేలే

త్రిమూర్తులనే పాపలు చేసి

ఊయలలూపిన అనసూయ

 మాతృమూర్తి మా అమ్మ ॥ప్రేమమయీ||

2

మరపురానిది మధురమైనది

అమ్మ సన్నిధి ఎంతహాయి.॥మరపు||

ధ్యానము సేయగ వేచితిని

ధ్యాసే కుదరక వగచితిని

అమ్మ కనులలో అమృత మొలికే 

అది గని నామది ఆనందమందె

 జయహోమాత శ్రీఅనసూయ

రాజరాజేశ్వరి శ్రీపరాత్పరి

అను నీ నామం పలుకును ప్రతినోట

 అదియే అందరికీ సుగమమైన బాట

3

జిల్లెళ్ళమూడియే జీవన స్వర్గం

 అందరి యిల్లే అలరారు నిలయం

అమ్మ నుదుటి కుంకుమయే

అరుణోదయ బింబము అమ్మ కనుల చల్లదనం 

చంద్రోదయ కిరణం -అమ్మ రూపమె అమృతకలశం

అమ్మ సన్నిధే అనురాగ కోవెల

అమ్మ పలుకులే అమృతపు జల్లులు

 అమ్మనామమె ముక్తికి మార్గం

4

అమ్మ అన్నది ఒక కమ్మని మాట

అమ్మ ప్రేమయే అనురాగాల మూట

అమ్మ ఒడియే విరిసిన పూదోట 

అమ్మ చూపించు చక్కని బాట

 అందరికి అమ్మ అనసూయమ్మ 

జిల్లెళ్ళమూడిలో వెలసెను సుమ్మా॥

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!