1. Home
  2. Articles
  3. Viswajanani
  4. ‘అమ్మ పూజా విధానము’ – గ్రంధ వినియోగము

‘అమ్మ పూజా విధానము’ – గ్రంధ వినియోగము

A V R Subramanyam
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : July
Issue Number : 12
Year : 2014

ప్రచురణ మరియు ప్రతులు లభించు చోటు : శ్రీ విశ్వజననీపరిషత్, జిల్లెళ్ళమూడి – 522113, ఫోన్ 30.08643227324, 227492

గ్రంధ లక్ష్యం:

  1. అమ్మ బిడ్డలంతా అనుదినం వారి వారి ప్రాంతాల్లో పూజామందిరాల్లో అమ్మకి మరియు హైమవతీశ్వరికి పూజ చేసుకునేందుకు అనుకూలంగా ఒక విధానాన్ని రూపొందించడం.
  2. ఈ విధానము జిల్లెళ్ళమూడిలో శ్రీ అనసూయేశ్వరాలయం, శ్రీ హైమాలయం దేవ్యాలయాల్లో జరిగే నిత్యపూజా విధానాన్ని అచ్చంగా పోలి ఉండాలి. 

గ్రంధ విశేషాలు :

సో॥॥డా॥ పన్నాల రాధాకృష్ణశర్మగారు శ్రీ అంబికా సహస్రనామస్తోత్రాన్ని రచించారు.

దరిమలా జిల్లెళ్ళమూడిలో – శ్రీ అనసూయేశ్వ రాలయంలో శ్రీ అంబికాసహస్రనామ పూర్వకమైన; శ్రీ హైమాలయంలో శ్రీ లలితాసహస్రనామపూర్వకమైన అర్చనా విధానాన్ని అనుసరింప అమ్మ ఆదేశించింది. కనుక అనుదినం – 

నేడు – శ్రీ అనసూయేశ్వరాలయంలో – 

ఉదయం : మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకానంతరం శ్రీ అంబికా సహస్రనామావళి. మరియు శ్రీ అంబికా అష్టోత్తర శతనామావళులతో అర్చన చేస్తారు.

సాయంకాలం : శ్రీ అంబికా సహస్ర నామావళి, శ్రీ అంబికాత్రిశతీనామావళి, శ్రీ అంబికా ఖడ్గమాలా నామావళి, శ్రీ అంబికా అష్టోత్తర శతనామవళులతో అర్చన చేస్తారు.

(గమనిక : అంబిక అంటే ‘అమ్మ’. )

శ్రీ హైమాలయంలో – 

ఉదయం : మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకానంతం శ్రీ లలితా సహస్రనామావళి, శ్రీ లలితా అష్టోత్తర శతనామావళులతో అర్చన చేస్తారు.

సాయంకాలం : శ్రీ లలితాసహస్రనామావళి, శ్రీ లలితాత్రిశతీనామావళి, శ్రీ లలితాఖడ్గమాలా నామావళి, శ్రీ లలితా అష్టోత్తర శతనామావళి, శ్రీ హైమవతీ అష్టోత్తర శతనామావళులతో అర్చన చేస్తారు. రెండు ఆలయాల్లో రెండు పూటలా మహానివేదనానంతరము మంత్ర పుష్పత్రయాన్ని సమర్పిస్తారు.

గ్రంధవినియోగం :

పాత్రఃకాలం అంబికా సుప్రభాతము, సాయంకాలం అంబికాన్తవకదంబము (నంధ్యావందనము) ఆచరించవచ్చును.

– శ్రీ సూక్తవిధానములో షోడశోపచారములతో అమ్మ, హైమవతీశ్వరి పూజలను నిర్వర్తించవచ్చును.

– గ్రంధములో అనుబంధములుగా తొమ్మిది నామావళులు లభిస్తాయి. యధాశక్తి ఆయా నామావళులను పఠిస్తూ అర్చన చేయవీలగును.

– మంత్రపుష్పత్రయమ్, మంగళహారతులతో పాటు బహుపరాకులు లభ్యమగుచున్నవి. రాత్రివేళ పవళింపు సేవ నిమిత్తము జోలపాటలు పొందుపరచబడ్డాయి.

ఆశయం : భాగవతప్రోక్త నవవిధ భక్తిమార్గాల్లో ‘అర్చనం’ అనేది సగుణ పరబ్రహ్మోపాసన పరంగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నది.

అమ్మ ‘అంబాంబా’, అంటే తల్లులకు తల్లి, జగజ్జనని. పరాత్పరి అమ్మ ‘నామపారాయణ ప్రీత’, ‘భావనామాత్ర సంతుష్ట హృదయ’, ‘క్షిప్రప్రసాదిని’ కనుక సోదరీ సోదరులు అనుదినం పూజా సమయాల్లో పర్వదినాల్లో వీలు వెంబడి ఆయా నామావళులతో అమ్మ- హైమక్కయ్యలను అర్చించి దుర్లభమైన దైవానుగ్రహాన్ని సులభంగా పొందగలరు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!