అమ్మ ప్రసాదం గైకొన రారండి
ఆకలి తీర్చే మహా ప్రసాదం గైకొన రారండి!!
మన ఆకలి తీర్చే మహా ప్రసాదం గైకొన రారండి!!
అలసట ఎరుగని అమ్మ సేవయట
వాడవాడలా అన్న యాగమట
అమ్మ నడుపు ఉద్దండ యజ్ఞమట
అన్నపూర్ణకు అలవాలమట!!
పెట్టు వారలు అమ్మ బిడ్డలట
ప్రేమను పంచే త్యాగ మూర్తులట
ఆకలి బాధలు తీర్చు వారలట
అమ్మ బాటలో నడిచే వారట!!
జగతికొసంగిన దివ్యౌషధమట
ప్రేమతొ పిలిచే అమ్మ కేక యట
అమ్మ నామమే గంట చప్పుడట
అన్నార్తులకు అభయప్రదమట!!