గాడి పొయ్యి భగభగలు
అన్నపు గుండిగ తుకతుకలు
అన్నపూర్ణాలయ గణగణలు
అమ్మ కరుణారస సింధువులు
వాత్సల్యాలయ సుప్రభాతాలు
అనసూయేశ్వర సహస్రాలు
హైమవతీదేవి అభిషేకాలు
నవనాగేశ్వర ఆరాధనలు
విఘ్ననాయకుని అర్చనాదులు
విద్యార్థుల సేవా సహవాసాలు
ఆత్మీయత గల అనుబంధాలు
అందరింటి మధురోహలజాలు
అఖండదీపపు జ్ఞానదీప్తులు
అఖండ నామపు మధురరాగాలు.
హోమశాలపై యజ్ఞధూమాలు
అమ్మ ప్రాంగణ సుమధుర సుందరదృశ్యాలు