వాశిష్టం: యత్రయత్రోదితాసం విద్వేషాం యేషాం యాదాయాదా
తత్ర తత్రోదితం రూపం తేషాం తేషాం తధాతధృ
నేహైవ తత్రనామోర్ధ్వం నాథోనచగమా గమాః
అన్యదేవపదం కించిత్త స్మాద్దేహ గమం హితత్
ఉత్పద్యోత్పద్యతే తత్ర సమం సంవిత్స్వభావతః
స్వసంకల్పైః శమం యాతిబాలసంకల్ప జాలవత్||
తా॥ ఎవరికి ఎచ్చట ఎట్లు ప్రాకన వాసనా జ్ఞానము స్ఫురించుచుండునో వారికి ఆయా తావుల అట్టి రూపములే అగుపడుచుండును. కాని తత్వజ్ఞులకు ఊర్ధ్వ అథో మధ్యదేశ కల్పనయే లేదు. అచట కరుగుటయును లేదు. వారు కేవలము ద్వైతహీనమగు బ్రహ్మమునే గాంచుచుండును. వెనుక చెప్పబడిన లోకములు అజ్ఞుల శరీరప్రాప్తిని నిర్దేశించి అమ్మ. చెప్పబడినవి. అజ్ఞానముననే బాలుని చిత్త కల్పనవలె ఆ బ్రహ్మాండములుత్పన్నములై నశించచున్నవి.
వ్యాఖ్య : అమ్మని ఎవరైనా లోకాలోక వివరణలు భగవంతుని ఉనికి ఏదో లోకములోనో ఎక్కడన్నా ఉన్నదా? మొదలైన ప్రశ్నలు వేసినప్పుడు “నాకు ఇన్ని లోకాలు, పైన ఏదో ఉందని, క్రింద ఏవో ఉన్నవని అనిపించటం లేదు. నా ఎదుట ఉన్నదంతా అదేననిపిస్తుంది. వేరే ఏదో ఉందని, పొందాలని అనిపించటంలేదు. దిగజారాడు అంటూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళాడని, లేక ఏ స్థితి అది కాదని ? ఆ విధంగా అంటారు. దిగజారటం వెళ్ళటం రెండు లేవు. కలదు. దిక్కులను గురించి ప్రస్తావన వస్తే “ఉన్నది ఒకే దిక్కు ఇన్ని దిక్కులు లేవు” అన్నది. అంటే ప్రత్యేకించి ఊర్ధ్వ అధోమధ్య దేశకల్పన లేదు. కనుక దిగజారటమనే ప్రశ్నే లేదు. అంతా ఒకే దివ్యాత్మ కనుక వేరే లోకాలు ప్రత్యేకించి భగవంతుని ఉనికి లేదు. అమ్మ ద్వైత విహీన దివ్యమూర్తి కనుక వేరే లోకాలు అక్కడికి వెళ్ళటం అనే ప్రశ్న లేదు. సర్వత్రా బ్రహ్మమునే చూస్తుంది. సాధారణ జనులకు వారి వారి ప్రాప్తిన వాసనా జ్ఞానము వలన ద్వంద్వాలలో ఉండటం వలన వారికి ఆయా తావులందు ఆయారూపాలు ద్వైత సహిత అనుభూతులు ఉంటాయి. అజ్ఞానముచే ఏర్పడిన శరీరధారులకు ఆయాలోకాల వివరణలు చెప్పబడుతాయి. ఎదురుగా ఏమీ లేకపోయినా బాలుడు ఏదో ఊహించుకుని బెదిరినట్లు, ఉన్నట్లుండి అవి ఏర్పడి మల్లీపోయినట్లు, అజ్ఞానపు చిత్తకల్పన యొక్క అనుభూతి వలె అజ్ఞానులమైన మనకు కూడా ఈ బ్రహ్మాండములు ఉత్పన్నములై నశిస్తున్నట్లు ఉంటాయి. అమ్మ విహీన కనుక సర్వం సజీవంగా, చైతన్యంగా ఒకే స్థితిగా అనుభవించి దర్శిస్తుంది. ఆ వాస్తవస్థితిని తెలియజేస్తుంది. ఇదే తత్త్వం వాశిష్ఠంలో చెప్పబడినది. కనుక వాశిష్ఠం చెప్పిన దివ్యతత్వపు సారమే అమ్మ
వాశిష్ఠం: దర్శనేంఘ తుమే ప్రోక్తా భేదాం మనసి తర్కతః
క్వచిత్కృచిద్వాదకరైప వాదకరైః కిల
తేహి రామనబ్యుధ్యంతే విశిష్యంతే నచక్వచిత్
సర్వాహి శక్తియోదేవే విద్యంతే సర్వగామతః
తా॥ ఓ రామా ! ఏకతర్కపరాయణులగు మతవాదులు తమ తమ శాస్త్రములందచ్చటచ్చట దేహమునో జీవులందు భేదము కల్పించిరో అట్టి వారు వ్యాసాదులచే ఉత్తమశిక్షణ పొందక యుండిరి. మనశ్శక్తి సర్వవ్యాపకము కాన వారి ఈకుతర్క శక్తియు మనస్సును దేవుని యందే
వ్యాఖ్య : అమ్మ “మీరు నేననే శరీరం కాదంటున్నారు. కాని నేను అన్నీ శరీరం, మనస్సూ, జీవాత్మ నేనే అంటాను” అన్నది. కాని సాధారణంగా బయటలోకంలో నేను అంటే ఆత్మ, శరీరం కాదంటారు. అమ్మ వాక్యంలో “నేననే శరీరం” అంటే ఈ శరీరం ఆత్మచైతన్యమే అని ఉంటే, బయటలోకంలో నేను అనే ఆత్మచైతన్యం ఈ శరీరం కాదని అంటున్నారు. అని చెబుతూ కాని తన దృష్టి నుండి అసలు సత్యాన్ని తెలియచేస్తూ శరీరం, మనస్సూ, జీవాత్మ “నేనే” అంటే ఆత్మ చైతన్యమే అని వివరించింది. యదార్ధస్థితి ఏమిటో వాశిష్టం పైన వివరించిన దానిని బట్టి చూస్తే యదార్థవస్తువు నెఱుంగని వారు, కుతర్కపరాయణులయిన మతవాదులు, దేహ మనోజీవులందు భేదముకల్పించిరి అని చెప్పటం జరిగింది. అంటే యదార్థముగా దానిలో భేదం లేదని అంతా ఆత్మ చైతన్యమేనని వాశిష్ఠం కూడా వివరించింది. దైవం సర్వం అయినాడు కనుక సర్వవ్యాపకమయిన మనస్సు కూడా ఆ దైవమే. జ్ఞాన, అజ్ఞానాలు, సంశయ నిస్సంశయాలు, తర్క – కుతర్కాలు సర్వం మనస్సు నుండి వచ్చేవే. ప్రేరణే దైవం. ప్రేరణలో ఇవ్వన్నీ భాగమే. అమ్మ తన మాటలలో “దైవంగా భావించింది నీ మనస్సు. దైవాన్ని కొలిచినది నీ మనస్సు. దైవం అయినది నీ మనస్సు. కనుక నీ మనస్సే దైవం” అని చెప్పినది. తర్క కుతర్కాలు కాని మరి యేదైనా కాని సంకల్పం వలననే కలుగుతవి. ఈ సంకల్పమే దైవం. దానికి మనస్సే ఆధారం. అది సర్వవ్యాపకం కనుక, ఆ మనస్సనే దేవుని యందు ఈ కుతర్క శక్తియూ కలదు” అని వాశిష్ఠం చెప్పినది. అమ్మ మనస్సే దైవమని అన్ని సంకల్పాలు వానిదేనని చెప్పిన విషయాన్ని వాశిష్ఠ్యం పైవిధంగా చెప్పినది. అమ్మ చెప్పిన “అన్ని సంకల్పాలూ వానిదే” అన్నమాటలో వాశిష్ఠం చెప్పిన “మనస్సనే దేవుని యందే ఈ కుతర్కము” అని చెప్పిన విషయము ఇమిడి ఉన్నది. మనస్సనే దేవుని యందు అన్ని సంకల్పాలు ఉన్నవని, దేహ, మనోజీవులు, ఆత్మచైతన్యమేనని, అమ్మ-వాశిష్ఠం చెప్పటం జరిగినది. కనుక రెండూ ఒక్కటే.
సర్గస్తు పరమార్ధస్య సంజ్ఞేత్యేవం వినిశ్చయః
నా నాస్తి నాయ మత్యంత మంబరస్య యధాంబరమ్ ||
తా॥ అజ్ఞానానికి నానా విధములుగా కన్పట్టు ఈ జగత్తు యదార్థముగా ఏ కాలమునను లేనిదే అగును. ఆకసమున మరొక ఆకసము ఉండనట్లు పరమార్థ వస్తువు యందు మరొక పరమార్థ వస్తువు ఉండజాలదు. కావున సృష్టియు పరబ్రహ్మము యొక్క సంజ్ఞయేయని నిశ్చితమగుచున్నది.
అమ్మ, బ్రహ్మ జగత్తు వేరు కాదు. ఇన్ని బ్రహ్మలు లేవు. ఒక్కటే బ్రహ్మ” – అన్నది.
వ్యాఖ్య : అజ్ఞానానికి నానా విధములుగా కన్పట్టు జగత్తు లేదు. అంటే వాస్తవానికి ఇది కూడా బ్రహ్మమేనని, దీనిని జగత్తుగా చూడటం వలన వాస్తవదృష్టి నుండి లేదని వాశిష్ఠం చెప్పినది. ఆకసమున మరొక ఆకసము ఏవిధంగా ఉండదో పరమార్థ వస్తువునందు మరొక పరమార్థ వస్తువు ఉండదని చెప్పినది. మనవారు బ్రహ్మతత్వాన్ని అనేక విధములుగా విభజించి ఆ బ్రహ్మ అని ఈ బ్రహ్మ అని రకరకాలుగా చెబుతారు. ఇన్నిగా అయినది ఒకే చైతన్యం కనుక మౌలికంగా ఇన్ని బ్రహ్మలు లేవని వాశిష్ఠం చెప్పినది, “ఇన్ని బ్రహ్మలు లేవు. ఒకే బ్రహ్మ” అది అమ్మ చెప్పినది, ఒకే సత్యసారాంశం. ఈ జగత్తు యొక్క అస్తిత్వాన్ని వివరిస్తూ అమ్మ “బ్రహ్మ, జగత్తు రెండూ వేరు కాదని” చెప్పినది. వాశిష్ఠం ఇదే విషయాన్ని వివరిస్తూ “సృష్టియూ పరబ్రహ్మము యొక్క సంజ్ఞయే అని నిశ్చయమగుచున్నదని” తన పరిభాషలో అమ్మ చెప్పిన విషయాన్నే తెలియచేసింది.
“ఏన చంచలతాహీనం మనఃక్వచన దృశ్యతే
చంచలత్వం మనోధర్మవహ్నిర్ధర్మో యధోష్ణతా॥
తా॥ ఓ రామా ! చంచలత్వమును విడిచి మనస్సు
ఏ లోకమున ఎచటను కూడా గాంచబడుటలేదు. అగ్నికి ఉష్ణత్వము వలె చంచలత్వమే మనస్సు యొక్క ధర్మము. అమ్మ: లేదు “మీరు మనస్సు నిలవటం లేదు. ఏకాగ్రత కుదరటం అంటున్నారు. నేను దాన్ని స్వభావం అంటున్నాను.
వివరణ : మనోధర్మాన్ని గురించి అమ్మ, వాశిష్ఠం చెప్పినది ఒక్కటే. మనస్సు నిలవటం లేదని చాలా మంది అంటూ ఉంటారు. మన నిత్యానుభవం నుండి సాధారణ మానవులు నిరుత్సాహపడతారు. ఇది లోపమని కుంగిపోయెడి పరిస్థితిని తొలగించి అమ్మ – వాశిష్ఠం చక్కని వివరణ ఇవ్వటం జరిగింది. “అగ్నికి ఉష్ణం ధర్మం అయినట్లు” అని ఉదాహరణతో వాశిష్ఠం చెప్పిన విషయాన్ని అమ్మ స్వభావం అన్నది. చంచలత్వం దాని స్వభావం – ధర్మం అని అమ్మ వాశిష్ఠం చాటి చెప్పటం జరిగింది.
జగత్తు ఎప్పుడూ ఉంటుంది. వచ్చేవాడు వస్తుంటాడు. పోయేవాడు పోతుంటాడు.
నాతో పాటు వచ్చిన మీరందరు కారణజన్ములే. కొలిచేవాడు కోసం కొలవాల్సిన వాళ్ళను పుట్టించుకున్నాడు.