శ్రీ విశ్వజననీ పరిషత్, పూర్వ విద్యార్ధి సమితి సంయుక్తంగా 2021 డిసెంబర్ 10, 11, 12 తేదీలలో వైభవంగా నిర్వహించిన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల స్వర్ణోత్సవాలు 2021లో రాబోయే అమ్మ శత జయంతి ఉత్సవాలకు అంకురారోపణ.
అమ్మ సంకల్ప అనుగ్రహ ఆశీర్వచన సాకారం రూపమే ఓరియంటల్ కళాశాల..
విద్య పరమ లక్ష్యం స్వధర్మాచరణ. Culture is the end of Education అన్నారు స్వామి వివేకానంద.
కళాశాల అనే అమ్మ బడిలోను, అందరిల్లు అనే అమ్మ ఒడిలోనూ ఉన్నత విద్యను ఉత్తమ సంస్కారాన్నీ అభ్యసించిన విద్యార్ధినీ విద్యార్థులు పలు ప్రాంతాల్లో అనేక రంగాల్లో విశిష్ట సేవలనందిస్తున్నారు. అమ్మ ఆచరణాత్మకంగా ప్రబోధించిన జీవన విలువలకు నిలువెత్తు దర్పణం పడుతున్నారు. కనుకనే యావచ్ఛక్తిని వినియోగించి కృతజ్ఞతాపూర్వకంగా రసవత్తరంగా స్వర్ణోత్సవాల్ని నిర్వహించారు. అంటే ఏంచేశారు? త్రయాహ్నిక దీక్షగా సాగిన ఉత్సవ కార్యక్రమాల్లో ప్రభుత్వ ప్రతినిధుల్ని, ప్రజానాయకుల్ని, లబ్దప్రతిష్టులైన మహనీయుల్ని, సాహితీవేత్తలను, విద్యగలసిన గురువరేణ్యలను, SVJP కార్యనిర్వాహక సభ్యులను, కళాశాల నిర్వహణకోసం తపించే అందరింటి సభ్యులను, గ్రామ ప్రముఖులను, వేద విద్యార్థులను వృత్యగానాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో రజింపచేశారు. ఆలయ అర్చకులను గుర్తించి సమ్మానించారు.
ఈ శుభకార్యాన్ని నిర్వహించిన తీరు విద్యార్థిలోకాన్నే కాక అందరింటి సభ్యులనూ ఎంతగానో అలరించింది; పులకరింపచేసింది. శ్రీ బి. రామబ్రహ్మం అన్నయ్య గార్కి జీవనసాఫల్య అవార్డును ఇచ్చి సత్కరించారు. అతిధులను సుమనోహర సుమమాలలచే, దుశ్శాలువల, మనోజ్ఞ జ్ఞాపికలచే, సాదర మృదు మధురోక్తులచే సన్మానించి వారి ఎడల గౌరవాభిమానము లను చాటారు. వారి ఆశీస్సులను అందుకున్నారు. ఐకమత్యం, సంఘటిత శక్తి సౌజన్యదీప్తి అడుగడుగునా అణువణువునా ప్రస్ఫుటమైది. ఈ సాఫల్యానికి హేతువు ప్రత్యక్షంగా గురువుల మార్గదర్శనం, అవ్యక్తంగా అమ్మ ఆశీర్బలం.
స్థావేసు శిష్యనివహై ర్వినియుజ్యమానా
విద్యా గురుం హి గుణవత్తర మాతనోతి
ఆదాయ శుక్తిషు బలాహక విప్రకీర్ణిం
రత్నాకరో భవతి వారిభి రంబు రాశిః॥ (ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్యః స్వమేధయా! పాదం సబ్రహ్మచారి పాఠం కాలక్రమేణము” అన్నట్లు
జిజ్ఞాసువులులైన శ్రద్ధాళువులైన విద్యార్థులు నేర్చుకున్న ప్రజ్ఞావిశేషం వలన గురువుల కీర్తిప్రతిష్టలు __ ఇనుమడిస్తాయి అని. అట్టి విద్యార్ధి బృందాన్ని చూచి గురువులు, గురు శిష్యుల ఆదర్శ ఆచరణను చూసి అందరమ్మ అనసూయమ్మ మురిసిపోతారు.
‘అమ్మవాత్సల్య జలధియై అవని యందు
సంచరించును కారుణ్య సార మనగ
ఎవ్వరైనను ఏ భేద మెంచకుండ
అందరికి అన్నమును పెట్టు ఆదరమున’. అంటూ
దిశానిర్దేశం చేస్తూ, స్వర్ణోత్సవాలు 3 రోజులూ 3 పెళ్ళిళ్ళు చేసినట్లు చాలాబాగా దర్శనీయంగా వీనులవిందుగా జరిగాయి’ అంటూ తమ శుభాశీస్సుల్ని వర్షించారు శ్రీ విరాల రామచంద్రమూర్తి గారు.
“ఛాత్రులెల్లరు తమ సర్వశక్తులొడ్డి
పసిడి పండుగ చేసిరి బడికి నేడు
నేటి సంస్కార బలమింక రాటుదేలి
అమ్మ శతజయంతికి నాంది యగును గాత!’ అని
మంగళాశాసనం చేశారు ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు. అహర్నిశలు శ్రమ స్వర్ణోత్సవ సంబరాల్ని ఘనంగా నిర్వహించి త శిష్యకోటిని చూసి డా॥ వరలక్ష్మిగారు, గారు సంతోషంతో ఉప్పొంగిపోయారు. అందరించి సోదరీ సోదరులు, శ్రీరవి అన్నయ్య ఆనందానికి అంతేలేదు.
“ఊర్ధ్వమూల మధశ్శాఖ మత్యర్థం ప్రాహించవ్యముని
ఛంన్దాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్ అ ప్రబోధించారు కృష్ణపరమాత్మ
కాగా, జిల్లెళ్ళమూడిలో ఉన్నది వటవృక్షం – మట్టిచెట్టు, అమ్మ శుభసంకల్పమే మళ్ళీ చెట్టు జ్ఞాన ప్రజ్ఞాన సర్వస్వం, మట్టిచెట్టు ఊడలు ఎరిగి సూటిగా నేలలోకి చొచ్చుకొనిపోయి స్థిరీకృతమై స్తంభాలుగా రూపాంతరంచెంది తల్లిచెట్టుకి ఆధారభూత మవుతాయి. అమ్మ అనురాగ రక్తాన్ని పంచుకుని, అమ్మ పవిత్రపాదస్పర్శచే ఆధ్యాత్మిక పునర్జన్మ పొంది పరిధ విల్లిన భాగ్యవంతులందరూ మట్టి ఊడలే. కావున అ అశేష సంతానం ముఖ్యంగా యువత (విద్యార్థి బృందం) మాతృ సంస్థకి ఆధారంగా నిలబడి శ్రీమాతృ సే దీక్షాబద్ధులు కావాలి.
అమ్మ ఆచరణాత్మక ప్రబోధం – ప్రేమ, ఆదరణ, సంరక్షణ, సంసేవన, ధర్మాచరణానురక్తి, పరహితార్థ కామన – తపన, త్యాగం, అట్టి లోకోత్తర మహశ్య గుణవైభవాన్ని ఆచరిస్తూ దశదిశలా ప్రచారం, ప్రసారం చేయడం అమ్మ శతజయంతి ఉత్సవ పరమార్ధం.
సమీప భవిష్యత్తులో, 2023లో, మనల నిర్వహించుకునే అమ్మ శత జయంతి ఉత్సవాలకి కళాశాల స్వర్ణోత్సవాలు అంకురారోపణ.