శ్రీ K. నరసింహమూర్తి గారి అధ్యక్షతన సర్వోన్నత కమిటీ అంతర్జాల సమావేశం 25.12.22న నిర్వహించబడింది. అందు 24 మంది సభ్యులు పాల్గొన్నారు.
ముఖ్యాంశములు:
- 26.1.2023 న హైదరాబాద్, రవీంద్రభారతిలో నిర్వహించనున్న అమ్మ సందేశవ్యాప్తి సభ నిమిత్తం, కరపత్రములు, Postal Envelope మున్నగునవి సిద్ధమైనవని శ్రీ నరసింహమూర్తి గారు తెలిపారు.
- జిల్లెళ్ళమూడిలో చేపట్టిన నిర్మాణ పనులు ఏర్పాట్లను శ్రీ గిరిధర్ కుమార్ వివరించారు.
- హైదరాబాద్ (రవీంద్రభారతిలో), విశాఖపట్టణం, రాజాం, కొవ్వూరు, విజయవాడ, తిరుపతి మున్నగు ప్రాంతాల్లో సభల నిర్వహణపరంగా అందు పాల్గొను ముఖ్య అతిథులు, వక్తలు, సభా నిర్వాహకుల వివరాలను ఆచార్య మల్లాప్రగడ వివరించారు.
- పంచాహ్నికంగా నిర్వహించుకునే శతజయంతి ఉత్సవ అనుదిన కార్యక్రమం
- ఉ॥ గం.10.30 నుండి గం.12.30 వరకు వీఠాధిపతులు, ముఖ్య అతిధుల అనుగ్రహభాషణం, ప్రసంగాలు గం.12.30 తర్వాత – అన్నప్రసాద వితరణ సా॥గం.4.00 ల నుండి గం. 5.30ల వరకు
- సాంస్కృతిక కార్యక్రమములు గం. 5.30 నుండి – ప్రముఖుల ప్రసంగాలు.
- కుర్తాళం పీఠాధిపతులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి వారు, బెంగుళూరు రాజేశ్వరీ పీఠాధిపతులు శ్రీకైలాసానంద స్వామి వారు, శ్రీ విశ్వయోగి విశ్వంజీ గారలు ఉత్సవములకు వచ్చుటకు సమ్మతించారు. కంచి పీఠం నుండి వారి ప్రతినిధిని పంపుటకు సమ్మతించారు అని తెలిపారు.
- పూర్వ ఉపాధ్యక్షులు శ్రీ M. వెంకయ్యనాయుడు గారు, బాపట్ల నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కోన రఘుపతిగారు మున్నగు ప్రముఖులను ఆహ్వానించవలసియున్నది.
- సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనుటకు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్, శ్రీ గజల్ శ్రీనివాస్, శ్రీమతి ఈమని కళ్యాణి, శ్రీమతి S.V.శివకుమారి, పూర్వ విద్యార్థి శ్రీకాంత్, శ్రీమతి M. చారుమతీ పల్లవి, వాయులీన విద్వాంసులు డా॥ M.లలిత, శ్రీమతి M. నందిని సోదరీమణులు, శ్రీసూర్యసత్యప్రశాంత్ గారలను ఆహ్వానించెద మని తెలిపారు.
- సావనీరు కమిటీ కార్యదర్శి ఆచార్య మల్లాప్రగడ మాట్లాడుతూ విశ్వజనని మార్చి మరియు – ఏప్రిల్ సంచికలను కలిపి ఒక ప్రత్యేక సంచిక (ఏప్రిల్ నెల) గా ప్రచురించి, శ్రీరావూరి ప్రసాద్ గారి గ్రంధములతో ఉత్సవాలలో అతిధులచే ఆవిష్కరిస్తామని తెలిపారు.
- I.T కమిటీ కార్యదర్శి శ్రీ V. హేమకుమార్ పూర్తి స్థాయిలో App సిద్ధంగా ఉన్నదని తెలియచేశారు.
- Project కమిటీ కార్యదర్శి శ్రీ B. రామచంద్ర సంస్థ చేపట్టిన పథకాలు, పనుల గురించి వివరించగా, ఈ క్రింది పధకాలను ప్రాధాన్యత ఆధారంగా చేపట్టాలని సూచించారు. తదుపరి సమావేశం నాటికి వాటికి అగు ఖర్చు అంచనావేసి సమర్పించాలని సూచించారు.
- ఓంకారనది వద్ద స్మారక కట్టడం.
- తూర్పు వైపు, ప్రహారీగోడవద్ద స్వాగత తోరణ నిర్మాణం.
- ఆలయాలు, ప్రహారీ గోడ పునరుద్ధరుణ.
- వాహనముల నిలుపుదల కోసం ఖాళీస్థలాల్లో ఏర్పాట్లు.
- బాలికల వసతి గృహము, నూతన అతిధి గృహముల నిర్మాణములను పూర్తి చేయుట.
- అందరింటి మరమ్మత్తులు, పునరుద్ధరణ పనులు పూర్తి చేయుట.
- సమాచార కేంద్ర నిర్మాణ పని పూర్తిచేయుట.
- బహిరంగ శౌచాలయ నిర్మాణ పనిపూర్తి చేయుట.
- అమ్మ జన్మస్థలి, మన్నవ లోని స్థలానికి ప్రహారీ నిర్మించుట, పూజారిని ఏర్పాటు చేయుట. 28-3-2023న సామూహిక అనసూయా వ్రతాచరణకు వీలుగా నేలచదును చేసి షామియానాలను ఏర్పాటు చేయుట – ముందస్తు చర్యగా చేపట్టడం. శతజయంతి ఉత్సవాల అనంతరం భవన నిర్మాణము, అమ్మ విగ్రహ ప్రతిష్ఠ చేపట్టుట.
- భోజన వసతి సౌకర్యాల కమిటీ బాపట్ల, పెదనందిపాడు పట్టణాల్లో అతిథుల కొరకు వసతి కోసం ఏర్పాటుచేయుట.
- వైద్య సదుపాయ కమిటీ కన్వీనర్గా డా॥ సిద్ధార్థ వ్యవహరిస్తారని తెలిపారు.
- జ్ఞాపికలు, లాకెట్లు, గ్రంథ ప్రచురణలకు సంబంధించిన విధాన నిర్ణయాలు చేయాలని శ్రీ గిరిధర్కుమార్ గారిని కోరిరి.
- అమ్మ నడయాడిన కాలం విశేష సేవలనందించిన సోదరీ సోదరులను ఉత్సవాల్లో సన్మానించుటకు శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు, శ్రీ DVN. కామరాజు, శ్రీమతి బ్రహ్మాండం వసుంధర, శ్రీ రావూరి ప్రసాద్, శ్రీ Y.V.మధుసూదనరావు గారలతో ఒక కమిటీ నియమించారు. శాంతి మంత్ర పఠనంతో సభ ముగిసింది.