అమ్మ శతజయంతి మహోత్సవాలను వైభవంగా సార్థకంగా నిర్వహించాలనే సంకల్పంతో శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రణాళికా సమావేశం జరిగింది.
హైదరాబాదు శ్రీ వెంకటేశ్వర హెూటలులో జూన్ 26వ తేదీ ఆదివారం జరిగిన ఈ సమావేశాన్ని నిర్వహించటంతో పాటు ట్రస్ట్ చైర్మన్ శ్రీ కె. నరసింహమూర్తి సోదరీ సోదరులకు ఆత్మీయంగా ఆతిథ్యం కూడ అందించారు. అమ్మకు పుష్పార్చనతో ఉదయం 11గం.కు ప్రారంభమై, సాయంత్రం 5గం. వరకు జరిగిన ఈ సమావేశంలో సుమారు 50మంది సోదరీ సోదరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో రానున్న శతజయంతికి నిర్వహించవలసిన అన్ని అంశాలను గురించిన సమాలోచన ఆధారంగా వివిధ విభాగాల రూపకల్పన జరిగింది. వివరాలు, విశేషాలూ త్వరలో వెల్లడిస్తామని ట్రస్టు ప్రకటించింది. – – సంపాదక మండలి, విశ్వజనని