అమ్మ శతజయంత్యుత్సవ
సంబరాలు అంబరాన్నిఅంటే
అడుగడుగునా అమ్మ అగుపించే
అందరియందూ అమ్మే కనిపించే.
కనులపండుగగా అమ్మ కమనీయ చిత్రాలు
వీనుల విందుగా అమ్మ నామ స్మరణ
అమ్మ కోరే విధంగా కొసరి కొసరి తినిపింపు
ఆత్మీయసోదరుల మధుర పలకరింపు.
అమ్మ సందేశాల గుభాళింపు
మహామహుల సన్నిధానం లభింపు
పూజా పునస్కారాల మేళవింపు
యజ్ఞయాగాలతో దేవతలకు ఆరగింపు
పసివయసు నుండి పండువయసు వరకు
పామరులనుండి పండితోత్తములవరకు
సత్యాన్వేషకుల నుండి భాగవతోత్తముల వరకు
అంతఃకరణశుద్ధిగా అమ్మకు ఆత్మ నివేదింపు.
నగరసంకీర్తనలతో శోభాయాత్రలతో నయనాలకు చెమ్మగింపు.
వేదికపై సాంస్కృతిక కార్యక్రమాల జోరు
అంతరంగాలలో ఆనందపు హెూరు
మాటైనా పాటైనా ఆటైనా అన్నీ
అమ్మకు సర్వసమర్పణ తీరు,