‘అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే |
ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్వితాః॥’
‘యో మా మజ మనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్ ।
అసమ్మూఢః స మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే |॥’
సర్వజగత్తుకూ నేనే మూలకారణమనీ, నా వల్లనే సమస్తం నడుస్తున్నదనీ గ్రహించే బుద్ధిమంతులు నన్ను భక్తిభావంతో భజిస్తారు-అనీ, పుట్టుక, ఆది లేనివాడననీ, సమస్త లోకాలకూ ప్రభువుననీ నన్ను తెలుసుకున్నవాడు. మనుషులలో వివేకవంతుడై, పాపాలన్నిటినుంచి విముక్తి పొందుతాడు అనీ గీతాచార్యులు ప్రబోధించారు. అనేక సేవాసంస్థలను జయప్రదంగా నడుపుటకు అమ్మ స్థాపించిన శ్రీ విశ్వజననీ పరిషత్ సంస్థలో ట్రెజరర్గా ఎనలేని సేవలు అందించిన శ్రీ లక్కరాజు రామకోటేశ్వరరావు అన్నయ్యగారు గుంటూరులో 20/01/2025 తేదీ రాత్రి 11 గంటల ప్రాంతంలో అమ్మలో ఐక్యమైనారు అనే ఒక విషాదవార్త చెవులకు సోకగానే విషాదంతో హృదయం బరువైనది.
శ్రీ రామకోటేశ్వరరావు అన్నయ్య గారు గొప్ప స్నేహశీలి. చిరునవ్వులు చిందించే చిదానందమూర్తి. కష్టనష్టాలుంటే మనసులోనే కానీ మోములో ఫలింపచేయని కర్మయోగి, ధాన్యాభిషేక ఉత్సవం జయప్రదం ఫలప్రదం కావటంలో, అన్నపూర్ణాలయం స్వయంసమృద్ధి సాధించటంలో కీలకపాత్ర వహించారు.
ఆయన ప్రత్యేకత – దాతలకు రశీదులు, ప్రసాదం సమయానికి పంపటం, వారికి అమ్మ శేషవస్త్రం అందించటం, సంస్థ ఖాతాలను సక్రమంగా నిర్వహించి ఆడిట్ చేయించటంలో త్రికరణ శుద్ధిగా అమ్మసేవ చేయటంలో ఆయన విజయులైనారు.
ఈ కార్యక్రమాల నిర్వహణే అమ్మసేవగా, తన ఊపిరిగా, అదే అమ్మ అర్చనగా ఎంచి నిరంతర జాగరూకతతో వ్యవహరించి అందించిన వారి సేవలు చిరస్మరణీయం, ఎందరికో ఆదర్శప్రాయం. ఒక వ్యక్తి ఒక ఆధ్యాత్మిక సంస్థ బాధ్యతను తన భుజాలపై వేసుకుని నిబద్ధతతో ఎలా నడపాలో ఆయన చేసి చూపారు, ఆయనలో ఉన్న మరో గొప్ప లక్షణం విద్యను పంచడం అని అందరిచేత మెచ్చుకోబడిన భాగ్యశాలి. ఆయన నేర్పిన విద్య చాలామంది జీవననౌకకి చుక్కానిగా ధృవతారగా మార్గదర్శనం చేసింది.
ఆయన చివరి రోజుల్లో కూడా ఏదో ఫంక్షన్ ఆర్గనైజ్ చేశారు. అందరికీ భోజనాలు సమకూర్చి కార్యక్రమం సుసంపన్నం చేశారు. మరీ ముఖ్యంగా వారు రెండురోజుల క్రితం ఆఫీసుకు వెళ్ళి ధాన్యాభిషేకం గురించి నిర్వాహకులతో చర్చించి తగు సూచనలు ఇచ్చి మరల గుంటూరు వెళ్ళి పచ్చిన తరువాత వస్తానని చెప్పి వెళ్లారని సహవరులు చెబుతుంటే వెస్తుబోవటం మన వంతు అవుతుంది. ఇంతలోనే ఇలా జరగటం చాలా విచారకరం.
వారి జీవితం ఒకసారి అవలోకిస్తే అమ్మ లీలామానుష తత్వం సుబోధకమవుతుంది. ఎవరిని ఎలా కరుణిస్తుందో, ఎవరిని ఎలా ఏ వనికి వినియోగించుకుంటుందో తెలియడు. ఏ ఒక్క వ్యక్తి అనుభవం మరొకరి విషయంలో పునరావృతం కాదు. లక్ష్మి అక్కయ్యను ముందుగా వారి జీవితభాగస్వామిగా వంపి, అందరి అమ్మ భాగ్యలక్ష్మిని తథా దీవించుకునే భాగ్యాన్ని అనుగ్రహించింది.
“మనతో నడిచే వాళ్ళు నలుగురైన చాలు కదా!
నలుగురు మనతో ఉంటే కష్టనష్టాలు ఏమి చేయలేవు.
అందరితో ఉండే ఆనందానికి సాదిలేదు.
సర్వసమర్పణ స్థితి జీవనసూత్రమైతే మరణభయానికి వేడి?
వేరే యోగాభ్యాసాలెందుకు?” – అన్న కవి హృదయానికి తన జీవితం జీవనంతో రూపం ఇచ్చిన చతురుడు శ్రీరామ కోటేశ్వరరావు అన్నయ్యగారు.
“అందరికీ సుగతో” అని చాటిన అమ్మ మనందరం ఎంతో ఆత్మీయంగా పిలుచుకొనే LRK గారికి తన ఒడిలో శాశ్వత సౌఖ్యాన్ని ప్రసాదించే ఉంటుంది. తన సేవలకు ప్రతిఫలంగా అవి చ్ఛిన్నమైన శాంతి ఆయన ఆత్మకు కలిగే ఉంటుంది.
లక్ష్మి అక్కయ్యకి, వారి కుటుంబ సభ్యులుకి మా ప్రగాడ సానుభూతి తెలుపుతూ వారి బాధ్యత ఇక
అమ్మదే!!