27-04-2022: సాయంత్రం శ్రీ అన్నపూర్ణాలయ వేదిక వద్ద హైదరాబాదు వాస్తవ్యులు జరిగినది. శ్రీ ముదిగొండ ఉమామహేశ్, శ్రీమతి నీరజ దంపతుల కుమార్తె కుమారి ధృతి, మరియూ మాతృశ్రీ ప్రాచ్యకళాశాల విద్యార్థిని కుమారి వసంత చేసిన శాస్త్రీయ నృత్యప్రదర్శన అందరినీ అలరించింది.
01-05-2022: హెూమశాలలో చండీ హెూమము జరిగినది. హెూమకార్యక్రమములో ప్రభుత్వ న్యాయవాది శ్రీ యడవల్లి నాగవివేకానంద, శ్రీమతి దుర్గా శ్రీసుధ దంపతులు శ్రీ గాదిరాజు రమేష్ ప్రసాద్, డా॥ శ్రీమతి పద్మజ దంపతులు, శ్రీ వారణాసి ధర్మసూరి శ్రీమతి భగవతి దంపతులు పాల్గొన్నారు.
05-05-2022: జగత్ కళ్యాణమూర్తులైన అమ్మ – నాన్నగారల కళ్యాణమహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి.
08-05-2022: హోమశాలలో సౌరహోమము జరిగినది.
విశ్వజనని మాతృశ్రీ అనసూయామహాదేవి శతజయంతి ఉత్సవముల సందర్భంగా రేటూరు గ్రామములో శ్రీ నాన్నగారు నివాసం ఉన్న ఇంటినుండి జిల్లెళ్ళమూడివరకూ వైభవంగా శోభాయాత్ర నిర్వహించబడింది.
09-05-2022: ఆశ్లేషానక్షత్రం అమ్మ నామ ఏకాహము జరిగినది.
12-05-2022: రాత్రి 9 గం.కు వాత్సల్యాలయములో అమ్మ నామసంకీర్తన, మహాహారతి జరిగినవి.
శుద్ధ ఏకాదశి – శ్రీ అనసూయావ్రతము అమ్మ నామసంకీర్తనాకార్యక్రమములు జరిగినవి. సాయంత్రం 6 గం.కు ఆలయప్రాంగణములో సహస్రదీపాలంకరణ జరిగినది.
13-05-2022: బాపట్ల వాస్తవ్యులు శ్రీ మిన్నెకంటి నాగరాజు గారు, శ్రీమతి ఉషాకిరణ్ దంపతులు తమ కుమారుడు చి॥ సాయిరిషిత్ ఉపనయనము బంధుమిత్రుల సందడితో శ్రీ అన్నపూర్ణాలయ వేదికవద్ద జరుపుకున్నారు. అందరికీ అన్నప్రసాదవితరణ గావించారు.
చెన్నై వాస్తవ్యులు శ్రీ తుర్లపాటి సుబ్రహ్మణ్యంగారు శ్రీమతి కళ్యాణి దంపతులు తమ కుమారుడు చి॥ సాయివెంకటసందీపు ఉపనయనము, కళ్యాణ మంటపములో బంధుమిత్రుల సందడితో జరుపు కున్నారు. అందరికీ అన్నప్రసాద వితరణగావించారు.
14-05-2022: హోమశాలలో నృసింహ హోమము జరిగినది.
15-05-2022: పూర్ణిమ శ్రీ హైమనామ ఏకాహము జరిగినది.
శ్రీ పిల్లలమర్రి శ్రీనివాసరావు గారు, శ్రీమతి శకుంతల దంపతులు తమ కుమారుడు చి॥ మణికంఠ సాయిరాం ఉపనయనము శ్రీ అన్నపూర్ణాలయ వేదికవద్ద బంధుమిత్రుల సందడితో జరుపుకున్నారు.
19-05-2022: బహుళ చవితి హెూమ గణేశ హెూమము జరిగినది.
21-05-2022: బహుళషష్ఠి – శ్రీ హైమవతీ వ్రతము, ‘అమ్మనామ’ సంకీర్తన కార్యక్రమము జరిగినవి.
అఖండనామం చేయు బృందాలకు గ్రీష్మతాప నివారణార్థం Water cooler ను సంస్థ ఏర్పాటు చేసింది.