1-3-2022 : మహాశివరాత్రి సందర్భముగా ఉదయం శ్రీ నవనాగేశ్వరాలయములో పంచామృతము లతో ఏకవార రుద్రాభిషేకము అనంతరము హెూమశాలలో ఏకాదశ రుద్రహవన సహిత దుర్గాసూక్త హెూమము, శ్రీ లక్ష్మీగణపతి హెూమము, నవగ్రహ హెూమము, మహాసుదర్శన హెూమము, మన్యుసూక్త హెూమము, శ్రీ నృసింహమూలమంత్ర హెూమము, అనంతరము పూర్ణాహుతి కార్యక్రమములు జరిగినవి.
రాత్రి లింగోద్భవ కాలములో శ్రీ అనసూయే శ్వరాలయములో 11 మంది ఋత్వికులచే మహాన్యాస పారాయణ, మహాన్యాస పూర్వక మహారుద్రాభిషేకము, అనంతరము శివనామ సహస్రముతో బిల్వార్చన జరిగినవి.
శ్రీ నవనాగేశ్వరాలయములో మహన్యాస కున్నారు. పూర్వక మహా రుద్రాభిషేకము అనంతరము సహస్ర నామార్చన కార్యక్రమములు జరిగినవి. శ్రీ హైమాలయములో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము జరిగినది.
శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయములో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము జరిగినది. మహాశివరాత్రి సందర్భముగ సోదరీ సోదరులు “నాన్నగారి” నామ ఏకాహము నిర్వహించారు.
మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శ్రీ విశ్వజననీ పరిషత్ కార్యనిర్వాహకులు, స్థానికులు, స్థానికేతరులు అభిషేకము, పూజ, హెూమము కార్యక్రమములలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
3-3-2022 : శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయ ప్రసాద్గారి సంస్మరణసభాకార్యక్రమము, వాత్సల్యాయ సభామందిరములో జరిగినది. సోదరీ సోదరులు శ్రీ పి.యస్.ఆర్.గారితో గల ఆత్మీయతానుబంధాన్ని, వారి సేవానిరతిని స్మరిస్తూ ఘనంగా నివాళులర్పించారు.
10-3-2022 : డాక్టర్ శ్రీమతి ఇనజకుమారి గారు (డాక్టర్ పాపక్కయ్య) “అమ్మ” తనను అర్థాంగిగా స్వీకరించిన వివాహవార్షికోత్సవము సందర్భముగ శ్రీవారి చరణసన్నిధి చేరి మల్లెలు, మందారాలు, గులాబీలు, చేమంతులతో శ్రీ చరణార్చన చేసుకొని వివిధ రకముల పండ్లు, నూతన వస్త్రములు సమర్పించి శ్రీవారి దివ్యాశీస్సులందుకొన్నారు. శ్రీ విశ్వజననీ పరిషత్ వారు అమ్మ ఆశీః పూర్వకంగా శేషవస్త్రాల్ని అందించారు.
12–3–2022 : శృంగవరపు కోటవాస్తవ్యులు శ్రీ విన్నకోట భాస్కరశర్మ, కస్తూరి దంపతులు మరియూ విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీ ఏకా చిన్నారావు శ్రీమతి గాజులమ్మ దంపతులు, మాతృశ్రీ గోశాలలో పూజా కార్యక్రమములు నిర్వహించి, “అమ్మ” సేవకు రెండు గోవులను సమర్పించారు. అనంతరము వారితో వచ్చిన 10 మంది సోదరీసోదరులతో కలిసి, శ్రీ హైమాలయములో శ్రీ హైమవతీవ్రతము జరుపుకునారు.
రాత్రి 9 గంటలకు శ్రీ వాత్సల్యాలయములో “అమ్మ” నామసంకీర్తన, మహాహారతి జరిగినవి.
13-3-2022 : విజయవాడ వాస్తవ్యులు శ్రీ పి. కళ్యాణచక్రవర్తి – శ్రీమతి లీలాగీత దంపతులు వారి కుమార్తె చి. షణ్ముఖ చక్రవర్తి అన్నప్రాశన కార్యక్రమము శ్రీ అనసూయేశ్వరాలయములో జరుపుకున్నారు. ఏడాది క్రితము వారు జిల్లెళ్ళమూడి వచ్చినపుడు సంతానం కొరకు అమ్మకు మ్రొక్కుకున్నారట. వారికి పాప జన్మించింది. వారు ఎంతో సంతోషంగా కృతజ్ఞతా పూర్వకంగా “అమ్మ”కు పూజలు చేసుకున్నారు.
13-3-2022 హెూమశాలలో సౌర హెూమము జరిగినది.
14-3-2022 : శుద్ధ ఏకాదశి – శ్రీ అనసూయా వ్రతము ‘అమ్మ’ నామ ఏకాహము జరిగినది.
15-3-2022 : ఆశ్లేషానక్షత్రము – అమ్మ నామ ఏకాహము జరిగినది.
17-3-2022 : పూర్ణిమ – శ్రీహైమనామ ఏకాహము జరిగినది.
21-3-2022 : బహుళ చవితి హెూమశాలలో “సంకష్టహర” గణేశహెూమము జరిగినది.