18-08-2022: విజయవాడ వాస్తవ్యులైన శ్రీసాయి భారద్వాజ సత్సంగ సభ్యులైన 22 మంది సోదరీ సోదరులు అమ్మ శతజయంతి ఉత్సవములు – మరియు శ్రావణమాస సందర్భముగా అమ్మకు సారె సమర్పించారు.“అమ్మ’కు నాన్నగారికి పూజలు గావించి నూతన వస్త్రములు సమర్పించి అమ్మకు పసుపు కుంకుమలు – గాజులు, పుష్పములు, చలిమిడి వివిధ రకముల పిండివంటలు, మధుర ఫలములు నివేదన గావించారు. శ్రీ హైమవతీదేవికి పూజలు గావించి నూతన వస్త్ర సమర్పణ గావించారు.
26-08-2022: ఆశ్లేషా నక్షత్రము అమ్మనామ సంకీర్తన జరిగినది.
28-08-2022: “అమ్మ” శతజయంతి ఉత్సవములలో భాగంగా శ్రీసాయి శృతి మ్యూజికల్ అకాడమి (గుంటూరు) నిర్వాహకులు శ్రీరామరాజు ప్రేమకుమార్ గారి నిర్వహణలో సాయంత్రం శ్రీ అన్నపూర్ణాలయ వేదికపై నిర్వహింప బడిన కార్యక్రమములో శ్రీ రామరాజు ప్రేమకుమార్ గారి కుమారుడు చి. శశాంక్ చేసిన మురళీగాన కచేరి ప్రేక్షకులను ఆనందపరవశులను చేసింది. శ్రీ వల్లూరి కృష్ణకిశోర్, శ్రీ మునిపల్లె ప్రణీత్, చి. సాంబశివరోహిత్, శ్రీ ప్రేమకుమార్ అద్భుతమైన వాద్య సహకారము నందించారు. అనంతరం “అమ్మ” ఆశీఃపూర్వకంగా కళాకారులందరికీ నూతన వస్త్ర బహూకరణ జరిగింది.
5-09-2022: అమెరికాలోని కాలిఫోర్నియాలో వుండే దంపతులు శ్రీ గిల్బర్ట్, శ్రీమతి వెండీ దంపతులు ఇండియా వచ్చిన సందర్భముగ, విశాఖపట్నములోని వారిమిత్రులైన శ్రీ ఆదిభట్ల శాంతారామ్ గారు శ్రీమతి రమణి దంపతులతో కలిసి జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను-నాన్నగారిని శ్రీ హైమవతీదేవిని దర్శించుకొని, పూజలు జరిపించుకొని ధ్యానమందిరములో ధ్యానము చేసుకొని, తమ సంతృప్తిని సంతోషమును తెలిపారు.
చీరాల వాస్తవ్యులు శ్రీ గుడిపల్లి యోహిత్ వంశీ శ్రీమతి నిత్యకళ దంపతులు శ్రీ అనసూయేశ్వరా లయములో తమ కుమార్తెకు నమన్ కోమల శ్రీ గా నామకరణము చేసుకున్నారు.
6-09-2022: శుద్ధ ఏకాదశి – శ్రీ అనసూయా వ్రతము, అమ్మనామ సంకీర్తన కార్యక్రమములు జరిగినవి.
7-09-2022: అమెరికా నుండి ఇండియాలోని వారి స్వస్థలమైన ఒంగోలుకు వచ్చిన శ్రీ నందిగామ ఫణిగారు – శ్రీమతి లక్ష్మీ సుధ దంపతులు వారి పిల్లలు, చి. మనస్వి, చి. మహస్విన్, నేడు జిల్లెళ్ళమూడి వచ్చి “అమ్మను నాన్నగారిని శ్రీ హైమవతీదేవిని దర్శించుకొని శ్రీ అనసూయేశ్వరాలయములో అనసూయావ్రతము చేసుకున్నారు.
10-09-2022: పూర్ణిమ శ్రీ హైమనామ ఏకాహము జరిగినది.
11-09-2022: హెూమశాలలో సౌర హెూమము జరిగినది.
12-09-2022: వాత్సల్యాలయములో రాత్రి 9 గంటలకు “అమ్మ నామ సంకీర్తన” మహాహారతి జరిగినవి.
13-09-2022: బహుళ చవితి హెూమ శాలలో సంకష్టహర గణేశ హెూమము జరిగినది.
16-09-2022: బహుళషష్ఠి – శ్రీ హైమవతీ వ్రతము “అమ్మ” నామ సంకీర్తన జరిగినవి.
16-09-2022: ఒంగోలు వాస్తవ్యులు శ్రీ తూబాటి లీలాకృష్ణమోహన్ శ్రీమతి రమ్యమాధురి దంపతులు, వారి కుమారుడు చి. అర్జున్ నేడు
జిల్లెళ్ళమూడి వచ్చి “అమ్మను నాన్నగారిని శ్రీ హైమవతీదేవిని దర్శించుకొని శ్రీ అనసూయేశ్వరా లయములో “శ్రీ అనసూయావ్రతము” చేసుకున్నారు.
17-09-2022: కావలి వాస్తవ్యులు శ్రీ శ్రీహర్ష గారు, శ్రీమతి మణిమాల దంపతులు వారి కుమారుడు చి. వశిష్ఠ అన్నప్రాశన కార్యక్రమము, శ్రీ అనసూయేశ్వ రాలయములో జరుపుకున్నారు.
20-09-2022: మాతృశ్రీ ప్రాచ్య కళాశాల పూర్వ విద్యార్థులు (2005-2010) నేడు జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మకు – నాన్నగారికి శ్రీహైమవతీదేవికి పూజలు జరిపించి అందరికీ అన్నప్రసాద వితరణ గావించారు.
21-09-2022: మాతృశ్రీ ప్రాచ్యకళాశాల పూర్వవిద్యార్థులు (2015-2020) నేడు జిల్లెళ్ళమూడి వచ్చి “అమ్మను – నాన్నగారిని” శ్రీ హైమవతీదేవిని దర్శించుకొని అందరికీ అన్నప్రసాద వితరణ గావించారు.
21-09-2022: బహుళ ఏకాదశి అనసూయా వ్రతము కార్యక్రమములు జరిగినవి. “అమ్మ నామ సంకీర్తన
22-09-2022: ఆశ్లేషా నక్షత్రము అమ్మ నామ సంకీర్తన కార్యక్రమములు జరిగినది.
24-09-2022 : దసరా నవరాత్రుల సందర్భముగా ఆలయములలో తిరుమంజన కార్య క్రమము జరిగింది. కార్యక్రమములో కళాశాల విద్యార్థినీ విద్యార్థులు, వేదవిద్యార్థులు, ఆలయముల అర్చకులు, ఆవరణలోని అందరింటి సోదరీసోదరులు పాల్గొని ఆలయములను ప్రాంగణములను శుభ్రపరిచారు.