18.03.2023: బహుళఏకాదశి – శ్రీఅనసూయావ్రతము, అమ్మనామ ఏకాహము జరిగినవి.
28.03.2023: విశ్వజనని అన్నపూర్ణేశ్వరి “అమ్మ” శతజయంతి మహోత్సవాలు (1923-2023) 28.03.2023 నుండి 1.04.2023 వరకూ అత్యంత వైభవోపేతముగా జరిగినాయి. ఈ కార్యక్రమములలో పూజ్యులైన పీఠాధిపతులు, పండితులు, ప్రభుత్వాధికారులు, సాంస్కృతిక కళాకారులు, వేలాదిమంది సోదరీసోదరులు పాల్గొన్నారు. ఉదయం 10 గం॥ నుండి సభాకార్యక్రమములు, సాయంత్రం 5 గం॥ నుండి జరిగిన సాంస్కృతిక కార్యక్రమములు అసంఖ్యాకులను ఉత్తేజపరిచినాయి.
28.03.2023 – 01.04.2023 : శ్రీవిశ్వజననీ పరిషత్ ట్రస్ట్ వారు కార్యక్రమములకు విచ్చేసినవారికి విస్తృతమైన సౌకర్యములు కల్పించారు.
శ్రీ హైమవతీదేవి ఆలయప్రవేశ సందర్భముగా శ్రీ హైమాలయములో అభిషేక, పూజా కార్యక్రమములు, శ్రీ హైమవతీ వ్రతములు జరిగినవి. వేలాది సోదరీసోదరులు అమ్మను నాన్నగారిని శ్రీ హైమవతీదేవిని దర్శించుకున్నారు. అత్యంతవైభవంగా పూజా కార్యక్రమములు నిర్వహింపబడినాయి. కార్యక్రమములకు వచ్చిన వేలాది సోదరీసోదరులు జిల్లెళ్ళమూడి మహాక్షేత్రమునకు వచ్చి శ్రీ అనసూయామహాదేవి, అన్నపూర్ణేశ్వరి అమ్మను దర్శించుకొనుట తమ భాగ్యమన్నారు. కార్యక్రమమునకు వచ్చిన కొందరు సోదరీసోదరులు సేవాకార్యక్రమములలో పాల్గొని ఈ అదృష్టం పొందినందుకు ఎంతో సంతృప్తిని తెలియజేశారు. వచ్చిన వేలాదిమంది సోదరీసోదరులకు శ్రీవిశ్వజననీపరిషత్ ట్రస్ట్ వారు ఉదయం ఉపాహారములు, మధ్యాహ్నం, రాత్రి అమ్మ అన్నప్రసాద వితరణగావించారు.
30.03.2023: శ్రీరామనవమి సందర్భంగా శ్రీఅనసూయేశ్వరాలయంలో శ్రీసీతారాముల కళ్యాణోత్సవము వైభవంగా జరిగింది. పూజా, కళ్యాణాది కార్యక్రమములనంతరము సోదరీసోదరులందరూ కళ్యాణమూర్తులకు పుష్పార్చన గావించుకొన్నారు. అనంతరము అందరికీ వడపప్పు పానకము ప్రసాదముగ ఇచ్చారు. శ్రీసుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి పద్మావతి దంపతులు, సోదరీ సోదరులు నామ సంకీర్తన, భక్తి గీతాలాపన గావించారు.
05.04.2023: పూర్ణిమ – శ్రీహైమనామ ఏకాహము జరిగినది.
09.04.2023: బహుళచవితి – హెూమశాలలో సంకటహర గణేశ హెూమము జరిగినది.
12.04.2023: రాత్రి 9 గం॥కు వాత్సల్యాలయములో నామసంకీర్తన మహాహారతి జరిగినవి.
16.04.2023: బహుళ ఏకాదశి – శ్రీఅనసూయా వ్రతము, ‘అమ్మ’ నామఏకాహము జరిగినవి.
2023 మే నెలలో జిల్లెళ్ళమూడి కార్యక్రమాలు
09.05.2023: బ|| చవితి సంకటహర గణేశ హోమము. –
11.05.2023: బ|| షష్ఠి – శ్రీ హైమవతీ వ్రతము, ‘అమ్మ’ నామఏకాహము.
12.05.2023: రాత్రి 9 గం॥కు వాత్సల్యాలయములో ‘అమ్మ’ నామసంకీర్తన, మహాహారతి.
14.05.2023: 2వ ఆదివారం – సౌర హోమము,
15.05.2023: వైశాఖ బహుళ ఏకాదశి – శ్రీఅనసూయావ్రతము. “అమ్మ” నామ ఏకాహము.
26.05.2023: ఆశ్లేషానక్షత్రం – అమ్మనామ ఏకాహము.
31.05.2023: శుద్ధ ఏకాదశి – శ్రీ అనసూయా వ్రతము, ‘అమ్మ’ నామ ఏకాహము.
2023 జూన్ నెలలో జల్లెళ్ళమూడి కార్యక్రమాలు
03.06.2023: పౌర్ణమి – హైమనామ ఏకాహము
07.06.2023: సంకటహర గణేశ హెూమము
09.06.2023: బ|| షష్ఠి – హైమవతీ వ్రతము, ‘అమ్మ’ నామ ఏకాహము
11.06.2023: సౌర హెూమము
12.06.2023 నుండి 14.06.2023 వరకు ‘అమ్మ’ అనంతోత్సవములు
12.06.2023: రాత్రి వాత్సల్యాలయంలో గం. 9.00 లకు ‘అమ్మ’ నామ సంకీర్తన, మహాహారతి
22.06.2023: ఆశ్లేషానక్షత్రం – ‘అమ్మ’ నామ ఏకాహము.
అమ్మలో ఐక్యం
శ్రీ తంగిరాల శ్రీనివాసరావు 21-3-23 వ తేదీన అమ్మలో ఐక్యమైనారు. శ్రీ తంగిరాల సోదరులు, వారి తల్లిదండ్రులు అందరూ చిరకాలంగా అమ్మను, హైమమ్మను అచంచల భక్తి విశ్వాసాలతో అలౌకిక అనుభూతులతో ఆరాధిస్తున్నారు.
శ్రీశ్రీనివాసరావు అమ్మ శతజయంతి మహోత్సవాల ముందు హఠాన్మరణం చెందటం తంగిరాల కుటుంబ సభ్యులందరినీ దుఃఖసాగరంలో ముంచెత్తి వేసింది.
వారి కుటుంబసభ్యులకు శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్టు తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తోంది.