26-01-2023: వసంతపంచమి సందర్భముగ హెూమశాలలో సౌరహెూమము, శ్రీ సరస్వతీహెూమములు జరిగినవి. స్థానికులు, ఇతర ప్రాంతములనుండి వచ్చిన సోదరీసోదరులు హెూమ కార్యక్రమములో పాల్గొన్నారు.
శ్రీపంచమి సందర్భముగ, బాపట్ల వాస్తవ్యులు శ్రీ బత్తుల బాలసాయి, శ్రీమతి అశ్వని దంపతులు, శ్రీ అనసూయేశ్వరాలయములో తమ కుమారుడు చి॥ కియాంషీ అవ్యక్తి అక్షరాభ్యాసము జరుపుకున్నారు.
28-01-2023: రథసప్తమి సందర్భముగ హెూమశాలలో మహాసౌరహోమము, అరుణహోమము, సూర్యనమస్కార కార్యక్రమములు జరిగినవి. కార్యక్రమములో స్థానికులు ఇతర ప్రాంతమునుండి వచ్చిన సోదరీసోదరులు పాల్గొన్నారు.
30-01-2023: పురుషోత్తమపట్నం వాస్తవ్యులు శ్రీ ఈలప్రోలు వెంకటేష్ – శ్రీమతి దివ్య దంపతులు తమ కుమారుడు చి॥ హితేష్ చౌదరి అన్నప్రాశన కార్యక్రమము శ్రీఅనసూయేశ్వరా లయములో జరుపుకొని అందరికీ అన్నప్రసాద వితరణ గావించారు.
01-02-2023: శుద్ధ ఏకాదశి. అనసూయేశ్వరాలయములో శ్రీ అనసూయావ్రతము జరిగినది. సాయంత్రము- శ్రీహైమాలయ ప్రాంగణములో సహస్రదీపార్చన కార్యక్రమము జరిగినది. శ్రీమతి ఈమని సంధ్యగారు, జంట సర్పాకృతి, శివలింగాకృతిలో చేసిన దీపాలంకరణ అందరినీ ఆకర్షించింది. విద్యార్థినులు, తమ సహకారమునందించారు. కుమారి సుబ్బలక్ష్మిగారు కార్యక్రమ పర్యవేక్షణ చేశారు.
05-02-2023: పూర్ణిమ – శ్రీహైమనామ ఏకాహము జరిగినది.
06-02-2023: ఆశ్లేషా నక్షత్రము – అమ్మ నామసంకీర్తన జరిగినది.
09-02-2023: బహుళ చవితి, హెూమశాలలో సంకష్ట హరగణేశహోమము జరిగినది. స్థానికులు, ఇతర ప్రాంతముల నుండి వచ్చినవారు హోమ కార్యక్రమములో పాల్గోన్నారు.
09-02-2023: హైదరాబాదు వాస్తవ్యులు. శ్రీ అన్నంరాజు రామచంద్రరావు గారు, శ్రీమతి సుజాత – దంపతులు, శ్రీనవ నాగనాగేశ్వర ఆలయ ప్రాంగణములో నాగప్రతిష్ఠ గావించారు. కార్యక్రమములలో వారి బంధుమిత్రులు, ఆవరణలోని సోదరీసోదరులందరూ పాల్గొన్నారు.
12-02-2023: బహుళ షష్ఠి – శ్రీహైమవతీవ్రతము- అమ్మనామసంకీర్తన జరిగినవి, రాత్రి 9 గం॥కు వాత్సల్యాలయములో అమ్మ నామ సంకీర్తన, మహాహారతి జరిగినవి.
02-03-2023- శుద్ధ ఏకాదశి సందర్భముగ శ్రీ హైమాలయ ప్రాంగణములో సాయంత్రము. 6 గం॥లకు సహస్ర దీపార్చన కార్యక్రమము జరిగినది. శ్రీమతి ఈమని సంధ్య గారి నిర్వహణలో శ్రీహైమనామమును దీపాలంకృతిలో అలంకరించారు. పర్యవేక్షణ కుమారి సుబ్బలక్ష్మిగారు. విద్యార్థినులు దీపాలంకరణకు తమ సహకారమందించారు. దీపాలంకరణ ఆలయ సందర్శకుల మన్ననలందుకొన్నది.
07-03-2023: పూర్ణిమ. శ్రీహైమనామ ఏకాహము జరిగినది.
10-03-2023: డా॥ శ్రీమతి ఇనజకుమారి గారు. (డా.పాపక్కయ్యిగారు) అమ్మ తనను అర్ధాంగిగా స్వీకరించిన శుభ వివాహ వార్షికోత్సవ సందర్భముగ శ్రీవారి చరణసన్నిధి చేరి, పుష్పమాలాంకృతని చేసి శ్రీ చరణార్చన చేసుకొని, వివిధ రకముల పండ్లూ, ఫలహారములు, నూతన వస్త్రములు సమర్పించి, శ్రీవారి దివ్యాశీస్సులందుకొని అందరికీ అన్నప్రసాద వితరణగావించారు.
11-03-2023: బహుళ చవితి, హోమశాలలో సంకష్టహరగణేశ హోమము జరిగినవి.
12-03-2023: 2వ ఆదివారం, హోమశాలలో సౌరహోమము జరిగినది. రాత్రి 9 గం|| వాత్సల్యాలయములో ‘అమ్మ’ నామసంకీర్తన మహాహారతి జరిగినవి.
13-03-2023: బహుళ షష్ఠి – శ్రీహైమాలయములో శ్రీహైమవతీ వ్రతము జరిగినది.