25-5-2022 : శ్రీ హనుమజ్జయంతికార్యక్రమములు : శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా శ్రీ హైమాలయములో శ్రీ హైమవతీదేవికి వివిధ రకముల, పత్రపుష్పములతో అలంకరణ పూజా కార్యక్రమములు జరిగినవి. కార్యక్రమములలో ఆవరణలోని అందరింటి సోదరీ సోదరులు పాల్గొని, నామసంకీర్తన, 108 పర్యాయములు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ గావించారు. కార్యక్రమానంతరం పించారు. అందరికీ పానకము, అప్పాలు, చిట్టిగారెలు ప్రసాదముగా ఇచ్చారు.
26-05-2022: జిల్లెళ్ళమూడి వాస్తవ్యులు శ్రీ బూదరాజు శ్యామ్ ప్రసాద్ – శ్రీమతి బూదరాజు వాణి దంపతుల మనుమడు శ్రీ బూదరాజు శేషశయన్ శ్రీమతి ఉమాదేవి దంపతుల కుమారుడు చి. నాగరత్న మోహిత్ ఉపనయనము బంధుమిత్రుల సందడితో శ్రీ అన్నపూర్ణాలయ వేదిక వద్ద జరిగింది.
28-05-2022 నుండి 1-6-2022 నవనాగేశ్వర ఆలయ వార్షికోత్సవములు వైభవంగా జరిగినాయి. ఏకాదశరుద్రాభిషేకములు, హెూమాది కార్యక్రమములు పూర్ణాహుతి కార్యక్రమము నిర్వహింప బడినవి.కార్యక్రమములలో శ్రీ బ్రహ్మాండం రవీంద్ర రావు గారు, శ్రీమతి వైదేహి దంపతులు, శ్రీ వారణాసి ధర్మసూరిగారి కుటుంబసభ్యులు, శ్రీ రాచర్ల రహి కుటుంబ సభ్యులు, స్థానిక, స్థానికేతరులు కార్య క్రమములలో పాల్గొన్నారు.
పూజాహెూమాది కార్యక్రమముల నిర్వహణ, జిల్లెళ్ళమూడి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ చుండి శర్మ – వేదపాఠశాల గురువులు శ్రీ మురికిపూడి నవీన్ సందీప్ శర్మ – శ్రీ అవ్వాది ఉమాశంకరదీక్షితులుగారి బృందము శ్రీ విష్ణుభట్ల లక్ష్మీ సోమయాజులుగారి బృందము.
1-06-2022: సాయంత్రం శ్రీ అన్నపూర్ణాలయ వేదికపై అమ్మనాన్నగారల శాంతి కళ్యాణ మహోత్సవము జరిగినది. శ్రీ వారణాసి ధర్మసూరిగారి కుటుంబసభ్యులు శ్రీ రాచర్ల రహి కుటుంబ సభ్యులు కళ్యాణకార్యక్రమము నిర్వహించారు. కార్యక్రమములో సోదరీ సోదరులందరూ పాల్గొన్నారు. శ్రీ చుండి నవీన్ శర్మ కళ్యాణ కార్యక్రమము జరిపించారు
1-06-2022 నుండి 4-6-2022 శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ వార్షికోత్సవములు: శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ వార్షికోత్సవములు వైభవంగా జరిగినాయి. వార్షికోత్సవముల సందర్భంగా జరిగిన ఏకాదశ రుద్రాభిషకములు ‘గ’ కార సహస్ర నామార్చన, అష్టగణపతి హెూమములు సహస్ర నామార్చన కార్యక్రమములలో స్థానికులు ఇతర ప్రాంతముల నుండి వచ్చిన సోదరీ సోదరులు పాల్గొన్నారు.
4-06-2022: పెరలి గ్రామస్తులు శ్రీ పెరలి వెంకటసాయి తేజ – శ్రీమతి రాజ్యలక్ష్మి దంపతులు తమ కుమార్తె చి. మహతి ప్రణవి అన్నప్రాసన అనసూయేశ్వరాలయంలో జరుపుకున్నారు.
5-06-2022: ఆశ్లేషానక్షత్రము అమ్మ నామ సంకీర్తన జరిగినది.
9-06-2022: బాపట్ల వాస్తవ్యులు కొండముది ప్రేమకుమార్ – శ్రీమతి సుబ్బలక్ష్మి కుమారుడు చి. రామకృష్ణకాశ్యప్ ఉపనయనము శ్రీ అన్నపూర్ణాలయ వేదిక వద్ద వైభవముగా జరిగింది. బంధుమిత్రులు చి. రామకృష్ణకాశ్యప్కు శుభాశీస్సులు తెలిపారు.
9-06-2022: విశాఖపట్టణం వాస్తవ్యులు మంగళపల్లి ఆదినారాయణమూర్తి – శ్రీమతి పద్మ దంపతులు తమ కుమార్తె చి.ల.సౌ. అపర్ణ వివాహ నిశ్చితార్థము చి. శశాంక్ గారితో అమ్మ దివ్య సన్నిధిలో జరుపుకున్నారు.
9-06-2022: చి.వైభవ శర్మ చి.ల.సౌ. అచ్యుత శ్రీకళ (శ్రీ తంగిరాల కేశవ అన్నయ్యగారి మనుమడు, మనుమ రాలు) వివాహము శ్రీ అన్నపూర్ణాలయ వేదికపై వైభవంగా జరిగింది. కార్యక్రమమునకు విచ్చేసిన సోదరీ సోదరులు తెలిపారు. నూతన వధూవరులకుల శుభాశీస్సులు తెలిపారు.
10-06-2022: జిల్లెళ్ళమూడి వాస్తవ్యులు శ్రీ ప్రేమటెర్రీ – శ్రీమతి జానకీ కళ్యాణలక్ష్మిగారల కుమారుడు చి.రేఖా శివరామకృష్ణ ఉపనయనము కళ్యాణమండపములో సందడిగా జరిగింది. వచ్చిన వారు చి. శివరామకృష్ణకు శుభాశీస్సులు తెలిపారు.
10-06-2022: ఖాజీపాలెం వాస్తవ్యులు శ్రీ బొప్పూడి ప్రేమ్చరణ్ – శ్రీమతి కిరణ్మయి దంపతులు కుమారుడు చి. విజయార్తీక్ ఉపనయనము అన్నపూర్ణాలయ వేదికవద్ద జరిగింది. చి. విజయా కార్తీక్ కు అందరూ శుభాశీస్సులు తెలిపారు.
11-06-2022: శుద్ధ ఏకాదశి శ్రీ అనసూయా వ్రతము “అమ్మ” నామ సంకీర్తన జరిగినది. ఆలయ ప్రాంగణములో సహస్ర దీపాలంకరణ సేవ జరిగినది.
14-06-2022: పూర్ణిమ – శ్రీ హైమనామ ఏకాహము జరిగినది.
17-06-2022: బహుళ చవితి సంకష్ట హర గణేశ హెూమము జరిగినది.
17-06-2022: విజయవాడ వాస్తవ్యులు శ్రీ నంబూరి చిరంజీవిగారు, వారి కుమారుడు కోడలు అమెరికా నుండి స్వదేశము వచ్చిన సందర్భముగా నేడు వారితో జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మకు, నాన్నగారికి – శ్రీ హైమవతీదేవికి – పూజలు జరిపించి శ్రీ అనసూయేశ్వరాలయములో “శ్రీ అనసూయా వ్రతము” చేసుకున్నారు.
18-06-2022: బెంగుళూరు వాస్తవ్యులైన శ్రీ నందకుమార్ గారు, శ్రీమతి విమల దంపతులు నూతన దంపతులైన తమ కుమార్తె చి.ల.సౌ. విశ్విత అల్లుడు చి. కార్తీక్ గారితో జిల్లెళ్ళమూడి వచ్చి “అమ్మకు” నాన్నగారికి, శ్రీ హైమవతీదేవికి పూజలు జరిపించారు.
19-06-2022: శ్రీ హైమవతీవ్రతము – అమ్మ నామ సంకీర్తన జరిగినది.