23-07-2011: బాపట్ల ఎమ్.ఆర్.ఒ. శ్రీ గంగవరం వేంకటశివరామఫణీంద్రబాబు, శ్రీమతి విజయలక్ష్మీ తమ 6 నెలల పాప చి|| మీనాక్షి అన్నప్రాసనకు బంధుమిత్ర సపరివారంగా వచ్చి అమ్మ ఆలయంలో జరుపుకున్నారు. ఆవరణలోని అందరికీ అమ్మ ప్రసాదం అందించారు.
03-08-2011: పదకొండు రోజులు పై కార్యక్రమమును నిర్వహించినవారు శ్రీ మన్నవ నరసింహరావు దంపతులు (పుట్టినింటి తరపున సంస్థతరపున) 06-08-2011: శ్రీ కె.సుబ్రహ్మణ్యం (బుద్ధిమంతుడు) దంపతులు (అట్లబంతి)
07-08-2011: బోళ్ళ వరలక్ష్మీ వారి కుమార్తెలు శ్రీమతి సరోజిని, శ్రీమతి తులసీ అరిసెలు బంతిలో వడ్డించారు.
08-08-2011: శ్రీ ప్రేమచంద్, శ్రీమతి గౌతమి గుంటూరు నుండి వచ్చి తమ చిరంజీవి శ్రీవర్షిణి అన్నప్రాసన అమ్మ ఆలయంలో జరుపుకున్నారు.
09-08-2011: ఏకాదశి సందర్భంగా అనసూయేశ్వరాలయంలో జరిగిన అనసూయా వ్రతంలో శ్రీ మతుకుమల్లి రాము శ్రీమతి శారద పాల్గొన్నారు. అమ్మ నామ ఏకాహం జరిగింది.
12-08-2011: పౌర్ణమి సందర్భంగా హైమాలయంలో హైమవతీదేవి నామ ఏకాహం జరిగింది. ప్రతి నెల 12వ తేదీ అమ్మ ఆలయప్రవేశం చేసిన తేదీ ప్రకారం రాత్రి 9-40 నుండి 10-30 వాత్సల్యాలయంలో సంకీర్తన జరిగింది.
శ్రావణ శుక్రవారం సందర్భంగా హైమాలయంలో శ్రావణ శుక్రవార వ్రతం జరిగింది. ఆవరణలోని అక్కయ్యలు ఓరియంటల్ కాలేజి విద్యార్థినులు, ఊరిలోని వారు, ఇతర ప్రదేశములనుండీ వచ్చినవారు వ్రతంలో పాల్గొన్నారు.
13-08-2011: 3/8 నుండి 13/8 వరకూ అమ్మ సమర్త పేరంటం మహా వైభవంగా అన్నపూర్ణాలయం డయాసు వద్ద జరిగింది. శ్రీమతి వసుంధర అక్కయ్య అమ్మ చేయించిన పద్ధతిలోనే వేడుకను పూర్తిగా దగ్గరుండి జరిపించారు. అమ్మను చక్కగా అలంకరించి ప్రతిరోజు సాయంత్రం సంస్కృత కళాశాల విద్యార్థినులు, ఆవరణలోని వారు కోలాటం పాటలతో డయాస్పై అలంకరించి పూజ చేసి, చిమ్మిలి పాటలతో చిమ్మిలిదంచి పాటలు పాడి అందరికీ అమ్మ ప్రసాదం పంచారు. శ్రీహనుమబాబుగారి సహాయంతో వసుంధర అక్కయ్య 11 రోజులు కడు ఎభవంగా పై కార్యక్రమం జరిపించారు.
14-08-2011: పరిషత్ అధ్యక్షులు శ్రీమరకాని దినకర్ ఇంగ్లీషులో ‘సోజోర్న్’ పేరిట అనువాదం చేసిన పావక ప్రభను శ్రీ బ్రహ్మాండం రవీంద్రగారు ఆవిష్కరించారు.
15-08-2011: ఆగష్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం భారతదేశానికైతే అన్నపూర్ణాలయ వార్షికోత్సవం మనకు. ఈ సందర్భంగా ఉ. 8 గంటలకు అందరింటి వద్ద అమ్మ పతాకం ఆవిష్కరించి విద్యార్థులను ఉద్దేశించి శ్రీ దినకర్, శ్రీ గోపాలన్నయ్య ప్రసంగించారు. తదనంతరం ఓరియంటల్ కాలేజీలో జెండావందనం జరిపారు. అన్నపూర్ణాలయ సిబ్బందికి, ఆఫీసు సిబ్బందికీ అందరికీ నూతనవస్త్రాలు బహుకరించారు. తదుపరి అన్నపూర్ణాలయం కల్యాణవేదిక వద్ద వేంచేసిన అమ్మ విగ్రహం శ్రీ యుతులు బ్రహ్మాండం రవీంద్రరావు అన్నయ్య ఆవిష్కరించారు. శ్రీ జొన్నాభట్ల సుబ్రహ్మణ్యం అమ్మ విగ్రహం అలంకరించి వేదికపై పూజచేశారు. ఉదయం కల్యాణమండపంలో కీ. శే. శేషగిరి రావు అన్నయ్య శతజయంతి సందర్భంగా సభ నిర్వహింపబడి వారి కుటుంబ సభ్యులను సత్కరించారు.
17-08-2011: సంకటహర గణేషహోమము జరిగింది. ఇందులో శ్రీ యస్.మోహన కృష్ణ, శ్రీమతి దామరాజు భానుమతి చి॥ కౌశిక్ చి॥కొప్పోలు రాఘవేంద్ర కిరణ్ కుమార్, శ్రీమతి వాణి, శ్రీ టి.టి. అప్పారావుగారు, శ్రీమతి కుసుమాంబ, చి|| హరీష్ శ్రీమతి పద్మావతి, శ్రీమతి రుక్మిణి ఇందులో పాల్గొన్నారు.
21-08-2011: సౌరహోమములో యన్. సరళా కృష్ణమూర్తి, శ్రీమతి సీత, శ్రీమతి సరస్వతి శ్రీకృష్ణబాబు దంపతులు, ఖాజావలి, శ్రీమతి భానుమతి, శ్రీ చుండి రామకృష్ణ, శ్రీమతి లక్ష్మీసరోజలు పాల్గొన్నారు.
21-08-2011: కృష్ణాష్టమి సందర్భంగా అనసూయేశ్వరాలయంలో సాయంత్రం అమ్మ నామసంకీర్తన, కృష్ణనామ సంకీర్తన చేసారు. మోడికారం నివేదన చేసి అందరికీ ప్రసాదం పంచారు.