22-09-2011 : శ్రీ వై.వి. శ్రీరామమూర్తిగారు శ్రీమతి లలిత అక్కయ్య తమకోడలు శ్రీమతి లక్ష్మీరమ సీమంతం అనసూయేశ్వరాలయంలో వసుంధర అక్కయ్య ఆధ్వర్యంలో జరుపుకున్నారు.
23-09-2011 : శుద్ధఏకాదశి సందర్భంగా అలంకార హైమాలయం వద్ద అమ్మనామ ఏకాహం జరిగింది.
23-09-2011 : చీరాల నుండి వచ్చిన ఎన్.వి. కృష్ణారావుగారు, శ్రీమతి నాగేశ్వరమ్మ తమ స్నేహితులతో కలసి వచ్చి అనసూయేశ్వరాలయంలో లలితా పారాయణం చేసారు.
27-09-2011 : అలంకార హైమాలయం వద్ద సప్తసప్తాహాలు ఉదయం 6-30 గంటలకు ప్రారంభించ బడినవి. ఇందులో హైద్రాబాద్ నుండి శ్రీమతి పోత్తూరు విజయలక్ష్మిగారు శ్రీ శివగావుగారు, శ్రీ వి. ధర్మసూరిగారు, శ్రీ బి. రామబ్రహ్మం గారు ఇతర ప్రదేశాల నుండి రాగా స్థానికులు, శ్రీ ఎమ్.దినకరుగారు, శ్రీ గోపాలన్నయ్య, శ్రీ భాస్కరన్నయ్య, శ్రీ లక్ష్మణరావు అన్నయ్య, శ్రీ వై.వి. శ్రీరామమూర్తి గారు, టి.టి. అప్పారావుగారు, శ్రీ యల్.రామకోటేశ్వరరావు ఇందులో పాల్గొనగా, శ్రీ సుబ్రహ్మణ్యంగారు, శ్రీమతి పద్మావతిగారు సప్త సప్తాహాలలో నామం ప్రారంభించారు.
28-09-2011 దసరా మొదటిరోజు, బాలాత్రిపురసుందరిగా అమ్మను అలంకరించగా, ఓణీలో హైమక్క అందంగా అలరారింది. త్రికాల పూజలతో ఆవరణలోని వారు వివిధ ప్రదేశాల నుండి వచ్చినవారు పాల్గొన్నారు. వూరిలోని అక్కయ్యలు పూజలలో పాల్గొన్నారు.
29-09-2011 : దసరా రెండవరోజు పూజలలో కంకిపాడు కీ||శే|| డాక్టర్ కేశవరావుగారి సతీమణి శ్రీమతి కృష్ణవేణి పిన్ని, వారి కుమార్తె శ్రీమతి బొడ్డపాటి సుబ్బలక్ష్మి గారు కూడా అందరితో కలసి పూజ చేసుకున్నారు. అమ్మ గాయత్రీ అవతారంలో మోహనంగా వున్నారు. దసరా పూజలలో పాల్గొనుటకు ఇతర ప్రదేశముల నుండి వచ్చినవారిలో శ్రీమతి వీణ, శ్రీ బి. గిరధర్కుమార్, శ్రీమతి శివకుమారి, శ్రీమతి ఆర్.శేషు, శ్రీమతి పద్మ, శ్రీమతి మాధవి, భానుమతి, శ్రీమతి కమల అక్కయ్య, శ్రీమతి భగవతి, శ్రీనాగరాజు, శ్రీమతి ఉష పూజలలో పాల్గొన్నారు.
30-09-2011 : దసరా మూడవరోజు మహలక్ష్మిగా అమ్మను సర్వాంగసుందరంగా అలంకరించారు. 4వరోజు అన్నపూర్ణగా చేతిలో పెరుగు గిన్నె వివిధరకాల కూరగాయలతో మాలలు అల్లి అమ్మను, హైమక్కను అలంకరించారు. 5వరోజు త్రిపురసుందరిగా చేతిలో చిలుక, చెరుకుగడ, పాశం, అంకుశంతో అమ్మ దర్శనం ఇచ్చారు. ఈ రోజు హైద్రాబాద్ నుండి తంగిరాల లక్ష్మి అక్కయ్య (కీ॥శే॥ తంగిరాల రాధ అన్నయ్య భార్య) తమ పిల్లలతో వచ్చి అమ్మను అర్చించుకున్నారు.
2-10-2011 : గుంటూరు వాస్తవ్యులు శ్రీ కట్టమూరు వెంకటేశ్వరరావుగారి తనయుడు చి|| అనసూయేశ్వర్కు ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్యోగం వచ్చిన సందర్భంగా అమ్మకు పూజ చేసుకుని ప్రధమజీతం అమ్మకు సమర్పించారు.
జాండ్రపేటనుండి వచ్చిన కటకం హనుమయ్యగారు కుటుంబసభ్యులతో వచ్చిన అమ్మను అర్చించుకున్నారు. విశాఖపట్నం నుండి శ్రీ పి.వి. సుబ్బారావుగారు, శ్రీమతి ఉమ, హైద్రాబాద్ నుండి శ్రీ పొత్తూరి ప్రేమగోపాల్, శ్రీ కె.యస్. రామారావుగారు, శ్రీమతి దుర్గపిన్ని, ఏలూరు నుండి శ్రీ ఉమామహేశ్వరరావుగారు, శ్రీమతి జయలక్ష్మి, జొన్నాభట్ల సుబ్రహ్మణ్యం, శ్రీమతి లక్ష్మి, చి॥బిందు, బి.జి.కె. శాస్త్రిగారు, శ్రీమతి సుబ్బలక్ష్మి అక్కయ్య పూజలలో పాల్గొన్నారు.
3-10-2011 : హోమశాలలో దసరా సందర్భంగా చండీహోమము జరిగింది. ఇందులో శ్రీ విజయకుమార్ శర్మ ఆధ్వర్యంలో చి॥వంశీ పాల్గొన్నాడు.
4-10-2011 : కీ॥శే॥ కొండముది రామకృష్ణ. అన్నయ్య రెండవ కుమారుడు కీ॥శే॥ కొండముది సుధాకర్ సంవత్సరీకాలు జిల్లెళ్ళమూడిలో 2, 3, 4 తేదీలలో జరిగాయి.
5-10-2011 : అమ్మను నప్తమినాడు సరస్వతీదేవిగా, అష్టమినాడు దుర్గాదేవిగా, నవమినాడు మహిషాసురమర్దినిగా అందరూ అర్చించారు అమ్మకు 3, 4, 5 తేదీలలో రెండు పూటలా ఉదయం, సాయంత్రం పూజలో కిరీటం అలంకరించారు. త్రికాలాలు వివిధ రకముల హరతులిచ్చారు. రాత్రిపూట చతుర్ వేదపారాయణం జరిగింది. నవరాత్రులు వైభవంగా జరిగినవి.
నెల్లూరు వాస్తవ్యులు శ్రీ ఈమని కుమారశాస్త్రి శ్రీమతి పార్వతి తమ పుత్రిక కుమారి లావణ్య వివాహ సందర్భంగా జిల్లెళ్లమూడిలో పెండ్లికూతురుని చేసుకున్నారు. ఆవరణలోని అందరూ వధువును ఆశీర్వదించారు.
6-10-2011 : దసరా పూజలు పూర్తి ఐన సందర్భంగా ఆలయాలలోని నిర్మాల్యం ఓంకారనదిలో నిమజ్జనానంతరం ఆలయాలలో నిత్యపూజలు యధావిధిగా జరిగినవి. సాయంత్రం 6 గంటలకు చి॥ప్రేమ, సుజాత అక్కయ్య అమ్మకు, శమీ వృక్షానికి పూజ చేసుకున్నారు. అనంతరం ఆవరణలోని వాళ్ళు వివిధ ప్రదేశాల నుండి వచ్చినవారు అందరూ ‘శమీ శమయతే పాపం’ అంటూ ప్రదక్షిణలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
7-10-2011 : నరసరావుపేట నుండి వచ్చిన చింతలపాటి లావణ్య చదువుకుంటూ ఉద్యోగం చేస్తూ వుంది. అందులో తనకు వచ్చిన మొదటి జీతం మొత్తం అమ్మకు సమర్పించి ఆలయంలో అమ్మను అర్చించుకుంది. లావణ్యకు కున్నారు. బి.యిడి. లో సీటు వచ్చింది.
11-10-2011 : శ్రీమతి చింతలపాటి వాణి (రావూరి ప్రసాద్ చెల్లెలు) తన కుమారుడు చి||వెంకట సత్య చైతన్య – చి||ల||సౌ|| లక్ష్మికీర్తిల వివాహనంతరం నూతన వధూవరులతో వచ్చి అమ్మను అర్చించుకున్నారు.
16-10-2011 : శ్రీ బులుసు లక్ష్మి ప్రసన్న సత్యనారాయణ శాస్త్రి దంపతులు తమ 52వ వివాహ వార్షికోత్సవము జిల్లెళ్ళమూడిలో అమ్మ సమక్షంలో కడు వైభవంగా జరుపుకున్నారు. పండితులు ఆశీఃపూర్వకంగా అవభృధస్నానాన్ని దంపతులకు చేయించి ఆశీర్వదించారు. శ్రీవిశ్వజననీ పరిషత్ తరఫున ప్రెసిడెంటు శ్రీ ఎమ్. దినకర్గారు వారికి అమ్మ శేషవస్త్రాలు సమర్పించారు.
16-10-2011 : శ్రీ శనగవరపు మోహనకృష్ణ. శ్రీమతి రుక్మిణి అక్కయ్య, ఎమ్.వి.సుబ్బలక్ష్మి అక్కయ్య బోళ్ళవరలక్ష్మి అక్కయ్య, భానుమతి, సరస్వతి అక్కయ్య, శ్రీమతి బి. వాణి, శ్రీ బి. శ్యామ్ ప్రసాద్, శ్రీ పి. వీరభద్రరావు, శ్రీ మోగులూరి ప్రేమకుమార్, శ్రీ చీమకుర్తి హరినాథరావు, శ్రీ నంబూరి వెంకటరాధాకృష్ణ విఠల్ సంకష్ట హరిగణపతిహోమం సౌరహోమాలలో పాల్గొన్నారు.
18-10-2011 : వేమవరప్పాడు నుండి శ్రీ శివరావు గారు తన తనయుని వివాహానంతరం నూతన వధూవరులతో వచ్చి అమ్మను అర్చించుకున్నారు.
కీ॥శే॥ సీతాపతి తాతగారి (అమ్మ నాన్నగారు) అబ్దికం శ్రీ ఎమ్. నరసింహారావు మామయ్య అందరింట్లో చేసి అమ్మను అర్చించుకున్నారు.
19-10-2011 : శ్రీ నాన్నగారి జయంతి సందర్భంగా (బ్రహ్మాండం నాగేశ్వరరావు) మన్నవ జయ & రమ అమ్మను నాన్నగారిని ప్రత్యేకంగా వచ్చి అర్చించుకున్నారు.
శ్రీ భూమరాజు సుబ్రహ్మణ్యంగారి మనుమడు శ్రీ సుధామాధవ్ శ్రీమతి శివసునీత (బొంబాయి) పుత్రుడు చి॥ సుబ్రహ్మణ్యకీర్తి ఆదిత్య అక్షరాభ్యాసం హైమవతీదేవి ఆలయంలో వైభవంగా జరుపుకున్నారు. వీరు నంద్యాల జిల్లా యాలూరు వాస్తవ్యులు.