1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అర్కపురి విశేషాలు

అర్కపురి విశేషాలు

Kumari Visali
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : March
Issue Number : 8
Year : 2012

26.1.2012 : సంస్థలో చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్న శ్రీ రావూరి రామయ్య – శ్రీమతి లక్ష్మిల మనుమరాళ్ళు శ్రీ శ్రీనివాస్, శ్రీమతి రమణల కుమార్తెలు, చి॥ హైమకు, పుట్టు వెంట్రుకలు చి॥ వాత్సల్యకు అమ్మ సన్నిధిలో అన్నప్రాశన చేసుకున్నారు.

27.1.2012 : ప్రముఖ సినీ టి.వి. ఆర్టిస్టులు శ్రీ కోట శ్రీనివాసరావు, శ్రీ మిశ్రోలు జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను దర్శించుకున్నారు. శ్రీ మిశ్ర ‘అమ్మ టెలిఫిల్ము’లో సీతాపతి తాతగారి పాత్రను చక్కగా పోషించారు.

28.1.2012 : చీరాల వాస్తవ్యులు శ్రీమతి పోలిశెట్టి సుశీలమ్మగారు, వారి కుమార్తె శ్రీమతి నాగేశ్వరరావుగారు, ఉదయం అనసూయేశ్వరాలయములో అనసూయావ్రతము సాయంకాలము హైమాలయములో హైమవతీవ్రతము చేసుకున్నారు.

జాండ్రపేట వాస్తవ్యులు శ్రీ కటికి బ్రహ్మాండం, శ్రీమతి చేశారు. సీతామహలక్ష్మిగారు కుమారుడు చి|| జయదేవ హైమానంద్ అక్షరాభ్యాసము హైమాలయములో జరుపుకున్నారు. శ్రీ భాస్కరావు అన్నయ్య బాబుకు అక్షరాభ్యాసం చేశారు.

30.1.2012 : రధసప్తమి సందర్భముగ యాగశాలలో సౌరహోమము జరిగింది. ఆవరణలోనివారు, ఇతర ప్రాంతముల నుండి వచ్చినవారు హోమ కార్యక్రమములో పాల్గొన్నారు.

శ్రీమతి బోళ్ళ వరలక్ష్మిగారు తమ భర్త కీ॥శే॥ శ్రీ బోళ్ళ గోపాలకృష్ణగారి జ్ఞాపకార్థము ఆలయములో పూజ హోమశాలలో కుటుంబ సమేతంగా హోమము చేసుకొని ప్రతి సంవత్సరం మాదిరిగానే అందరికీ విందుభోజనం ఏర్పాటు చేశారు.

31.1.2012 : శ్రీమతి బోళ్ళ వరలక్ష్మిగారి కుమార్తెలు శ్రీమతి సరోజ శ్రీమతి సరళ “అమ్మ ఆలయములో” అనసూయా వ్రతము చేసుకున్నారు.

1.2.2012 : జిలెళ్ళమూడిలో మాతృశ్రీ అనసూయాదేవి “శ్రీ చరణ” మహోత్సవ కార్యక్రమము సందర్భముగా అంకురార్పణ – వాస్తుహోమము, నవగ్ర హోమములు జరిగినవి.

2.2.2012 : రుద్రహోమము – చండీ హోమము జరిగాయి. 

 

3.2.2012 : మాతృశ్రీ అనసూయాదేవి దివ్య శ్రీ చరణ ప్రతిష్ఠ కుంభాభిషేకము శ్రీ విద్యాహోమము సువాసినీ, కన్యపూజలు, ప్రతిరోజు ఉదయం సాయంత్రము, సామూహిక లలితాస్తోత్ర నామపారాయణ కార్యక్రమములు జరిగినవి. ఆ కార్యక్రమములన్ని శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణ అన్నయ్యగారి నేతృత్వములో వైభవముగా జరిగినాయి.

4.2.2012 : శ్రీ ఎమ్.ఆదినారాయణమూర్తి, శ్రీమతి పద్మ వారి కుమారుడు చి|॥సాయి సందీప్ శర్మ ఉపనయనము జిల్లెళ్ళమూడిలోని టి.టి.డి. కల్యాణ మండపములో వైభవముగా జరుపుకుని అందరికీ అమ్మప్రసాద వితరణ చేసారు. 

5.2.2012: శ్రీ సత్తిరాజు ఈశ్వరకుమార్, శ్రీమతి బిందుగారల కుమారుడు చి॥ శేషసాయి ప్రణవ్ అక్షరాభ్యాస కార్యక్రమము, అమ్మాలయములో జరుపుకున్నారు. అనంతరము ప్రసాదవితరణ గావించి విద్యార్థినీ విద్యార్థులకు పెన్నులు పంచి పెట్టారు.

9.2.2012 : విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీ ఎ.హరి, శ్రీమతి పుష్పగారల కుమారుడు చి॥ సోనాహరి | శ్రీ ఉపనయనము అమ్మ చరణసన్నిధిలో వారి బంధుమిత్రుల సమక్షములో వైభవముగా జరుపుకున్నారు.

11.2.2012 : హోమశాలలో సంకటహరగణేశ హోమము జరిగింది. ఆవరణలోని వారు, ఇతర ప్రాంతముల నుండి వచ్చినవారు హోమములో పాల్గొన్నారు.

12.2.2012 : శ్రీమతి మృదుల, శ్రీశ్రీచరణ్ ల ద్వితీయ పుత్రికలు చి॥ చరితకు అమ్మ సమక్షములో చెవులు కట్టించారు.

16.2.2012 : నాన్నగారి ఆరాధనోత్సవమునకు నాంది పలికి ధాన్యాభిషేకము మొదలు పెట్టుటకు కారకులైన

సోదరులు శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ గారికి, అమ్మ “నిత్యాన్నప్రసాదవితరణ పధకము”ను ప్రవేశపెట్టి అనేక కట్టడములు దగ్గర వుండి కట్టించిన శ్రీ రాజగోపాలరావు గారికి, సంస్థకు 10 సం॥లు అధ్యక్షులుగా వుండి, బహుముఖ ప్రజ్ఞతో విద్యాపరిషత్తుకు రూ.35 లక్షల కార్పస్ డిపాజిట్ ఏర్పరచిన శ్రీ బొప్పూడి రామబ్రహ్మంగారికి, ఉపాధ్యక్షులుగా సంస్థ అభివృద్ధికి ఎంతో కృషి సల్పిన శ్రీ బులుసు లక్ష్మీ ప్రసన్న సత్యనారాయణశాస్త్రి గారికి శ్రీ విశ్వజననీపరిషత్వారు ఆత్మీయ సత్కారం జరిపారు. ఈ కార్యక్రమములో సోదరులు శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావుగారు, శ్రీ దినకర్ గారు, శ్రీ లక్ష్మణరావుగారు, శ్రీమతి కుసుమాచక్రవర్తిగారు, సుగుణగారు, డాక్టర్ వరలక్ష్మిగారు ప్రసంగించారు. శ్రీమతి నాదెండ్ల భ్రమరాంబ అక్కయ్యగారు, శ్రీమతి వసుంధర అక్కయ్య ఈ కార్యక్రమములో పాల్గొన్నారు. ఈ సన్మాన కార్యక్రమము తలపెట్టిన వారు శ్రీ వారణాసి ధర్మసూరిగారు. శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తిగారు జనరంజ కముగా సభానిర్వహణ గావించారు. అనంతరము అనేక  పోటీలలో పాల్గొని విజేతలైన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతి ప్రదానం జరిగింది.

17.2.2012 : ధాన్యాభిషేకము ఉదయం 7 గంటలకు శ్రీ అనసూయేశ్వరాలయములో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకముతో ప్రారంభమయినది. శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావుగారు, శ్రీమతి వైదేహి విశాఖపట్నం నుండి వచ్చిన సోదరీసోదరులు ఇతర భక్తులు, 11 మంది ఋత్విక్కులు, మంత్రములు చదువుచుండగా అభిషేకము చేసుకున్నారు. ఉదయం 8-30కు కళ్యాణమూర్తులను అనసూయేశ్వరాలయము నుండి అన్నపూర్ణాలయ కల్యాణ వేదికవద్ద రూ. ఊరేగింపుగా తీసుకొని వచ్చారు. ఈనాడు నాన్నగారి ఆరాధనోత్సవం గనుక నాన్నగారి విశిష్టతను గూర్చి శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్ గారు, ధాన్యాభిషేక ప్రాశస్త్యాన్ని గూర్చి శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తిగారు ప్రసంగించారు. శ్రీరావూరి ప్రసాద్ పాటలలో అలరించారు. అనంతరం 10-30 కు వేదిక మీద విశాఖ అధ్యయనపరిషత్ వారు, అడవులదీవివారు ధాన్యముతో పూజ చేశారు. అనసూయేశ్వరాలయములో “అమ్మకు” బియ్యముతో అభిషేకము చేశారు. ఉదయం 8-30 కు ఆదరణాలయములో పాలు పొంగించి ప్రారంభించారు. మధ్యాహ్నం 12-30 గంటలకు మహా నివేదన అనంతరము అసంఖ్యాక భక్తులకు అన్నవితరణ జరిగింది.

19.2.2012 : యాగశాలలో సౌరహోమము జరిగింది. ఆవరణలోని వారు వివిధ ప్రాంతముల నుండి వచ్చిన సోదరీ సోదరులు పాల్గొన్నారు.

20.2.2012 : మహాశివరాత్రి ఉదయం 9 గంటలకు హోమశాలలో శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణగారి నేతృత్వములో రుద్రహోమము జరిగింది. రాత్రి 11 గంటలకు 11 మంది ఋత్విక్కులచే అమ్మ ఆలయములో మహన్యాసపూర్వక ఏకాదశరుద్రాభిషేకము జరిగింది. మూలవిరాట్కు (అమ్మకు) పంచామృతములతో ఆవరణలోని వారు, వివిధ ప్రాంతముల నుండి వచ్చినవారు అభిషేకములు జరుపుకున్నారు. 

20.2.2012 : కాలేజి విద్యార్థినులు “అమ్మ” తమ గదికి వచ్చిన సందర్భముగా భజన, లలితాపారాయణ చేసి అందరికీ ప్రసాదం పంచారు.

 

21.2.2012 : కళాశాల విద్యార్థులు “అమ్మ” తమ హాస్టల్ కు  వచ్చిన సందర్భమున ఆగమ మహోత్సవము, కళాశాల హాస్టలు భవనము నందు భక్తి పూర్వకముగా జరుపుకున్నారు. ఈ సందర్భముగ, కళాశాల అధ్యాపక బృందము, కళాశాల పాలకవర్గము వారు పాల్గొన్నారు. విద్యార్థులు అఅమ్మవారి చిత్రపటమునకు పూజచేసి శ్రీ లలితాపారాయణ గావించారు. అనంతరము ప్రసాద వినియోగం జరిపారు.

24.2.2012 : జిల్లెళ్ళమూడి వాస్తవ్యులు శ్రీ మీనుగుల ఆంజనేయలు, శ్రీమతి త్రివేణిల కుమారుడు చి॥ఈశ్వర్ అన్నప్రాసనను శ్రీ అనసూయేశ్వరాలయములో  జరుపుకున్నారు. 

శ్రీ అన్నాప్రగడ లక్ష్మీనారాయణ, శ్రీమతి విజయ లక్ష్మిల మనుమడు శ్రీ వడ్లమూడి చిరంజీవిరావు, శ్రీమతి రోహిణిదేవిగారల ఏకైకపుత్రుడు చి॥ వెంకట కళ్యాణ్ను ‘అమ్మ ఆలయం’లో పెళ్లికొడుకును చేశారు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!