1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అర్కపురి విశేషాలు

అర్కపురి విశేషాలు

Kumari Visali
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : May
Issue Number : 10
Year : 2012

19.3.2012 : శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు గారు గుంటూరు జిల్లా పొత్తూరు గ్రామములో వారి ఆశ్రమ ప్రాంగణములో శ్రీ విఘ్నేశ్వర విగ్రహ ప్రతిష్ఠ జరిపారు. ఈ సందర్భంగా జిల్లెళ్ళమూడి లోని సోదరీ సోదరులు శ్రీ రవి అన్నయ్య, యస్.వి.జె.పి. కార్యవర్గ సభ్యులు, మరికొంతమంది అన్నయ్యలు, అక్కయ్యలు పాల్గొన్నారు. శ్రీ విశ్వజననిపరిషత్ వారు “అమ్మ” ప్రసాదముగ లడ్డూలు, పులిహోర తీసుకొని వెళ్ళి ప్రసాద వినియోగము జరిపారు. శ్రీ పొత్తూరు ప్రేమగోపాల్ అన్నయ్య దంపతులు వచ్చిన వారందరికీ ఆదరపూర్వక విందుభోజనము ఏర్పాటు చేశారు.

23.3.2012 : శ్రీ నందన నామ సంవత్సర ఉగాది సందర్భముగ ఆలయములలో ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం ఉగాది ప్రసాద వినియోగము జరిగినది. ఆవరణలోని సోదరీ సోదరులు ఇతర ప్రాంతముల నుండి వచ్చినవారు పరస్పర శుభాభినందనలు తెలుపుకున్నారు. డాక్టర్ శ్రీ యస్.వి.యన్.వరప్రసాద్ గారు పంచాంగ శ్రవణము చేసి సంవత్సర ఫలితములను వివరించారు.

శ్రీమతి వారణాసి భగవతి తన పుట్టినరోజు. సందర్భంగా అమ్మ, హైమ” ఆలయములలో పూజ చేసుకొని అందరికీ విందు భోజనము ఏర్పాటు చేశారు.

కుమారి మన్నవ సుబ్బలక్ష్మిగారి, అక్కగారి కుమారుడు విజయవాడ వాస్తవ్యులు శ్రీ వాడపల్లి రవీందర్ గారు “అందరింటికి” వాటర్ కూలర్ బహుకరించారు. ఉగాది శుభదినమున శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణ గారు, కొబ్బరికాయ కొట్టి కూలర్ను ప్రారంభించారు.

“అమ్మ” 90వ జన్మదినమహోత్సవముల సందర్భముగ “అమ్మ” అఖండనామ సంకీర్తన 23.3. 2012 నుండి 3.4.2012 వరకు జరగటానికి సోదరులు భాస్కరరావు అన్నయ్య శ్రీ వై.వి. శ్రీరామమూర్తిగారు, శ్రీ వల్లూరి రమేష్బాబుగారు, శ్రీ ఎల్. రామకోటేశ్వరరావుగారు, కుమారి ఎమ్.వి.సుబ్బలక్ష్మి, శ్రీమతి బి. వరలక్ష్మి, శ్రీమతి వసుంధర అక్కయ్య తదితరులు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు.

24.3.2012 : ఆలయ అర్చకులు శ్రీ చుండి నవీన కుమార్ శర్మగారి భార్య శ్రీమతి చుండి నాగసుందరి సీమంత కార్యక్రమమును శ్రీమతి సుందరి పుట్టింటివారు సంస్థలోని అక్కయ్యలు శ్రీ హైమాలయములో వైభవముగా జరిపి సుందరిని ఆశీర్వదించారు.

25.3.2012 : బాపట్ల వాస్తవ్యులు శ్రీ వ్యాకరణం భారద్వాజ శాస్త్రిగారి ఆధ్వర్యంలో 25-3-2012 నుండి 2-4-2012 వరకు జరిగే చండీహోమ కార్యక్రమములు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీ భట్టిప్రోలు రామచంద్ర, శ్రీమతి సుగుణ, చి॥రహికిరణ్, శ్రీ నాదెండ్ల లక్ష్మణరావు -శ్రీమతి సీతాభ్రమరాంబికాదేవి, శ్రీ వఝ లోక దివ్యమల్లికార్జున ప్రసాద్ – శ్రీమతి సీత, శ్రీ తురుమెళ్ళ మురళీధరరావు శ్రీమతి సుబ్బలక్ష్మి, శ్రీ తూనుగుంట్ల త్రిలోక అప్పారావు – శ్రీమతి కుసుమాంబ, శ్రీ చక్కా శ్రీమన్నారాయణ శ్రీమతిలక్ష్మి, శ్రీ ఘంటసాల దుర్గా అనంతపద్మనాభరావు – శ్రీమతి సరోజ కుమారి లావణ్య, శ్రీ భానుప్రకాష్, శ్రీ వఝశివరామకృష్ణ – శ్రీమతి భూమికా ప్రసన్న, శ్రీ మన్నవ వెంకటకృష్ణశర్మ – శ్రీమతి లలితాశివజ్యోతి, శ్రీ వల్లూరి రమేష్బాబు – శ్రీమతి హైమ మరియు స్థానికులైన వారు. పాల్గొన్నారు.

30.3.2012 : శ్రీ హైమవతీదేవి ఆలయ ప్రవేశ మహోత్సవము సందర్భముగ సామూహిక హైమవతీ వ్రతములు జరిగినాయి. స్థానికులు, ఇతరప్రాంతముల నుండి వచ్చినవారు అధికసంఖ్యలో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమములో పాల్గొన్నారు.

1.4.2012 : శ్రీరామనవమి సందర్భంగా “అమ్మ” ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగినాయి. హనుమబాబుగారు, శ్రీ పి. సుబ్రహ్మణ్యం గారు, శ్రీరావూరి ప్రసాద్ గారు అమ్మ నామసంకీర్తన, భక్తిగీతాలాపన చేశారు. పానకము వడపప్పు ప్రసాదముగా అందరికీ ఇచ్చారు.

3.4.2012 : “అమ్మ” 90వ జన్మదిన మహోత్సవములో నెల్లూరు సోదరులు శ్రీ ఈమని కుమారశాస్త్రిగారు, ఇతర సోదరుల సహకారముతో “అమ్మ, హైమాలయములను అత్యంత ఆకర్షణీయముగా అలంకరించారు.

6.4.2012 : ఉదయం 10 గం. 15 ని.లకు (10 గం. 14 ని.లకు) అందరింటి భోజనశాల నూతనభవనానికి శ్రీయార్లగడ్డ భాస్కరరావు అన్నయ్య, శ్రీ రవి అన్నయ్య శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమములో శ్రీ జేమ్స్, శ్రీ రాజగోపాలరావుగారు, శ్రీ గోపాలన్నయ్య, శ్రీ రమేష్బాబు, శ్రీ పి.వి.రమణరావు, శ్రీ ఎమ్.వి.సుబ్బారావు (ఆర్కిటెక్టు) ఆవరణలోని వారు అందరూ ఈ కార్యక్రమములో పాల్గొన్నారు. అందరూ శ్రీలలితా సహస్రనామ పారాయణ చేశారు.

హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ రాయప్రోలు సుబ్రహ్మణ్యం (రిజర్వ్ బ్యాంక్ ఆఫీసర్) వారి సతీమణి శ్రీమతి కామాక్షిగారల కుమార్తె చి.ల.సౌ. గాయత్రికి వివాహము కుదిరిన సందర్భముగా వారు జిల్లెళ్ళమూడి వచ్చి “అమ్మకు నాన్నగారికి, హైమ అక్కయ్యకు వస్త్రములు సమర్పించి “అమ్మ”కు 108 కొబ్బరికాయలు కొట్టి మ్రొక్కు తీర్చుకొని వెళ్ళారు.

8.4.2012 : శ్రీ చావలి వెంకటేశ్వరశర్మ గారి ఆధ్వర్యములో జరిగిన సౌరహోమములో శ్రీ శనగవరపు మోహనకృష్ణ (హైదరాబాద్) చి॥ యశస్వి అక్షయశర్మ – శ్రీమతి ఉషశ్రీ (బెంగుళూరు శ్రీ ఎన్. చంద్రశేఖర్ (యు. యస్.ఎ), శ్రీ వాడపల్లి వాసుదేవరావు – శ్రీమతి రమాదేవి (హైదరాబాద్) శ్రీ పి.వి. సుబ్బారావు శ్రీమతి ఉమామహేశ్వరి (విశాఖపట్నం) శ్రీ కె.పి.ఆర్.విఠల్, శ్రీమతి చెప్పారు. గిరిజ (హైదరాబాద్) స్థానికులైన సోదరీ సోదరులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు.

10.4.2012 : సంకష్టహర గణేశ హోమములో శ్రీ యస్. మోహనకృష్ణ (హైదరాబాద్) శ్రీమతి శైలజ, చి॥శ్రీ హర్ష, చి. శ్రీ జిత (జమ్ము-కాశ్మీర్) శ్రీమతి ఉషశ్రీ చి. యశస్వి అక్షయ్ శర్మ (బెంగుళూరు) తదితరులు పాల్గొన్నారు. ఈ హోమ కార్యక్రమము శ్రీ పెండ్యాల నాగేశ్వరరావు, శ్రీ వై విజయకుమార్ నిర్వహణలో జరిగింది.

కర్నూలు నుండి వచ్చిన శ్రీ గాయత్రి జూనియర్ కాలేజీ లెక్చరర్ శ్రీ పి. నాగేశ్వరరావు (జిల్లెళ్ళమూడి పూర్వ విద్యార్థి 1999 టూ 2004) చెప్పిన విశేషములు కర్నూలు లోని టౌను మోడల్ జూనియర్ కళాశాలలో జరిగిన ఇంటర్ మీడియట్ ప్రశ్నాపత్రముల మూల్యాంకనమునకు వెళ్ళినపుడు అచ్చట “అమ్మ”ను గురించి తెలిపి 3.4.2012న “అమ్మ” జన్మదినవేడుకలను ఘనంగా జరిపారు. అచ్చట కొందరు భక్తులు ‘అమ్మ’ యెడల భక్తితో విరాళములు అందజేశారు. ఈ కార్యక్రమములో శ్రీ జి.నాగేశ్వరరావు, శ్రీ జె.రవీంద్రారెడ్డి, జి.వి. కామేశ్వరరావు, శ్రీ కె. బాలేశ్వరరావు, శ్రీ ఎమ్.ప్రసాద్ మొదలైనవారు (జిల్లెళ్ళమూడి పూర్వవిద్యార్థులు పాల్గొని కార్యక్రమములను భక్తిశ్రద్ధలతో వేడుకగా “అమ్మ” జన్మదినోత్సవ కార్యక్రమములు జరిపారు.

16.42012 : కంకిపాడు వాస్తవ్యులు శ్రీ గ్రంధి సాంబశివరావు – శ్రీమతిరాజకుమారి గారల మనమడు (కీ.శే. శ్రీ జ్వాలా కృష్ణ గారి జ్యేష్ఠపుత్రుడు) చి. జ్వాలా సాయి అఖిల్కు “అమ్మ” సన్నిధిలో అన్నపూర్ణాలయ వేదిక మీద” పూజ్యులు శ్రీ లలితా పీఠ అధిపతులు – శ్రీశ్రీశ్రీ వాసుదేవానందగిరి (పెదపులిపాక) స్వామీజీ గారి సమక్షములో ఉపనయన కార్యక్రమము జరిగినది. ఈ సందర్భముగ శ్రీ స్వామిజీ ఉపనయన సంస్కారము గురించి చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించారు. “అమ్మ” గురించి ఇచ్చట జరిగే కార్యక్రమముల గురించి సోదరులు శ్రీ చక్కా శ్రీమన్నానారాయణ గారు వివరించి

17.4.2012 : వెదుళ్ళపల్లి వాస్తవ్యులు శ్రీ శివశంకర్ – శ్రీమతి వనజకుమారి వారి చిరంజీవి, చి||సాయి హనుమ ఉమేష్ చంద్ర అన్నప్రాసన కార్యక్రమము “అమ్మ” సన్నిధిలో జరుపుకొని “అమ్మ”కు వస్త్రములు సమర్పించారు.

18.4.2012 : ఈ రోజు విజయవాడ వాస్తవ్యులు శ్రీ పేర్ల రమేష్ బాబు, శ్రీమతి అనంతలక్ష్మి చి. సాయిసుధీర్, చండీహోమము చేసుకున్నారు.

మాదేపల్లి వాస్తవ్యులు శ్రీ వన్నెంరెడ్డి మల్లిఖార్జున రావుగారు, శ్రీమతి వెంకటజయలక్ష్మిగారు కుమారులు శ్రీ వన్నెంరెడ్డి అమరనాధ్, శ్రీ సందీపులకు ఉద్యోగములు వచ్చిన సందర్భముగ జిల్లెళ్ళమూడి వచ్చి “హైమవతీ వ్రతము” చేసుకొని “అమ్మకు” హైమ అక్కయ్యకు, వస్త్రములు సమర్పించి అన్నప్రసాదవితరణ జరిపారు.

జాండ్రపేట వాస్తవ్యులవు శ్రీకటికి హనుమయ్యగారి మనుమడు శ్రీ బ్రహ్మాండం, శ్రీమతి సీతామహలక్ష్మిగారల పుత్రుడు చి.జయదేవ హైమానంద్ 3వ పుట్టినరోజు సందర్భముగా జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మకు హైమక్కయ్యకు పూజ చేసుకొని శ్రీ హైమవతీ వ్రతము చేసుకొని ప్రసాదవితరణ గావించారు.

2.4.2012 : దమ్మన్నంపాలెం వాస్తవ్యులు శ్రీ గుఱ్ఱ పుసాల వీరయ్య – శ్రీమతి రాజ్యలక్ష్మి గారల కుమారుడు చి. తనోజ్ అన్నప్రాసన కార్యక్రమము “అమ్మ” సన్నిధిలో వారి బంధుమిత్రుల సమక్షములో వైభవముగా జరుపుకున్నారు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!