1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అర్కపురి విశేషాలు

అర్కపురి విశేషాలు

Kumari Visali
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : July
Issue Number : 12
Year : 2023

శ్రీ నవనాగేశ్వరాలయ సప్తమ వార్షికోత్సవముల విశేషములు

29.5.2012 : ఉదయం అమ్మ సన్నిధిలో మహన్యాసపారాయణ తదుపరి నాగేశ్వరస్వామివారికి రుద్రాభిషేకము మన్యుసూక్త సహిత సుదర్శన హోమము జరిగినవి. సాయంత్రం ఆంజనేయస్వామికి సహస్రనామార్చన జరిగినిద

30.5.2012 : ఉదయం మహన్యాసపారాయణ, రుద్రాభిషేకము, సుబ్రహ్మణ్య సర్పసూక్త హోమములు, సాయంత్రము సుబ్రహ్మణ్య శివసహస్రనామార్చన జరిగింది. 31.5.2012 : ఉదయం మహన్యాసపారాయణ, రుద్రాభిషేకము, చండీహోమము, సాయంత్రం ఆంజనేయ, సుబ్రహ్మణ్య, లలితాసహస్రనామార్చన జరిగినది.

1.6.2012 : ఉదయం మహన్యాస పారాయణ, శతరుద్రాభిషేకము, రుద్రహోమము, ఖడ్గమాల హోమము, పూర్ణాహుతి, మాతృశ్రీ చరణ సన్నిధినందు మన్యుసూక్త పారాయణ, అవబృధస్నానము, పండిత సత్కారము సాయంత్రం “అమ్మ నాన్నగారల శాంతి కళ్యాణము జరిగింది.

శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ షష్టమ వార్షికోత్సములు శ్రీ నవనాగేశ్వరాలయ, సప్త వార్షికోత్సములు 26.5.2012 నుండి 1-6-2012 వరకూ శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణ అన్నయ్యగారి ఆధ్వర్యంలో అత్యంత వైభవముగా జరిగినాయి.

హోమ కార్యక్రమములు పూజా కార్యక్రమములలో, శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణ శ్రీమతి కమల దంపతులు. శ్రీరాచర్ల రహి – శ్రీమతి సుధాదంపతులు, శ్రీవారణాసి ధర్మసూరి, శ్రీమతి భగవతి దంపతులు, శ్రీరాచర్ల బంగారు బాబు ఇంకా స్థానికులైన సోదరీ సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమములను గుంటూరు వాస్తవ్యులు శ్రీ అవ్వారి ఉమాశంకర్ దీక్షిత్ గారు వారి బృందం నిర్వహించారు.

2.6.2012 సత్తెనపల్లి వాస్తవ్యులు శ్రీమతి జె.వై.భారతి గారు వారి కుమారుడు శ్రీ ఫణీంద్రనాధ్ గారికి

ఉద్యోగము వచ్చిన సందర్భముగ అమ్మకు పూజ జరిపించి వస్త్రములు సమర్పించారు.

3.6.2012 : కీ॥శే॥ శ్రీమతి బొడ్డుపల్లి శకుంతలమ్మగారి సంవత్సరీకముల సందర్భముగ, వారి మనుమడు శ్రీ సి. హెచ్. ఫణికుమార్ “అమ్మ”ను పూజించుకొని అన్నప్రసాదవితరణ కావించారు.

4.6.2012 : కీ.శే. శ్రీమతి శకుంతలగారి పుణ్యతిథి సందర్భముగ వారి కుమార్తె మరియు పూర్వవిద్యార్థిని అయిన శ్రీమతి కస్తూరి “అన్న” ప్రసాదవితరణ గావించారు.

8.6.2012 : హోమశాలలో జరిగిన సంకష్టహర గణపతి హోమములో స్థానికులైన సోదరీ సోదరులు ఇతర ప్రాంతముల నుండి వచ్చినవారు పాల్గొన్నారు.

10.6.2012 : హోమశాలలో జరిగిన సౌరహోమము శ్రీ సాగి సాంబమూర్తి గారి (గుంటూరు) నిర్వహణలో జరిగింది. ఈ కార్యక్రమములో శ్రీమతి యస్.రుక్మిణ (హైదరాబాద్) శ్రీమతి వైదేహి, శ్రీమతి రాధారాణి (గుంటూరు) శ్రీ చక్కా శ్రీమన్నారాయణ, శ్రీమతి లక్ష్మి మొదలైనవారు పాల్గొన్నారు.

11.6.2012 అమ్మ అనంతోత్సవముల సందర్భముగ సోదరులు శ్రీరావూరి ప్రసాద్ “రాగ నీరాజనము” కార్యక్రమము నిర్వహించారు. “అమ్మను గూర్చి సోదరులు శ్రీ మన్నవ బుచ్చిరాజు శర్మగారు, కీ.శే. శ్రీ నదీరాగారు వ్రాసిన పాటలను శ్రీరావూరి ప్రసాద్, శ్రీమతి లక్కరాజు విజయశ్రీ శ్రావ్యంగా ఆలపించారు.

12.6.2012 : “అమ్మ” అనంతోత్సవాల సందర్భంగా ఈ రోజు జరిగిన “రాగనీరాజనం” పాటల పోటీలలో పాల్గొన్న వారికి బహుమతి ప్రదానం జరిగింది. 25 సంవత్సరాలపైన కేటగిరిలో శ్రీ ఆదిత్యరామ్ (చెన్నై) ప్రధమ బహుమతి తీసుకోగా, ద్వితీయ బహుమతి – శ్రీమతి జె. రామలక్ష్మి (విజయవాడ), తృతీయ బహుమతి కుమారి ఎమ్.వి.సుబ్బలక్ష్మిగారు తీసుకున్నారు. 25 సంవత్సరాలలోపు కేటగిరిలో కుమారి జయలక్ష్మి ప్రథమ బహుమతి పొందగా, ద్వితీయ బహుమతి కుమారి వైష్ణవి, తృతీయ బహుమతి చి. రవితేజ తీసుకున్నారు. చి. సాయిశృతి (ఒంగోలు) కన్సాలేషన్ బహుమతి పొందారు. ఈ కార్యక్రమములో “అమ్మ”కు చిరకాల భక్తులు. బాపట్ల వాస్తవ్యులు శ్రీ తూములూరి కృష్ణమూర్తిగారు పాల్గొని “అమ్మ” పాటలను ఆలపించారు. పై కార్యక్రమములో పాటలు పాడిన వారందరికీ అమ్మ ఫోటోలు ప్రశంసపత్రములు అందజేశారు. 11, 12 తేదీలలో జరిగిన రాగనీరాజన కార్యక్రమము ఆద్యంతము హాయిగా ఆసక్తిదాయకంగా సాగింది. ప్రతి పాటకి శ్రీ రావూరి ప్రసాద్ శర్మగారు, తమ అనుభవాలను తెల్పారు. యస్.వి.జె.పి. తరుపున శ్రీ అయ్యగారు శ్రీ ప్రసాద్ ను, శ్రీమతి లక్కరాజు విజయశ్రీలకు వస్త్రబహుకరణ జరిపి తమ ఆశీస్సులు అభినందనలు తెలియజేశారు. శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ అన్నయ్యగారి ఆధ్వర్యంలో కార్యక్రమము అద్యంతము, ఆహ్లాదకరంగా పూర్తి అయింది. ఈ కార్యక్రమములకు శ్రీమతి కొమరవోలు కుసుమ తమ సహకారమును అందించారు. అమ్మ అనంతోత్సవాల సందర్భముగా ఉదయం శ్రీ అనసూయేశ్వరాలయంలో “అమ్మ”కు (మూలవిరాట్కు) 11 మంది ఋత్విక్కులచే మహారుద్రాభిషేకము, 11 గంటలకు అన్నాభిషేకము జరిగింది. రాత్రి 9-30 గంటల నుండి 10-30 గంటల వరకు వాత్సల్యాలయములో మహసంకీర్తన, హారతి కార్యక్రమములు జరిగినాయి.

13.6.2012 కట్లపాడు వాస్తవ్యులు యెన్.పౌల్రాజు గారు వారి గేదెలు తప్పిపోగా అవి క్షేమంగా తిరిగివస్తే అమ్మకు పూజ చేసుకుంటామని మ్రొక్కుకున్నారట. వారి గేదెలు అన్ని క్షేమంగా తిరిగివచ్చిన సందర్భంగా వారి కుటుంబసభ్యులు అమ్మను దర్శించుకొని అర్చన జరిపించుకున్నారు.

13.6.2012 : యు.యస్.నుంచి వచ్చిన శ్రీమతి నందిగామ విజయలక్ష్మి భవానిగారు తమ పుట్టినరోజును అమ్మ సన్నిధిలో జరుపకున్నారు. దాదాపు ప్రతి సంవత్సరం తమ పుట్టినరోజును, వారి పాప విజయరీతిక పుట్టిన రోజును, జిల్లెళ్ళమూడి “అమ్మ” సన్నిధిలో జరుపుకుంటారు.

జిల్లెళ్ళమూడిలో జరిగే ప్రతి కార్యక్రమము యు.యస్.లో వారి ఇంటిలో జరుపుకుంటామని చెప్పారు. ప్రతి శుక్రవారం శ్రీలలితానామపారాయణ, అనసూయా వ్రతము, “అమ్మ” పుట్టినరోజును అమ్మా నాన్న గారల కళ్యాణ వేడుకలను జరుపుకుంటామన్నారు. వారి మిత్రులందరూ ఈ కార్యక్రమములకు వస్తారని, చాలా ఆనందంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. విదేశములో వున్న మన సంస్కృతీ సదాచారములను అచ్చటివారికి తెలియజేస్తూ “అమ్మ”ను గూర్చి అందరికీ చెపుతూ కార్యక్రమములను ఆసక్తిదాయకంగా, ఆనందంగా నిర్వహిస్తున్న విజయలక్ష్మీ భవాని గారు అభినందనీయులు.

13.6.2012 : ఉదయం 11 గంటలకు అమ్మ తత్వచింతన కార్యక్రమము జరిగినది. ఈ కార్యక్రమములో సోదరులు శ్రీ గోపాలన్నయ్య, శ్రీ మన్నవ బుచ్చిరాజు శర్మ, శ్రీ వై.వి. శ్రీరామమూర్తి, శ్రీ టి.టి.అప్పారావు, శ్రీ వల్లూరి రమేష్బాబు, శ్రీ పార్థసారధి తదితరులు, శ్రీమతి బ్రహ్మాండం శేషు అక్కయ్య, కుమారి ఎమ్. వి. సుబ్బలక్ష్మి, శ్రీమతి కుసుమ ఈ కార్యక్రమములో పాల్గొన్నారు. శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ ఈ కార్యక్రమము నిర్వహించారు.

సాయంత్రం 6 గంటలకు ధ్యానాలయములో “అమ్మ”కు పూలంగి సేవాకార్యక్రమము జరిగింది. పూల కిరీటముతో పూలదండలతో “అమ్మ”ను అలంకరించారు. ప్రతి సంవత్సరమువలెనే ఈ సంవత్సరము కూడా శ్రీ వల్లూరి పార్ధసారధి దంపతులు (హైదరాబాద్) ఈ కార్యక్రమము ఏర్పాటు చేశారు. కుమారి ఎమ్. వి. సుబ్బలక్ష్మి మొదలైనవారు ఈ కార్యక్రమమునకు తమ సహకారమును అందించారు.

14.6.2012 ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకూ శ్రీ అనసూయేశ్వరాలయంలో మూలవిరాటు (అమ్మకు) సహస్రఘటాభిషేకము జరిగింది. సాయంత్రం 6గం. 30ని. అనసూయేశ్వర ఆలయంలో లక్షమల్లె పూల పూజ జరిగింది.

15.6.2012 8-6-2012 నుండి మొదలైన అఖండ నామ సంకీర్తనా కార్యక్రమము 15-6-2012. వరకూ దిగ్విజయంగా కొనసాగింది. చివర శ్రీ దినకర్ ప్రసంగించినారు. కార్యక్రమ విజయానికి తోడ్పడ్డ శ్రీ కొండముది రవి దంపతులను అందరూ అభినందించారు.

శ్రీ నాదెండ్ల లక్ష్మణరావు, శ్రీమతి సీతాభ్రమరాంబికా దేవి దంపతుల 58వ వివాహ వార్షికోత్సవము సందర్భముగా “అమ్మ” హైమలకు పూజ చేసుకొని అందరింటి లోని వారందరికీ విందు భోజనము అందజేశారు. సంస్థవారు ఈ దంపతులకు నూతన వస్త్ర ప్రధానము గావించారు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!