1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అర్కపురి విశేషాలు

అర్కపురి విశేషాలు

Pannala Radhakrishna Sarma, Kumari Visali
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 12
Month : September
Issue Number : 2
Year : 2012

20.7.2012 : శ్రావణమాసము మొదటి శుక్రవారము సందర్భముగా శ్రీ చక్కా శ్రీమన్నారాయణ దంపతులు వారి స్వగృహములో (జిల్లెళ్ళమూడి శ్రీ విద్యా నిలయము) అమ్మకు పూజ చేసుకున్నారు. విద్యార్థినులు ఆవరణలోని వారు గ్రామస్తులు ఈ కార్యక్రమములో పాల్గొని శ్రీ లలితా సహస్రనామపారాయణ చేశారు.

23.7.2012: ఈ రోజు నుండి ‘అమ్మ’ సమర్తవేడుకలు ప్రారంభమయినాయి. 23.7.2012 నుండి 2.8.2012 వరకూ శ్రీమతి బ్రహ్మాండం వసుంధర అక్కయ్య ఆధ్వర్యంలో సాయంత్రం 6 గంటల నుండి పేరంటము వేడుకలు జరిగినాయి. ఈ కార్యక్రమాలకు కుమారిఎమ్.వి. సుబ్బలక్ష్మి తదితరులు తమ సహకారమును అందించారు.

24.7.2012 : శ్రావణ మంగళవారము మంగళ గౌరీవ్రతమును ఆవరణలోని అక్కయ్యలు, ఇతర ప్రాంతముల నుండి వచ్చినవారు హైమాలయములో జరుపు కున్నారు.

27.7.2012 : వరలక్ష్మీ వ్రత సందర్భముగా అమ్మ హైమాలయములలో విశేష సంఖ్యలో సోదరీమణులు పూజలు చేసుకున్నారు. సోదరి శ్రీమతి యు.వరలక్ష్మిగారు తన పుట్టినరోజు సందర్భముగా అమ్మకు, హైమకు పూజ చేసుకొన్నారు.

26.7.2012 : విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీగుడిపూడి పాండురంగ విఠల్ వారి కుటుంబసభ్యులు శ్రీ నాదెండ్ల లక్ష్మణరావు, శ్రీమతి సీతాభ్రమరాంబికాదేవి దంపతులచే నూతనముగా నిర్మింపబడిన “అమ్మ ఒడి అతిధి గృహగృహప్రవేశము రాత్రి జరిగినది. ఈ సందర్భముగా శ్రీ జి.వి.యన్. హరి (సి.ఎ.) శ్రీమతి పూర్ణిమ దంపతులు వాస్తు పూజ, వాస్తు హోమము నిర్వహించారు. మరునాడు (27.7.2012) అందరింటి పెద్దలందరూ నూతన గృహములో ఏర్పాటుచేసిన విందు భోజనమునకు విచ్చేసి అభినందనలు తెలిపారు.

29.7.2.012 : ఏకాదశి సందర్భముగ పెదనంది పాడు వాస్తవ్యులు శ్రీ బి.యస్.ఆర్.ఆంజనేయులు వారికుమారుడు శ్రీ యజ్ఞనారాయణ వారి బృందము (శ్రీరామనామామృత భజన సమాజము) ఉదయం 6-30. నుండి 30.7.2012 ఉదయం 6.30 ని. వరకూ శ్రీరామనామ అఖండ సంకీర్తనా కార్యక్రమము నిర్వహించారు. అందరినీ ఆనందపరిచింది.

3.8.2012 : గోపవరపు గూడెం వాస్తవ్యులు శ్రీ నల్లూరి రమేష్ శ్రీమతి లక్ష్మీసాయి వారి పాప చి. నిహారికకు అమ్మ సన్నిధిలో చెవులు కుట్టించారు.

3.8.2012 : జాండ్రపేట వాస్తవ్యులు గంజాం నాగకిరణకుమార్ శ్రీమతి నాగరాధిక, అమ్మకు, హైమకు పూజ చేసుకొని “అమ్మకు, నాన్నగారికి, హైమ” కు వస్త్రములు సమర్పించారు.

శ్రీ కరెవరం కృష్ణమూర్తిగారు కుటుంబసభ్యులు “అమ్మకు” ప్రతి సంవత్సరమువలెనె ఈ సంవత్సరము కూడా కుంకుమ స్వయంగా తయారు చేయించి తీసుకొనివచ్చి అమ్మకు సమర్పించుకున్నారు.

4.8.2012 : గుండవరం వాస్తవ్యులు శ్రీ వల్లూరి నరసింహారావు, శ్రీమతి రాజ్యలక్ష్మిల మనుమరాలు, శ్రీ వల్లూరి నాగేశ్వరరావు, శ్రీమతి సావిత్రిల కుమార్తెకు అమ్మ సన్నిధిలో లక్ష్మీ హైమ అని నామకరణము చేశారు.

5.8.12 : హోమశాలలో సంకష్ఠహరగణపతి హోమములో శ్రీ వాడపల్లి వాడపల్లి రవీంద్రర్, శ్రీమతి సంధ్య (విజయవాడ) స్థానికులైన సోదరీ సోదరులు పాల్గొన్నారు.

12.8.2012 : ఈ రోజు జరిగిన సౌరహోమములో కొప్పురావూరి సాకేత్ (సూరంపల్లి) పి.వీరభద్రరావు (హైదరాబాద్) శ్రీ కోన శ్రీరామచంద్రమూర్తి, శ్రీమతి సరోజిని (బాపట్ల) మరియు స్థానికులైన సోదరీ సోదరులు

15.8.2012 : అన్నపూర్ణాలయ వార్షికోత్సవము ఉదయం 7-30ని.లకు అన్నపూర్ణాలయ ప్రాంగణములో శ్రీ గోపాలన్నయ్య అమ్మ పతాక ఆవిష్కరణ చేసి “నేను నేననైనేను” గురించి క్లుప్తంగా చెప్పగా శ్రీ దినకర్ అన్నయ్యఅమ్మ పతాకములోని విశేషాంశములను అన్నపూర్ణాలయ విశిష్టతను గురించి మాట్లాడారు. కుమారి వైష్ణవి, కుమారివరలక్ష్మి పతాక గీతికను ఆలపించారు.

15.8.2012 : ఉదయం 9 గంటలకు శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్ వ్రాసిన “విశ్వమానవి జిల్లెళ్ళమూడి అమ్మ” గ్రంథాన్ని శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు ఆవిష్కరించారు తదనంతరం శ్రీ దొంతరాజు సీతాపతిరావు (సీతాపతి అన్నయ్య) గారికి సన్మాన కార్యక్రమము జరిగింది. సంస్థలోని అన్ని విభాగాలలో పనిచేస్తున్న శ్రీ సీతాపతి అన్నయ్యగారి కార్యదక్షత వినయశీలత గురించి పెద్దలందరూ కొనియాడారు. 1978లో జిల్లెళ్ళమూడి వచ్చిన అన్నయ్యగారు అప్పటినుండి ఇప్పటివరకూ అలుపెరగని శ్రామికులు, అందరికీ ఆదర్శప్రాయులు. శ్రీ సీతాపతి, శ్రీమతి శ్యామల దంపతులను సంస్థవారు అభినందించి దుశ్శాలువలు, నూతన వస్త్రములు మొమెంటోలతో నవరత్నహారముతో, కిరీటంతో సత్కరించారు.

ఉదయం 11 గంటలకు అనసూయా సాహిత్య సామ్రాజ్యం రూపక కార్యక్రమము పిన్నలను, పెద్దలను అలరించింది. శ్రీ చంద్రమౌళి చిదంబరరావుగారి నుండి శ్రీ రామకృష్ణ అన్నయ్యగారి వరకూ పాత్రలను పోషించిన పెద్దలందరూ అభినందనీయులు.

సాయంత్రం 6.30 ని.లకు అమ్మ దివ్యసన్నిధిలో అన్నపూర్ణాలయ సిబ్బందికి ఆవరణలోని వారందరికీ సంస్థవారు వస్త్ర బహూకరణ చేశారు.

17.8.2012 : చెన్నై వాస్తవ్యులు, శ్రీ పి. హెచ్. ప్రసాదరావు- శ్రీమతిలక్ష్మి నరసమ్మగారలు, వారి కుమారుడు శ్రీ పి. శ్రీనివాసరావు కోడలు శ్రీమతి లక్ష్మి సారంగి, మనమరాళ్ళు చి. శివప్రియ, చి. కృష్ణప్రియ (కవలపిల్లలు)తో జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను హైమక్కను దర్శించుకున్నారు. 

18.8.2012 : ఈ రోజు శ్రీవారణాసి ధర్మసూరి – శ్రీమతి భగవతి దంపతులు, శ్రీ కొంపెల్లి శ్రీనివాసశరనిర్వహణలో నవగ్రహ హోమము, రుద్రహోమము జరుపుకున్నారు.

22.8.2012: శ్రీ మతుకు మల్లి రాము శ్రీమతి శారదల కుమార్తె శ్రీమతి శ్రీరంగ ( శ్రీ ఫణిరాజేష్) కు హైమాలయము శ్రీమంత కార్యక్రమము జరిగింది.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!