1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అర్కపురి విశేషాలు

అర్కపురి విశేషాలు

Kumari Visali
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 12
Month : December
Issue Number : 5
Year : 2012

25.10.2012 : గురువారెడ్డి పాలెం వాస్తవ్యులు మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీ (జిల్లెళ్ళమూడి) పూర్వ విద్యార్థి శ్రీ ఎన్. వేణుగోపాలరెడ్డి అమ్మను హైమను దర్శించుకొని కుంకుమపూజ చేసుకున్నారు. అమ్మ దయవలన తాను ఎమ్.ఎన్. పాడు, సుల్తానుగూడెం, ఒంగోలులో ఐ.టి.సి.లో కంప్యూటర్ ఇన్ఛార్జ్ పనిచేస్తున్నానని తెలిపారు.

శుద్ధ ఏకాదశి సందర్భముగా శ్రీ అనసూయేశ్వరా లయములో శ్రీ కె. యస్. రామారావు దంపతులు, శ్రీ ఎ.వి.ఆర్.సుబ్రహ్మణ్యం, శ్రీమతి లక్ష్మీపార్వతి దంపతులు, శ్రీమతి సుమ అనసూయావ్రతము జరుపుకున్నారు.

26.10.2012 : 26-10-2012 నుండి 4-12-2012 వరకు జరిగే “అమ్మ” అఖండనామ సంకీర్తనా పాల్గొన్నారు. కార్యక్రమములో జిల్లెళ్ళమూడి, చెరువు జమ్ములపాలెం 6వ మైలు భజనసంఘములు అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రవణానందముగా అమ్మనామ సంకీర్తనముగావించుచున్నవి.

“వినగ వినగ తృప్తినిచ్చు నామం

అనగ అనగ ముక్తి నిచ్చు నామం

ఇహమునకు పరమునకు తోడైన నామం,

నీనామగానం నే చేయనా ఆడుతూ పాడుతూ 

“అమ్మా నీ నామ గానం నే చేయనా” అని కీ॥శే॥ ఇందిర ఎప్పుడూ పాడుతూ ఉండేది. సోదరులు శ్రీ కొండముది రవిబాబు, శ్రీ రెడ్డి సుధాకర్ నిర్వహిస్తున్నారు.

27.10.2012 : హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ఎమ్.యస్.ఆర్.సాయిబాబు, శ్రీమతి అనంత సీతాలక్ష్మి దంపతులు “అమ్మ” మూలమంత్ర జపహోమము చేసుకున్నారు.

28.10.2012 : హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ఎమ్.యస్.ఆర్. సాయిబాబు శ్రీమతి అనంతసీతాలక్ష్మిదంపతులు అమ్మ సన్నిధిలో బంధుమిత్రుల సమక్షములో షష్టిపూర్తి వేడుకలు జరుపుకున్నారు. ఆయుష్ హోమము మృత్యుంజయ హోమము, నవగ్రహ హోమము పూర్ణాహృతి, అవబ్బధస్నానకార్యక్రమములు జరిగినాయి. సాయంత్రం అన్నపూర్ణాలయ వేదిక మీద, దంపతి పూజచేశారు.

31.10.2012 : హైదరాబాద్ లో వివాహము జరిగిన నూతన వధూవరులు శ్రీ దేశిరాజు కృష్ణకాంత్ శ్రీమతి భార్గవి (సోదరులు శ్రీ డి.వి.యన్. కామరాజు గారి కుమారుడు – కోడలు) బంధుమిత్రులతో జిల్లెళ్ళమూడి వచ్చి అనసూయావ్రతము జరుపుకున్నారు. (సినీ టి.వి. ఆర్టిస్ట్ శ్రీ చిట్టిబాబు గారు కూడా ఈ వేడుకలలోపాల్గొన్నారు.

3.11.2012 : గుండవరం వాస్తవ్యులు శ్రీ వల్లూరి నాగేశ్వరరావు -శ్రీమతి సావిత్రి గారల పాప చి॥ లక్ష్మీ హైమ అన్నప్రాసన శ్రీ అనసూయేశ్వరాలయములోజరుపుకున్నారు.

6.11.2012 నాన్నగారి శతజయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయినాయి. ఉదయం 11 మంది ఋత్విక్కులతో మహారుద్రాభిషేకము జరిగింది. ఈసందర్భముగా జిల్లెళ్ళమూడి మరియు పరిసర ప్రాంతముల వయోవృద్ధులకు 100 మందికి పైగా నూతన వస్త్రములతో సత్కరించారు. దాదాపు 800 మందికి పైగా “అమ్మ” అన్నప్రసాద వితరణ జరిగింది. శ్రీ జొన్నాభట్ల సుబ్రహ్మణ్యం గారు ఈ సందర్భంగా 100 ధోవతులు సంస్థకు అందజేశారు.

11.11.2012 : 2001 నుండి 2006 వరకు మాతృశ్రీ ఓరియంటల్ కాలేజి జిల్లెళ్ళమూడిలో చదివిన పూర్వ విద్యార్థులు జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను, హైమను దర్శించుకొని అందరికీ అన్నపూర్ణాలయంలో అన్న ప్రసాద వితరణ గావించారు.

14.11.2012 : 2000 నుండి 2005 వరకు జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీలో చదివిన పూర్వ విద్యార్థులు, జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను, హైమను అర్చించుకొని అన్నపూర్ణాలయంలో అందరికీ అమ్మ ప్రసాద

వితరణగావించారు.

13.11.2012 : దీపావళి అమావాస్య సందర్భముగా సాయంత్రం 6 గంటలకు హైమాలయంలో విద్యార్థినులు, అక్కయ్యలు, అన్నయ్యలు లక్ష్మీపూజ చేసుకున్నారు. శ్రీ వై.వి.సుబ్రహ్మణ్యంగారు (బుద్ధిమంతు డన్నయ్య, చీరాల) అనసూయేశ్వరాలయములో పూజ చేసుకొని అమ్మకు దీపావళి టపాసులు సమర్పించారు. నాలుగు ఆలయములలోనూ, వాత్సల్యాలయములోను అందంగా దీపాలంకరణ చేశారు. ఆవరణలోనివారు, విద్యార్థినీ విద్యార్థులు ఎంతో వుత్సాహంగా దీపావళి మందు సామాను కాల్చుకొని తీపి ప్రసాదము తీసుకున్నారు.

13.11.2012 : జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీ విశ్రాంత ఉపన్యాసకులు శ్రీ కుమారశర్మగారు, నూతనముగా వివాహమైన తమ కుమారుడు, కోడలు బంధుమిత్రులతో జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను అర్చించుకున్నారు. శ్రీ శర్మగారు గత సంవత్సరము గుంటూరులో వినాయక దేవాలయము నిర్మించి ఆ ఆవరణలో ‘అమ్మ విగ్రహమును కూడా ప్రతిష్ఠించుటవిశేషము.

17.11.2012 : నాగులచవితి సందర్భముగా నవనాగేశ్వరాలయములో ప్రత్యేకపూజలు, సర్పసూక్తముతో అభిషేకములు జరిగినవి. అందరూ నాగేంద్రస్వామికి పాలాభిషేకము చేసుకున్నారు.

17.11.2012 : శ్రీమతుకుమల్లి రాము, శ్రీమతి శారదల 31వ వివాహ వార్షికోత్సవ సందర్భముగాహైమాలయములో హైమవతీ వ్రతము చేసుకున్నారు.

18.11.2012 : చిలకలూరిపేట వాస్తవ్యులు శ్రీ లింగా మహేష్ బాబు ఉద్యోగములో పదోన్నతి పొందిన సందర్భముగా వారి శ్రీమతి బాలసరస్వతి, పిల్లలు చి॥ వెంకట వరుణ్, చి॥రఘువంశీలతో జిల్లెళ్ళమూడి వచ్చి అనసూయావ్రతము చేసుకొని, అందరికీ అమ్మ అన్న ప్రసాద వితరణ గావించారు.

18.11.2012 : నవంబరు 16, 17, 18 తేదీలలో నరసాపురం – డాక్టర్ కీ॥శే॥ శ్రీ ఆచంట కేశవరావుగారి ధర్మపత్ని కీ॥శే॥ శ్రీమతి ఆచంట అన్నపూర్ణగారి సంవత్సరీకాలు వారి కుమారుడు డాక్టర్ ఆచంట రామకృష్ణ సతీసమేతముగా వచ్చి బంధుమిత్రులతో వచ్చి శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ మూడురోజులూ అన్నపూర్ణాలయములో అందరికీ అన్నప్రసాదాన్ని అందించారు. సంస్థ కార్యదర్శి శ్రీ వి. రమేష్ బాబు గారు వచ్చిన వారందరికీ అమ్మ ఆశీః పూర్వక ప్రసాదాన్ని అందించారు.

21.11.2012 : భుజబలపట్నం వాస్తవ్యులు శ్రీ కూర్మాల మాణిక్యాలరావు శ్రీమతి ప్రభావతి దంపతులు. పాపకు అనసూయేశ్వరాలయములో అన్నప్రాసన చేసుకొని లక్ష్మీ మాతృశ్రీదేవిహరిణిగా నామకరణము చేసుకొని బాబు చి। “మాన్విత్ శివనాగసాయి”కి హైమాలయంలోఅక్షరాభ్యాసము చేశారు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!