22.12.2012 : శ్రీ జంపాల యానాదిగారు శ్రీమతి విజయలక్ష్మిగారల ద్వితీయకుమారుడు చి. నాగేశ్వరరావు శ్రీ అవనిగడ్డ సాంబశివరావు దంపతుల కుమార్తె చి.ల.సౌ. భారతి వివాహ నిశ్చితార్థ కార్యక్రమము బంధుమిత్రులు సందడితో శ్రీ హైమాలయములో జరిగింది.
23.12.2012 : గుంటూరు వాస్తవ్యులు శ్రీ శిష్ట్లా భార్గవ కౌండిన్య – శ్రీమతి లక్ష్మీమంజుల తమ పాప చి.లక్ష్మీసాయి సహస్ర అన్నప్రాసన కార్యక్రమము అనసూయేశ్వరాలయములో జరుపుకున్నారు.
23.12.2012 : ముక్కోటి సందర్భముగ ఆలయములో ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం 4గంటలకు శ్రీమల్లు అన్నయ్య శ్రీ మతుకుమల్లి రాము అన్నయ్య చెరువునుంచి తెచ్చిన బిందె తీర్థముతో “అమ్మ”కు స్నానము చేయించి అలంకరించారు. ఉదయం 5 గంటలకు శంఖు చక్రధారిణి అయిన అమ్మను అనసూయేశ్వరాలయ ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. తిరుప్పావై, విష్ణు సహస్రనామపారాయణ నామసంకీర్తన జరిగినవి.
24.12.2012 : నాన్నగారి శతజయంతి ఉత్సవముల సందర్భముగ మాతృశ్రీ ఓరియంటల్ పాఠశాల, కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు 2012-2013 సంవత్సరంకు గాను ఆటలపోటీలు ప్రారంభమయినాయి. సంస్థ ప్రెసిడెంట్ శ్రీ ఎమ్.దినకర్, పోటీలు ప్రారంభించారు. శ్రీ మురళీధరరావు బాలురకు, బాలికలకు శ్రీమతి ఎన్.నాగమణి పోటీలు నిర్వహించారు.
శ్రీ రాచర్ల రహి, శ్రీమతి సుధల కుమారుడు చి. రాజేశ్వరి గాయత్రి హోమము చేసుకున్నాడు. శ్రీ లక్ష్మీనారాయణ వారి కుటుంబసభ్యులు శ్రీ వారణాసి ధర్మసూరి వారి కుటుంబసభ్యులు చండీహోమము చేసుకున్నారు.
30.12.2012 : నవనాగేశ్వర ఆలయ అర్చకులు శ్రీ పెండ్యాల నాగేశ్వరశర్మ, శ్రీమతి మృదుల, తమ కుమారుని నామకరణము, అన్నప్రాశన బంధుమిత్రుల సందడితో శ్రీ అనసూయేశ్వరాలయములో జరుపుకున్నారు.చి.బాబుకు సాయిసత్య సుబ్రహ్మణ్యేశ్వర వెంకటేశ్వర కామేశ్వర అనసూయేశ్వర లక్ష్మీపార్వతీ నరసింహ
మార్కండేయ దర్శిత్గా నామకరణం చేశారు.
30.12.2012 : సంక్రాంతి పండుగ సందర్భంగా అన్నపూర్ణాలయ వేదికవద్ద సాయంత్రం విద్యార్థినుల సందడితో “సందెగొబ్బెమ్మ, పేరంటము మొదలైంది. అలంకరించిన గొబ్బెమ్మలకుపూజ చేసుకున్న విద్యార్థినులు గొబ్బిచుట్టూ తిరుగుతూ గొబ్బి తట్టారు. కుమారి ఎమ్.వి. సుబ్బలక్ష్మి శ్రీమతి నాదెండ్ల భ్రమరాంబ అక్కయ్య గొబ్బి పాటలు పాడారు. కుమారి గౌరి శాస్త్రీయ నృత్య ప్రదశ్రన చేసింది. కుమారి ఎమ్.వి. సుబ్బలక్ష్మి పాడుతూ తాను ఆడి అందరిచేతా గొబ్బి ఆడించింది. శ్రీ కామరాజు గడ్డ వెంకటరమణశర్మ గారు హరిదాసుగా వచ్చి అందరినీ ఆనందపరిచారు. శ్రీమతి బ్రహ్మడం వసుంధర పూజా పేరంటములు నిర్వహించగా శ్రీమతి బూదరాజు రాణి శ్రీమతి వల్లూరి హైమ, శ్రీమతి చక్కా లక్ష్మి మొదలైన వారు తమ సహాయసహకారములను అందించారు. ఇంత కార్యక్రమమును నిర్వహించిన మనత కుమారి ఎమ్.వి. సుబ్బలక్ష్మిగారిదే.
31.12.2012 : మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో చరిత్ర ఉపన్యాసకునిగా సుదీర్ఘ కాలము పనిచేసి 31-12-2012న చడవీ విరమణ చేసిన శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తిగారి అభినందన సభను పూర్వప్రస్తుత విద్యార్థినీ, విద్యార్థులు జిల్లెళ్ళమూడిలో ఘనంగా నిర్వహించారు.
హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు గారి మనమరాండ్రు సాయిమహిత కుమారి మనిషాకుమారి శిరీషలు గానం చేసిన అమ్మ పాటల ఆడియోరిలీజ్ కార్యక్రమము సాయంత్రం శ్రీ అనసూయేశ్వరాలయములో శ్రీ బ్రహ్మాండం రవి అన్నయ్య ప్రారంభించారు.
నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలు,శ్రీ అనసూయేశ్వరాలయములోనూ, శ్రీ హైమాలయములోనూ మొదలైనాయి. శ్రీ భట్టిప్రోలు రాము, శ్రీమతి సుగుణగారల కుమార్తె కుమారి అనసూయాదీప్తి కేక్ కట్ చేయగా అందరు
కొత్త సంవత్సరానికి వెల్కం చెప్పారు. శ్రీ సత్తిరాజు గారి అబ్బాయి ఈశ్వరకుమార్, శ్రీమతుకుమల్లి రాము, శ్రీమతి శారద వాత్సల్యాలయములో అమ్మకు పూజ చేసుకున్నారు. అన్నపూర్ణాలయ వేదిక వద్ద అందరికీ రస్కులు, కేకులు, టీ ఇచ్చారు. అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. “అమ్మ డైరీలను 2013, శ్రీ రవి అన్నయ్య ఆవిష్కరించగా అమ్మా, నాన్నగారల కేలండర్, అమ్మ కేలండర్, శ్రీ ఎమ్. దినకర్ అన్నయ్య, శ్రీ
వై.వి.శ్రీరామమూర్తి అన్నయ్యగారు ఆవిష్కరించారు.
1.1.2013 : నూతన సంవత్సర ప్రారంభముగా ఆలయములోని ప్రత్యేకపూజలు జరిగాయి.
2.1.2013 : ఉదయం అన్నపూర్ణాలయ నూతన భోజనశాల నిమిత్తము, ప్రస్తుతము ఉన్న రేకుల షెడ్డు తొలగింపు కార్యక్రమము మొదలైంది. ఈ రోజు నుండి అందరికీ కళ్యాణమండపములో భోజనాలు ఏర్పాటు చేశారు.
2.1.2013 : సంకష్టహర గణేశహోమము జరిగింది.
5.1.2013 : నాన్నగారి శతజయంతి వుత్సవముల సందర్భముగా బాపట్లలోని బధిరుల ఆశ్రమ జూనియర్ కళాశాల విద్యార్థులకు శ్రీ విశ్వజననీపరిషత్వారు, పులిహోర, దద్దోజనము అమ్మప్రసాదముగ అందజేశారు.
6.1.2013 : నాన్నగారి శతజయంతి ఉత్సవములు సందర్భముగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విశ్రాంత అధ్యాపకురాలు సోదరి శ్రీమతి యు. వరలక్ష్మి, శ్రీ కె.సత్యప్రసాద్, శ్రీ తురుమెళ్ళ చెన్నకేశవరావుగారి కుమారుడు మాణిక్యరావు వేమూరు గ్రామములో అన్నప్రసాదవితరణ గావించారు. వారి బంధుమిత్రులు, గ్రామస్తులు, ఈ కార్యక్రమములో పాల్గొన్నారు. అనంతరము ప్రతి ఒక్కరికీ నూతన వస్త్ర బహుకరణ చేశారు. స్థానిక ఎమ్.ఎల్.ఎ. శ్రీ ఆనందబాబుగారు, శ్రీ దినకర్గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. సోదరులు శ్రీ రావూరి ప్రసాద్ అమ్మపాటలు పాడి అందరినీ ఆనందింపచేశారు. శ్రీమతి సుగుణ మొదలగువారు ప్రసంగించారు.
13.1.2013 : భోగిపండుగ సందర్భముగ సాయంత్రం 6గంటలకు భోగిపండ్ల కార్యక్రమము సందడిగా సరదాగా మొదలైంది. ఉద్యోగరీతా వివిధ ప్రాంతములలో ఉన్న గోపాలన్నయ్యగారి కుమారు వారి కుటుంబములతో వచ్చి అమ్మకు హైమకు పూజ చేసుకున్నారు. పూజా కార్యక్రమములు అనంతరము భోగిపండ్లు పోసే వేడుకు మొదలైంది.
ప్రతి పౌర్ణమినాడు గ్రామస్థులు, భక్తులు శ్రీ హైమాలయములో శ్రీ లలితసహస్రనామ కుంకుమపూజ చేయుటకు విశ్వజననీపరిషత్వారు ఏర్పాటు చేయుట జరిగినది.
13.1.2013 : సుదర్శన హోమము, శ్రీ లక్ష్మీగణపతి హోమములు జరిగినవి. శ్రీ వారణాసి ధర్మనూరి, శ్రీమతి భగవతి (హైదరాబాద్) బి.యస్.ప్రకాశరావు, శ్రీమతి కృష్ణవేణి, కుటుంబ సభ్యులు, (విశాఖపట్నం) శ్రీ విన్నకోట భాస్కరశర్మ, శ్రీమతి కస్తూరి, కుటుంబసభ్యులు (యస్.కోట), శ్రీమతి టి. విశాలాక్ష్మి అన్నపూర్ణ – శ్రీమతి ఆర్. నాగసులోచన (హైదరాబాద్) మొదలైనవారు పాల్గొన్నారు.
15.1.2013 : నాన్నగారి శతజయంతి ఉత్సవములు మరియు సంక్రాంతి పండుగ సందర్భముగ 13.1.2013 నుండి 15.1.2013 వరకూ జిల్లెళ్ళమూడి గ్రామస్తులు జిల్లెళ్ళమూడిలో సోదరులు, శ్రీ చక్కా శ్రీమన్నారాయణగారి (శ్రీ విద్యానిలయం – జిల్లెళ్ళమూడి) సహాయ సహకారములతో ఆటలపోటీలు నిర్వహించారు. ఎంతో వుత్సాహపూర్తి వాతావరణంలో సందడిగా పోటీలు ప్రారంభమయినాయి. స్లోసైక్లింగ్, ముగ్గులు, లెమన్ స్పూన్, వాలీబాల్, షార్ట్పుట్ మూజికల్ చైర్స్ మొదలైన ఆటలపోటీలు జరిగినాయి. గ్రామంలోని పిల్లలు పెద్దలు చాలా వుత్సాహంగా, ఆనందంగా పోటీల్లో పాల్గొన్నారు. శ్రీ రవి అన్నయ్య గారు పోటీలలో పాల్గొన్న వారందరికీ ఆశీస్సులు, అభినందనలు తెలియచేశారు. నాటి గ్రామస్తులతో తనకున్న అనుబంధము. నేడు వారి పిల్లలు అభివృద్ధి పథములో పయనించి విదేశములలో కూడా వుద్యోగులై వుండటము సంతోషకరమైన విషయమన్నారు.
శ్రీ చక్కా శ్రీమన్నారాయణగారు ప్రసంగించారు. ముగ్గులపోటీలలో పాల్గొన్న ప్రతిసోదరీమణికి కీ.శే. కుమారి ఇందిర పేరు మీద కాంప్లిమెంటరీ బహుమతులు ఇవ్వటం జరిగింది. శ్రీ రవి అన్నయ్య విజేతలకు బహుమతులు అందజేశారు.
18.1.2013 : నిజాంపట్నం మండలం గోకర్ణ మఠం గ్రామ వాస్తవ్యులు శ్రీ పులుగుబాలచంద్రారెడ్డి – శ్రీమతి ఉమ తమ కుమారుడు విక్రాంత్రెడ్డి అన్నప్రాసన కార్యక్రము అనసూయేశ్వరాలయములో జరుపుకున్నారు.
18.1.2013 : “జిల్లా టాక్” వీక్లీ పత్రిక (తెనాలి) ప్రతినిధులు శ్రీ టి.అశోక్ కుమార్, శ్రీ నాగాంజనేయులు, జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను దర్శించుకున్నారు.
19.1.2013 : జిల్లెళ్ళమూడి ఓరియంటల్ పాఠశాల అధ్యాపకులు శ్రీ కొత్త ప్రసాద్, శ్రీమతి లక్ష్మి, తన కుమార్తె చి. హైమ పుష్పవతి అయిన సందర్భముగా శ్రీ హైమాలయములో పేరంటము చేశారు.
20.1.2013 : చింతలపూడి వాస్తవ్యులు శ్రీ షేక్ బాబు కుటుంబముతో వచ్చి అమ్మను దర్శించుకున్నారు. తాను ఆటోడ్రైవర్ ననీ, 3 సంవత్సరముల క్రితము తాను జిల్లెళ్ళమూడి వచ్చినపుడు, తాను సొంతంగా ఆటో ఏర్పాటు చేసుకోగలిగితే ఒక బస్తాధాన్యం ఇస్తానని అనుకున్నారట. ఇంతకాలానికి తాను ఆటో సొంతదారుకాగలిగాననీ అమ్మకు ధాన్యం బస్తా ఇవ్వటానికి వచ్చానని సంతోషముగా తెలియజేశారు.
1.1.2013: 1.1.2013 o& 11.1.2013 వరకు విజయవాడలో జరుగుచున్న 24వ పుస్తక ప్రదర్శన సందర్భముగ అమ్మ సాహిత్యము, అమ్మ సినిమా సిడిలు, టెలిఫిలిమ్ సి.డి.లు, కాలెండర్లు, ఫోటోలు, స్టాలులో పెట్టడం జరిగింది. స్టాకు, సోదరులు, శ్రీ బొప్పూడి రామబ్రహ్మంగారు ప్రారంభించారు. స్టాల్ శ్రీ అనంత్గారు నిర్వహించగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల అధ్యాపకులు శ్రీ రవితేజ, శ్రీ త్రయంబకం, కళాశాల విద్యార్థి చి. కిషోర్ సహాయసహకారముల నందించారు.
6.1.2013 : హైదరాబాదులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రతి సంవత్సరము ఏర్పాటు చేసినట్లే ఈ సంవత్సరము కూడా 6.1.2013వ తేదీన అమ్మ గురించిన సాహిత్యము, సిడిలు, ఫోటోలు మొదలైనవి వుంచిన స్టాల్ ఏర్పాటు చేయటమైనది. ఈస్టాలును జిళ్ళెళ్ళమూడి నుండి వచ్చిన ఇ.సి. మెంబరు శ్రీ నాదెండ్ల లక్ష్మణరావు గారు ముఖ్య అతిధిగా విచ్చేసి రిబ్బన్ కట్చేసి, పుస్తక ప్రదర్శనాలను ప్రారంభించారు. ఈ ప్రదర్శన 40రోజులు నిర్వహించబడుతుంది.”
23.1.2013 : ఈ రోజున జిల్లెళ్ళమూడి గ్రామములో మంచినీటి సదుపాయము గల చెరువునకు గ్రామస్తుల సహకారముతో మరియు “అమ్మ” భక్తుల సహకారముతో కొత్తగా రేవు పునర్ నిర్మాణము చేయుటకు- శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు అన్నయ్యగారితో శంఖు స్థాపన చేయించటం జరిగింది. ఈ రేవు నిర్మాణ బాధ్యతను శ్రీ చక్కా శ్రీమన్నారాయణగారు (పరిషత్ సభ్యులు -ఇ.సి. మెంబరు) స్వీకరించడమైనది. అవకాశము వున్నవారు తమ సహాయసహకారములను అందించవచ్చును అని తెలిపారు.
25.1.2013 : విజయవాడ తాడిగడపకాలనీ నుండి 15 మంది సోదరీ సోదరులు జిల్లెళ్ళమూడివచ్చి అమ్మను దర్శించుకొని, కుంకుమార్చన చేసుకున్నారు.