1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అర్కపురి విశేషాలు

అర్కపురి విశేషాలు

Medikonduri Anjani Devi, Kumari Visali
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : March
Issue Number : 8
Year : 2013

24.1.2013: 24-1-2013 308 26-1-2013 వరకూ శ్రీ మన్నవ బుచ్చిరాజుశర్మగారు శ్రీమతి కీ॥శే॥ మన్నవ ప్రభావతిగారి సంవత్సరీకములు జిల్లెళ్ళమూడిలో జరుపుకున్నారు.

27.1.2013 : తెనాలి వాస్తవ్యులు 91 సంవత్సరాల శ్రీ ఆలపాటి పూర్ణచంద్రరావుగారు వారి కుటుంబసభ్యులతో జిల్లెళ్ళమూడి వచ్చి వీల్ చైర్లో అనసూయేశ్వరాలయము నకు వచ్చినపుడు వారు పొందిన ఆనందము అనిర్వచ నీయము. అమ్మా అంటూ ఎంతో ఆర్తితో స్తోత్రములు చదివారు. హైమను దర్శించుకున్నారు. ఒకప్పుడు తనతోపాటు అమ్మను చూచేందుకు వచ్చే అన్నయ్యలను అక్కయ్యలను జ్ఞాపకం చేసుకున్నారు.

శ్రీ పూర్ణచంద్రరావుగారు అందరింటిలోని పెద్దలకు నూతన వస్త్ర బహూకరణ చేశారు. శ్రీపూర్ణచంద్రరావు గారిని శ్రీ విశ్వజననీపరిషత్ వారు ఘనముగా సన్మానించిన దృశ్యము ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది.

27.1.2013 : పట్టపుపాలములో మాతృశ్రీ మెడికల్ సెంటర్ జిల్లెళ్ళమూడి వారి ఆధ్వర్యములో ఉచిత వైద్యశిబిరము జరిగింది. సుమారు 67 మందిని పేషెంట్కు – పరీక్షించి మందులు ఇవ్వటమైనది. కాలువంకరగా వున్న బాబుకు సర్జరీ చేయించటమైనది.

28.1.2013 : శ్రీమతి బ్రహ్మాండం వసుంధర అక్కయ్య తన 70వ పుట్టినరోజు సందర్భముగా శ్రీ అనసూయేశ్వరాలయములో అనసూయావ్రతము జరుపుకొని అందరికీ అన్నప్రసాదవితరణ జరిపారు.

4.2.2013 : నాన్నగారి శతజయంతి ఉత్సవముల సందర్భముగ వల్లూరు గ్రామములో (కాకుమాను మండలం – గుంటూరుజిల్లా) శ్రీ విశ్వజననీపరిషత్, జిల్లెళ్ళమూడి వారి ఆధ్వర్యములో “అమ్మ”ను గూర్చి తెలియజేసే సినిమా ప్రదర్శన, అమ్మనామ సంకీర్తనా కార్యక్రమములు ఏర్పాటు చేశారు. అనంతరము అమ్మ అన్న ప్రసాదవితరణ జరిపారు. ఈ కార్యక్రమములో దాదాపు 150 మంది పాల్గొన్నారు. సోదరులు శ్రీ వల్లూరి రమేష్బాబు, శ్రీ సి. అనంత్, శ్రీ రావూరి ప్రసాద్, శ్రీ కొండముది రవిబాబు, ఈ కార్యక్రమమును నిర్వహించారు.

5.2.2013 ఏలూరు పరిసర ప్రాంతమైన మాదేపల్లిలో శ్రీ సైదు ఉమామహేశ్వరరావుగారి సంకల్పముతో, 5, 6 తారీకులో నాన్నగారి శతజయంతి ఉత్సవములు పాతశివాలయములో జరిగినాయి. 5-2-2013న అమ్మా నాన్నగారల ఊరేగింపు జరిగింది. అమ్మా, నాన్నగారల ఫోటోబండి మీద ఏర్పాటు చేసి వీధి వీధిన ఇంటింటి ముందు ఆగుతూ వారు అమ్మా నాన్నలకు పూలు, పండ్లు కొబ్బరికాయలు అందించగా శ్రీ విశ్వజననీ పరిషత్వారు వారందరికీ ప్రసాదము కుంకుమ ఇచ్చారు. 6-2-2013న శ్రీ విశ్వజననీపరిషత్ అధ్యక్షులు, శ్రీ ఎమ్. దినకర్ మరియు శ్రీ రావూరి ప్రసాద్, శ్రీ టి.టి. అప్పారావు, శ్రీ వై. కృష్ణాజీరావుగారల ఉపన్యాసము లతో అమ్మ నామ సంకీర్తనా కార్యక్రమముతో శ్రీ ఉమా మహేశ్వరరావుగారి అధ్యక్షతన కార్యక్రమములు దిగ్విజయముగా జరిగినాయి. సుమారు 2000 మందికి అమ్మ అన్నప్రసాదవితరణ జరిగింది.

10.2.2013 : పట్టపుపాలేము నందు మాతృశ్రీ మెడికల్ సెంటర్ జిల్లెళ్ళమూడి వారి ఆధ్వర్యములో ఉచిత వైద్య శిబిరము జరిగినది. సుమారు 50 మందిని పరీక్షించి అవసరమైన వారికి బి.పి., షుగర్ పరీక్షలు జరిపిన వారికి అవసరమైన మందులు ఇవ్వటం జరిగింది.

10.2.2013వ తేదీన పొన్నూరులో కీ.శే. అధరాపురపు శేషగిరిరావుగారి శతజయంతి సందర్భముగ విశేషసంచికను శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానందభారతీస్వాముల వారు ఆవిష్కరించారు. ఈ సభాకార్యక్రమములో శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావుగారు (హైదరాబాదు) సోదరులు శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు, శ్రీ ఎమ్. దినకర్, శ్రీ వై.వి. శ్రీరామమూర్తి, శ్రీ నాదెండ్ల లక్ష్మణరావు, శ్రీ ఎల్. రామకోటేశ్వరరావు (జిల్లెళ్ళమూడి) గారలు పాల్గొన్నారు. స్థానిక ఎమ్.ఎల్.ఎ., ఎమ్.ఎల్.సి మరియు పురప్రముఖులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు. ఈ కార్యక్రమములో శ్రీ శేషగిరిరావుగారి కుమారుడు శ్రీ రవిగారు కూడా పాల్గొన్నారు. పి.యస్.ఆర్. ఆంజనేయ ప్రసాద్ సభానిర్వహణ చేశారు.

11.2.2013 : శ్రీ రావూరిప్రసాద్ – శ్రీమతి శేషప్రభావతి గారల మనుమడు, శ్రీ విజయనరసింహ – శ్రీమతి ఉషాగాయత్రిగారల కుమారుడు చి. నాగ అనసూయ రామాంజనేయ ఆరూష్ అన్నప్రాసన కార్యక్రమము శ్రీ అనసూయేశ్వరాలయములో బంధుమిత్రుల సందడితో జరుపుకున్నారు. అనంతరము అన్నప్రసాద వితరణగావించారు.

15.2.2013 : శ్రీ జంపాల యానాదిగారు, శ్రీమతి విజయలక్ష్మి తమ కుమారుని వివాహమైన సందర్భముగ, జిల్లెళ్ళమూడి వచ్చి నూతన వధూవరులైన, చి. నాగేశ్వరరావు, చి.ల.సౌ. భారతిలతో అనసూయా వ్రతము చేయించారు. అనంతరము అందరికీ అమ్మ అన్న ప్రసాద వితరణ జరిపారు.

  శ్రీ పంచమీ సందర్భముగ హోమశాలలో సరస్వతీ హోమము జరిగింది.

డాక్టర్ శ్రీ కోన సత్యనారాయణమూర్తి – శ్రీమతి రాజ్యలక్ష్మి దంపతులు నూతన గృహనిర్మాణము నిమిత్తము జిల్లెళ్ళమూడిలోని ‘హైమవతీనగర్లో శంఖుస్థాపన చేసుకున్నారు.

15.2.2013 : విజయవాడ వాస్తవ్యులు శ్రీ పొన్నపల్లి కృష్ణకిశోర్, శ్రీమతి కృష్ణవేణిగారల కుమారుడు చి.లీలా హైమకర్ అక్షరాభ్యాసము శ్రీ అనసూయేశ్వరాలయములో జరుపుకున్నారు.

16.2.2013 : కీ.శే. శ్రీ బోళ్ళ కృష్ణమూర్తిగారి జ్ఞాపకార్థము శ్రీమతి బోళ్ళవరలక్ష్మిగారు వారి కుమార్తెలు శ్రీమతి సరోజిని, శ్రీమతి తులసి అనసూయేశ్వ రాలయములో అనసూయావ్రతము చేసుకొని అందరికీ అన్నప్రసాదవితరణం గావించారు.

17.2.2013 : సౌరహోమము జరిగింది. స్థానికులైన అన్నయ్యలు, అక్కయ్యలు ఇతర ప్రాంతముల నుండి వచ్చిన సోదరీ సోదరులు. ఈ హోమ కార్యక్రమములో పాల్గొన్నారు.

నాన్నగారి శతజయంతి ఉత్సవములు ఆరాధ నోత్సవముల సందర్భముగ 16.2.2013 ఉదయం 6 గంటల నుండి 17.2.2013 ఉదయం 6 గంటల వరకు శ్రీమతి భ్రమరాంబ అక్కయ్య భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా నాన్నగారి నామ ఏకాహము మొదటిసారి నిర్వహించారు. సోదరులు శ్రీ ఎమ్. దినకర్, శ్రీ వై.వి. శ్రీరామమూర్తిగారు, శ్రీ కొండముది రవిబాబు, హైదరాబాదు వాస్తవ్యులు శ్రీ గుడిపూడి జనార్దనశర్మ మొదలైన వారు పాల్గొన్నారు.

నాన్నగారి ఆరాధనోత్సవముల సందర్భముగ శ్రీ ఎమ్. దినకర్, శ్రీ వై.వి. శ్రీరామమూర్తిగారు అమ్మా నాన్నగారికి నూతన వస్త్రములు సమర్పించారు. మహారుద్రాభిషేకము జరిగింది. అనంతరము అమ్మా నాన్నగారికి ధాన్యముతోనూ బియ్యముతోనూ ధాన్యాభిషేకము జరిగింది. ఈ కార్యక్రమములో స్థానికులు ఇతర ప్రాంతముల నుండి వచ్చిన సోదరీ సోదరులు భక్తి శ్రద్ధలతో విరివిగ పాల్గొని అభిషేకము చేసుకొన్నారు. 2000 మందికి అమ్మ అన్నప్రసాదవితరణ జరిగింది.

మద్రాసు గెస్ట్ హౌస్ నందు గల సోదరీ సోదరులు మూడు సంవత్సరములుగా అమ్మ సత్సంగము ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ సందర్భముగా సోదరీ శ్రీమతి జె.సరస్వతిగారు, అమ్మపూజ ప్రసంగములు నామసంకీర్తనా కార్యక్రమములు మూడు రోజులు ఏర్పాటు చేశారు. సత్సంఘ సభ్యులు, శ్రీ గోపాలన్నయ్యగారు, శ్రీ టి.టి. అప్పారావు గారు, శ్రీ నాదెండ్ల లక్ష్మణరావు గారు, శ్రీమతి భ్రమరాంబగారు, శ్రీ ఎమ్. దినకర్ గారు, ఇతర ప్రాంతముల నుండి వచ్చినవారు ఈ కార్యక్రమములలో పాల్గొన్నారు. ఈ మూడురోజులూ విశాఖపట్నం వాస్తవ్యులు సోదరులు శ్రీ గుడిపూడి పాండురంగ విఠల్ గారు భక్తిరస పూరితంగా సుందరకాండ పారాయణ చేయగా, శ్రీమతి నాదెండ్ల భ్రమరాంబ అక్కయ్యగారు నామసంకీర్తనా కార్యక్రమము నిర్వహించారు. ప్రతిరోజూ పూజా సంకీర్తనానంతరము ప్రసాద వినియోగము జరిపారు.

విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీ అయ్యంగారి చక్రవర్తి, శ్రీమతి కుసుమాచక్రవర్తి దంపతులు ప్రతి సంవత్సరము వలెనే ధాన్యాభిషేకం సందర్భముగా ఈ సంవత్సరము కూడా “అమ్మకు – హైమకు” పట్టువస్త్రములు సమర్పించి, అభిషేక పూజా కార్యక్రమములో పాల్గొన్నారు.

19.2.2013 : శ్రీ భట్టిప్రోలు రామచంద్ర, శ్రీమతి సుగుణగారలు తమ పెండ్లిరోజు సందర్భముగ అమ్మా, హైమలకు పూజ చేసుకొని అన్నప్రసాదవితరణ గావించారు.

20.2.2013 : అమ్మ ఆగమనోత్సవ సందర్భముగ మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, పాఠశాలల బాలికల హాస్టల్లోని విద్యార్థినులు, వార్డెన్ శ్రీమతి నండూరి నాగమణిగారి ఆధ్వర్యములో అమ్మకు పూజచేసుకొని శ్రీ లలితాసహస్రనామ పారాయణ చేశారు. ఈ కార్యక్రమములో ఎస్.వి.జె.పి. సభ్యులు, ఆవరణలోని వారు పాల్గొన్నారు. పూజ, పారాయణ అనంతరము ప్రసాదవినియోగము జరిగినది.

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విశ్రాంత అధ్యాపకులు శ్రీ ఐ. హనుమబాబుగారి ఇంటిలో అమ్మ ఆగమనోత్సవము సందర్భముగ “అమ్మ పూజ” మహా సంకీర్తన, ప్రసాదవితరణ జరిగినవి. ఈ కార్యక్రమములో ఎస్.వి.జె.పి.సభ్యులు ఆవరణలోని సోదరీ సోదరులు పాల్గొన్నారు.

23.2.2013 : గిట్టుపల్లి వాస్తవ్యులు శ్రీ జి. సత్యనారాయణ – శ్రీమతి సరళగారల ద్వితీయ కుమారుని వివాహమైన సందర్భముగా జిల్లెళ్ళమూడి వచ్చి నూతన వధూవరులైన చి. అఖిలేష్, చి.ల.సౌ. పూజితలతో “అనసూయావ్రతం” చేయించారు. శ్రీ జి. కృష్ణమోహన్, శ్రీమతి అపర్ణ గారలు కూడా అనసూయావ్రతములో పాల్గొన్నారు. అమ్మకు, హైమకు, నాన్నగారికి వస్త్రములు సమర్పించారు. అనంతరము అందరికీ అన్నప్రసాద వితరణ

గావించారు.

24.2.2013 : గుంటూరు వాస్తవ్యులు శ్రీ టి. రామకృష్ణ, శ్రీమతి సాయికుమారు కుమార్తె వివాహము నిశ్చయమైన సందర్భముగా కాబోవు వధూవరులు, చి.ల.సౌ. సాయిపద్మ, చి. శ్రీనాధ్ తో జిల్లెళ్ళమూడి వచ్చి హైమవతీవ్రతము చేసుకున్నారు.

25.2.2013 : 1958 సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీన అమ్మ ఓంకారనదిలో (నల్లమడను) దాదాపు 600 మందికి మాఘపౌర్ణమి పర్వదినాన మంత్రోపదేశం చేసిన అద్భుత సన్నివేశాన్ని చరిత్రబద్ధం చేయ సంకల్పించారు అమ్మబిడ్డలు. అందులకై ఆ పుణ్యభూమిలో పుష్కరఘాట్ నిర్మించదలచి మాఘపౌర్ణమినాడు (25.2.2013) శంఖు స్థాపనా కార్యక్రమం జరిగింది. శ్రీమతి వసుంధర అక్కయ్య పూజా కార్యక్రమమును నిర్వహించగా, హైదరాబాదు నుండి వచ్చిన సోదరులు శ్రీ వారణాసి ధర్మసూరి, శ్రీ యస్.మోహనకృష్ణ దంపతులు మొదలైనవారు ఏర్పాట్లను పర్యవేక్షించారు. గ్రామస్థులైన సోదరీమణులు “అమ్మనామ సంకీర్తన గావించారు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!