4-10-2013 : విజయనామ సంవత్సర దసరా ఉత్సవములకు నాందిగా శ్రీ అనసూయేశ్వరాలయము గర్భగుడిలో నిర్వహించబడిన “తిరుమంజనము” కార్యక్రమంలో సోదరులు శ్రీవారణాసి ధర్మసూరి, శ్రీ పొత్తూరి ప్రేమగోపాల్, శ్రీ వర మల్లికార్జునప్రసాద్, శ్రీవల్లూరి రమేష్ బాబు, శ్రీమతి హైమ దంపతులు, అర్చక స్వాములు పాల్గొన్నారు.
5-10-2013 నుండి 13.10.2013: శ్రీ విజయనామ సంవత్సర శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతముగా నిర్వహించబడినాయి.
5-10-2013 : మాతృశ్రీ అనసూయాదేవి.
6-10-2013 : శ్రీ బాలాత్రిపురసుందరి
7-10-2013 : శ్రీ గాయత్రీదేవి
8-10-2013 : శ్రీ అన్నపూర్ణాదేవి
9-10-2013 : శ్రీ మహాలక్ష్మి
10-10-2013 : శ్రీ లలితాదేవి.
11-10-2013 : శ్రీ సరస్వతీదేవి
12-10-2013 : శ్రీ దుర్గాదేవి
13-10-2013 : శ్రీ మహాకాళి, శ్రీరాజరాజేశ్వరిదేవిగా దర్శనమిచ్చిన విశ్వజనని, జగన్మాత “అమ్మకు” స్థానికులు, అందరింటి లోనివారు, ఇతర ప్రాంతముల నుండి వచ్చిన సోదరీ సోదరులు భక్తి శ్రద్ధలతో త్రికాలపూజలు చేసుకున్నారు.
6-10-2013 : కొండుభొట్లవారి పాలెములో మాతృశ్రీ మెడికల్ సెంటర్ (జిల్లెళ్ళమూడి) వారి ఆధ్వర్యంలో వైద్య శిబిరం జరిగింది. దాదాపు 200 మంది పాల్గొన్న ఈ వైద్యశిబిరంలో అవసరమైన వారికి బి.పి., షుగర్, పరీక్షలు చేసి వైద్యసలహాలను, మందులను అందజేశారు. ఈ కార్యక్రమములో డాక్టర్ శ్రీమతి ఇనజకుమారి, డాక్టర్ శ్రీ చల్లా రామమోహనరావు సహాయకులుగా శ్రీమతుకుమల్లి రాము, శ్రీమతి ర కాన్సీ, శ్రీ ఎ.శ్యామసుందరరావు, విద్యార్థి చి॥ గోపీ పాల్గొన్నారు.
12-10-2013 : శ్రీ జన్నాభట్ల సుబ్రహ్మణ్యం, శ్రీమతి లక్ష్మి దంపతులు అమ్మ సన్నిధిలో సువాసినీ పూజ జరుపుకున్నారు.
11, 12, 13 వ తేదీలలో హోమశాలలో చండీ హోమము నిర్వహించబడినది.
13-10-2013 : సాయంత్రం శ్రీ వల్లూరి ప్రేమరాజు శమీపూజ చేసుకున్నారు. అమ్మ నామసంకీర్తన కార్యక్రమము అనంతరము ప్రసాద వినియోగము జరిగింది. 9 రోజులూ పూజలో పాల్గొన్నవారికి స్వయంగా రాలేక తమ గోత్రనామములతో పూజలు జరిపించుకున్న వారికి శ్రీ విశ్వజననీపరిషత్వారు “అమ్మ” శేష వస్త్రమును అందజేశారు.
14-10-2013: విమజ్జనోత్సవము నిర్వహించ బడింది.
14-10-2013 నుండి 23-11-2013 : మండలదీక్షగా అమ్మ అఖండనామము నిర్వహించబడుతున్నది.
వేదపాఠశాల వార్షికోత్సవము : వేదపాఠశాల ప్రధమవార్షికోత్సవము సందర్భముగా విజయదశమి నాడు (14.10.2013) పాఠశాల అధ్యాపకులు శ్రీ ఎమ్.సందీప్ శర్మగారు విద్యార్థులు అమ్మకు పూజచేసుకొని శ్రవణానందకరముగా వేదపఠనముగావించారు. వేద అధ్యాపకులు, తమ విద్యార్థులు నేర్చుకున్న పాఠముల గురించి వివరించారు.
ఈ కార్యక్రమములో సోదరులు శ్రీ ఎమ్.దినకర్, శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు, శ్రీ ఎ.వి.ఆర్.సుబ్రహ్మణ్యం
గారలు పాల్గొని అమ్మ ప్రసాదం అందించారు.
22-10-2013 : ఉదయం నుండి 23.10.2013 ఉదయం ఏకాహం.
22-10-2013 : నాన్నగారి నామసంకీర్తన (అనసూయేశ్వర నమో శ్రీ నాగేశ్వర నమోనమో) శ్రీ భాస్కరరావు అన్నయ్య ప్రారంభించారు.
22-10-2013 నుండి 26.10.2013: వరకూ నాన్నగారి (శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావుగారి శతజయంతి ఉత్సవములు ప్రతిరోజు నాన్నగారిని అమ్మను గురించి ప్రసంగములు, గ్రంథావిష్కరణలు, అమ్మ నాన్నగార్లతో ప్రత్యక్ష ఆత్మీ అనుబంధము కలిగిన సోదరీ సోదరుల “హృదయా విష్కరణలు” సభా కార్యక్రమములకు హాజరైన ప్రతి ఒక్కరినీ అలరించాయి. అచ్చపు తెలుగు కవితా గాన ర రులు కురిపించి సదస్యులను మెప్పించిన, సోదరీ, – సోదరులు అభినందనీయులు. దాదాపు కార్యక్రమాలు మొదలైన రోజు నుండీ వర్షాలు కురిసి జిల్లెళ్ళమూడి వరదలో చిక్కుకుపోయినా ‘నాన్నగారు, అమ్మ’ దివ్యాశీస్సులతో నిర్విఘ్నంగా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమ నిర్వహణకు తమ సంపూర్ణ సహకారము నందించిన సోదరులు అందరినీ శ్రీ విశ్వజననీ పరిషత్వారు అభినందించి సత్కరించారు.