27-11-2013 : గుంటూరు వాస్తవ్యులు శ్రీ బి.కె.బి.వి.వరప్రసాద్ శ్రీమతిరాధారాణి దంపతులు తమ కుమారుడు చి. పవన్కుమార్ ఉపనయనము అమ్మ సన్నిధిలో జరుపుకున్నారు.
28-11-2013 : బిలాస్పూర్ వాస్తవ్యులు శ్రీ ఎ. ఈశ్వరరావు, శ్రీమతి రమదంపతుల కుమార్తె చి||ల||సౌ|| ఆన్య వివాహము, కీ॥శే॥ శ్రీ మధుకర్రావు భోస్లే శ్రీమతి సవితాభోస్లే దంపతుల కుమారుడు చి॥ అలోక్ భోస్లే గారితో జిల్లెళ్ళమూడిలో శ్రీ హైమవతీదేవి సన్నిధిలో బంధుమిత్రుల సందడితో వేడుకగా జరిగింది.
28-11-2013 : హైదరాబాదు వాస్తవ్యులు శ్రీ వాడపల్లి వాసుదేవరావు శ్రీమతి రమాదేవి దంపతులు జిల్లెళ్ళమూడిలో శ్రీ హైమానిలయం అపార్టుమెంట్లో నూతన గృహప్రవేశం సందర్భంగా అమ్మకు నాన్నగారికి, శ్రీ హైమవతీదేవికి పూజలు గావించి నూతన వస్త్రములు సమర్పించారు.
29-11-2013 : పెదనందిపాడు వాస్తవ్యులు శ్రీ సూరె రామసుబ్బారావుగారు శ్రీమతి నాగమణీశ్వరి దంపతులు తమ కుమార్తె నాగ ప్రణవి (W/o. శ్రీ రవికిరణ్ – బెంగుళూరు) సీమంతము సందర్భముగా జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను, నాన్నగారిని, శ్రీ హైమవతీదేవిని దర్శించుకొని అందరికీ ప్రసాదములు అందజేశారు.
8-12-2013 : బాపట్ల వాస్తవ్యులు శ్రీ యస్. సత్యనారాయణ శ్రీమతి నాగశ్రీదేవి దంపతులు, తమ కుమార్తె చి॥లక్ష్మీప్రణతికి – అన్నప్రాసన, కుమారుడు చి|| వెంకట శ్రీ సాత్విక్ అక్షరాభ్యాసము అమ్మసన్నిధిలో జరుపుకున్నారు.
10-12-2013 : జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీ పూర్వవిద్యార్థులు (2004 టూ 2009) బ్యాచ్ జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను నాన్నగారిని, శ్రీ హైమవతీదేవిని దర్శించుకొని అందరికీ అన్నప్రసాదవితరణ గావించారు. ఈ కార్యక్రమములో సర్వశ్రీ శ్రీకాంత్, సుబ్రహ్మణ్యం, రవీంద్ర, గణేష్, కిశోర్, చక్రధర్, రామాంజ నేయులు, వెంకటస్వామి, అంజలి, సీతామహలక్ష్మి, మాలిని, పావని, నాగలక్ష్మి, వెంకటేశ్వర్లు మొదలైనవారు పాల్గొన్నారు.
14-12-2013 : హైదరాబాద్ వాస్తవ్యులు సోదరులు శ్రీ వారణాసి ధర్మసూరిగారు, 5వేల నిమ్మకాయలను విజయవాడ వాస్తవ్యులు శ్రీ వై. ప్రేమకుమార్ గారు 2000 నిమ్మకాయలను గుంటూరు వాస్తవ్యులు శ్రీ ఎమ్. శ్రీరామారు 30 కేజీల పొడికారమును వూరగాయ పెట్టుట నిమిత్తము అన్నపూర్ణాలయమునకు సమర్పించారు. పచ్చడి తయారీకి, ఆవరణలోని సోదరీ సోదరులు, ఇతర ప్రాంతముల నుండి వచ్చినవారు సందడిగా, సంతోషంగా నిమ్మకాయలను, ముక్కలుగా కోసి ఇచ్చారు.
17-12-2013 : శ్రీ పూర్ణానందస్వామి (శ్రీశైలం) వారి శిష్యులు శ్రీ త్యాగరాజశర్మగారు (శ్రీశైలం కరివేన సత్ర నిర్వాహకులు) వారి శిష్యులతో జిల్లెళ్ళమూడి వచ్చి, అమ్మను, నాన్నగారిని శ్రీ హైమవతీదేవిని దర్శించుకున్నారు. హోమం నిర్వహించారు.
17-12-2013 : తెల్లవారుఝామున తెరుప్పావై పఠనము, నామ సంకీర్తన, ఆలయంలో పూజలతో ధనుర్మాసం మొదలైంది.
21-12-2013 : అడవుల దీవి వాస్తవ్యులు శ్రీ వై.వి. మధుసూదనరావు, శ్రీమతి లలితదంపతులు నూతనముగా వివాహమైన తమ కుమారుడు చి॥ సతీష్ చి||ల||సౌ|| ప్రశాంతిగారలతో జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను, నాన్నగారిని, శ్రీ హైమవతీదేవిని అర్చించుకున్నారు.
21-12-2013 : జిల్లెళ్ళమూడిలో హోమశాలలో సంకష్ఠహర గణేశహోమము జరిగింది.
22-12-2013 : హోమశాలలో సౌరహోమము జరిగింది.
21-12-2013 : క్రిస్టమస్ సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కాలేజి అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్ధినీ, విద్యార్థులందరూ పాల్గొన్నారు. సో॥శ్రీ నాదెండ్ల లక్ష్మణరావు గారు కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరము అందరికీ కేక్, రస్కులు పంచి పెట్టారు.
25-12-2013 : క్రిస్టమస్ సందర్భంగా శ్రీ రమేష్అన్నయ్య ఆధ్వర్యంలో అన్నపూర్ణాలయం వేదిక మీద, హైస్కూలు విద్యార్థి చి॥ రవితేజ కేక్ కట్ చేశాడు. ఈ కార్యక్రమంలో కాలేజీ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ శరత్ చంద్రకుమార్గారు విద్యార్థులకు శాంతి సందేశమును తెలిపారు. అనంతరము అందరికీ, కేక్, రస్కులూ పంచిపెట్టారు.