1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అర్కపురి విశేషాలు

అర్కపురి విశేషాలు

Kumari Visali
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : February
Issue Number : 7
Year : 2014

26-12-2013: శ్రీ నాన్నగారి ఆరాధనోత్సవ సందర్భంగా జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్ మరియు పాఠశాల స్థాయిలో జరిగిన ఆటలపోటీలు 2013-2014 సంవత్సరంకు గాను శ్రీ విశ్వజననీపరిషత్ విద్యాపరిషత్ అధ్యక్షులైన శ్రీ ఎమ్. దినకర్ గారు టాస్ వేసి ఆటలపోటీలు ప్రారంభించారు. విద్యాపరిషత్ జనరల్ సెక్రటరీ శ్రీ వై. వి. శ్రీరామమూర్తిగారు బ్యాటింగ్, శ్రీ నాదెండ్ల లక్ష్మణరావుగారు బౌలింగ్ తో ఆటల పోటీలు ప్రారంభ అయినాయి. ఈ ప్రారంభోత్సవంలో కాలేజీ ప్రిన్సిపాల్ – శ్రీమతి డాక్టర్ బి. యల్. సుగుణ, మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు – శ్రీ కె.ప్రేమకుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థినులకు శ్రీ మతి బి. యల్. సుగుణ, శ్రీమతి మృదుల, శ్రీమతి పావని వార్డెన్ శ్రీమతి ఎన్. నాగమణిగారల ఆధ్వర్యంలో నిర్వహింపబడిన ఆటలు, కారమ్స్, చెస్, స్కిప్పింగ్ – షాట్పుట్, మ్యూజికల్ చైర్స్, విద్యార్థులకు – క్రికెట్ – వాలీబాల్ – కబాడి, కేరమ్స్, చెస్, రన్నింగ్ (100 మీటర్లు) రన్నింగ్ (400 మీ), జావలిన్ త్రో షాట్పుట్ పోటీలకు వార్డెన్ శ్రీ మురళీధరరావు అధ్యాపకులు శ్రీ ఫణిరామశర్మ, శ్రీ రవితేజ మరియు శ్రీ రాంబాబు మొదలైనవారి ఆధ్వర్యములో ఈ పోటీలు జరిగినవి. ఈ ఆటల పోటీల విజేతలకు శ్రీ బ్రహ్మాండం రవి అన్నయ్యగారు ప్రతి సంవత్సరము బహుమతులను స్పాన్సర్ చేయుచున్నారు.

30-12-2013: హైదరాబాద్ వాస్తవ్యులు నూతన దంపతులు చి.రాచర్ల నాగేశ్వర్ (S/O. శ్రీ ఆర్. శ్రీరామమూర్తి -శ్రీమతి లలిత) చి.ల.సౌ. శ్రీరమ్య (D/O. శ్రీ వాడపల్లి రమణప్రసాద్ – శ్రీమతి కుమారి) వారి తల్లిదండ్రులతో జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మ, నాన్నగారు – శ్రీ హైమవతీదేవిని అర్చించుకుని శ్రీ అనసూయేశ్వరాలయములో అనసూయా వ్రతము చేసుకున్నారు.

30-12-2013: హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ టి.వి. హర్ష ప్రవీణ్ – శ్రీమతి హిరణ్మయి దంపతుల ఆఖరి పాప చి. గీతాజ్యోప్నిక, ‘అన్నప్రాసన కార్యక్రమము’ అమ్మ సన్నిధిలో జరుపుకున్నారు.

31-12-2013: సాయంత్రం 6 గంటల నుండి 2014 నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయినాయి. సాయంత్రం 6 గంటల నుండి 1-1-2014 సాయంత్రం 6 గంటల వరకూ మాతృశ్రీ ఓరియంటల్ పాఠశాల, కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు అమ్మ నామ ఏకాహ కార్యక్రమమును ప్రారంభించారు. సాయంత్రం 6 గంటలకు శ్రీ విశ్వజననీపరిషత్వారి ఆధ్వర్యంలో విద్యార్థినులు సాంప్రదాయబద్ధంగా సందడిగా సందెగొబ్బెమ్మ పేరంటము ప్రారంభించారు. శ్రీమతి బ్రహ్మాండం వసుంధర అక్కయ్య విద్యార్థినులచే గొబ్బిపూజ చేయించారు. అనంతరం, హైస్కూల్, ఇంటర్, డిగ్రీస్థాయి, విద్యార్థినులు ప్రదర్శించిన, గొబ్బి, కోలాట నృత్యములు అందరినీ ఆకట్టుకున్నాయి. వేదపాఠశాల విద్యార్థి చి. తేజ, ఆలయ అర్చకులు శ్రీ సంతోషు, హరిదాసులుగా చి.చిన్నారి అర్కేష్ చిన్నికృష్ణుడి వేషధారణతో వచ్చి అందరినీ అలరించారు. కుమారి ఎమ్.వి. సుబ్బలక్ష్మి ఆద్యంతము కార్యక్రమ నిర్వహణను చేపట్టి అందరి ప్రశంసలు అందుకున్నారు. చక్కటి గొబ్బిపాటలు పాడుతూ విద్యార్థినులను ఉత్సాహపరుస్తూ కార్యక్రమమును నిర్వహించారు. ఈ కార్యక్రమములో అందరింటి అక్కయ్యలు, స్థానికులు, ఇతర ప్రాంతముల నుండివచ్చిన వారు పాల్గొన్నారు. అనంతరము ప్రసాద వినియోగము జరిగింది.

రాత్రి 12 గంటలకు ఆలయములలో అర్చనలు, నామ సంకీర్తనా కార్యక్రమములతో సోదరీ సోదరులందరూ 2014, నూతన సంవత్సరమునకు స్వాగతం పలికి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. సోదరులు శ్రీ పొత్తూరి ప్రేమగోపాల్ నూతన సంవత్సర “అమ్మ” క్యాలండర్లను అనసూయేశ్వరాలయంలో శ్రీ బ్రహ్మాండం రవి అన్నయ్యగారి చేత ఆవిష్కరింపచేసి అందరికీ అందజేశారు. వేద విద్యార్థులు కేక్ కట్ చేయగా అందరికీ ప్రసాదముగా రస్కులు, కేక్ ఇచ్చారు. శ్రీ మతుకుమల్లి రాము, శ్రీమతి శారద దంపతులు వాత్సల్యాలయములో అమ్మను అర్చించుకొని కేక్ కట్ చేసి అందరికీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సోదరులు శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు, శ్రీ ఎమ్. దినకర్, శ్రీ వి. రమేష్ బాబు, శ్రీ యల్.రామకోటేశ్వరరావు, శ్రీ వి. ధర్మసూరి, శ్రీ వి. మల్లికార్జునప్రసాద్ మొదలైనవారు, ఆవరణలోని సోదరీ సోదరులు, ఇతర ప్రాంతముల నుండి వచ్చినవారు, అందరూ పాల్గొని పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ నూతన సంవత్సరము 2014 అందరూ బాగుండాలని ప్రతి ఒక్కరూ వారి వారి విధినిర్వహణలో విజేతలు కావాలని, కరువు కాటకాలు రాకుండా సర్వదా దేశం సుభిక్షంగా వుండాలని అమ్మను కోరుకుంటూ సర్వేజనాః సుఖినోభవంతు.

01-01-2014: నూతన సంవత్సర సందర్భముగా అధిక సంఖ్యలో సోదరీ సోదరులు అమ్మను దర్శించు కున్నారు.

02-01-2014: శ్రీ కామాక్షి పీఠం విజయవాడ (గొల్లపూడి) నుండి పీఠ నిర్వాహకులు, శ్రీమతి ఊటుకూరి సుందరకాత్యాయని గారు వారి శిష్యులతో జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మ నాన్నగారలను శ్రీ హైమవతీదేవిని అర్చించుకున్నారు. విజయవాడ వాస్తవ్యులు శ్రీ బొడ్డపాటి మురళీకృష్ణ శ్రీమతి తులసీదేవి దంపతులు వేదవిద్యార్థులకు నూతన వస్త్ర బహూకరణ చేశారు.

05-01-2014: విజయవాడ వాస్తవ్యులు శ్రీ ఎమ్.వి.యస్.ఎ. కృష్ణప్రసాద్ – శ్రీమతి శేషుమణి దంపతులు జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మనాన్నగారిని, శ్రీ హైమవతీదేవిని అర్చించుకుని వృద్ధులకు రగ్గులు, అమ్మ ప్రసాదముగా అందరికీ స్వీట్సు అందజేశారు.

11-01-2014: ముక్కోటి ఏకాదశి సందర్భముగ వేకువనే ఉత్తరద్వార దర్శనము ఆలయములలో అభిషేకములు అర్చనలు జరిగినాయి. శ్రీ అనసూయేశ్వరా లయములో నామసంకీర్తనా కార్యక్రమము నిర్వహించ బడింది. కార్యక్రమముల అనంతరము, అందరికీ తీర్థప్రసాద వినియోగము జరిగింది. ఈ పూజా కార్యక్రమములలో మామయ్యగారు (శ్రీ ఎమ్.యల్.యన్. రావు) అత్తయ్యగారు (శ్రీమతి శేషు) శ్రీ రవి అన్నయ్య శ్రీమతి వైదేహి అక్కయ్య తదితరులు పాల్గొన్నారు.

12-01-2014 13-1-2014 విదేశీ యాత్రికులు (ఫ్రాన్స్) 11 మంది జిల్లెళ్ళమూడి వచ్చి ఆలయములను సందర్శించి, అమ్మ, నాన్నగారు, శ్రీ హైమవతీదేవిని అర్చించుకున్నారు. ఇచ్చటి కార్యక్రమాలను తెలుసుకొని తమ ఆనందమును వ్యక్తపరిచారు.

13-01-2014: శ్రీ విశ్వజననీపరిషత్ వారి ఆధ్వర్యములో సాయంత్రం 6 గంటలకు శ్రీ అనసూయేశ్వరా లయములో నామ సంకీర్తనా కార్యక్రమముతో భోగిపండుగ వేడుక మొదలైంది. సంకీర్తనానంతరము సోదరీ సోదరు లందరూ అమ్మ, నాన్నగారు, హైమవతీదేవి పాదపద్మము లకు భోగిపండ్లు పోసి అర్చించుకున్నారు. పూజా కార్యక్రమముల తరువాత శ్రీ హైమాలయములో భోగిపండ్ల వేడుక మొదలైంది. ఆలయ అర్చకులు అందరికీ భోగిపండ్లు పోశారు. భోగిపండ్ల నుండి రాలిన చిల్లరకు పిల్లలు, పెద్దలు, సరదాగా, సందడిగా పోటీపడ్డారు. సంతోషంగా ఆహ్లాదకర వాతావరణంలో పండుగ వైభవంగా జరిగింది. అనంతరము ప్రసాద వినియోగము జరిగింది.

14-01-2014: ఈ రోజు సంక్రాంతి సందర్భముగా అధికసంఖ్యలో సోదరీ సోదరులు, అమ్మ – నాన్నగారు, శ్రీ హైమవతీదేవిని దర్శించుకున్నారు. హోమశాలలో సౌరహోమము జరిగింది. స్థానిక, స్థానికేతరులైన సోదరీ సోదరులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు.

16-01-2014: బాపట్ల వాస్తవ్యులు శ్రీ బెల్లంకొండ బాలాజీ – శ్రీమతి పవిత్ర దంపతులు జిల్లెళ్ళమూడి వచ్చి వారి కుమార్తె చి. పూర్ణ లాస్యశ్రీ అన్నప్రాసన కార్యక్రమము వారి బంధుమిత్రుల సందడితో శ్రీ అనసూయేశ్వరా లయంలో జరుపుకున్నారు. అందరికీ అమ్మ అన్నప్రసాదవితరణ గావించారు.

హైదరాబాద్ వాస్తవ్యులు, శ్రీ శైలం కరివెన సత్ర నిర్వాహకులు, పూజ్యశ్రీ పూర్ణానందస్వామివారి (శ్రీశైలం) శిష్యులు శ్రీ త్యాగరాజశర్మగారు వారి శిష్యులతో జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మ నాన్నగారు, శ్రీ హైమవతీదేవిని అర్చించుకున్నారు. హోమశాలలో సహస్రలింగార్చన సహిత ఏకాదశ రుద్రాభిషేకము, అనంతరము అవబృథ స్నానములు గావించారు.

17-01-2014: బాపట్లలో 9:11.2013న వివాహం జరిగిన నూతన వధూవరులు గౌరీ పెద్ది పద్మనాభ శివశంకర్, లక్ష్మీవాత్సల్యలు సకుటుంబంగా బంధు మిత్రులలో వచ్చి అమ్మకు, హైమవతీదేవికి పూజలు చేసి నూతన వస్త్రాలు సమర్పించుకున్నారు. అర్చకులు వధూవరులను వేదమంత్రాలతో ఆశీర్వదించారు.

20-01-2014: హోమశాలలో సంకష్టహర గణేశ హోమము జరిగింది. స్థానికులు, ఇతర ప్రాంతముల నుండి వచ్చినవారు హోమకార్యక్రమములో పాల్గొన్నారు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!