27-03-2014: చెన్నై వాస్తవ్యులు లేటు శ్రీ ఎమ్.లక్ష్మణరావు, శ్రీమతి దేవకి దంపతుల కుమారుడు చి. సాయికుమార్, శ్రీ ఆకునూరి శ్యామసుందరరావు, శ్రీమతి సత్యవతి దంపతుల కుమార్తె చి.ల.సౌ. అనసూయ వివాహము అమ్మ సన్నిధిలో బంధుమిత్రుల సందడితో వేడుకగా జరిగింది.
28-03-2014: విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీ జె.యస్.ఆర్.మూర్తి, శ్రీమతి శ్యామల దంపతులు వారి కుమార్తె కుమారి హిమబిందుకు ఎమ్.బి.బి.యస్.లో సీటు వచ్చిన సందర్భముగ జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మకు, నాన్నగారికి శ్రీ హైమవతీదేవికి పూజలు చేసుకొని నూతన వస్త్రములు సమర్పించారు.
30-03-2014: నూతన దంపతులైన హైదరాబాద్ వాస్తవ్యులు – చి. సుంకర నరేంద్రబాబు, చి.ల.సౌ. హైమా చౌదరి వారి తల్లిదండ్రులు, బంధుమిత్రులతో జిల్లెళ్ళమూడి వచ్చి, అమ్మకి, నాన్నగారికి, శ్రీ హైమవతీదేవికి పూజ చేసుకొని నూతన వస్త్రములు సమర్పించారు.
31-03-2014: ఉదయాన్నే మంగళ వాద్యములతో జయనామ సంవత్సరమునకు స్వాగతం పలుకుతూ ఆలయములలో అభిషేకములు పూజలు ప్రారంభమయినాయి. పూజా కార్యక్రమముల అనంతరం అందరికీ ఉగాది ప్రసాదం ఇవ్వబడింది. సోదరీ సోదరులందరూ పరస్పరం అచ్చ తెలుగులో శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ అర్చకులు శ్రీ కుందుర్తి బాలసుబ్రహ్మణ్యశర్మగారు పంచాగ శ్రవణంగావించారు.
వసంత నవరాత్రుల సందర్భముగా 31.3.2014 నుండి 8-4-2014 వరకూ విశేషముగా చండీ హోమము నిర్వహించబడినది. సోదరులు శ్రీ వారణాసి ధర్మసూరిగారి ఆధ్వర్యములో ఈ హోమకార్యక్రమములు విజయ వంతముగా నిర్వహింపబడినాయి. 9 రోజులు జరిగిన ఈ చండీహోమములో సోదరీ సోదరులు
సర్వశ్రీ చక్కా శ్రీమన్నారాయణ, శ్రీమతిలక్ష్మి దంపతులు, మురళీధర్-శ్రీమతి సుబ్బలక్ష్మి – దంపతులు,శ్రీ వాసుదేవరావు దంపతులు, విఠల్ దంపతులు, వడ్డాది సత్యనారాయణమూర్తి – శ్రీమతి భాస్కరమ్మ దంపతులు,
శ్రీమతి బ్రహ్మాండం హైమ,
జొన్నాభట్ల వీరభద్రశాస్త్రిగారు
బి.వి.బి.వి.ప్రసాద్ – శ్రీమతి రాధారాణి దంపతులు,
భట్టిప్రోలు రామచంద్ర – శ్రీమతి లక్ష్మీసుగుణ దంపతులు,
యస్.మోహనకృష్ణ – శ్రీమతి రుక్మిణి దంపతులు,
బి. వెంకటేష్ గుప్త – శ్రీమతి రాజరాజేశ్వరి దంపతులు,
టి.టి. అప్పారావు – శ్రీమతి కుసుమాంబ దంపతులు,
కె. లక్ష్మీనారాయణ, శ్రీ టి. కృష్ణబాబు, శ్రీమతి కృష్ణకుమారి
సాయిలక్ష్మి కుమారి అవంతి మరియు స్థానికులు, స్థానికేతరులైన సోదరీ సోదరులు ఈ చండీ హోమ కార్యక్రమములో పాల్గొన్నారు.
హైదరాబాద్ వాస్తవ్యులైన నూతన దంపతులు చి. ధూళిపాళ సత్యబుచ్చి మహేశ్వర్, చి.ల.సౌ. వైష్ణవీ శ్రీవిద్య వారి తల్లిదండ్రులతో జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మకు, నాన్నగారికి హైమవతీదేవికి అర్చన చేసుకున్నారు.
4-04-2014: హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ పూళ్ళ రఘురాం, శ్రీమతి ఉమాకల్యాణి దంపతులకు కుమారుడు చి. శివచైతన్యభారద్వాజ్ ఉపనయనము బంధుమిత్రుల సందడితో అమ్మ సన్నిధిలో జరిగింది.
5-04-2014: శ్రీ లక్కరాజు హరిప్రసాద్, శ్రీమతి విజయశ్రీ దంపతులు జిల్లెళ్ళమూడి లోని హైమవతీ నగర్లో నిర్మించుకున్న నూతన గృహము “సౌజన్యకీర్తి”లోనికి గృహప్రవేశము చేశారు. 6-4-2014న నూతన గృహములో అనసూయావ్రతము జరుపుకొని అందరికీ అమ్మప్రసాద వితరణ గావించారు.
6-04-2014: 6-4-2014 08 8-4-2014 వరకూ హైమాలయ మహోత్సవములు ప్రారంభ మయినాయి. ఈ సందర్భముగా జరిగిన శ్రీ హైమవతీదేవి వ్రతములు “అమ్మ” నామ ఏకాహ కార్యక్రమములలో ఆవరణలోని వారు, ఇతర ప్రాంతముల నుండి వచ్చిన సోదరీ సోదరులు పాల్గొన్నారు.
8-04-2014: శ్రీరామనవమి సందర్భముగా ఉదయం శ్రీఅనసూయేశ్వరాలయములో నామ సంకీర్తన అనంతరము వడపప్పు, పానకము, ప్రసాద వినియోగము జరిగింది. ఈ కార్యక్రమములో స్థానికులు ఇతర ప్రాంతముల నుండి వచ్చినవారు పాల్గొన్నారు.
8-4-2014 నుండి 13-4-2014 వరకు శ్రీ విశ్వజననీపరిషత్ వారి ఆధ్వర్యములో గాయత్రీహోమము నిర్వహించబడినది. 13.4.2014 సాయంత్రం శ్రీసూక్త సంపుటితో జరిగిన శ్రీ మహాలక్ష్మీ హోమములో శ్రీ వల్లూరి రమేష్బాబు – శ్రీమతి హైమ దంపతులు, శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు – శ్రీమతి వైదేహి దంపతులు, శ్రీ జొన్నాభట్ల వీరభద్రశాస్త్రి, శ్రీమతి లక్కరాజు లక్ష్మి మొదలైన వారు పాల్గొన్నారు. గుంటూరు వాస్తవ్యులు శ్రీ ఉమాశంకర దీక్షితులు వారి బృందము ఈ హోమ కార్యక్రమములను నిర్వహించారు.
11-04-2014: అమ్మజన్మదిన మహోత్సవము “అమ్మ” 91వ జన్మదినోత్సవ వేడుకలు వైభవంగా జరిగినాయి. అధిక సంఖ్యలో సోదరీసోదరులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు. సోదరులు శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్, శ్రీ రావూరి ప్రసాద్రి ఆధ్వర్యంలో సామూహిక అనసూయావ్రతము జరిగినది. ఉదయం అనసూయేశ్వరాలయంలో ఏకాదశ రుద్రాభిషేకము పూజల అనంతరము కిరీటధారిణి అయిన “అమ్మ”ను కనులపండుగగా, మనసు నిండుగా సోదరీ సోదరులందరూ భక్తి శ్రద్ధలతో ముకుళిత హస్తములతో దర్శించుకున్నారు. అనంతరము సోదరులు శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్, శ్రీ ఎ.వి.ఆర్.సుబ్రహ్మణ్యంగారలు సంకలనపరచిన అమ్మపూజావిధానము పుస్తకమును శ్రీమతి వల్లూరి హైమ, కుమారి ఎమ్.వి.సుబ్బలక్ష్మి ఆవిష్కరించారు.
15-04-2014: గుంటూరు వాస్తవ్యులు శ్రీ ధర్మవరపు విజయకోదండరామకృష్ణ – శ్రీమతి మంజుల దంపతులు వారి పాపకు అమ్మసన్నిధిలో నామకరణము చేసుకున్నారు. చి. పాపకు సాయి శ్రీ లక్ష్మీజనన్య జానకి జమ్మితగా పేరు పెట్టుకున్నారు.
వణుకూరు వాస్తవ్యులు శ్రీ చక్కా వెంకట సుబ్బారావు, శ్రీమతి రాణి దంపతులు, శ్రీ చక్కా వెంకట సుబ్బారావు గారి పుట్టినరోజు సందర్భముగా అమ్మకు, నాన్నగారికి శ్రీ హైమవతీదేవికి పూజ చేసుకొని నూతన వస్త్రములు సమర్పించారు.
17-04-2014: జిల్లెళ్ళమూడి వాస్తవ్యులు శ్రీ దొంతరాజు సీతాపతిరావు – శ్రీమతి శ్యామల దంపతులు తమ కోడలు శ్రీమతి పావన తులసి (W/O శ్రీ నాగసంతోష్కుమార్) సీమంతము పేరంటము శ్రీ హైమాలయములో బంధుమిత్రుల సందడితో వేడుకగా జరుపుకున్నారు.
19-04-2014: హోమశాలలో సంకష్టహర గణపతి హోమము జరిగింది.
20-04-2014: బహుళషష్ఠి సందర్భముగా శ్రీ హైమాలయములో హైమవతీవ్రతము, అమ్మనామ ఏకాహ కార్యక్రమము జరిగినాయి. నామ సంకీర్తనా కార్యక్రమములో జిల్లెళ్ళమూడి మరియు పరిసర ప్రాంతముల నుండి వచ్చిన భక్త సమాజముల వారు పాల్గొన్నారు.
23-04-2014: ఆలయముల అర్చకులు శ్రీ చుండినవీన్ శర్మ – శ్రీమతి సుందరి దంపతుల కుమారుడు చి. అర్కేష్ 3వ పుట్టినరోజు వేడుకను సాయంత్రం హైమాలయములో వేడుకగా జరిపారు. ఆవరణలోని సోదరీ సోదరులు చి. అర్కేష్కు ఆశీస్సులు అందజేశారు. చి. అర్కేష్ కట్ చేసిన కేక్ చిన్నపిల్లలందరికీ ఇచ్చారు. పిల్లల సందడితో పుట్టినరోజు ఆనందంగా జరిగింది.