25-04-2014: శ్రీ గోపాలన్నయ్య సహస్రచంద్ర దర్శనం 83వ పుట్టినరోజును శ్రీమతి బ్రహ్మాండం హైమ గోపాలన్నయ్య చేత కేక్ కట్ చేయించి ఉత్సవం ప్రారంభించారు. ఈ కార్యక్రమములో సోదరులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు, శ్రీ ధర్మసూరి, శ్రీ ఐ. రామకృష్ణ శ్రీ నాదెండ్ల లక్ష్మణరావు తదితరులు పాల్గొని అన్నయ్యకు తమ శుభాకాంక్షలు తెలియజేసి “అమ్మ” యందు శ్రీ గోపాలన్నయ్యకు గల భక్తి విశ్వాసములను కొనియాడారు. శ్రీ గోపాలన్నయ్య అమ్మతో తమకు గల ఆత్మీయతా అనుబంధములను తెలియజేశారు.
26-04-2014: శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు దంపతులు తమ 60 వివాహ వార్షికోత్సవము జిల్లెళ్ళమూడిలో అమ్మ సన్నిధిలో జరుపుకున్నారు. అమ్మకు నాన్నగారికి శ్రీ హైమవతీదేవికి పూజలు చేసుకున్నారు. సోదరీ సోదరులందరూ ఈ కార్యక్రమములో పాల్గొని శుభాభినందనలు తెలియజేశారు. అనంతరము “అమ్మ ఒడి” అతిధి గృహములో కుర్తాళం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానందభారతీస్వామివారికి కుటుంబ సమేతముగా పాదపూజ చేసుకున్నారు. అనంతరము అన్నపూర్ణా లయములో విందుభోజనమును అందించారు.
27-04-2014: విజయవాడ వాస్తవ్యులు శ్రీమతి మువ్వా శేషుమణి (W/o శ్రీ మువ్వా వెంకట సత్య ఆదినారాయణ కృష్ణప్రసాద్) జిల్లెళ్ళమూడిలో గ్రామ కుంకుమ నోము చేసుకున్నారు.
1-05-2014: అమ్మ కళ్యాణోత్సవ సందర్భముగ 1-5-2014 నుండి 5-5-2014 వరకు అమ్మ నామ సంకీర్తనా కార్యక్రమము జరిగింది. శ్రీమతి నాదెండ్ల భ్రమరాంబ అక్కయ్య, శ్రీ కొండముది రవి – ఆధ్వర్యములో జరిగిన ఈ కార్యక్రమములో ఆవరణలోని సోదరీ సోదరులు గ్రామములోని భజన సమాజముల వారు పాల్గొన్నారు.
జగ్గయ్యపేట వాస్తవ్యులు శ్రీ కె. వెంకట కాశీవిశ్వనాధం శ్రీమతిరాజ్యలక్ష్మి దంపతుల కుమారుడు చి. భరత్ వివాహము (15-5-2014) నిశ్చయమైనందున జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మకు, నాన్నగారికి, శ్రీ హైమవతీదేవికి పూజలు గావించి నూతన వస్త్రములను సమర్పించారు.
2-05-2014: జిల్లెళ్ళమూడి వాస్తవ్యులు శ్రీ మీనుగ ఆంజనేయులు శ్రీమతి త్రివేణి దంపతులు వారి కుమారుడు చి. ఈశ్వర్ అక్షరాభ్యాసమును శ్రీ అనసూయేశ్వరా లయములో జరుపుకున్నారు. పిల్లలకు పలకలు అందజేశారు.
***
జిల్లెళ్ళమూడి ఆలయములో అర్చకులు శ్రీ చుండి నవీన్ శర్మ శ్రీమతి సుందరి దంపతుల కుమారుడు చి. అర్కేష్ అక్షరాభ్యాసము అనసూయేశ్వరా లయములో జరుపుకున్నారు.
***
జిల్లెళ్ళమూడి వాస్తవ్యులు శ్రీ సి. హెచ్. రవికామేశ్వరరావు – కీ. శే. శ్రీమతి పుష్ప దంపతుల కుమార్తె చి.శరణ్య అక్షరాభ్యాసము అనసూయేశ్వరా లయములో జరుపుకున్నారు. అనంతరము ప్రసాద వినియోగము జరిగింది.
5-05-2014: అమ్మ-నాన్నగారల కళ్యాణోత్సవ వేడుకలు. ఉదయం 11 మంది ఋత్విక్కులతో ఏకాదశ మహరుద్రాభిషేకములు పూజా కార్యక్రమముల అనంతరము “అమ్మను నాన్నగారిని వివాహవేదిక” వద్దకు తీసుకొని రావటంతో ఎదురుకోల కార్యక్రమం మొదలైంది.
శ్రీ మతుకుమల్లి రాము శారద, వఝ మల్లికార్జున ప్రసాద్ – సీత, వల్లూరి రమేష్ – హైమ, చుండి నీవన్ శర్మ – సుందరి దంపతులు, మన్నవ దత్తాత్రేయ శర్మ వధూవరుల పక్షాన కళ్యాణవేదిక వద్దకు వచ్చారు. నాన్నగారి తరఫున సోదరులు శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ అమ్మతరపున శ్రీ రావూరి ప్రసాద్ ఎదురు కోల కార్యక్రమములో తమ చమత్కార సంభాషణతో అందరినీ అలరించారు. వేదమంత్రాలు మంగళధ్వనులతో వివాహ కార్యక్రమము మొదలైంది. మంగళసూత్రమును నాన్నగారు అమ్మ దివ్యకంఠసీమను అలంకరించారు. తలంబ్రాల కార్యక్రమము ఉత్సాహంగా, వేడుకగా సాగింది.
అమ్మానాన్నగారి కళ్యాణోత్సవ సందర్భంగా శ్రీ విశ్వజననీ పరిషత్వారు ఉచిత ఉపనయన కార్యక్రమము ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమములో పాల్గొన్నవారు
1) వటువు – చి|॥గుండవరపు వెంకటసాయి ఆదిత్య
S/o శ్రీ జి. సురేష్-శ్రీమతి అనురాధ
2) వటువు చి॥ అచ్యుతుని రామకృష్ణ
S/o శ్రీమతి & శ్రీ వెంకట సుబ్బారావు, జాండ్రపేట
3) వటువు చి||వాలిచర్ల దినేష్
S/o శ్రీ వాలిచర్ల బాలకృష్ణ, శ్రీమతివాసవి, గన్నవరం
అమ్మా నాన్నగారల కళ్యాణోత్సవ సందర్భంగా సూరంపల్లి గ్రామవాస్తవ్యులు శ్రీ కాసరనేని మాధవరావు శ్రీమతి శివమ్మ దంపతులు మరికొంతమంది సోదరీ సోదరులతో జిల్లెళ్ళమూడి వచ్చి సుమారు 800 నూమిడిపండ్లను సాదరంగా సోదరీసోదరులకు పంచారు.
బెంగుళూరు వాస్తవ్యులు శ్రీ తురగ సుందర శ్రీరామమూర్తి శ్రీమతి నిర్మలాదంపతులు, సోదరీ మణులకు జాకెటీపీసులు వేదవిద్యార్థులకు నూతన వస్త్రములు, అమ్మకు నాన్నగారికి, శ్రీ హైమవతీదేవికి నూతన వస్త్రము సమర్పించారు. ఈ కళ్యాణోత్సవ సందర్భంగా వల్లూరు నుంచి వచ్చి ఆలయములను, అందరింటి నూతన భవనమును అందముగా, అద్భుతముగా, ఆకాశతారలను తెచ్చి తోరణాలు కట్టారా అనిపించేట్టు విద్యుత్ దీపముతో అలంకరించిన అందరి అభినందనలకు పాత్రులైనారు. ప్రతి ఒక్కరూ వారి నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు.
సాయంత్రం 4 గంటలకు కీ.శే. ఆత్మీ సోదరులు శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణగారి సంస్మరణ సభను శ్రీ విశ్వజననీపరిషత్వారు ఏర్పాటు చేశారు. సోదరులు శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు, శ్రీ ఎమ్. దినకర్, శ్రీ గోపాలన్నయ్య, శ్రీ ఎన్. లక్ష్మణరావు, శ్రీ వి. రమేష్బాబు, శ్రీ టి.టి. అప్పారావు, శ్రీ చక్కా శ్రీమన్నారాయణ తదితరులు శ్రీ లక్ష్మీనారాయణగారితో తమకు గల అనుబంధము, వారి ఔదార్యము అమ్మ ఎడల వారికి గల అపారభక్తి ప్రపత్తులను స్మరించుకొని నివాళులు అర్పించారు. శ్రీ రావూరి ప్రసాద్ కార్యక్రమము నిర్వహించారు.
ఉపనయనములు
10-05-2014: జిల్లెళ్ళమూడి వాస్తవ్యులు శ్రీ భట్టిప్రోలు రామచంద్ర – శ్రీమతి లక్ష్మీసుగుణ (ప్రిన్సిపాల్ – మాతృ శ్రీ ఓరియంటల్ కాలేజీ) దంపతులు వారి కుమారుడు చి. రహికిరణ్ ఉపనయనము అమ్మ సన్నిధిలో బంధుమిత్రులు అందరింటి సోదరీ సోదరుల సందడితో వేడుకగా జరుపుకున్నారు. అందరికీ అమ్మ ప్రసాదముగా విందుభోజనములు ఏర్పాటు చేశారు. అందరింటి వారందరికీ నూతన వస్త్రములు అందజేశారు.
కూచిపూడి వాస్తవ్యులు శ్రీ ఎమ్. శ్రీనివాస్ – శ్రీమతి రాజ్యలక్ష్మి దంపతులు వారి కుమారుడు చి.ఫణి హనుమసాయి సందీప్ ఉపనయనము అమ్మ సన్నిధిలో జరుపుకున్నారు.
10-05-2014: విజయవాడ వాస్తవ్యులు శ్రీ మువ్వా వెంకట సత్య ఆదినారాయణ కృష్ణప్రసాద్, శ్రీమతి శేషు మణి దంపతులు జిల్లెళ్ళమూడిలో వారి బంధుమిత్రులతో నోములు పూర్తి చేసుకున్నారు.
ఉదయం 10 గంటలకు శ్రీమతి పార్వతి W/o శ్రీ ఎమ్.హెచ్.యస్. ప్రసాద్, శ్రీమతి భార్గవి W/o శ్రీ సింగరాజు శ్రీధర్ కైలాసగౌరినోము చేసుకున్నారు.
శ్రీమతి సంధ్యాసుందరి W/o శ్రీ ఎమ్.రవికాంత్ 16 ఫలముల నోము చేసుకొని కొబ్బరిబొండాలు, దోసపళ్ళు, దానిమ్మపండ్లు ఇచ్చారు. సాయంత్రం 6 గంటలకు శ్రీ కృష్ణప్రసాద్ – శేషుమణి దంపతులు లక్షవత్తుల నోము ప్రారంభించారు. 11-5-2014 మధ్యాహ్నం నోము కార్యక్రమము సమాప్తమైంది.
12-05-2014: శ్రీ కృష్ణప్రసాద్, శ్రీమతి శేషుమణి దంపతులు అనసూయేశ్వరాలయములో అనసూయా వ్రతము చేసుకున్నారు. హైమవతీదేవికి పూజలు
జరిపించారు.
10-5-2014 నుండి 12-5-2014 వరకు శ్రీకృష్ణ ప్రసాద్ – శ్రీమతి శేషుమణి దంపతులు, అందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేశారు. పూజా వ్రతకార్యక్రమములు అనంతరము ఆవరణలోని వారందరికీ నూతన వస్త్రములు అందజేశారు. మూడు రోజుల నిర్విరామంగా పూజలు నొములు చేసుకొని అందరి ఆత్మీయతను పొందారు. శ్రీ విశ్వజననీపరిషత్వారు, సోదరులు శ్రీ చక్కా శ్రీమన్నారాయణ గారు ఈ కార్యక్రమములకు తమ సంపూర్ణ సహకారమును అందించారు.
15-05-2014: జిల్లెళ్ళమూడి ఆలయ అర్చకులు చి. శివలక్ష్మణకుమార్ శర్మ వివాహము 10-5-2014న అన్నవరములో జరుగగా 15-5-2014 నూతన వధువు చి.ల.సౌ. ఉషశ్రీ బంధుమిత్రులతో జిల్లెళ్ళమూడి వచ్చి అనసూయావ్రతము జరుపుకున్నారు.
19-05-2014: నూతలపాటి వారిపాలెం వాస్తవ్యులు శ్రీ ఉమ్మనేని సుబ్బారావు శ్రీమతి లక్ష్మి దంపతుల కుమారుడు చి. హరీష్బాబు వివాహము, 21-5-2014 నిశ్చయమైనందున జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మ సన్నిధిలో హరీషన్ను పెండ్లికుమారుని చేసుకున్నారు.
13-05-2014: హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ యనమండ్ర రాజా ప్రభాకర్ – శ్రీమతి భారతి దంపతుల ఏకైక కుమారుడు చి. సాయినాధ్ ఉపనయనము వైభవంగా జరిగింది. అనంతరము అమ్మ ప్రసాదముగా విందు భోజనములు ఏర్పాటు చేశారు. వారు ఏర్పాటు చేసిన కూల్వాటర్ బాటిల్స్ అందరికీ అమిత ఆనందాన్ని కలిగించింది. ఎండవేడిమిలో చల్లటి హిమపానీయములు, వాహ్!