నవనాగేశ్వరాలయ నవమ వార్షికోత్సవములు
28-5-2014 : 28-5-2014 సాయంత్రం శ్రీ నవనాగేశ్వర ఆలయ నవమ వార్షికోత్సవ అంకురారోపణ, కలశస్థాపన కార్యక్రమములు జరిగినవి.
29-5-2014 : మహన్యాసపూర్వక రుద్రాభిషేకము గణపతి హోమము రుద్రహోమ కార్యక్రమములు జరిగినవి.
30-5-2014 : మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, మన్యుసూక్త హోమము, చండీహోమము.
31-5-2014 : మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, మన్యుహోమము, సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు వేదఘనస్వస్తి, 6 గంటల నుండి 8-30 వరకూ మన్యుసూక్త హోమము జరిగినవి.
1-6-2014 : మహన్యాసపూర్వక రుద్రాభిషేకము. శ్రీ మహాలక్ష్మీ, సుదర్శనయాగము, పూర్ణాహుతి. అవబృధస్నానము, సాయంత్రము అమ్మ నాన్నగారల శాంతి కళ్యాణోత్సవము జరిగినవి. ప్రతిరోజూ 11 మంది ఋత్విక్కులతో అభిషేకములు హోమకార్యక్రమములు జరిగినవి.
కీ॥శే॥ సోదరులు శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణగారి కుమారులు శ్రీ బంగారుబాబు, శ్రీ రహి శ్రీమతి సుధ దంపతులు అల్లుడు శ్రీ వారణాసి ధర్మసూరి, శ్రీమతి భగవతి దంపతులు నిర్వహణలో కార్యక్రమములు ఆద్యంతము విజయవంతంగా ముగిసినాయి.
ప్రతిరోజూ పూజాహోమకార్యక్రమముల అనంతరము సోదరులు శ్రీధర్మసూరి వేదవిశిష్టత, మనసంస్కృతి, భగవదారాధనావిధానము, భగవంతుని నామస్మరణ, సంకీరనవలన కలుగు ఉత్తమ ఫలితముల గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. అమ్మానాన్న గారల కళ్యాణోత్సవ సందర్భముగా శ్రీమతి రాచర్ల సుధ, శ్రీమతి వారణాసి భగవతి, సోదరీమణులకు జాకెట్ పీసులు పండ్లు ఇచ్చారు. శ్రీ విశ్వజననీపరిషత్వారు కళ్యాణములో పాల్గొన్న దంపతులకు అమ్మ ఆశీఃపూర్వకంగా నూతన వస్త్రములు అందజేశారు.
గుంటూరు వాస్తవ్యులు శ్రీ అవ్వారి ఉమాశంకర దీక్షితులు వారి సహచర బృందమ అభిషేక, హోమ కార్యక్రమములు నిర్వహించారు.
2-6-2014 నుండి 5.6.2014 వరకూ వరసిద్ధి వినాయక ఆలయ నవమ వార్షికోత్సవములు. శ్రీ విశ్వజననీ పరిషత్ వారి ఆధ్వర్యములో జరిగినవి. ప్రతిరోజూ అభిషేకములు హోమములు తర్పణ కార్యక్రమములు జరిగినవి.
అమ్మ అనంతోత్సవములు
12-6-2014 నుండి 14-6-2014 వరకూ జిల్లెళ్ళ మూడిలో అమ్మ అనంతోత్సవములు నిర్వహించబడినవి.
12-6-2014 ఉదయం 6 గంటల 30ని.ల అనసూయేశ్వరాలయములో 11 మంది ఋత్విక్కులతో “అమ్మ”కు మహన్యాసపూర్వక రుద్రాభిషేకము నిర్వహించారు. సోదరులు శ్రీ బ్రహ్మాండరవీంద్రరావు గారు అభిషేక కార్యక్రమములను ప్రారంభించగా సోదరీ సోదరులందరూ ఈ కార్యక్రమములో పాల్గొన్నారు. అనంతరము అన్నపూర్ణేశ్వరి “అమ్మ”కు అన్నముతో అభిషేకము గావించారు. సాయంత్రం 6గంటలకు శ్రీ గోపాలన్నయ్య రచించిన “అమ్మ అందించిన తత్త్వదర్శనము” శ్రీమతి బ్రహ్మాండ వసుంధర అక్కయ్య సేకరించిన మహోపదేశం (త్వతీయముద్రణ) గ్రంధములు ఆవిష్కృతమైనాయి. ఈ కార్యక్రమములకు సోదరులు శ్రీ ఎమ్. దినకర్ అధ్యక్షత వహించగా గోపాలన్నయ్య గ్రంధమును సోదరులు శ్రీ అన్నంరాజు చంద్రమోహన్, వసుంధర అక్కయ్య గ్రంధమును శ్రీ కరెవరం కృష్ణమూర్తి ఆవిష్కరించారు.
సాయంత్రం 6గంటల 30ని. వివిధ పరిమళ భరిత పుష్పాలతో సోదరీసోదరులందరూ “అమ్మ శ్రీ చరణార్చన చేసుకున్నారు.
12-6-2014 : అమ్మ ఆశీస్సులతో అమ్మ అనంతోత్సవములలో భాగంగా జిల్లెళ్ళమూడి 7వ మైలు రాయి వద్ద ప్రయాణీకుల సౌకర్యార్థం ఏర్పాటు కానున్న షెల్టర్కు గ్రామ ప్రెసిడెంట్ శ్రీమతి బూదరాజు వాణి మరియు శ్రీ విశ్వజననీపరిషత్ పాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు శంఖుస్థాపన కార్యక్రమము నిర్వహించారు. అందరింటి సోదరీ సోదరులు గ్రామస్థులు ఈ కార్య క్రమములో పాల్గొన్నారు. నిర్మాణ బాధ్యత సోదరులు శ్రీ చక్కా శ్రీమన్నారాయణ చేపట్టటం జరిగింది. ఆసక్తి వున్నవారు నిర్మాణ కార్యక్రమమునకు సహకరించగలరు. శ్రీ చక్కా శ్రీమన్నారాయణ సెల్ నెం. 9963385818.
13-6-2014 : ఉదయం 6గం 30.ని శ్రీ అనసూయేశ్వరాలయములో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము జరిగింది. యాగశాలలో శ్రీ విశ్వజననీ చరితమ్ పారాయణ, హోమకార్యక్రమములు జరిగాయి. ఉదయం 10 గంటలకు శ్రీ అనసూయేశ్వరాలయములో సామూహిక అంబికా లక్షనామపారాయణ కార్యక్రమము జరిగింది. సాయంత్రం 5 గంటలకు అమ్మతత్వచింతనా సదస్సు జరిగింది. సోదరులు శ్రీ దినకర్ అధ్యక్షత వహించిన ఈ సభలోపాల్గొన్న సోదరీ సోదరులు అమ్మ గురించి, వారికి అమ్మతో గల సాన్నిహిత్యాన్ని గురించి, హృద్యంగా వివరించారు.
14-6-2014 : ఉదయం 7 గంటలకు శ్రీ అనసూయేశ్వరాలయములో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మూలవిరాట్ “అమ్మ”కు సహస్ర ముటాభిషేకము నిర్వహింపబడినాయి. సోదరీ సోదరులందరూ భక్తిశ్రద్ధలతో ఈ సహస్ర ఘటాభిషేకములో పాల్గొన్నారు.
సాయంత్రం 6 గంటలకు సోదరులు శ్రీ రావూరి ప్రసాద్, రాగనీరాజనం – కార్యక్రమమును నిర్వహించారు. ఈ కార్యక్రమములో శ్రీమతి విజయ, శ్రీమతి శివకుమారి, శ్రీమతి యం.బి.డి శ్యామల శ్రీ రావూరి ప్రసాద్ రమ్యమైన అమ్మ భక్తిగీతాలాపన చేసి అందరినీ అలరించారు. శ్రీ ఏకా రాజా కీబోర్డు సహకారము శ్రీ పి. సుబ్రహ్మణ్యంగారు డోలకా వాద్య సహకారము అందజేశారు. శ్రీ విశ్వజననీ పరిషత్ వారు గాయనీగాయకులకు “అమ్మప్రసాదముగా” నూతన వస్త్రములను అందజేశారు. సోదరులు శ్రీ వై.వి. శ్రీరామమూర్తి వందన సమర్పణ గావించారు.
రాత్రి 8 గంటలకు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ వల్లూరి పార్థసారధిరావు, శ్రీమతి వేదవతి దంపతులు ధ్యానమందిరంలో అమ్మకు పూలంగిసేవను అత్యంత రమణీయంగా నిర్వహించారు. సామూహిక లలితాసహస్ర నామ పారాయణ అనంతరము ప్రసాద వినియోగము జరిగింది.
12, 13, 14 తేదీలలో శ్రీమతి నాదెండ్ల భ్రమరాంబ అక్కయ్య శ్రీ కొండముది రవి ఆధ్వర్యములో అమ్మ అఖండ నామ సంకీర్తనా కార్యక్రమము జరిగింది. స్థానిక స్థానికేతర భజన సమాజముల వారు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు.
14-6-2014 : జిల్లెళ్ళమూడి వాస్తవ్యులు శ్రీ కొండముది రవి శ్రీమతి అన్నపూర్ణ దంపతుల – కుమార్తె చి.ల.సౌ. లలితకు, బాపట్ల వాస్తవ్యులు శ్రీ విన్నకోట దుర్గాప్రసాద్ దంపతుల కుమారుడు చి. యశ్వంత్ కుమార్తో వివాహ నిశ్చయ కార్యక్రమము “అమ్మ” ఆశీస్సులతో శ్రీవిద్యానిలయములో జరిగింది. అనంతరము అందరికీ “అమ్మ” ప్రసాద వినియోగము జరిగింది.
15-6-2014 : సోదరులు శ్రీ నాదెండ్ల లక్ష్మణరావు, శ్రీమతి సీతాభ్రమరాంబికాదేవి – దంపతుల 60వ వివాహవార్షికోత్సవము సందర్భముగా ‘అమ్మా నాన్నగారికి అభిషేకము, యాగశాలలో సౌరహోమము చేసుకున్నారు. అందరికీ విందుభోజనము ఏర్పాటు చేశారు. శ్రీ విశ్వజననీపరిషత్వారు షష్టిపూర్తి కళ్యాణదంపతులకు అమ్మ ప్రసాదముగా నూతన వస్త్రములు అందజేశారు.
19-6-2014 : వేసవి శలవుల అనంతరము మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, పాఠశాల పునః ప్రారంభ సందర్భముగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీమతి లక్ష్మీసుగుణ, హెడ్మాష్టరు ప్రేమకుమార్, అధ్యాపక ఆఫీసు సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు అమ్మను దర్శించుకొని శ్రీ లలితాసహస్రనామ పారాయణ గావించారు.
***
‘పేరేచర్ల వాస్తవ్యులు శ్రీ దేవరపల్లి చిన సుబ్బయ్య శ్రీమతి వెంకటరత్నం – దంపతుల కుమారుడు చి. ప్రతాప్ కీ. శే. చలపతిరావు – వెంకాయమ్మ దంపతుల కుమార్తె చి.ల.సౌ. నాగజ్యోతి (నూతన వధూవరులు) వారి బంధుమిత్రులతో జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మ నాన్నగారిని శ్రీ హైమవతీదేవి దర్శనము చేసుకున్నారు.
***
కాకుమాను వాస్తవ్యులు శ్రీ మాజేటి శివరామకృష్ణ – శ్రీమతి పూర్ణచంద్రావతి దంపతుల కనిష్ఠపుత్రుడు – చి. విశ్వనాధ్, శ్రీ చింతా సీతారాములు శ్రీమతి లక్ష్మి దంపతుల కనిష్ఠకుమార్తె చి.ల.సౌ. గౌతమి (నూతన దంపతులు) వారి తల్లిదండ్రులు, బంధుమిత్రులతో జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మకు, నాన్నగారికి, శ్రీ హైమవతీదేవికి పూజ చేసుకొని నూతన వస్త్రములు సమర్పించారు.