1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అర్కపురి విశేషాలు

అర్కపురి విశేషాలు

Kumari Visali
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 14
Month : September
Issue Number : 2
Year : 2014

29-7-2014 : శ్రావణమంగళవారము సందర్భముగ సోదరీమణులు శ్రీ హైమాలయములో మంగళగౌరీవ్రతము చేసుకున్నారు.

31-7-2014 నుండి 10.8.2014 వరకు: అమ్మ రజస్వలోత్సవములు పేరంటములు ప్రతిరోజూ సాయంత్రము అన్నపూర్ణాలయ నూతన భవన వేదిక వద్ద శ్రీమతి బ్రహ్మాండం వసుంధరక్కయ్య నిర్వహణలో అత్యంత వైభవముగా వేడుకగా నిర్వహింపబడినాయి. పేరంటములు, ఈ క్రిందివారు నిర్వహించారు.

శ్రీ విశ్వజననీ పరిషత్వారు, శ్రీమన్నవ లక్ష్మీనరసింహారావు, శ్రీమతి శేషు దంపతులు, ఆలయ అర్చకులు శ్రీనవీన్ శర్మ-శ్రీమతి సుందరి, శ్రీ సంతోష్, శ్రీ శర్వణ్, వేదపాఠశాల అధ్యాపకులు శ్రీ సందీప్ శర్మ, వేదవిద్యార్థులు శ్రీ బూదరాజు శ్యాంప్రసాద్ ముఖర్జీ – శ్రీమతి వాణి దంపతులు, శ్రీ వై.వి.సుబ్రహ్మణ్యం – కుటుంబ సభ్యులు (చీరాల), శ్రీ వడ్డాది సత్యనారాయణ మూర్తి – శ్రీమతి భాస్కరమ్మ, శ్రీ కటిక హనుమయ్య – కుటుంబసభ్యులు (జాండ్రపేట), శ్రీ జన్నాభట్ల సుబ్రహ్మణ్యం – శ్రీమతిలక్ష్మి (గుంటూరు), శ్రీమతి వరలక్ష్మి – శ్రీమతి పద్మతులసి, కుమారి మౌనిక, కుమారి అవని గాయత్రి (గుంటూరు), మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీ విద్యార్థినులు – లేడిస్, హాస్టల్ వార్డెన్ శ్రీమతి ఎన్. నాగమణి, శ్రీ ఎమ్.వి.ఎ.ఎన్.కె.ప్రసాద్ – శ్రీమతి శేషుమణి దంపతులు, శ్రీ చక్కా శ్రీమన్నారాయణ – శ్రీమతి లక్ష్మి దంపతులు, 31-7-2014 నుండి 10-8-2014 వరకు అందముగా అలంకరించిన వేదిక మీద “అమ్మ”ను వుంచి, పూజించి చిమ్మిరి దంపారు. శ్రీమతి నాదెండ్ల భ్రమరాంబ అక్కయ్య, కుమారి ఎమ్.వి. సుబ్బలక్ష్మి తదితురులు పేరంటము పాటలు పాడి సందడి చేశారు. కాలేజి విద్యార్థినుల కోలాటము అందరినీ ఆకర్షించింది. ప్రతిరోజు సాయంత్రము పేరంటంలో పండ్లు, పూలూ, చిమ్మిరి, స్వీట్స్ అందరికీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలేజీ విద్యార్థినులు ఆవరణలోని వారు గ్రామస్థులు, ఇతర ప్రాంతముల నుండి వచ్చినవారు వుత్సాహంగా పాల్గొన్నారు.

8-8-2014 : శ్రావణమాసం వరలక్ష్మీవ్రతము సందర్భముగ అందరింటి అక్కయ్యలు, శ్రీ విద్యానిలయం సోదరీమణులు కాలేజీ విద్యార్థినులు, గ్రామస్థులు, ఇతర ప్రాంతముల నుండి వచ్చినవారు ఉదయం 9 గంటలకు వాత్సల్యాలయములో “అమ్మ”కు పసుపు కుంకుమలు సమర్పించి అనంతరము శ్రీ హైమాలయములో వరలక్ష్మీవ్రతము చేసుకొని అందరికీ ప్రసాదములు ఇచ్చారు.

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విశ్రాంత ఆచార్యులు డాక్టర్ శ్రీమతి వరలక్ష్మిగారు తన పుట్టినరోజును అమ్మ సన్నిధిలో జరుపుకొని అందరికీ అమ్మ అన్న ప్రసాద వితరణగావించారు.

13-8-2014 : శ్రీ ఉప్పలూరి వాసుదేవరావు – శ్రీమతి శ్రీ మహాలక్ష్మి (చిట్టిపిన్ని) దంపతుల కుమారుడు, కోడలు శ్రీ గిరీష్ కుమార్ – శ్రీమతి ఇందిరా ప్రియదర్శిని (బొంబాయి) దంపతులు శ్రీ అనసూయేశ్వరాలయములో అనసూయావ్రతము చేసుకున్నారు.

14-8-2014: శ్రీ ఉప్పలూరి గిరీష్ కుమార్ తమ షష్టిపూర్తి కార్యక్రమమును వారి శ్రీమతి ఇందిరా ప్రియదర్శినితో కలసి వారి తల్లితండ్రులు, సోదరీ సోదరులు, బంధుమిత్రుల సమక్షములో అన్నపూర్ణలయ వేదిక మీద “అమ్మ” ఆశీస్సులతో అత్యంత వుత్సాహభరిత వాతావరణంలో జరుపుకున్నారు. బొంబాయిలో వారు నిర్వహిస్తున్న సేవాసత్ సంఘ కార్యక్రమములు వివరిస్తూ ఇంకా ఎన్నో మంచి కార్యక్రమములు నిర్వహించే శక్తిని “అమ్మ” తమకు ప్రసాదించాలని కోరుకున్నారు.

  ఈ కార్యక్రమములో సోదరులు శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్, శ్రీ బ్రహ్మాండరవీంద్రరావు, శ్రీ ఎమ్. దినకర్, శ్రీ గోపాలన్నయ్య, శ్రీ నాదెండ్ల లక్ష్మణరావు, శ్రీ వల్లూరి రమేష్బాబు, శ్రీ గిరీష్కుమార్ దంపతులకు తమ శుభాభినందనల తెలిపారు. కార్యక్రమ అనంతరం అందరికీ విందుభోజనం ఏర్పాటు చేశారు.

14-8-2014 : డాక్టర్ కోన సత్యనారాయణమూర్తి – శ్రీమతి రాజ్యలక్ష్మి దంపతులు (విజయవాడ) జిల్లెళ్ళమూడిలో నిర్మించుకున్న నూతన గృహము నందు గృహప్రవేశము చేసి అనసూయావ్రతము చేసుకొని అందరికీ ప్రసాదవితరణ గావించారు.

15-8-2014: అన్నపూర్ణాలయ 56వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగినాయి ఉదయం 8 గంటలకు శ్రీ విశ్వజననీ పరిషత్ అధ్యక్షులు శ్రీ ఎమ్. దినకర్ అన్నపూర్ణాలయ చిహ్నమైన అమ్మ జండా ఆవిష్కరణ చేశారు.

ఉదయం 9 గంటలకు శ్రీవిశ్వజననీపరిషత్ వారు అనసూయేశ్వరాలయములో సంస్థలోని సోదరీ సోదరులందరికీ అమ్మ ప్రసాదముగా నూతన వస్త్రములు అందజేశారు. అనంతరము కళ్యాణమండపములో అవధాన కార్యక్రమము ఏర్పాటు జరిగింది.

ఈ కార్యక్రమమునకు అధ్యక్షులుగా సోదరులు శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్ కార్యక్రమ నిర్వహణ చేశారు.

బ్రహ్మశ్రీ శ్రీ ఆముదాల మురళి (అవధాని సంస్కృత ఉపన్యాసకులు, తిరుపతి) అవధాన కార్యక్రమములు నిర్వహించారు.

***

శ్రీ భట్టిప్రోలు రామచంద్ర, శ్రీమతి లక్ష్మీసుగుణ – (ప్రిన్సిపాల్ మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీ) దంపతులు జిల్లెళ్ళమూడిలో నిర్మించుకున్న నూతన గృహము నందు బంధుమిత్రుల సందడితో గృహప్రవేశము చేశారు.

***

చీరాల వాస్తవ్యులు శ్రీ వెంకటేశ్వర గుప్త కుమారుడు చి.షణ్ముఖరావు, చి.ల.సౌ. వెంకట శివనాగజ్యోతి (D/o. శ్రీ బైసాని జగన్నాధరావు – శ్రీమతి పద్మావతి) వివాహము అమ్మ సన్నిధిలో జరిగింది.

***

16-8-2014 : శ్రీ బి. రామచంద్ర, శ్రీమతి సుగుణ ఉదయం నూతన గృహము నందు అనసూయావ్రతము చేసుకొని అందరికీ విందు భోజనమందించారు.

జిల్లెళ్ళమూడి వాస్తవ్యులు, డాక్టర్ మద్దిబోయిన సాంబయ్యగారి మనుమరాలు, శ్రీ కుమారస్వామి, హైమవతి దంపతుల కుమార్తె చి.ల.సౌ. బాలాత్రిపుర కిరణ్మయి వివాహ నిశ్చితార్థము శ్రీ బాలగంగాధర్ తిలక్ శ్రీమతి వరలక్ష్మి దంపతుల కుమారుడు శ్రీ గోపీ కిషోర్తో హైమాలయములో జరిగింది.

17-8-2014 : శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భముగా శ్రీ విశ్వజననీపరిషత్వారు కృష్ణాష్ఠమి వేడుకలు నిర్వహించారు. అన్నపూర్ణాలయ వేదికమీద చిన్న కృష్ణుని ప్రతిమను వుంచి, వేద విద్యార్థులు వేదపఠనము చేశారు. మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీ విద్యార్థినులు గోపకాంతలై కృష్ణుని ముందు కోలాట నృత్యము చేశారు. అందరినీ అలరించిన కార్యక్రమము అనంతరము అందరికీ ప్రసాదముగా వెన్న, మోడీకారం ఇచ్చారు.

***

హైదరాబాదులో వివాహమైన నూతన దంపతులు చి.ల.సౌ. స్ఫూరి (D/O. అన్నంరాజు సీతారామారావు – శ్రీమతి అనురాధ) వారి తల్లిదండ్రులు, బంధుమిత్రులతో వచ్చి, శ్రీ అనసూయేశ్వరాలయములో అనసూయా వ్రతము చేసుకొని ప్రసాదవితరణ గావించారు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!