1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అర్కపురి విశేషాలు

అర్కపురి విశేషాలు

Kumari Visali
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 14
Month : November
Issue Number : 4
Year : 2014

23-9-2014 : శ్రీ మన్నవ నాగభూషణరావుగారి (భూషి మామయ్యగారు) ప్రధమ పుత్రుడు శ్రీ అరుణకుమార్ 23-9-2014న హైదరాబాద్లో అమ్మలో ఐక్యమయినారు.

25-9-2014 నుండి 3-10-2014 వరకూ : జిల్లెళ్ళమూడిలో దసరావుత్సవాలు వైభవంగా జరిగాయి. 

జగన్మాత “అనసూయాదేవిగా, బాలత్రిపురసుందరి, గాయత్రీదేవి, అన్నపూర్ణాదేవి, లలితాదేవి, శ్రీ మహాలక్ష్మి, సరస్వతి, దుర్గాదేవి, శ్రీమహాకాళిగా, విశేషమైన అలంకరణలతో ఉన్న “అమ్మను” అశేష జనవాహిని ఉప్పొంగిన భక్తిశ్రద్ధలతో ఆనందముగా దర్శించుకొని, అర్చించుకొని హర్షపులకాంకితులైనారు.

శ్రీశ్రీ జొన్నభట్ల వీరభద్రశాస్త్రి దంపతులు (నిడదవోలు) శ్రీ డి.వి.యన్. కామరాజు దంపతులు (హైదరాబాద్) ఉదయం బాలపూజ, మధ్యాహ్నం సువాసిని పూజ చేసుకున్నారు. ఉదయం సుందరకాండ పారాయణ, సప్తశతి పారాయణ చేశారు.

29-9-2014 : కనగాల వాస్తవ్యులు గోలి రామచంద్రరావు – శ్రీమతి జానకి దంపతులు తమ కుమార్తెకు నామకరణము మరియు అన్నప్రాసన కార్యక్రమమును శ్రీ హైమాలయములో జరుపుకున్నారు. చి. పాపకు “ఖ్యాతి శ్రీహైమ”గా నామకరణము చేశారు. 

1-10-2014 నుండి 2-10-2014: వరకూ హోమశాలలో చండీహోమము జరిగింది. శ్రీ వారణాసి ధర్మసూరి దంపతులు, శ్రీ డి.వి.యన్. కామరాజు దంపతులు శ్రీ జొన్నాభట్ల వీరభద్రశాస్త్రి దంపతులు మరియు స్థానికులైనవారు ఈకార్యక్రమములో పాల్గొన్నారు.

1-10-2014 : గుండవరం వాస్తవ్యులు శ్రీ వల్లూరి నాగేశ్వరరావు – శ్రీమతి సావిత్రి దంపతులు వారి పాప చి॥ లక్ష్మీహైమ అక్షరాభ్యాస కార్యక్రమము అమ్మసన్నిధిలో జరుపుకున్నారు.

2-10-2014 : శ్రీ జొన్నాభట్ల సుబ్రహ్మణ్యం దంపతులు (గుంటూరు) అమ్మకు అర్చన చేసుకొని తొమ్మిదిమంది సోదరీమణులకు సువాసిని పూజ చేసుకొని నూతనవస్త్రములను అందజేశారు.

2-10-2014: జాతి పిత పూజ్యగాంధీజీ 145వ జయంతి సందర్భముగ ప్రారంభించిన కేంద్ర రాష్ట్రాల పిలుపు మేరకు జిల్లెళ్ళమూడిలో ‘స్వచ్ఛ్భారత్’ కార్యక్రమము ప్రారంభించారు. శ్రీ విశ్వజననీపరిషత్ అధ్యక్షులు శ్రీ ఎమ్. దినకర్ స్వచభారత్ ఆవశ్యకతను వివరించి కార్యక్రమ ప్రారంభించారు. ఈ కార్యక్రమములో సోదరులు శ్రీ వై.వి.శ్రీరామమూర్తి, శ్రీ వారణాసి ధర్మసూరి, శ్రీ భట్టిప్రోలు రామచంద్ర, మాతృశ్రీ ఓరియంటల్ కాలేజి ప్రిన్సిపల్ శ్రీమతి డాక్టర్ బి. లక్ష్మీసుగుణ అధ్యాపకులు శ్రీ వి. త్రయంబకం శ్రీ శిష్ట్లా ప్రభాకర్ మరియు కళాశాల, విద్యార్థినులు ఆలయపరిసరములను శుభ్రపరిచారు. ఇక మీద స్వభారత్ కార్యక్రమమును చేపట్టి విద్యార్థినీ విద్యార్థులను ఈ కార్యక్రమములో భాగస్వాములను చేస్తామని ప్రిన్సల్ శ్రీమతి లక్ష్మీసుగుణ తెలిపారు. ప్రతి ఒక్కరు తమ వంతు చేయూత నిస్తామని వుత్సాహంగా తెలియజేశారు.

3-10-2014 : సోదరులు శ్రీ జొన్నాభట్ల వీరభద్రశాస్త్రి సుందరకాండ పారాయణ పూర్తి చేసిన సందర్భముగా “అమ్మకు శ్రీ రామసహస్ర, సీతా అష్టోత్తర, శతనామములతో శ్రీఆంజనేయ అష్టోత్తర ఎఱ్ఱకలువ పూలతో పూజ చేసుకున్నారు.

విజయదశమి సాయంత్రం శమీపూజతో దసరా వేడుకలు విజయవంతంగా ముగిసినాయి. ఈ తొమ్మిది రోజులూ “అమ్మకు” భక్తిశ్రద్ధలతో ఎంతో నైపుణ్యంగా అత్యంత ఆకర్షణీయంగా అలంకరణలు చేసి “అమ్మ” ఆశీస్సులనందినవారు; శ్రీమతి మన్నవ శేషు (అందరి అత్తయ్యగారు), శ్రీమతి బ్రహ్మాండం శేషు అక్కయ్య, శ్రీమతి బ్రహ్మాండం వైదేహి అక్కయ్య, శ్రీమతి బూదరాజు వాణి తదితరులు. ఈ కార్యక్రమమునకు సహాయ సహకారములు అందించినారు శ్రీ సంతోష్ శర్మ, శ్రీమతి సుందరి, – శ్రీమతి రోహిణి, వేద విద్యారులు. ఈ దసరా నవ రాత్రులలో సి. హెచ్. రవి, పద్మ, శ్యామల, శేఖర్, నాగమణి, విశాలి తదితర సిబ్బంది చాలా ఉత్సాహంగా సమయము నకు అన్ని అందించారు.

3-10-2014 : వేదపాఠశాల 3వ వార్షికోత్సవము సందర్భముగా వేద విద్యార్థులు, వారి గురువర్యులు శ్రీ ఎమ్.సందీప్ శర్మ అమ్మకుపూజ చేసుకొని వేదపఠనము గావించారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ విద్యానిలయ గృహసముదాయ ప్రాంగణమునందు ఏర్పాటు చేసిన సభాకార్యక్రమములో ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త శ్రీ వి.యస్.ఆర్.మూర్తిగారు ముఖ్య అతిధిగా పాల్గొనగా శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్ సభా నిర్వహణ గావించారు. శ్రీ వి.యస్.ఆర్. మూర్తి మాట్లాడుతూ సంస్థ అభివృద్ధికి మనమందరమూ మనకు చేతనైన విధముగా చేయూత నిద్దాము. “అంతా అమ్మే చూసుకుంటుంది” అని నిర్లిప్తంగా వుండకుండా మనం “అమ్మ” బిడ్డలం కాబట్టి అమ్మ ఆశయసిద్ధికి మనవంతు కర్తవ్యాన్ని నిర్వహించుదా మని అన్నారు. తాము వి.యస్.ఆర్. మూర్తి ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నామని అవసరమైన అర్హులైన వారికి ఈ ఫౌండేషన్ సాయము అందిస్తుంది అన్నారు. అనంతరం సంస్థ అభివృద్ధికి తమ వంతు సేవలు అందిస్తున్న వారికి శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్ గారి ప్రశంసా వ్యాఖ్యానముతో శ్రీ వి.యస్.ఆర్.మూర్తిగారు ఆత్మీయ సత్కారమునందజేశారు.

సత్కార గ్రహీతలు : శ్రీ బ్రహ్మాండం. రవి అన్నయ్య, శ్రీ టి.టి. అప్పారావు, శ్రీ ఎమ్. దినకర్, శ్రీ వై.వి.శ్రీ రామమూర్తి, శ్రీ మన్నవ లక్ష్మీనరసింహారావు, శ్రీ నాదెండ్ల లక్ష్మణరావు, శ్రీ శరత్ చంద్రకుమార్, శ్రీ యార్లగడ్డ భాస్కరరావు, శ్రీ బి. రామబ్రహ్మం, శ్రీ డి.వి.యన్. కామరాజు, శ్రీ వి.యస్.ఆర్. ప్రసాదరావు, శ్రీ అన్నంరాజు మురళీకృష్ణ, శ్రీ యస్.మోహనకృష్ణ. శ్రీ చక్కా శ్రీమన్నారాయణ, శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్, మువ్వా కృష్ణ ప్రసాద్, శ్రీ గిరిధర్ కుమార్, శ్రీ బి.శ్యాంప్రసాద్ ముఖర్జీ, శ్రీ వెంకటేశ్వరరావు, శ్రీ పి.సుబ్రహ్మణ్యం దంపతులు. కార్యక్రమానంతరము ఎప్పటి వలెనే వచ్చిన వారందరికీ శ్రీ చక్కా శ్రీమన్నారాయణ – శ్రీమతి లక్ష్మి దంపతులు రుచికరమైన ఉపాహారములనందించారు.

శ్రీ సుబ్రహ్మణ్యం, శ్రీమతి పద్మావతి దంపతులు శ్రవణానందకరముగా నామసంకీర్తన గావించారు.

4-10-2014 : “అమ్మ”ను పూజించిన శరన్నవరాత్రి నిర్మాల్యమును ఓంకారనదిలో నిమజ్జనము చేశారు. కళాశాల విద్యార్థినులు నిర్మాల్యమును పళ్ళెరములలో వుంచి శిరస్సున ధరించి మంగళవాద్యము లతో నడువగా అందరూ వారిని అమ్మవారుగా భావించి హారతులిచ్చి నారికేళ సమర్పణ చేశారు. అమ్మ నామ సంకీర్తనతో బయలుదేరిన నిమజ్జన వూరేగింపులో శ్రీ రవితేజ, శ్రీ కార్తీక్, శ్రీ మల్లు అన్నయ్య ఆనందంతో నృత్యం చేశారు. ఉత్సాహంగా పాల్గొన్న కార్యక్రమ నిర్వాహకులు శ్రీ వల్లూరి రమేష్బాబు, శ్రీ త్రయ్యంబకం తదితరులు.

7-10-2014 : మన్నవ వాస్తవ్యులు శ్రీ మన్నవ నాగభూషణరావుగారు (భూషి మామయ్యగారు) 7-10-2014న మన్నవ గ్రామములో అమ్మలో ఐక్యమయినారు.

14-10-2014 : బాపట్ల పోలీస్ డిపార్టుమెంట్ యస్.పి. శ్రీరామకృష్ణగారి తల్లిదండ్రులు ఈ రోజు అమ్మదర్శనము చేసుకున్నారు. శ్రీ రామకృష్ణగారు చిన్నప్పుడు అమ్మ దగ్గరకు వచ్చామని అమ్మ ఆశీస్సులు పొందామని తెలియజేశారు.

12-10-2014 : ఈరోజు గుంటూరు నుండి వచ్చిన సోదరీ సోదరులు అమ్మను, నాన్నగారిని, శ్రీ హైమవతీదేవిని దర్శించుకొని, కలువపూలతో పూజ చేసుకున్నారు.

15-10-2014 : శ్రీ నాన్నగారు (శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావుగారు) 102వ జయంతి సందర్భముగా శ్రీ అనసూయేశ్వరాలయములో ఉదయం హైమవతి పూజ, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, శివసహస్ర నామము, అష్టోత్తరము శతనామావళి, షోడశోపచార పూజ, అంబికా అష్టోత్తర షోడశ ఆవర్ణార్చన, సహస్రలింగార్చన జరిగినవి. ఈ పూజా కార్యక్రమములో శ్రీమతి బ్రహ్మాండం శేషు అక్కయ్య సోదరులు శ్రీ వై.వి. శ్రీరామమూర్తి, శ్రీ మన్నవ దత్తాత్రేయశర్మ పాల్గొన్నారు. గుంటూరు నుంచి వచ్చిన సోదరీమణులు శ్రీమతి మన్నవ జయ, శ్రీమతి రమ వివిధరకముల పూలతో అమ్మకు నాన్నగారికి అర్చన చేసుకున్నారు. శ్రీ సంతోషశర్మ, వేదవిద్యార్థులు పుట్టమట్టితో సహస్ర లింగములను తయారుచేసి ఒకే లింగముగా తీర్చిదిద్దారు. శ్రీ చుండి నవీన్ శర్మ, శ్రీ ఎమ్. సందీప్ శర్మ, శ్రీ సాయిప్రసాద్ శర్మ, శ్రీ సంతోషశర్మ, శ్రీ శరవరణ్ శర్మ తదితరులు అభిషేక పూజా కార్యక్రమములు నిర్వహించారు.

15-10-2014 : నాన్నగారి 102వ జయంతి సందర్భముగ శ్రీ నవనాగేశ్వరాలయములో నాన్నగారి నామ సంకీర్తన “శ్రీ అనసూయేశ్వర నమో నమో శ్రీ నాగేశ్వర నమో నమో” కార్యక్రమమును శ్రీమతి నాదెండ్ల భ్రమరాంబ అక్కయ్య ప్రారంభించారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సాగిన ఈ కార్యక్రమములో శ్రీ కొండముది రవి, ఆవరణలోని వారు గ్రామస్థులు పాల్గొన్నారు.

18-10-2014 : శ్రీ మన్నవ నాగభూషణరావు గారు అమ్మలో ఐక్యమయిన 12వ రోజు సందర్భముగా వారి కుమారులు శ్రీ చంద్రసేన్, శ్రీ కృష్ణశర్మ జిల్లెళ్ళమూడిలో అమ్మ సన్నిధిలో ఆశీర్వచనము పొంది అందరికీ అన్నప్రసాద వితరణ గావించారు.

19-10-2014 : ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, విద్యావేత్త, మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీ, హైదరాబాద్ ఛైర్మన్ శ్రీ ఎమ్.బి.యస్. పురుషోత్తం గారు జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను అర్చించుకున్నారు.

23-10-2014 : దీపావళి పండుగ సందర్భముగా చీరాల సోదరులు శ్రీ వై.వి.సుబ్రహ్మణ్యంగారు (బుద్ధిమంతుడు అన్నయ్య) శ్రీ అనసూయేశ్వరాలయములో అమ్మను లక్ష్మీదేవిగా అర్చించారు. స్థానికులు, కాలేజి విద్యార్థినీ విద్యార్థులు, ఆనందోత్సాహాలతో మందుగుండు సామాను కాల్చి సంబరం చేసుకున్నారు. విద్యార్థినులు ఆలయములను అందరింటిని దీపాలతో అందముగా అలంకరించారు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!