29.7.2015 శ్రీ టి.టి. అప్పారావుగారు తన పుట్టినరోజు సందర్భముగ సతీసమేతముగ శ్రీ అనసూయా వ్రతము చేసుకొన్నారు.
31.7.2015 : గురుపూర్ణిమ సందర్భముగ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అమ్మజీవిత మహోదధిలో తరంగాలు పారాయణ కార్యక్రమము జరిగింది. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీమతి బి. యల్. సుగుణ, అధ్యాపకులు డాక్టర్ శ్రీ కోటయ్యగారి అధ్వర్యములో కళాశాల విద్యార్థినులు ఆవరణలోని సోదరీ సోదరులు ఈ కార్యక్రమ ములో పాల్గొన్నారు. అధ్యాపకులు శ్రీ సత్యనారాయణ గారు గురుపౌర్ణమి ప్రాముఖ్యతను వివరించారు.
సాయంత్రం 6 గంటలకు కుమారి ఎమ్.వి. సుబ్బలక్ష్మి ఆధ్వర్యములో వాత్సల్యాలయములో శ్రీ లలితా సహస్ర నామపారాయణ, అమ్మనామసంకీర్తన జరిగినవి.
2.8.2015 : హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ భీమరాజు వెంకటేశ్వరశర్మ వారి కుటుంబసభ్యులు, వీరవల్లి వాస్తవ్యులు శ్రీ నందమూరి మురళీధరరావు, శ్రీ నందమూరి శ్రావణ్ కుమార్ కుటుంబసభ్యులు జిల్లెళ్ళమూడి వచ్చి 440 కొబ్బరికాయలు కొట్టి “అమ్మ” మ్రొక్కు తీర్చుకున్నారు.
4.8.2015: సంకటహరగణేశ హోమము జరిగింది.
8.8.2015: 8.8.2015 od 10.8.2015 వరకు అన్నపూర్ణాలయ వార్షికోత్సవము మరియు స్వాతంత్య్ర దినోత్సవముల సందర్భముగా కళాశాల విద్యార్థులు అన్నపూర్ణాలయమును, అందరింటి ఆవరణను, ఆలయ పరిసరములను శుభ్రపరిచారు.
10.8.2015 : శ్రీ మతుకుమల్లి రాము, శ్రీమతి శారద దంపతుల కుమారుడు శ్రీ నాగేశ్వర వంశీకాశ్యప్ శ్రీమతి ధనలక్ష్మి దంపతుల కుమారుని బారసాల శ్రీ అనసూయేశ్వరాలయములో జరిగింది. చిరంజీవికి అనురాగ్ శారద ఋత్వికారాం అని నామకరణము చేశారు.
15.8.2015 : అన్నపూర్ణాలయ వార్షికోత్సవము మరియూ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు అందరింటి ఆవరణలో వైభవంగా జరిగినాయి. ఉదయం 7 గంటల 30 ని.లకు శ్రీ విశ్వజననీ పరిషత్ అధ్యక్షులు శ్రీ బి. రామబ్రహ్మంగారు ‘అన్నపూర్ణాలయ పతాకం ఎగుర వేయగా సంస్థ కార్యదర్శి శ్రీ వై.వి.శ్రీరామమూర్తి గారు ఉదయం 7 గం. 45 ని.లకు జాతీయ జండా ఆవిష్క రించారు. శ్రీరామబ్రహ్మంగారు – అన్నపూర్ణాలయ స్థాపన గురించి తెలియజేశారు. శ్రీ వై.వి. శ్రీరామమూర్తి గారు “అమ్మ” మహానీయతను అన్నపూర్ణాలయ మహోన్నతిని గురించి చెప్పారు.
ఉదయం 8 గంటలకు కళ్యాణమండపంలో శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయ ప్రసాద్ గారి నిర్వహణలో ఏర్పాటయిన సభాకార్య క్రమములో శ్రీ పొత్తూరి వెంకటేశ్వర రావుగారు, శ్రీమతి బి.యల్. సుగుణగారు, శ్రీ లక్కరాజు సత్యనారాయణ గారు (లాలా) శ్రీ రామబ్రహ్మం గారు, శ్రీ దినకర్ గారు విద్యార్థినీ విద్యార్థులకు నాటి స్వాతంత్య్ర వీరుల పోరాట పటిమ గురించి దేశభక్తిని గురించి, దేశాభిమానమును గురించి త్యాగమయ జీవనుల గురించి “నేడు “అమ్మ” ఏర్పాటు చేసిన అందరింటి వ్యవస్థ గురించి, తెలియజేశారు. అనంతరము ఉత్తమఫలితములు సాధించిన విద్యార్థినీ విద్యార్థులు కె. శ్వేత, టి. రాజ్యలక్ష్మి భవాని, లత, సురేష్, మణికంఠ, సుబ్రహ్మణ్యం బహుమతులు స్వీకరిం చారు. విద్యార్థినీ విద్యార్థులు పాటలు స్వాతంత్య్ర వీరుల గురించి ప్రసంగించారు. ఉదయం 10గం. 30 ని.లకు అమ్మ తత్వవైభవము ప్రధాన విషయముగ ఏర్పాటు చేసిన సభను సోదరులు శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ నిర్వహించగా కార్యక్రమములో ఆర్షవిద్యాసాగర శ్రీమల్లా ప్రగడ శ్రీమన్నారాయణమూర్తిగారు, విజయవాడ, డాక్టర్ శ్రీమతి యు. వరలక్ష్మిగారు, డాక్టర్ శ్రీమతి బి. యల్. సుగుణ గారు, శ్రీరావూరి ప్రసాద్ (డాక్టర్ శ్రీమతి ఎమ్.బి.డి. శ్యామల (లెక్చరర్ గురుకుల పాఠశాల) బాపట్ల మొదలైనవారు పాల్గొన్నారు.
అన్నపూర్ణాలయ వార్షికోత్సవము సందర్భముగా అన్నపూర్ణాలయ సిబ్బంది శ్రీ అనసూయేశ్వరాలయములో అమ్మకు, నాన్నగారికి పూజ చేసుకున్నారు. అనంతరము శ్రీ విశ్వజననీపరిషత్వారు అన్నపూర్ణాలయ సిబ్బందికి, సంస్థలోని ఉద్యోగులకు ఆవరణలోని సోదరీ సోదరులకు నూతన వస్త్రములు అందజేశారు.
అన్నపూర్ణాలయ వార్షికోత్సవము సందర్భముగ శ్రీవిశ్వజననీపరిషత్ వారు (జిల్లెళ్ళమూడి) బాపట్లలోని గవర్నమెంటు హాస్పిటల్ నందలి రోగులకు, రిక్షా కార్మికులకు తదితరులకు పులిహోర ప్యాకెట్సు అందజేశారు. ఈ కార్యక్రమములో కళాశాల హాస్టల్ వార్డెన్ శ్రీ మురళీధర రావు, బి.ఎ. రెండవసంవత్సర విద్యార్థులు తమసహకారము నందించారు.
17.8.2015: 14.8.2015 od 17.8.2015 వరకూ అమ్మనామ సంకీర్తనా కార్యక్రమము జరిగింది. 14వ తేదీ ఉదయం 8 గంటలకు శ్రీ భాస్కరరావు అన్నయ్య శ్రీ వై.వి. శ్రీరామమూర్తిగారు, శ్రీ కొండముది రవిబాబు, సంకీర్తనకార్యక్రమము ప్రారంభించారు. సకాలములో వర్షాలు కురవాలని, సమృద్ధిగా పంట చేతికందాలని గ్రామ సోదరీమణులు భక్తిశ్రద్ధలతో అమ్మనామగాన సంకీర్తన చేశారు. 17.8.2015 న శ్రీమతి బ్రహ్మాండం వసుంధర అక్కయ్య అమ్మకు నారికేళ సమర్పణ చేసి హారతినిచ్చారు.
18.8.2015: శ్రావణ మంగళవారము సందర్భముగ ఆవరణలోని సోదరీమణులు శ్రీ హైమాలయములో మంగళగౌరీవ్రతము చేసుకున్నారు.
19.8.2015: 19.8.2015 30 29.8.2015 వరకు అమ్మ చిమ్మిరి ఉత్సవ పేరంటములు మొదలైనవి. సోదరి వసుంధర ఆధ్వర్యంలో జరిగినవి.
22.8.2015 : మాతృశ్రీ ఓరియంట కళాశాల విద్యార్థులు శ్రీ అనసూయేశ్వరాలయములో శ్రీ విష్ణుసహస్ర నామపారాయణ గావించారు.