27.9.2015 శ్రీ వారణాసి ధర్మసూరి గారి సహకారముతో శ్రీవిశ్వజననీపరిషత్ వారు బాపట్లలో గవర్నమెంట్ హాస్పటల్ నందలి రోగులకు రైల్వేస్టేషన్ ఆలయ పరిసరము లందు రిక్షా కార్మికులకు అమ్మ ప్రసాదముగా పులిహోర పాకెట్లు వితరణ జరిగింది. ఈ కార్యక్రమములో కళాశాల వార్డెన్ శ్రీమురళీధరరావు, బి.ఎ. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు.
1.10.2015 : సంకట హర గణేశ హోమము జరిగింది.
4.10.2015: మాతృశ్రీ ఓరియంటల్ పాఠశాల కళాశాల విద్యార్థినీ విద్యార్థులు దసరా పండుగ శలవులకు స్వస్థలములకు వెళ్ళుచూ 14.10.2015 ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకూ సామూహికంగా “అమ్మ” నామం చేశారు.
4.10.2015 : వణుకూరు వాస్తవ్యులు శ్రీ చక్కా వెంకట సుబ్బారావు గారి మనుమరాలు, శ్రీ గోపీకృష్ణ – శ్రీమతి జ్ఞానవిజయలక్ష్మి దంపతుల కుమార్తె చి. మాన్వి సాయి, అన్నప్రాశన కార్యక్రమము శ్రీ అనసూయేశ్వ రాలయములో జరిగింది.
7.10.2015 : బాపట్ల వాస్తవ్యులు జిల్లెళ్ళమూడి శ్రీ ఓరియంటల్ పాఠశాల విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీ బొడ్డుపల్లి రామకృష్ణగారు 75వ పుట్టినరోజు సందర్భముగ సతీసమేతముగా జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మకు, నాన్నగారికి, శ్రీ హైమవతీదేవికి, నూతన వస్త్రములు సమర్పించి పూజల చేసుకున్నారు.
*****
హైదరాబాదు వాస్తవ్యులు సోదరులు శ్రీ తంగిరాల సింహాద్రిశాస్త్రి – శ్రీమతి విజయలక్ష్మి దంపతులు వారి 50వ వివాహ వార్షికోత్సవ సందర్భముగ జిల్లెళ్ళమూడి వచ్చి ‘అమ్మ, నాన్నగారికి’ శ్రీ హైమవతీదేవికి పూజ చేసుకొని, నూతన వస్త్రములు సమర్పించారు.
11.10.2015 : జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ పాఠశాల విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీ బొడ్డుపల్లి రామకృష్ణగారికి 75 ఏళ్ళు నిండగా కళాశాల, పాఠశాలల పూర్వవిద్యార్థులు, టి.టి.డి. కళ్యాణ మంటపము నందు వారినీ, వారి శ్రీమతినీ సత్కరించారు. తనకు జరిపిన సన్మానమునకు ఉచితరీతిన శ్రీరామకృష్ణ మాస్టారు తమస్పందనను తెలియజేశారు. కళాశాల విశ్రాంతఅధ్యాపకులు శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తిగారు కార్యక్రమ నిర్వహణ గావించారు.
11.10.2015 : శ్రీ అనసూయేశ్వరాలయములో తిరుమంజన కార్యక్రమము జరిగింది.
11.10.2015 : సౌరహోమము జరిగింది.
13.10.2015 : శరన్నరాత్రుల సందర్భముగ కీ॥శే॥ శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణ గారి కుమారులు శ్రీ రహి, శ్రీ బంగారుబాబు, తదితర సోదరీ సోదరులు “అమ్మకు, నాన్నగారికి, శ్రీ హైమవతీ దేవికి నూతన వస్త్రములు సమర్పించి పూజా కార్యక్రమములు నిర్వహించారు.
14.10.2015 : గుంటూరు వాస్తవ్యులు శ్రీ కట్టమూరి వెంకటేశ్వరరావు – శ్రీమతి కాత్యాయని దంపతులు ద్వితీయ కుమారుడు చి॥ అనసూయేశ్వర్ విజయవాడ వాస్తవ్యులు శ్రీ చుండూరి వెంకట సుబ్రహ్మణ్యం – శ్రీమతి పద్మావతి దంపతుల పుత్రిక చి॥ల॥సౌ॥ రాగసంధ్యల వివాహ నిశ్చితార్థ కార్యక్రమము శ్రీ హైమాలయములో జరిగింది.
14.10.2015 నుండి 22-10-2015 వరకూ శరన్నవరాత్రి ఉత్సవాలు : 14-10-2015 నుండి 22-10-2015 వరకూ ఉదయాన్నే శుభప్రద మంగళ వాద్యములతో, వేదపఠనముతో, త్రికాలపూజలతో, దసరా పూజాకార్యక్రమములు ప్రారంభమయినాయి. స్థానికులు ఆవరణలోనివారు, ఇతర ప్రాంతముల నుండి వచ్చిన సోదరీ సోదరులు “అమ్మ”ను జగన్మాత అనసూయాదేవిగా – శ్రీ బాలత్రిపురసుందరిదేవి, శ్రీ గాయత్రీదేవి, శ్రీ మహాలక్ష్మిదేవి, అన్నపూర్ణాదేవి, శ్రీ లలితాదేవి, శ్రీ సరస్వతీదేవి, శ్రీ దుర్గాదేవి, శ్రీ మహాకాళి, శ్రీ రాజరాజేశ్వరి దేవిగా విశేషమైన అలంకరణలతో వున్న “అమ్మ”ను అశేష జనవాహిని ఉప్పొంగిన భక్తిశ్రద్ధలతో ఆనందముగా దర్శించుకొని, అర్చించుకొని, హర్షపులకాంకితులైనారు. 22-10-2015న జరిగిన శమీపూజా కార్యక్రమముతో దసరా వుత్సవాలు విజయవంతంగా ముగిసినాయి.
15.10.2015: హైదరాబాదు వాస్తవ్యులు శ్రీ రాచర్ల అనంతరామన్, శ్రీమతి లక్ష్మీ శైలజ దంపతులు వారి కుమారుడు చి||నాగఆదిత్యకార్తీక్ అన్నప్రాశన కార్య క్రమమును శ్రీ అనసూయేశ్వరాలయములో జరుపు కొన్నారు.
16.10.2015 : ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా శంఖుస్థాపన కార్యక్రమము నిమిత్తము, జిల్లెళ్ళమూడి గ్రామ సర్పంచ్ – శ్రీమతి బూదరాజు వాణి, MPP శ్రీమతి మానం విజేత, M.P.T.C. శ్రీ బి. శ్రీనివాస్, తదితరులు “అమ్మ” దర్శించుకొని కలశపూజా కార్యక్రమములు జరిపారు.
19.10.2015 నుండి 21.10.2015: చండీ హోమము జరిగింది. స్థానికులు హైదరాబాదు తదితర ప్రాంతముల నుండి వచ్చిన సోదరీ సోదరులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు.
22.10.2015: జిల్లెళ్ళమూడి నూతనముగా నిర్మింపబడిన శ్రీ నాగేశ్వర నిలయం – అపార్టుమెంట్స్ భవనము నందు శ్రీ వఝ ప్రసాద్ – శ్రీమతి అరుణశ్రీ దంపతులకు కుమారుడు శ్రీ హేమకుమార్ శ్రీమతి శైలజ గృహప్రవేశము చేసి ఆవరణలోని సోదరీ సోదరులందరికీ నూతన వస్త్రములు విందు భోజనము ఏర్పాటు చేశారు.
22.10.2015 : ఉదయం మంగళవాద్యములతో, అమ్మనామ గానంతో నిర్మాల్య నిమజ్జనోత్సవం జరిగింది.
22.10.2015 : సాయంత్రం అనసూయేశ్వ రాలయంలో జరిగిన శమీపూజ కార్యక్రమములో అధిక సంఖ్యలో సోదరీసోదరులు పాల్గొన్నారు. పూజానంతరము ఈ శరన్నవ రాత్రులు 9 రోజులూ పూజా కార్యక్రమములకు సహకరించిన విద్యార్థినులకు, అర్చకులకు, తదితరులకు శ్రీవిశ్వజననీపరిషత్వారు అమ్మ ఆశీర్వచనముగా నూతనవస్త్రములు అందజేశారు.
24.10.2015 26.10.2015: Ŝn & మన్నవ నాగభూషణరావు గారి సంవత్సరీకములను వారి కుమారులు శ్రీ చంద్రసేన్, శ్రీ కృష్ణశర్మగారలు జిల్లెళ్ళమూడి అందరింటి ఆవరణలో జరుపుకొన్నారు.
25.10.2015 : హైదరాబాద్ వాస్తవ్యులు సోదరులు శ్రీ వి.యస్.ఆర్. ప్రసాదరావుగారి 75వ పుట్టినరోజు సందర్భముగ, శ్రీ ప్రసాదరావు దంపతులకు అనసూయేశ్వరాలయములో శ్రీ విశ్వజననీపరిషత్ వారు నూతన వస్త్రములందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
గుంటూరు వద్ద శ్రీ లలితాపీఠంలో గృహప్రవేశం- అనసూయావ్రతం
జిల్లెళ్ళమూడి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ రఘురామయ్య గుంటూరు చిలకలూరిపేటరోడ్డులోని లలితాపీఠం లోని అమ్మ మందిరం ప్రక్కన విజయదశమి నాడు నూతన గృహప్రవేశం చేసి అందులో 23.10.15న అనసూయా వ్రతం చేసుకున్నాడు.