21 ఆగష్టు 2023 : నాగపంచమి సందర్భంగా జిల్లెళ్ళమూడి హెూమశాలలో సుబ్రహ్మణ్య హెూమం ఆలయపురోహితులు నిర్వహించారు. ఇదే రోజున అమ్మ పవిత్రోత్సవాలు ప్రారంభమైనాయి. శ్రీమతి బ్రహ్మాండం వసుంధర అక్కయ్య ఆధ్వర్యంలో అన్నపూర్ణాలయం వేదికమీద సోదరీమణు లందరూ పూజ చేసుకుని పేరంటం చేశారు.
22 ఆగస్టు 2023 : అమ్మ పవిత్రోత్సవాలు 2వరోజు కార్యక్రమంలో ఆంజనేయస్వామి వారికి ఆకుపూజ చేసి అప్పాలు నివేదన చేయడం జరిగింది. హైమాలయంలో హైమవతీదేవి దగ్గర శ్రావణ మంగళవార వ్రతాలు జరిగాయి.
23 ఆగస్టు, 2023 : శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్ మరియు టెంపుల్స్ ట్రస్ట్, కొండముది రామకృష్ణ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కీ.శే కొండముది రామకృష్ణ అన్నయ్య 25 వ వర్ధంతి సభ స్థానిక T.T.D కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ L.V. సుబ్రహ్మణ్యం గారు పాల్గొన్నారు. నాటి సభలో సోదరులు సర్వ శ్రీ యం. దినకర్ గారు, కొండముది సుబ్బారావుగారు, వారణాసి ధర్మసూరిగారు, కాలేజీ కరస్పాండెంట్ జి. రాఘవేంద్రరావు, మరియు ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, కాలేజీ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ L.V. సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ ఎవరైనా పెద్దలు వారి అనుభవంతో మాట్లాడుతున్నప్పుడు వాటిని నోటు చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంటుందని ఆ అనుభవాలు భవిష్యత్లో ఉపయోగపడతాయని విద్యార్థులకు ఉద్భోదించారు.. అమ్మ సంకల్పాలు నెరవేర్చాలంటే కృతజ్ఞత, విశ్వాసము, అమ్మ నామసంకీర్తన, జాతీయ భావం మొదలైనవి అలవరుచుకోవా లన్నారు. పూర్వ విద్యార్థులు అమ్మ శతజయంతికి చేసిన 108 క్షేత్రాలలో అన్న వితరణం, పార్వతీపురం లాంటి ప్రదేశాల్లో నిత్యమూ అన్నవితరణం చేయటం అమ్మ ఇచ్చిన సంస్కారం అన్నారు. శ్రీ కొండముది సుబ్బారావుగారు మాట్లాడుతూ రామకృష్ణ అన్నయ్య త్యాగాన్ని, అమ్మ పట్ల వారికి ఉన్న అంకిత భావాన్నీ వివరించారు. వారి ఫౌండేషన్ తరఫున ఉత్తమ సంపూర్ణ విద్యార్థులు చిరంజీవులు డి. సత్యవాణి, తులసి లకు రవి అన్నయ్య, L.V.సుబ్రహ్మణ్యం, ఇతర పెద్దల సమక్షంలో పురస్కారం, బహుమతులు అందజేశారు.
ఆత్మీయ అతిథి శ్రీ ధర్మసూరి గారు అమ్మ నామం చేస్తే విద్యార్థుల మనస్సు, మేధ షార్ప్ అవుతుందని చెప్పారు. రవి అన్నయ్య గారు కొన్ని వందల ఫలాలను అమ్మకు నివేదన చేశారు. తదుపరి వాటిని ప్రాంగణం లో వారికి, గ్రామస్థులకు పంపిణీ చేశారు. ఈ ఫలాల పంపిణీ టెంపుల్స్ ట్రస్ట్ ప్రతినెలా చేయాలని సంకల్పం చేశారు. ఇంకా ఆనాటి సభలో జయంతి చక్రవర్తి అమ్మపాట పాడగా, విద్యార్థి అప్పలకొండ, రమేష్, చక్కా శ్రీమన్నారాయణ, డా. మృదుల, శ్రీకాంత్ తదితరులు ప్రసంగించారు. ఆంజనేయులు (లెక్చరర్) వందన సమర్పణ చేశారు.
23 ఆగస్టు, 2023 : శ్రావణ శుక్రవారం సందర్భంగా హైమాలయంలో హైమవతీశ్వరిని వరలక్ష్మీదేవిగా భావించి సోదరీ మణులు వ్రతం చేసుకున్నారు.
25 ఆగస్టు 2023 : అమ్మ పవిత్రోత్సవాలు కార్యక్రమం 5 వరోజు వైభవంగా జరిగింది.
26 ఆగస్టు 2023: శ్రీ చక్కా శ్రీమన్నారాయణ తమ షష్టి పూర్తి సందర్భంగా హెూమశాలలో ఆయుష్యహెూమం చేసుకున్నారు.
27 ఆగస్టు, 2023 : శ్రీ చక్కా శ్రీమన్నారాయణ గారి ఆధ్వర్యంలో పెదపులిపాక శ్రీ శ్రీ శ్రీ వాసుదేవానందగిరి స్వామివారి మార్గదర్శకత్వంలో 1000 మంది భక్తులు సామూహిక లలితాసహస్రనామ పారాయణం చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేకమంది సోదరసోదరీమణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీమన్నారాయణ గారు సోదరసోదరీమణులందరికీ ఒకే రకమైన చీరెలు బహూకరించారు.
శ్రీ వాసుదేవానంద స్వామి వారు లలితా సహస్రనామ వైశిష్ట్యాన్ని తెలియజేయగా, చక్కా శ్రీమన్నారాయణ గారు అమ్మ జీవిత విశేషాలనూ, అమ్మగా ఇచ్చిన సందేశాలనూ వివరించారు. నాటి సభలో రవి అన్నయ్య గారు, లాలా అన్నయ్య, దినకర్ అన్నయ్య మొదలైన వారు ప్రసంగించారు. కోలాటాలు, భజనలతో ఆవరణ భక్తి పారవశ్యంలో మునిగి పోయింది. తదుపరి శ్రీమన్నారాయణ దంతులకు అమ్మప్రసాదం, వస్త్రాలు సమర్పించడం జరిగింది. శ్రీమన్నారాయణగారు కొత్తగా వేసిన పరాత్పరి ప్లాట్సు దగ్గర సుదర్శన హెూమం జరిగింది. శ్రీమన్నారాయణ T.T.D. కళ్యాణ మండపంలో అమ్మ అన్న ప్రసాద వితరణ చేశారు.
28, ఆగస్టు 2023 : శ్రీ ప్రత్తిపాటి రవి గారి కుటుంబం వారు మాతృశ్రీ గోశాలలో వారి అమ్మాయి హైమ పుట్టినరోజు సందర్భంగా గోపూజ చేసుకున్నారు.
31 ఆగస్టు 2023 : పౌర్ణమి సందర్భంగా హైమనామ ఏకాహం జరిగింది. వేద విద్యార్థులు, హెూమాలు చేసుకున్నారు. అనసూయావ్రతాలు కూడా యథావిధిగా జరిగాయి.
31 ఆగస్టు 2023 : అమ్మ పవిత్రోత్సవాల 11 వరోజు సందర్భంగా సమర్త పేరంటం అన్నపూర్ణాలయం కళ్యాణ వేదికపై సందడిగా జరిగింది.
సెప్టెంబర్ 2023 : మొదటి ఆదివారం జిల్లెళ్ళమూడి హెూమశాలలో సౌరహెూమం జరిగింది. గుంటూరు నుండి వచ్చిన శ్రీదేవి అక్కయ్య తదితరులు హెూమం చేసుకున్నారు. సాయంత్రం సంకటహరచతుర్థి హెూమం జరిగింది.
7 సెప్టెంబర్, 2023: జిల్లెళ్ళమూడి లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. హెూమశాలలో సుదర్శన హెూమం జరిగింది. సాయంత్రం అన్నపూర్ణాలయంలో కాలేజీ విద్యార్థులు స్థానికుల సమక్షంలో ఉట్టికొట్టే కార్యక్రమం ఆనందంగా జరిగింది.
9 సెప్టెంబరు, 2023 : సాయంత్రం 4 గంటలకు అనసూయేశ్వరాలయంలో చండీసప్తశతి పారాయణ, బాపట్లలో 30 కిలోల హరిద్రాన్న వితరణ జరిగాయి.
12 సెప్టెంబర్, 2023 : శ్రీ బ్రహ్మాండం రవి అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా దంపతులిద్దరూ అమ్మను హైమను పూజించుకున్నారు. హెూమశాలలో ఆయుష్యహెూమం మొదలైన హెూమాలు చేశారు. బుట్టల కొద్దీ ఫలాలు అమ్మకు నివేదన చేసి ఊరంతా పంచిపెట్టడం జరిగింది. శ్రీ దినకర్ అన్నయ్య, శ్రీ గిరిధర్ కుమార్ అన్నయ్య దంపతులకు అమ్మ ప్రసాదం, నూతన వస్త్రాలు వితరణ చేశారు.