జులై 20, 2023 జిల్లెళ్ళమూడిలో వేంచేసియున్న శ్రీ వరసిద్ధివినాయకాలయ కుంభాభిషేకం మొదటిరోజున మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మంటపారాధన, ఆయుత గణపతి హెూమం సాయంత్రం సహస్రనామార్చన జరిగాయి. ఈ కార్యక్రమంలో శ్యామ్ అన్నయ్య కూతురు, కిరణ్మయి దంపతులు పాల్గొన్నారు.
జులై 21,2023 – వరసిద్ధివినాయకాలయం కుంభాభిషేకం రెండవరోజు ఉదయం మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, గణేశ హెూమం, సాయంత్రం సహస్రనామార్చన, వేదస్వస్తి జరిగింది. హెూమకార్యక్రమాలలో కిరణ్మయి దంపతులు, బ్రహ్మాండం శేషు, వైదేహి, వర్ధని అక్కయ్య మొదలైన
వారు పాల్గొన్నారు.
జులై 23, 2023 శ్రీ వరసిద్ధి వినాయక కుంభాభిషేకం సందర్భంగా ఉదయం అభిషేకం, పూజ అనంతరం గణపతి దేవాలయంపైన కుంభాభిషేకం అద్భుతంగా జరిగింది. అమెరికా నుండి వచ్చిన బ్రహ్మాండం రంగసాయి, రవి అన్నయ్య దంపతులు, శేషక్కయ్య, ఉభయట్రస్టుల మేనేజింగ్ ట్రస్టీలు, ఇతర ట్రస్టీలు, ఆవరణలోని అక్కయ్యలు అన్నయ్యలు, బయట ప్రదేశాలనుండి వచ్చిన వారు, స్థానికులు అనేకమంది ఈ కుంభాభిషేకంలో పాల్గొన్నారు. వేదపండితులు, దీక్షితులు, మరి 11 మంది వేదపండితులు, ఘనపాఠీలు, ఆలయ పురోహితులు ఈ కార్యక్రమం నిర్వహించారు. కుంభాభిషేకం అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది. జిల్లెళ్ళమూడి గ్రామస్తులందరికీ లడ్డుప్రసాదం వితరణ చేయడం జరిగింది. రామరాజు ప్రేమకుమార్ 25-7-2023 తమ పెండ్లిరోజు సందర్భంగా అమ్మకు, హైమకు పూజచేసుకున్నారు. వారికి అమ్మ ప్రసాదం ఇవ్వడం జరిగింది.
ఆగష్టు 2, 2023 : జిల్లెళ్ళమూడిలో వేంచేసియున్న శ్రీ ఆంజనేయస్వామి వారికి 6 మంగళవారాలు ఆకుపూజ, అప్పాలు నివేదన చేయమని పంజాల హైమవతి, మురళీధర్ కోరినందున ఆగష్టు 2 నుండి ప్రతి మంగళవారం ఆంజనేయస్వామి వారికి పూజ చేసి వారికి ప్రసాదం పంపిణీ చేయడం జరుగుతున్నది. వీరు అనపర్తి కృష్ణశర్మ గారి కూతురు, అల్లుడుగారు.
ఆగష్టు 15 న : ఉదయం జిల్లెళ్ళమూడిలో ప్రత్యేక నగర సంకీర్తన జరిగింది. మహాస్నపనం అయిన తరువాత ఏకాదశ రుద్రాభిషేకం, పూజల అనంతరం శాకంభరీ అలంకారంతో అమ్మను, అనసూయేశ్వరాలయాన్ని వివిధరకాలైన శాకాలు, కూరలతో అలంకరించారు. విజయవాడ నుండి హరికుమార్ కుమరమరు ప్రత్యేక శ్రద్ధ వహించి రెండు, మూడు క్వింటాళ్ళ కూరలను పంపించే ఏర్పాటు చేశారు. శాకంభరీ అలంకరణ పూజ అయిన పిదప అమ్మకు కిరీటధారణ చేసి దండకము స్తోత్రాలతో భక్తిపూర్వకంగా సేవించడం జరిగింది. అన్నపూర్ణాలయ పాకశాస్త్ర ప్రవీణులు, ఇతరులు అమ్మను సేవించుకున్న పిదప అన్నపూర్ణాలయం ఆవరణలో పూజ చేసుకున్నారు. జిల్లెళ్ళమూడిలో వివిధరకాలైన సేవలు చేస్తున్న ఉద్యోగులందరికీ వస్త్రవితరణ చేయడం జరిగింది. ఉదయం అన్నపూర్ణాలయం ఆవరణ ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీమతి బ్రహ్మాండం వసుంధర అక్కయ్య అమ్మ ఫోటోను పూలమాలలతో అలంకరించారు. అమ్మ జండా ఆవిష్కరణ అయిన పిదప సోదరులు దినకర్ గారు, గిరిధర కుమార్ గారు మేనేజింగ్ ట్రస్టీలు, సుబ్రహ్మణ్య శాస్త్రి, లెక్చరర్ గారు అమ్మ అన్నపూర్ణాలయం ఏర్పాటు చేసిన వైశిష్ట్యాన్ని వివరించారు. కాలేజీ విద్యార్థినీ విద్యార్థులు తెలుగు, సంస్కృత భాషలలో పాటలు పాడారు.
సాయంత్రం అమ్మకు అలంకారం చేసిన కూరలను 400 మంది గ్రామస్థులకు, జిల్లెళ్ళమూడిలోని వారందరి ఇంటికి ప్రసాదంగా పంపండం జరిగింది. ఇంకా మిగిలిన కూరలను అన్నపూర్ణాలయ వంటశాలలో ప్రసాదవితరణలో ఉపయోగించడానికి సమర్పించడమైనది. గ్రామస్థులందరూ అమ్మప్రసాదం అందినందుకు చాలా సంతోషం వ్యక్తం చేశారు.
ఆగస్టు 13, 2023: ప్రతి రెండో ఆదివారం రాహుకాలంలో జరిగే చండీ సప్తశతి పారాయణం ఈ ఆదివారం కూడా జిల్లెళ్ళమూడి అనసూయేశ్వరాలయంలో జరిగింది. ఈ పారాయణలో వేదవిద్యార్థులు, వేదపాఠశాల ప్రిన్సిపాల్ సందీప్ శర్మ, నవీన్ శర్మ, శ్రీనివాస శర్మ, ధర్మసూరి దంపతులు, కస్తూరి, సాయిబాబు, బ్రహ్మాండం శేషు, చుండి సుందరి, మువ్వా కృష్ణప్రసాద్ గారు, ఇంకా అనేక ఇతరప్రాంతాలనుండి వచ్చిన అక్కయ్యలు, అన్నయ్యలు పాల్గొన్నారు. వర్ధని అక్కయ్య, మువ్వా శేషుమణి అక్కయ్య అమ్మకు పూజ చేసుకున్నారు. సాయంత్రం 6.00 గంటలకు 30 కిలోల హరిద్రాన్నము బాపట్లలోని పేదలకు అన్నార్తులకు ప్రసాదవితరణ చేయబడింది. ఈ కార్యక్రమంలో కాలేజీ విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.