జూన్ 25, 2023 ఆదివారం ఫల్గుణీ నక్షత్రంతో కూడిన భానుసప్తమి, వ్యతీపాతయోగంతో కూడిన – పాతార్కయోగము. ఇదివేల సూర్యగ్రహణములతో సమానమైన పర్వదినమని వేదపండితులు నిర్ధారించినందున ఆరోజు అరుణ పారాయణం, తీర్థప్రసాదాల వితరణం జరిగాయి.
జూన్ 25,2023 : కీ.శే. కొండముది సుధాకర్ కోడలు చి.సౌ. అమృత సీమంతం జిల్లెళ్ళమూడి వాత్సల్యాలయం అమ్మ సన్నిధిలో జరిగింది. వారికి ట్రస్టు తరుఫున అమ్మ ప్రసాదం ఇవ్వడం జరిగింది. జూన్ 29, 2023 : తొలి ఏకాదశి సందర్భంగా ఆలయాలలో విశేష పూజలు, అనసూయా వ్రతము, విష్ణుసహస్రనామ పారాయణ, హెూమశాలలో సుదర్శన, నారసింహ, పురుషసూక్త, శ్రీసూక్త హెూమాలు జరిగాయి.
జులై 1, 2023 : శ్రీ టి.టి. అప్పారావు గారు తమ 89వ పుట్టినరోజు సందర్భంగా అమ్మను, హైమవతీశ్వరిని పూజించుకుని ఆశీర్వచనం తీసుకున్నారు. ఆ సందర్భంగా అప్పారావు గారికి, వారి సతీమణికి టెంపుల్స్ ట్రస్ట్ తరుఫున అమ్మ ప్రసాదం, వస్త్రాలు వితరణ చేయడం జరిగింది.
జులై 2, 2023 : మొదటి ఆదివారం ఉదయం హెూమశాలలో సౌరహోమం జరిగింది. వేదపండితులు సూర్యనమస్కారాలు నిర్వహించారు. తీర్థప్రసాదాల వితరణ జరిగింది. జులై 3, 2023 : గురుపూర్ణిమ సందర్భంగా ఉదయం ప్రత్యేక నగరసంకీర్తన, హైమనామ ఏకాహం, అమ్మ చరిత్ర మహెూదధిలో తరంగాలు పారాయణ జరిగాయి. ఉదయం 6.30 మేనేజింగ్ ట్రస్టీ యం. దినకర్ అన్నయ్య అమ్మ చరిత్ర పారాయణ ప్రశస్తిని వివరించారు. తదుపరి సాయంత్రం 5.00 వరకు పారాయణ జరిగింది. వాత్సల్యాలయంలో అంబికా సహస్రనామ పారాయణ సాయంత్రం వాత్సల్యాలయంలో లలితాసహస్రనామ పారాయణ, అమ్మనామసంకీర్తన, దీపాలంకరణ జరిగాయి.
ఆ రోజునే మాతృశ్రీ నామజపయజ్ఞం అష్టోత్తర శతకోటి జపఫలం సోదరుడు యం. వి.ఆర్ సాయిబాబు అమ్మ పాదారవిందాలకు సమర్పించడం జరిగింది. సమాచార కేంద్రం నుండి వేదమంత్రాలతో వేదపండితులు ముందు నడువగా, అమ్మనామ జపయజ్ఞ వివరాలను, అమ్మ నాన్నగారికి వస్త్రాలను, పసుపు కుంకుమ, పూలు, పండ్లు మొదలైన పూజాద్రవ్యాలతో అక్కయ్యలు అన్నయ్యలు వెంటరాగా ఆలయాలకు ప్రదక్షిణలు చేసి అమ్మకు జపఫలం సమర్పించి, ఎవరెంత జపం చేశారో అమ్మకు చదివి వినిపించి అందరినీ ఆశీర్వదించమని అమ్మకు విన్నవించడం జరిగింది. అమ్మ చిరునవ్వుతో జపఫలాన్ని స్వీకరించిందని సోదరసోదరీమణులు తమ సంతోషాన్ని, కృతజ్ఞతని వ్యక్తపరిచారు. ఇంతటి మహాయజ్ఞాన్ని సఫలం చేసి అందరినీ దీవించిన అమ్మకు కృతజ్ఞతా పూర్వక భక్తిపూర్వక ప్రణామములు. చాలా మంది సోదరసోదరీమణులు జపం కొనసాగిస్తామని కోరినందున అమ్మ 108 సంవత్సరాల పుట్టినరోజుకు పూర్తి అయేటట్లు డిసెంబరులో హైమవతీ దేవి పుట్టినరోజు నుండి అమ్మనామజపయజ్ఞం మరల మొదలవుతుందని ప్రకటన వెలువడింది.
జులై 6, 2023 : జిల్లెళ్ళమూడి హెూమశాలలో సంకష్టహరచతుర్థి హెూమం జరిగింది.
జులై 9, 2023 : ఉదయం అమ్మను ఆలయాలను దర్శించుకోవడానికి Vigilance enforcement నుండి పలువురు Dignatories విచ్చేశారు. వారిలో శ్రీ L.V.Ramanamurthy, S.E, vigilance, vijayawada, K.V.V.kumar, D.E.E, Regional Vigilence officer, Guntur, PV. Nageswararao, A.E.E, Y.Sivanarayana, A.E.E తదితరులు ఉన్నారు. వారు ఆలయాలలో అమ్మను, హైమను దర్శించి ఇతర దేవాలయాలలోను పూజలు నిర్వహించారు. శ్రీ విశ్వజననీ పరిషత్ టెంపుల్స్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ యం. దినకర్ అన్నయ్య, వెంకటేశ్వరరావు గారికి అమ్మ ప్రసాదం, శేష వస్త్రాలు అందించారు.
జులై 9, 2023 – రెండవ ఆదివారం రాహుకాలంలో సాయంత్రం 4.00 నుండి 6.30 వరకు జరిగే దేవీసప్తశతి చండీపారాయణం యథావిధిగా జరిగింది. అయిదురకాల పూలు, అయిదురకాల పండ్లు, హరిద్రాన్నం, గారెలు, దధ్యోదనం, వడపప్పు, పానకం నివేదన జరిగింది. 30 కిలోల పులిహోర బాపట్లలో పేదలకు ప్రసాదవితరణ జరిగింది. నిమ్మ దొప్పలలో ఆవునెయ్యి దీపాలు వెలిగించి అమ్మకు హారతులు, అనంతరం ప్రసాదవితరణ జరిగాయి.
జులై 10, 2023: మన్నవ శ్రీ రంగడు బావ, విమల అక్కయ్య, స్వాతి అక్కయ్య, పిల్లలు అమ్మకు, హైమకు పూజ చేసుకున్నారు. స్వాతి అక్కయ్య పిల్లలు అమెరికా వెళుతున్న సందర్భంగా వారు కుటుంబ సమేతంగా అమ్మను సేవించుకున్నారు. వారికి అమ్మ ప్రసాదం, వస్త్రాలు ట్రస్టు తరుఫున సాయిబాబు దంపతులు అందించారు.
—
APPGCET -2023
డిగ్రీ పూర్తయిన (లేదా) డిగ్రీ చివరి సంవత్సరం చివర సెమిష్టర్ చదువుచున్న విద్యార్థులు PG కోర్సుల్లో విశ్వవిద్యాలయాల్లో గానీ విశ్వవిద్యాలయాల అనుబంధ కళాశాలల్లో గాని చేరేందుకు వాసే ప్రవేశపరీక్ష ఏపీపీజిసెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి సౌజన్యంతో రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు కలిసి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష APPGCET. 2023వ సంవత్సరంలో CET నిర్వహించే బాధ్యతను Andhra University కి ఇచ్చింది. 2023 ఏప్రియల్ 28న Notification విడుదల చేశారు. ప్రవేశపరీక్షలు జూన్ 5వ తేదీ నుండి జూన్ 10వ తేదీ వరకు జరిగాయి. కోర్సులలో గవర్నమెంట్ మరియు ప్రైవేట్ ఎయిడెడ్ అన్ ఎయిడెడ్ విద్యాసంస్థలలో చేరుటకు CET వ్రాయాలి. 145 కోర్సులు చదువుటకు ఈ పరీక్ష అవసరం. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పూర్వవిద్యార్థి సమితి ఎమ్.ఎ. (తెలుగు) ప్రవేశ పరీక్ష వ్రాయు విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను అందించి ప్రోత్సహించారు.
APPGCET – 2023 RANKERS M.A. (TELUGU) ENTRANCE TEST
1.కాకుమాను – నవ్య – 1వ ర్యాంకు
- మండల – రోజా – 4వ ర్యాంకు
- తిరుపతి – యమున – 5వ ర్యాంకు
- మంతిని – శ్రావణి – 9వ ర్యాంకు
- మేడూరి – అంజని – 13వ ర్యాంకు
6.పాలపర్తి – లావణ్య – 14వ ర్యాంకు
- వీసం – పద్మావతి – 17వ ర్యాంకు
- నాగినడ – వేణుమాధవి – 25వ ర్యాంకు
- షేక్ – ఆషాభీ – 38వ ర్యాంకు
10 షేవణ – మస్తానీ – 97వ ర్యాంకు
విజేతలకు అభినందనలు. ఈ విజయాలు సాధించటానికి కృషిచేసిన అధ్యాపకులకు, ఇందులో భాగస్వామ్యం వహించిన అందరింటి సోదరీ సోదరులకు కృతజ్ఞతలు. కరుణించిన విద్యాస్వరూపిణి అమ్మకు ప్రణామాలు.
- S.V.J.P. Trust, జిల్లెళ్ళమూడి