మే 21, 2023 : జిల్లెళ్ళమూడిలోని వరసిద్ధి వినాయక వార్షికోత్సవాలలో సాయంత్రం గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ స్థాపన, దీక్షాధారణ, మంటపారాధన జరిగాయి.
మే 22, 2023 : ఉదయం అధర్వ శీర్షిపనిషత్తో అభిషేకం, సహస్రమోదకాలతో శ్రీ లక్ష్మీ గణపతి హెూమం జరిగాయి. సాయంత్రం గకార గణపతి సహస్రనామార్చన జరిగింది.
మే 23, 2023 : ఉదయం శ్రీ వరసిద్ధి వినాయకాలయం లో అభిషేకం తర్వాత హెూమశాలలో అష్టగణపతి హెూమం జరిగింది. సాయంత్రం గణపతి సహస్రనామార్చన జరిగాయి.
మే 24, 2023: ఉదయం శ్రీ వరసిద్ధి వినాయకాలయంలో అభిషేకం, అధర్వశీర్హోపనిషత్ మంత్రాలతో యాగశాలలో హెూమం, సాయంత్రం గణపతి సహస్రనామార్చన, చతుర్వేద పారాయణ, పూజ జరిగాయి.
మే 24, 2023 : శ్రీ B.G.K. శాస్త్రి గారి 65 వ పెండ్లిరోజు సందర్భంగా అనసూయేశ్వరాలయంలో అమ్మ ప్రసాదం, వేదపండితుల ఆశీర్వాదం జరిగాయి.
మే 28, 2023 : నవనాగనాగేశ్వరాలయం వార్షికోత్సవాలలో భాగంగా అభిషేకం, పుణ్యాహ వాచనం, మంటపారాధన, గణపతి హోమం, దుర్గా సూక్తంతో హెూమం జరిగాయి.
మే 29, 2023 : నవనాగనాగేశ్వరాలయ వార్షికోత్సవం రెండవరోజున ఉదయం మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, గణపతి హెూమం, దుర్గాసూక్తంతో హెూమం జరిగాయి, సాయంత్రం గణపతి సహస్రనామార్చన, పుష్పార్చన, చతుర్వేద స్వస్తి జరిగాయి.
మే 30, 2023 : ఉదయం గాయత్రీ జయంతి సందర్భంగా శ్రీ కొండముది ప్రేమ్ కుమార్ దంపతులు అమ్మకు తెల్లటి చీర సమర్పించి, గాయత్రీ హెూమం చేసుకొని, పెరుగు అన్నం నివేదన చేసి ప్రసాదవితరణ చేశారు. నవనాగనాగేశ్వరాలయంలో ఉదయం అభిషేకం, మన్యుసూక్తహెూమం, గాయత్రీ హెూమం మొదలైన హెూమాలు జరిగాయి. సాయంత్రం సహస్రనామార్చన, పుష్పార్చన, వేదస్వస్తి జరిగాయి.
మే 31, 2023 : అన్నపూర్ణాలయ కళ్యాణ వేదిక మీద శ్రీ వలివేటి సుబ్బారావు, గీతాభవాని (తెనాలి) దంపతుల కుమారుడు చి॥ జయదీప్ ఉపనయనం జరిగింది.
నవనాగనాగేశ్వరాలయం 4 వరోజు వార్షికోత్సవం లో భాగంగా ఏకాదశరుద్రాభిషేకం, హేరంబ గణపతి సహిత, లక్ష్మీ నృసింహ హవనము జరిగాయి. సాయంత్రం సహస్రనామార్చన, పుష్పార్చన, వేదస్వస్తి జరిగాయి.
జూన్ 1, 2023 : నవనాగనాగేశ్వరాలయం వార్షికోత్సవం 5వ రోజున మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, నవగ్రహ హెూమం, శ్రీసూక్త పురుషసూక్త హవనం, రుద్రహవనం, ఆవాహిత దేవతల హవనం, పూర్ణాహుతి జరిగాయి. రాత్రి అన్నపూర్ణాలయం కళ్యాణ వేదిక మీద అనసూయా నాగేశ్వరుల శాంతి కళ్యాణం వైభవంగా జరిగింది. రాచర్ల వారు, వారణాసి వారు ప్రాంగణంలోని అక్కయ్యలకు, జిల్లెళ్ళమూడి గ్రామ సోదర సోదరీమణులకు పసుపు, కుంకుమ, జాకెట్లు ఇచ్చి, అందరికీ షడ్రషోపేత మైన పెండ్లి విందు ఏర్పాటు చేశారు.
జూన్ 4, 2023 : మొదటి ఆదివారం సౌరహెూమం జరిగింది. మాతృశ్రీ గోశాలలో గోపూజ జరిగింది.
జూన్, 10, 2023: అమ్మనామ సప్తాహం మొదలైంది.
జూన్ 11, 2023 : రెండవ ఆదివారం రాహుకాలంలో 4-6 గంటల్లో అనసూయేశ్వరాలయంలో చండీసప్తశతశతి పారాయణ జరిగింది. గోత్రనామాలు చెప్పిన తర్వాత కవచార్గల కీలక స్తోత్రాలు, రాత్రి సూక్తపారాయణ దుర్గాసప్తశతి, ఋగ్వేదాన్తర్గత దేవీ సూక్తం, రహస్య త్రయం పారాయణ వేదపాఠశాల ప్రిన్సిపాల్ సందీప్ శర్మ గారు, వేదపాఠశాల విద్యార్థి పార్థసారధి చేశారు. మహాకాళి ధ్యానమైన ప్రధమచరితం తులసీదళాలతోటి, మహాలక్ష్మీ ధ్యానమైన మధ్యమ చరితం గులాబీలతో మహాసరస్వతి ధ్యానమైన ఉత్తమ చరితం సన్నజాజులు, తెల్ల చామంతులతో పూజాకార్యక్రమం జరిగింది. పిండి దీపాలు వెలిగించబడ్డాయి. హరిద్రాన్నం, దధ్యోదనం, పాయసం, గారెలు నివేదన చేసి ప్రసాదవితరణ చేయడం జరిగింది.
శ్రీ విఠాల రామచంద్రమూర్తి తదితరుల విరాళాలతో 30 కిలోల హరిద్రాన్నం బాపట్ల పట్టణంలో పేదలకు, అన్నార్తులకు కాలేజీ విద్యార్థులు, లెక్చరర్స్ ద్వారా ప్రసాద వితరణ చేయబడింది.
జూన్ 12,2023 : అమ్మ అనంతోత్సవాలలో భాగంగా ఉదయం నగరసంకీర్తన, అమ్మ మూలవిరాట్టుకు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం జరిగింది.
ఈ కార్యక్రమం11 మంది వేదపండితులు నిర్వహించారు. యాగశాలలో కలశస్థాపన, ఋష్యశృంగ ఆరాధన, హెూమం జరిగింది. తర్వాత శ్రీ విశ్వజననీ చరితమ్ హెూమం సందీప్ శర్మ తదితరులు చేశారు.
జూన్ 13, 2023 : ఉదయం మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అనసూయేశ్వరాలయంలో మొదట కళాశాల విద్యార్థులచే ఆ తర్వాత ప్రాంగణంలోని సోదరసోదరీమణులచే అంబికాసహస్రనామ స్తోత్ర పారాయణ జరిగింది. విరాటపర్వం పారాయణ జరిగింది. ఋష్యశృంగ హెూమం, విరాటపర్వం అయిన తర్వాత జిల్లెళ్ళమూడిలో చిరుజల్లులు కురవడం విశేషం. కాకుమాను నుండి వచ్చిన సత్యవతి భజన బృందం వారు అమ్మ నామ సప్తాహంలో అత్యద్భుతంగా భజన చేశారు.
జూన్ 14,2023: ఉదయం అమ్మ నగరసంకీర్తన, సహస్ర ఘటాభిషేకం తర్వాత అనసూయేశ్వరాలయ శిఖరంపై కుంభాభిషేకం 11 మంది వేదపండితులచే అత్యద్భుతంగా నిర్వహించబడింది. రాత్రి 100 కిలోల మల్లెపూలతో ధ్యానాలయంలో పూలంగిసేవ నిర్వహించబడింది. ఈ కార్యక్రమాలలో సోదరసోదరీమణులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
జూన్ 15, 2023 : ద్రోణాదుల నుండి వచ్చిన శ్రీ బెల్లంకొండ పుల్లారావు భజనబృందం వారు అమ్మనామసప్తాహం లో అత్యంత అద్భుతంగా భజన చేశారు..
జూన్ 16 : అమ్మనామ సప్తాహం 17 న మంగళ హారతి, ప్రసాద వితరణ జరిగాయి. ఈ నామ సప్తాహాలకు జిల్లెళ్ళమూడి గ్రామస్తులను భజన బృందాలుగా మలచిన శ్రీమతి పద్మావతి అక్కయ్య, భ్రమరాంబ అక్కయ్యలు అభినందనీయులు. పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు.
జూన్ 16, 2023 : శ్రీ అనపర్తి కృష్ణశర్మ గారు దంపతులు అమ్మను దర్శించి అమ్మ ప్రసాదం అందుకున్నారు. జిల్లెళ్ళమూడి ఆలయ పురోహితులు శ్రీ పంచాగ్నుల శ్రీనివాస శర్మ వారి రెండవ కుమార్తె నిశ్చితార్థం హైమాలయంలో జరిగింది. వసుంధర అక్కయ్య అమ్మ ప్రసాదం అందించారు.