ఏప్రియల్ 23, 2023 – జిల్లెళ్ళమూడి ఆలయాలను ఏడుగురు అఘోరాలు దర్శించుకున్నారు. వారికి అన్నపూర్ణాలయంలో అన్నప్రసాద వితరణ, వస్త్ర వితరణ చేయడం జరిగింది.
ఏప్రియల్ 29, 2023 : అమ్మ జన్మ నక్షత్రం ఆశ్లేషానక్షత్రం సందర్భంగా 108 కలశాలతో అమ్మ మూలవిరాట్ కు మహారుద్రాభిషేకం, 2 లక్షల బిల్వార్చన, పుష్పార్చన జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎందరో సోదరీ సోదరులు పాల్గొన్నారు. వేదపండితులకు సత్కారం జరిగింది. మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం. అంబికాసహస్రనామం, లలితాసహస్రనామం, త్రిశతి, ఖడ్గమాల, వెంకటేశ్వర అష్టోత్తరం, దీపారాధన, లక్ష్మీ అష్టోత్తరం మొదలైన పూజాకార్యక్రమాలు అర్చనలు ఉదయం 6-30 నుండి సాయంత్రం 3.30వరకు మరిగాయి.
ఏప్రియల్ 29 నుండి మే 5 వరకు అమ్మ నామ సప్తాహం జిల్లెళ్ళమూడి లో జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక భజన బృందాలు, భక్తులతో పాటు చుట్టుపక్కల నుండి వచ్చిన భజన బృందాల వాళ్ళు విశేషంగా పాల్గొన్నారు.
మే 6వ తేదీన అమ్మకు హారతి ఇచ్చి కార్యక్రమాన్ని ముగించారు.
మే 5వ తేదీన హైమవతీ వ్రతం,
మే 7వ తేదీన సౌరహోమం,
మే 9వ తేదీన వైశాఖ బహుళ చవితి నాడు సంకటహర గణేశ హెూమం,
మే 15వ తేదీన వైశాఖ బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మ నామ ఏకాహం,
వైశాఖ బహుళ షష్ఠి మే 11వ తేదీన హైమవతీ వ్రతాలు జరిగాయి.
మే 5, 2023 – బ్రహ్మాండం రవీంద్రరావు అన్నయ్య, వైదేహి అక్కయ్య ల 50వ వైవాహిక స్వర్ణోత్సవం అనసూయేశ్వరాయంలో వేద ఆశీర్వాదంతో కన్నులపండువగా జరిగింది. శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్స్ తరఫున మేనేజింగ్ ట్రస్టీ శ్రీ పి. గిరిధర్ కుమార్ దంపతులు నూతన వస్త్రాలతో సత్కరించారు. రవి అన్నయ్య దంపతులు అమ్మకు నాన్నగారికి పుష్పార్చన చేశారు.
మే 7, 2023 – శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయ ప్రసాద్ గారి మనుమరాలు చి. పోతరాజు అలేఖ్య (హైమానంద్ గారి కుమార్తె) అమ్మను విశేషంగా అర్చించుకున్నారు.
14-5-2002 ఆదివారం – హనుమజ్జయంతి సందర్భంగా హైమాలయంలో అభిషేకానంతరం హైమవతీశ్వరిని గజమాలలతో వడమాలతో అలంకరించి తమలపాకులతో అర్చన చేశారు. హనుమాన్చాలీసా పారాయణం జరిగింది. గెస్ట్ హౌస్ ప్రక్కన గల ఆంజనేయస్వామి వారికి కూడా విశేషంగా అర్చన చేయడం జరిగింది. హెూమశాలలో హనుమజ్జయంతి సందర్భంగా మన్యుసూక్త హెూమం, రెండవ ఆదివారం చండీపారాయణ చేయాలన్న సంకల్పానికి అనుగుణంగా చండీ నవాక్షరి మూలమంత్రంతో హెూమం జరిగింది.
సాయంత్రం 4-00 నుండి 6-30 వరకు రాహుకాల సమయంలో చండీ సప్తశతశతి పారాయణ జరిగింది. విశేష స్పందన లభించిన ఈ కార్యక్రమ దాతలు 140 మంది పైగా గోత్రనామాలు చెప్పిన తర్వాత కవచార్గల కీలక స్తోత్రాలు, రాత్రి సూక్త పారాయణ, దుర్గాసప్తశతి, ఋగ్వేదాన్తర్గత దేవీసూక్తం, రహస్యత్రయం పారాయణ చేయబడింది. మహాకాళి ధ్యానమైన ప్రధమ చరితం తులసీదళాలతోటి, మహాలక్ష్మీ ధ్యానమైన మధ్యమ చరితం గులాబీల తోటి, మహా సరస్వతీ ధ్యానమైన ఉత్తమ చరితం మల్లెపూలు, సన్నజాజులు, తెల్ల చామంతుల తోటి అమ్మను విశేషంగా పూజించుకోవడం జరిగింది.
హనుమజ్జయంతి సందర్భంగా ఓంకారానందగిరి గారి ప్రసంగం youtube ద్వారా ప్రసారం చేయబడింది. మే 15, సోమవారం – శ్రీస్వామి కృష్ణానంద, అద్వైత ఆశ్రమం కాకినాడ వారు అమ్మ దర్శనానికి వచ్చిన సందర్భంగా అమ్మ అవతారం పైవారి ప్రసంగం youtube ద్వారా ప్రసారం అయింది.