మార్చి 19 – ఉదయం నగరసంకీర్తనలో ఎక్కువ మంది సోదరసోదరీమణులు పాల్గొన్నారు. జిల్లెళ్ళమూడి సోదరసోదరీమణులు మన్నవ సుబ్బలక్ష్మి అక్కయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శతజయంతి సంవత్సరం మొత్తం జరుగుతుండటం విశేషం. ఈరోజుననే APEX committee meeting జరిగింది. శతజయంతికి భక్తుల సంఖ్య ఎక్కువగా వస్తే line management ఏవిధంగా చెయ్యాలన్న విషయం ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ఉభయట్రస్టుల ట్రస్టీలు, ఛైర్మెన్ నరసింహమూర్తి గారు, మేనేజింగ్ ట్రస్టీలతో పాటు శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు అన్నయ్య గారు మొదలైన వారు పాల్గొన్నారు. యువ సోదరులు వారి అభిప్రాయాలను పంచుకున్నారు.
22 మార్చి 2023 ఉదయం నగరసంకీర్తన, శోభకృత్ ఉగాది పంచాంగ శ్రవణం – అయిన తర్వాత వేపపువ్వు ప్రసాదం ఇచ్చారు. మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ఆలయాలలో పూజలు జరిగాయి. అంబికా సహస్రనామ పారాయణం జరిగింది. శతజయంతి సందర్భంగా జిల్లెళ్ళమూడిలో పెద్ద బెలూన్ ఎగరవేశారు. జిల్లెళ్ళమూడి హెూమశాలలో వసంతనవరాత్రుల ప్రారంభం రోజున 11 రోజుల హెూమాలకు ప్రారంభంగా మండపారాధన, కలశస్థాపన, పుణ్యాహవాచనం శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు, వైదేహి దంపతులు చేయగా సహస్ర మోదకాలతో మహాగణపతి హెూమం జరిగింది. గుంటూరు, నరసరావుపేట, తిరుపతి, కంచి, రావులపాలెం తదితర చోట్ల నుండి వచ్చిన వేదపండితులు, మరియు ఆలయ పురోహితులు హెూమం నిర్వహించారు. ఈ హెూమంలో శ్రీ వారణాసి ధర్మసూరి దంపతులు, సో. వైదేహి, సాయిబాబు, అన్నపూర్ణ మొదలైన వారు పాల్గొన్నారు. ఈరోజునే 108 చోట్ల అమ్మ ప్రసాద వితరణ చేయడానికి త్రిచక్రవాహనాలలో ప్రసాదం పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలేజీ విద్యార్థులు, అధ్యాపకులు, పూర్వవిద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వేద సన్మానసభ ఫౌండేషన్ వారు మరియు కీ.శే వారణాసి సుబ్బరాయశాస్త్రి గారి ఆర్ధిక సహకారంతో నలుగురు వేదవిద్యార్థులకు ఒక్కొక్కరికి నెలకు రు. 2000/- చొప్పున ప్రోత్సాహకం (stipend) SVJP temples trust వారు అందించడం జరిగింది. తిరుపతి నుంచి వచ్చిన ఘనపాఠీ చండీ పారాయణ ప్రారంభించారు. సాయంత్రం సలక్షణ ఘనాపాఠీలచే వేదఘోష జరిగింది.
మార్చి 23, 2023 : ఉదయం నగరసంకీర్తన, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అంబికాసహస్రనామ పారాయణం, నిత్యపూజలు జరిగాయి. ఈరోజు హెూమశాలలో చండీహెూమం నిర్వహించబడింది. వివిధ ప్రదేశాలనుండి వచ్చిన 5 గురు వేదపండితులు మరియు ఆలయ పురోహితుల సహకారంతో ఈ హెూమం జరిగింది. ఈ హెూమ కార్యక్రమంలో సోదరులు వి. ధర్మసూరి, సాయిబాబు, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం సలక్షణ ఘనపాఠీలచే వేదస్వస్తి, వేదఘోష జరపబడింది.
25 మార్చి 2023 -ఉదయం నగరసంకీర్తన శోభాయమానంగా జరిగింది. మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పూజలు, వాత్సల్యాలయంలో అంబికాసహస్రనామ పారాయణం, సాయంత్రం లలితాసహస్రనామ పారాయణం జరిగింది. జిల్లెళ్ళమూడి హెూమశాలలో 108 ఆవృతులతో మన్యుసూక్త హెూమం జరిగింది. ఈ హెూమంలో దినకర్ అన్నయ్య కుటుంబ సభ్యులు, ధర్మసూరి, సాయిబాబు, అన్నపూర్ణ, రాఘవమూర్తి గారి దంపతులు పాల్గొన్నారు. సాయంత్రం ఆలయంలో సలక్షణ ఘనపాఠీలు 5 గురిచే వేదఘోష, స్వస్తి నిర్వహించబడింది.
మార్చి 24, 2023 – ఉదయం నగరసంకీర్తన లో రకరకాల రంగుల దుస్తులతో నృత్యరీతులతో పూర్వవిద్యార్థి శ్రీ కాంత్ ఆధ్యర్యంలో పిల్లలు జిల్లెళ్ళమూడి వీధులలో ఉరేగింపుగా వెళ్లారు. ఆలయాలలో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పూజలు, అంబికా సహస్రనామ పారాయణం, లలితాసహస్రనామ పారాయణం జరిగాయి. జిల్లెళ్ళమూడి అమ్మ శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో విజయవాడలో మీడియా సమావేశం జరిగింది. SVJP trust Managing trustee గిరిధర్ కుమార్, విశ్వజనని పత్రిక సంపాదకులు ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి కార్యక్రమాల వివరాలు ప్రెస్ వారికి తెలియజేశారు. జిల్లెళ్ళమూడిలో కొత్తగా నిర్మించిన అతిథిగృహం గౌ|| శ్రీ కోన రఘుపతి, శాసనసభ్యులు ద్వారా ప్రారంభం చేయబడింది.
ఈ ప్రారంభోత్సవానికి సర్వశ్రీ బ్రహ్మాండం రవి అన్నయ్య, V.S.R. మూర్తి, డి.వి.యన్. కామరాజు, 1. రామకృష్ణ, బొప్పూడి రామబ్రహ్మం, యల్లాప్రగడ మధుసూధనరావు, ఉభయట్రస్టుల ట్రస్టీలు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం శ్రీ కోన రఘపతి గారు మీటింగ్ హాలులో మాట్లాడుతూ జిల్లెళ్ళమూడి అభివృద్ధి పథంలో ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు. జమ్ములపాలెంలో తమ ప్రభుత్వం తరుఫున ఒక super speciality hospital నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. తమ ప్రభుత్వం తరుఫున చేతనయినంత సాయం జిల్లెళ్ళమూడి శతజయంతికి అందిస్తానని హామీ ఇచ్చారు. ఉదయం హెూమశాలలో చండీ హెూమం, చండీపారాయణ జరిగింది. ఈకార్యక్రమంలో ధర్మసూరి దంపతులు, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం నవనాగనాగేశ్వరాలయంలో సలక్షణ ఘనపాఠీలచే వేదఘోష నిర్వహింపబడింది.
మార్చి 2023 ఉదయం నగరసంకీర్తన, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పూజలు, అంబికాసహస్రనామ పారాయణం, సాయంత్రం లలితా సహస్రనామ పారాయణం జరిగాయి. హెూమశాలలో ఈరోజు దాదాపు 25 మందికి పైగా శ్రీశైలం పూర్ణానందస్వామి శిష్యులు, రమేష్ మొదలైన వారు చండీ హెూమం చేశారు. ఘనపాఠీలచే వేదఘనం, వేదపారాయణ, చండీపారాయణ నిర్వహింపబడింది.
24 మార్చి 2023 – ఉదయం నగరసంకీర్తన, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పూజలు, నవనాగనాగేశ్వరాలయం లో ఏకాదశ రుద్రాభిషేకం హెూమశాలలో ఏకాదశ రుద్రహవనం నిర్వహింపబడింది. ఈ కార్యక్రమంలో శ్రీ ధర్మసూరి గారి కుటుంబం, రాఘవమూర్తి గారి కుటుంబం, అన్నపూర్ణ, ఇతర భక్తులు అనేకమంది పాల్గొనడం విశేషం. సాయంత్రం నవనాగనాగేశ్వరాలయంలో వేదపండితులచే వేదఘోష నిర్వహింపబడింది. కంచి నుండి వచ్చిన ఘనపాఠీ సామవేదం వినిపించారు.
28 మార్చి 2023 – అమ్మ పుట్టినరోజు ఈరోజు తేదీల ప్రకారం. శతజయంతి ఉత్సవాలకు జిల్లెళ్ళమూడి ఆలయప్రాంగణం మొత్తం చలువ పందిళ్ళు, ఇతరచోట్ల రంగురంగుల ఇతర పందిళ్ళు ఏర్పాటు చేశారు. జనసందోహం క్రమపద్ధతిలో వెళ్ళడానికి బారికేడ్లు ఏర్పాటు చేశారు. భోజన ఏర్పాట్లు అందరి మామయ్య నరసింహారావుగారి పొలంలో చేయగా కాలేజీ ప్రాంగణంలో సభ నిర్వహణకు సర్వాంగసుందరంగా నిర్మించిన వేదిక ఏర్పాటు చేశారు. ఈరోజు నుండి ఏప్రియల్ 1 వరకు ఆలయాలలో ఉదయం 4-00 గంటలకు 108 సార్లు ఘంటానాదం అమ్మకు మహాస్నపనం, అలంకరణ అనంతరం 7 వమైలు రాయి వరకు మహానగర సంకీర్తన సోదరి సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో వందలాది మంది జిల్లెళ్ళమూడి మరియు ఇతరప్రాంతాల నుండి వచ్చిన సోదరసోదరీమణులు నిర్వహించారు. కాలేజీ విద్యార్థినులు కోలాటాలతో పాల్గొనడం విశేషం. హెూమశాలలో సుబ్రహ్మణ్య హవనం వేదపండితుల సహకారంతో అనేకమంది చేసుకున్నారు.
29 మార్చి 2023 : ఉదయం 4 గంటలకు ఆలయాలలో ఘంటానాదం తర్వాత మహాస్నపనం, నగరసంకీర్తన, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు జరిగాయి. హెూమశాలలో మేధాసూక్త హెూమం జరిగింది. వేదపండితుల సహకారంతో ఈ హెూమంలో శ్రీ రాఘవమూర్తి దంపతులు, అన్నపూర్ణ, విన్నకోట కస్తూరి దంపతులు, వారణాసి భగవతి, భవానీ నందిగామ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం అనసూయేశ్వరాలయంలో సలక్షణ ఘనపాఠీలచే ఘనస్వస్తి వేద ఘోష జరిగింది. వేదమాత అమ్మ ఆశీర్వచనాలు అందుకున్నారు.
30 మార్చి 2023 : ఉదయం 4 గంటలకు ఆలయాలలో జేగంటలతో ప్రారంభం అయి శ్రీరామనవమి పండుగ మరియు అమ్మ శతజయంతి 3 వరోజు వేడుకలు ఈరోజు జరిగాయి. మహాస్నపనం అయినతర్వాత నగరసంకీర్తన, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం మొదలయిన కార్యక్రమాలు జరిగాయి. తదుపరి రాముని గా భావించి పూజలు చేసి కళ్యాణ అక్షతలు అందరికీ అందించారు. అంబికాసహస్రనామ పారాయణం, సాయంత్రం లలితాసహస్రనామ పారాయణలు జరిగాయి. హెూమశాలలో నవగ్రహ, నారసింహ, సుదర్శన హెూమాలు వేదపండితులచే నిర్వహించబడింది. ఆలయంలో సలక్షణ ఘనపాఠీలచే వేదఘనం, వేదస్వస్తి జరుపబడింది.
31 మార్చి 2023 ఉదయం ఘంటానాదం, మహాస్నపనం, మహాన్యాసపూర్వక ఏకాదశ – రుద్రాభిషేకం జరిగాయి. హైమాలయం లో 11 మంది ఋత్విక్కులతో జరిగిన ఏకాదశ రుద్రాభిషేకం లో అమెరికా నుండి వచ్చిన శ్రీ బ్రహ్మాండం రంగసాయి మరియు రాఘవమూర్తి గారు పాల్గొన్నారు. హెూమశాలలో వేదపండితులచే శ్రీసూక్తహెూమం జరుపబడింది. ఈ హెూమకార్యక్రమాలలో శ్రీ ధర్మసూరి కుటుంబ సభ్యులతో పాటు, బి.రాజేశ్వరి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం. ఆలయంలో వేదఘోష నిర్వహించబడింది.
అంబికాసహస్రనామ స్తోత్ర పారాయణం ఈరోజుతో 1 కోటి 70 లక్షలు పూర్తి అయింది. దీనిని కొనసాగించి కోటి అంబికా నామస్తోత్రం చెయ్యాలని సంకల్పించారు. అమ్మ శతజయంతి సందర్భంగా 2024 లో సంకల్పించిన మాతృశ్రీ నామ జపయజ్ఞం ఈరోజుతో 100 కోట్ల 56 లక్షల 45, 7 పూర్తి అయింది. అమ్మ దివ్య ఆశీస్సులతో ఇది సాధ్యమయిందని యం.వి. ఆర్. సాయిబాబు కాలేజీ సభావేదిక మీద ప్రకటిస్తూ జపాన్ని 108 కోట్లు అయ్యేంతవరకు కొనసాగించాలని అందరూ కోరినందున అంతవరకు కొనసాగిస్తున్నట్లుగా తెలియజేశారు.
1 ఏప్రియల్ 2023 – తిథుల ప్రకారం అమ్మ కు నూరు వసంతాల పుట్టినరోజు. శతజయంతి, ఉదయం జేగంటలు, సుప్రభాతం, మహాస్నపనం తో ప్రారంభమయిన కార్యక్రమాలు సంవత్సరం నుండి నిర్వహిస్తున్న నగర సంకీర్తనలో ఆఖరిరోజున వందలాది మంది అన్నయ్యలు అక్కయ్యలు, కాలేజీ విద్యార్ధినీ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్ధినులు కోలాటాలతో, అమ్మ నామ సంకీర్తనతో జిల్లెళ్ళమూడి మారుమ్రోగింది. అనసూయేశ్వరాలయంలో 21 మంది వేదపండితులచే మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకంలో శ్రీ బ్రహ్మాండం రంగసాయి తదితరులు పాల్గొన్నారు. అనసూయా వ్రతం. అమ్మ చరిత్ర పారాయణం జరిగింది. హెూమశాలలో పురుషసూక్త హెూమం, ఆవాహితదేవతల హెూమం జరుపబడింది. ఆఖరిరోజున హెూమాలలో పలువురు స్థానికులు, ఇతర ప్రదేశాలనుండి వచ్చినవారు పాల్గొని పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం సలక్షణ ఘనపాఠీలచే వేదఘనం, స్వస్తి నిర్వహించబడింది. కైలాసాశ్రమ సంస్థాన పీఠాధిపతి జయేంద్రపురి మహాస్వామి వారు విచ్చేసి శ్రీ వారణాసి ధర్మసూరి గారి గృహప్రవేశం చేశారు. నవనాగనాగేశ్వరాలయం కుంభాభిషేకం 4 ఏప్రియల్ వరకు వారు ఇక్కడనే వేంచేశారు.
2 ఏప్రిల్ 2023 – అమ్మ అవతరణ దినోత్సవం అనంతరం వాత్సల్యాలయంలో శతజయంతి లో పాల్గొని సేవలందించిన విద్యార్ధినీ విద్యార్థులకు, సేవాదళ్ వాలంటీర్లకు, SVJP పారిశుద్ధ్య కార్మికులకు, పరిషత్ ఉద్యోగులకు, పురోహితులకు అందరికీ వస్త్రాలు, జ్ఞాపికలు ఇచ్చి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో trustees, ఇతరులు పాల్గొన్నారు.
3 ఏప్రిల్ 2023 – నవనాగనాగేశ్వరాలయం కుంభాభిషేకం సందర్భంగా ఈరోజు ఆలయాలలో కీ.శే. రాచర్ల లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు, వారణాసి ధర్మసూరి గారి కుటుంబ సభ్యులు తదితరులు అమ్మకు హైమకు పూజ చేసుకొని వస్త్రాలు సమర్పించారు. హెూమశాలలో కలశస్థాపన, మంటపారాధన చేశారు. జిల్లెళ్ళమూడి అమ్మ సేవాసమితి, హైదరాబాద్ వారు మాతృశ్రీ వేదపాఠశాల విద్యార్థులకు, గురువుగారికి వస్త్రవితరణ చేసి సన్మానించారు. ఈ ప్రేమార్చనలో శ్రీ తంగిరాల రామమోహనరావు సేవాసమితి తరుఫున పాల్గొన్నారు.
ఏప్రిల్ 4, 2023 – నవనాగనాగేశ్వరాలయం కుంభాభిషేకం సందర్భంగా శ్రీరాచర్లరహి కుటుంబ సభ్యులు, బ్రహ్మాండం రవీంద్రరావు అన్నయ్య గారు, బెంగుళూరు జయేంద్రపురి మహాస్వామి వారు ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. తదుపరి హెూమశాలలో ఏకాదశ రుద్రాభిషేకం చేయడం జరిగింది. తర్వాత ఆలయం పైన కుంభాభిషేకం స్వామి వారితోపాటు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కుంభాభిషేకం అనంతరం జయేంద్రపురి స్వామి వారు అనుగ్రహభాషణం చేశారు.
సాయంత్రం జయేంద్రపురి స్వామి వారు ఓంకారనదిలో దిగి అద్భుతంగా నామసంకీర్తన చేశారు. నది నీళ్ళతో అందరినీ సంప్రోక్షణ చేశారు. తదుపరి జిల్లెళ్ళమూడిలోని ఆలయాలను, డిజిటల్ సెంటర్ని, గెస్ట్ హౌస్ని, SVJP ఆఫీసును సందర్శించి అందరినీ ఆశీర్వదించారు.
ఏప్రిల్ 8, 2023 ఈరోజు పాంచాహ్నిక గాయత్రీ హెూమాలు ప్రారంభం రోజున – మంటపారాధన, కలశస్థాపన యం.వి.ఆర్. సాయిబాబు, అనంతసీతాలక్ష్మి దంపతులు చేశారు. తర్వాత మూడు ఆవృతులతో గాయత్రీ హెూమం జరిగింది. ఈకార్యక్రమాన్ని ఆలయ వేదపండితుల సహాయం తో యం.వి.ఆర్. సాయిబాబు దంపతులు, మోత్కుమల్లి శారద, పలువురు పాల్గొన్నారు.
ఏప్రియల్ 9 2023 గాయత్రీ హెూమం రెండవరోజున వేదపండితుల సహకారంతో సోదరుడు వల్లూరు రమేష్, శ్రీదేవి రాజేశ్వరి, గుంటూరు మరి పలువురు హెూమకార్యక్రమాలలో 5 ఆవృతులతో గాయత్రీ హెూమం జరిగింది.
ఏప్రియల్ 10, 2023 – గాయత్రీ హెూమం మూడవరోజున శ్రీ సందీప్ శర్మ వేదపాఠశాల ప్రిన్సిపాల్ గారి ఆధ్వర్యంలో అమ్మ భక్తులు అనేకమంది 5 ఆవృతులతో హెూమం చేసుకున్నారు. ఏప్రిల్ 11, 2023 – గాయత్రీ హెూమం నాలుగవరోజున సందీప్ శర్మ గారు, వేదపాఠశాల విద్యార్థుల సహకారంతో 5 ఆవృతులతో హెూమం నిర్వహించారు.
ఏప్రిల్ 12, 2023 – గాయత్రీ హెూమం అయిదవ రోజున సోదరులు వల్లూరు రమేష్, వల్లూరు బసవరాజు, బోళ్ళ వరలక్ష్మి, రాజేశ్వరి, మోహన్ గార్లు తదితరులు 5 ఆవృతులతో హెూమం చేసుకున్నారు. ఈకార్యక్రమాన్ని ఆలయపురోహితులు నవీన్ శర్మ, వేదపాఠశాల ప్రిన్సిపాల్ సందీప్ శర్మ చేయించారు. పూర్ణాహుతి పంచాహ్నిక గాయత్రీ హెూమాలు పూర్తిఅయినాయి.