జనవరి 15 జిల్లెళ్ళమూడిలో మహాసౌరహోమం జరిగింది. సౌరం అరుణంతో హెూమశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి దాదాపు 30 మంది పాల్గొన్నారు. ఎక్కువ సంఖ్యలో భక్తులు ఈ హెూమకార్యక్రమాలకు రావడం విశేషం.
జనవరి 26 : యాగశాలలో మహాసరస్వతీ హెూమం వేదమంత్రాలతో అత్యద్భుతంగా జరిగింది. దీనిలో కూడా దాదాపు 27 మంది భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా కూచిపూడి, ఒరిస్సా మున్నగు శాస్త్రీయ నృత్య రీతుల్లో ప్రావీణ్యతను సాధించి MBA విద్యనభ్యసించి USA International School of Technology and science – HR గా పనిచేసి అనేక ప్రదర్శన లిచ్చి ‘నాట్యకౌముది’, ‘నృత్యాద్వితీయ’ ‘నృత్యప్రియ’ వంటి బిరుదులు పురస్కాలు పొందిన కుమారి వనగాల శ్రావణి జిల్లెళ్ళమూడిలో 6 గంటలకు నృత్యప్రదర్శన నిచ్చి అమ్మను అర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి బ్రహ్మాండం వసుంధర అక్కయ్య, మన్నవ సుబ్బలక్ష్మి, తదితరులు నృత్య కళాకారిణిని సన్మానించారు.
ఫిబ్రవరి 16 : జిల్లెళ్ళమూడి అమ్మ సేవాసమితి, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16 న జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీ విద్యార్థులకు వస్త్ర వితరణ (దుప్పట్లు డ్రెస్ లు) శ్రీ సోమయాజుల వెంకటేశ్వర్లు ఆర్థిక సహకారంతో అన్నపూర్ణాలయం వేదిక మీద పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవి అన్నయ్య, యం. దినకర్, గిరిధర్ కుమార్ మేనేజింగ్ ట్రస్టీస్ పాల్గొన్నారు.
ఫిబ్రవరి 17 ధాన్యాభిషేకం నాన్నగారి ఆరాధనోత్సవం సందర్భంగా ఉదయం నగరసంకీర్తన, తదుపరి మూలవిరాట్టుకు, అర్చనా మూర్తులకు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిగింది. తదుపరి హైమాలయం ప్రక్కన గల ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేసిన అమ్మ నాన్న ఉత్సవమూర్తులకు ధాన్యాభిషేకం, మూలవిరాట్టుకు బియ్యంతో అభిషేకాలు జరిగాయి. అంతకుముందు కీ.శే యార్లగడ్డ భాస్కరరావు గారి వ్రాసిన’ అమ్మ జీవితమహోదధి ‘తెలుగు ఆడియో బుక్ రిలీజ్ కార్యక్రమం శ్రీ నరేంద్ర వర్మ గారిచే నిర్వహించబడింది. ఈ ఆడియో బుక్ కు గాత్రం శ్రీమతి గంటి రేవతీరావు గారు కల్పించగా ముందుమాట ప్రొ. శివరామకృష్ణ గారు చెప్పారు. ఈ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో S.V.J.P Trust మేనేజింగ్ ట్రస్టీ శ్రీ గిరిధర్ కుమార్, ధర్మసూరి, ట్రస్టీ ప్రభృతులు పాల్గొన్నారు. ధాన్యాభిషేకానికి దాదాపు 2000 మంది వివిధ ప్రదేశాలనుండి తరలివచ్చి అమ్మ, నాన్నగార్లను ధాన్యం తోనూ, బియ్యం తోనూ అభిషేకించుకుని, ప్రసాదం స్వీకరించి ధన్యులయ్యారు.
ఫిబ్రవరి 25 – అమ్మ శతజయంతి మహోత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 25 శనివారం సాయంత్రం 6 గంటల నుండి వాత్సల్యాలయ ప్రాంగణంలో చి. వి. నిత్య సంతోషిణి మనస్విని నృత్యప్రదర్శన నిర్వహించబడింది. తెనాలి వాస్తవ్యులు శ్రీ వంకమామిడి లక్ష్మీనరసింహమూర్తి శ్రీమతి లలిత దంపతుల కుమార్తె అయిన వీరు శ్రీ జంధ్యాల వెంకట శ్రీరామచంద్రమూర్తి గారివద్ద కూచిపూడి నృత్యాన్ని అభ్యసించి వేలాది ప్రదర్శనలిచ్చి గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించి ‘ నాట్యమయూరి వంటి బిరుదులతో సత్కరింపబడ్డారు. చి. నిత్యసంతోషిని అత్యద్భుత ప్రదర్శన అనంతరం శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్స్ తరుఫున శ్రీ వి.యస్. ఆర్. మూర్తి గారు ‘మాతృశ్రీ కళాజ్యోత్స్న’ అనే బిరుదు ప్రదానంతో సత్కరించారు.
ఫిబ్రవరి 28 – జిల్లెళ్ళమూడి పుణ్యక్షేత్రంలో Airtel tower temporary గా ఏర్పాటు చేశారు. దీనిద్వారా జిల్లెళ్ళమూడి మొబైల్, ఆన్ లైన్ సేవలు సమర్ధనీయంగా ఉపయోగంలోకి వచ్చాయి.
మార్చి 2 – ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నందు జిల్లెళ్ళమూడిలో హైమాలయం ప్రక్కన గల ఖాళీ స్ధలంలో ఓం హైమ నమో హైమ శ్రీ హైమ జై హైమ ‘ అనే నామ అక్షరాలు ద్యోతకం అయ్యే విధంగా సహస్ర దీపాలంకరణ సోదరసోదరీమణులు, మరియు మాతృశ్రీ ప్రాచ్యకళాశాల విద్యార్థినులు నయనాందకరంగా ఏర్పాటు చేసి తమ భక్తి ప్రపత్తులను తెలియజేశారు.
మార్చి 9, 2023 – ఉదయం నగర సంకీర్తన తో పాటు గడగడపకూ గ్రామంలో పంపిణీ చేసి శతజయంతి కి ఆహ్వానం పలికే కార్యక్రమం జిల్లెళ్ళమూడి సోదరీమణులు మన్నవ సుబ్బలక్ష్మి తదితరులు చేపట్టారు. మార్చి 9 నుండి ఈ కార్యక్రమం 4 రోజులు గ్రామం అంతా తిరిగి నిర్వహించారు.
జిల్లెళ్ళమూడి T.T.D కళ్యాణమండపంలో అమ్మ శతజయంతి సందర్భంగా అమ్మ కుంకుమను ప్రసాదంగా ఇవ్వడానికి జిల్లెళ్ళమూడి సోదరీమణులు, కాలేజీ విద్యార్థినిలు కలిసి కుంకుమ పొట్లాల తయారీని %మీతీఎష్ట్ర% 5 నుండి 12 వరకు చేపట్టారు. కొన్ని వేల కుంకుమ పొట్లాలు తయారు చేశారు.
మార్చి 11, 2023 : శనివారం ఉదయీ 9.00 గంటలకు మాతృశ్రీ అనసూయా దేవి దివ్య సన్నిధిలో శ్రీమతి నిట్టల కిరణ్మయి గారి ఆధ్వర్యంలో సామూహిక సౌందర్యలహరి పారాయణం: వాత్సల్యాలయ ప్రాంగణంలో జరిగింది. దాదాపు 200 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత కిరణ్మయి గారిచే ‘ శ్రీమాతా తత్త్వం ‘పై ప్రవచనం, తదుపరి ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారిచే ‘ అమ్మ వైభవం ‘ గురించి సోదాహరణ ప్రవచనం అత్యంత అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్వాధ్యాయ సత్సంగం వారు హైదరాబాద్ నుండి వచ్చి పాల్గొన్నారు.
12 మార్చి 2023 శ్రీ చక్కా శ్రీమన్నారాయణ గారి బంధువులు, స్నేహితుల ఆర్థిక సహకారంతో నిర్మించిన సమాచారకేంద్రం ప్రారంభోత్సవం సాయంత్రం 6 గంటలకు అందరింటి సోదరసోదరీమణుల సమక్షంలో జరిగింది. చీఫ్ పాట్రన్ బ్రహ్మాండం రవీంద్రరావు, బ్రహ్మాండం వసుంధర అక్కయ్య, శ్రీ విశ్వజననీ పరిషత్ ఉభయట్రస్టుల మేనేజింగ్ ట్రస్టీలు, ప్రభుత్వ అధికారి రాఘవరావు గారు, కాలేజీ విద్యార్థినీ విద్యార్థులు తదితరులు ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
12 మార్చి ఉదయం అనసూయేశ్వరాలయంలో పాట్రన్ బ్రహ్మాండం రవీంద్రరావు, మేనేజింగ్ ట్రస్టీ గిరిధర్ కుమార్ అమ్మ శతజయంతి పోస్టర్ విడుదల చేసి వివిధప్రాంతాలకు పంపించారు.
వేద విద్యార్థులకు ప్రోత్సాహకాలు
వేదపాఠశాల విద్యార్థులకు ప్రోత్సాహకాలు (Stipend) నెలకు రూ.2000/- ఇవ్వడానికి కీ.శే. వారణాసి సుబ్బరాయశాస్త్రి గారి కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఇదివరలో నారాయణ శర్మ గారు, వేదసన్మాన ఫౌండేషన్ వారు రూ.6000/ పంపించారు. మొత్తం రూ.8,000/- ఉగాది రోజున వేదవిద్యార్థులకు (ఒక్కొక్కరికి రూ. 2000/-) అందజేయడం జరుగుతుంది. వేదసన్మానసభ ఫౌండేషన్ వారికి, వారణాసి సుబ్బరాయ శాస్త్రి గారి కుటుంబ సభ్యులకు విశ్వజననీ పరిషత్ టెంపుల్స్ ట్రస్టు తరుఫున కృతజ్ఞతాభివందనములు తెలియజేస్తున్నాము. జయహో మాతా
మాఘపౌర్ణమి-మంత్రోపదేశస్మారక స్తూపం
మాఘపౌర్ణమి నాడు ‘అమ్మ’ 800 మందికి మంత్రోపదేశంచేసిన చారిత్రాత్మక స్థలంలో స్మారక స్థూప నిర్మాణానికి శంకుస్థాపన 5 ఫిబ్రవరి 2023 న ఓంకారనది రెండవ వరవ దగ్గర జరిగింది. శ్రీమతి బ్రహ్మాండం వసుంధర అక్కయ్య, శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు అన్నయ్య శంకుస్థాపన చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంకా విశ్వజననీ పరిషత్ ఉభయట్రస్టుల మేనేజింగ్ ట్రస్టీస్ శ్రీ యం. దినకర్ అన్నయ్య గారు, గిరిధర్ కుమార్, SVJP టెంపుల్స్ ట్రస్ట్ ట్రెజరర్ యం.వి.ఆర్. సాయిబాబు, ట్రస్టీస్ నరసింహారావు మామయ్య గారు, వల్లూరు రమేష్, చక్కా శ్రీమన్నారాయణ గారు ఇంకా జొన్నాభట్ల సుబ్రహ్మణ్యం, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీ స్టాఫ్ మరియు విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి పద్మావతి అక్కయ్య గారు, కాలేజీ విద్యార్థులు, ఇతరులు నామసంకీర్తనతో అమ్మను కీర్తించగా శ్రీ నవీనశర్మ శంకుస్థాపన, పూజ నిర్వహించారు. ఈ స్థలాన్ని శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్స్ ఉపయోగించుకునేందుకు ఇచ్చిన ప్రభుత్వము వారికి సంస్థ కృతజ్ఞతలు తెలియజేసింది.
ఫిబ్రవరి 18 శనివారం : మహాశివరాత్రి సందర్భంగా అనసూయేశ్వరాలయంలో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, హైమాలయం, నవనాగనాగేశ్వరాలయంలో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఋత్విక్కుల మంత్రోచ్ఛారణతో జరిగినాయి. నవనాగనాగేశ్వరాలయం లో కీ.శే. రాచర్ల లక్ష్మీనారాయణగారి కుటుంబసభ్యులు, ఇతరులు అభిషేకంలో పాల్గొన్నారు. తదుపరి హెూమశాలలో 30 మందికి పైగా మహారుద్రహోమంలో పాల్గొన్నారు. అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో రుద్రాభిషేకం, దర్శనం అన్ని ఆలయాలలో జరిగాయి. ఈ కార్యక్రమంలో అనేకమంది భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.