28-01-2022: బహళ ఏకాదశి శ్రీఅనసూయేశ్వరాలయములో శ్రీఅనసూయావ్రతము, అమ్మవారు ఏకాహము జరిగినవి.
05-02-2022: శ్రీపంచమి నందర్భముగ హెూమశాలలో శ్రీసరస్వతీ హెూమము జరిగినది. శ్రీపంచమి సందర్భముగ శ్రీమునిపల్లి మహర్షి శ్రీమతి అనసూయాదీప్తి దంపతులు వారి కుమార్తె చి| మిహిర అక్షరాభ్యాసము శ్రీ అననూయేశ్వరాలయములో జరుపుకున్నారు. అందరికీ అన్నప్రసాద వితరణ గావించారు.
శ్రీ దినవహి విజయసారధి శ్రీమతి హైద దంపతులు వారి కుమారుడు చి|| శ్రీకర్ అక్షరాభ్యాసము అమెరికాలో జరుపుకున్నారు. అందరికీ అన్నప్రసాద వితరణ గావించారు.
07-02-2022: రధనప్తమి సందర్భము హెూమశాలలో సౌర హెూమము జరిగినది. సోదరీ సోదరులు కార్యక్రమములో పాల్గొన్నారు.
08-02-2022: హెూమశాలలో రధసప్తమి సందర్భముగ సౌరహోమము జరిగింది. కార్యక్రమములో సోదరీ సోదరులు పాల్గొన్నారు. శ్రీమతి బోళ్ళ వరలక్షిగారు హెూముము చేసుకొని వారి భర్త ॥శే॥బోళ్ళ గోపాలకృష్ణమూర్తి గారి జ్ఞాపకార్ధము అందరికీ అన్నప్రసాద వితరణ గావించారు.
09-02-2022: శ్రీమతి బోళ్ళ వరలక్ష్మి గారు అమ్మకూ నాన్నగారికీ శ్రీ హైమవతీ దేవికి నూతన వస్త్రములు సమర్పించి, శ్రీ అనసూయావ్రతము శ్రీ హైమవతీ వ్రతము జరుపుకొని అందరికీ తీర్థ ప్రసాదముల నిచ్చారు.
12-02-2022 : శుద్ధ ఏకాదశి శ్రీఅననూయేశ్వ రాలయములో సోదరీ సోదరులు శ్రీఅనసూయా వ్రతము చేసుకున్నారు. ఏకాహము జరిగినది. రాత్రి అమ్మవాము గం.కు వాత్సల్యా యములో అమ్మనామ సంకీర్తన, మహాహారతి జరిగినవి..
16-02-2022: పూర్ణిమ – శ్రీ హైమనామ ఏకాహము జరిగినది.
ఆశ్లేషానక్షత్రము అమ్మనము ఏకాహము జరిగినది.
17-02-2022: నాన్నగారి ఆరాధనోత్సవము – ధాన్యాభిషేకము శ్రీవిశ్వజననీ పరిషత్ వారి నిర్వహణలో వైభవంగా జరిగింది. ఉదయం శ్రీఅనసూయేశ్వరాలయములో 11 మంది ఋత్విక్కులు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము నిర్వహించారు. ఉదయం 10 గం.కు శ్రీమతి. బ్రహ్మాండం వసుంధర అక్కయ్యగారి ఇంటి నుండి అందమైన పుష్పాలంకృతమైన పల్లకిలో అమ్మవారు సంకీర్తనతో మంగళవాద్యములతో అమ్మ, నాన్నగారల ఉత్సవ మూర్తుల ఊరేగింపు కార్యక్రమము జరిగినది. అనంతరం శ్రీ అన్నపూర్ణాలయ వేదికపై ధాన్యాభిషేక కార్యక్రమము జరిగినది. వేదికపై పై కొలువైయున్న ‘అమ్మ, నాన్నగారల’ దివ్యపాదపద్మములకు వేదపఠనముతో అమ్మనామ సంకీర్తనతో మంగళవాద్యములతో పూజాకార్య క్రమములతో ధాన్యాభిషేకము ప్రారంభమయినది. శ్రీవిశ్వజననీపరిషత్ కార్య నిర్వహణాధికారులు కార్యక్రమమునకు వచ్చిన వందలాది సోదరీసోదరులు అందరూ అమ్మ, నాన్నగారల దివ్యచరణములకు ధాన్యాభిషేకము చేసుకున్నారు. నాన్నగారి ఆరాధనోత్సవముల సందర్భముగ కొంతమంది వదాన్యులైన సోదరీసోదరులు ప్రతిభ కనపరిచిన విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులు అందచేశారు. అన్నపూర్ణాలయ వేదికవద్ద జరిగిన ఈ కార్యక్రమములో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ ఆర్.వరప్రసాద్ గారు, అధ్యాపకులు పాల్గొన్నారు.
శ్రీఅనసూయేశ్వరాలయములో “అమ్మ, నాన్నగారికి” నాన్నగారల’ శ్రీచరణములకు బియ్యముతో అభిషేక కార్యక్రమము జరిగినది.
శ్రీబ్రహ్మాండం రవీంద్రరావు గారు, శ్రీమతి వైదేహి దంపతులు కార్యక్రమము ప్రారంభము చేశారు. సోదరీసోదరులు అభిషేక కార్యక్రమములో పాల్గొన్నారు. అభిషేక కార్యక్రమాలనంతరము అన్నప్రసాద వితరణ జరిగింది.
శ్రీఅనసూయేశ్వరాలయములో, శ్రీ వి.యస్. ఆర్. మూర్తి గారు రచించిన “అం ఆ. తత్త్వదర్శనము” గ్రంథమును శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారు ఆవిష్కరించారు. కార్యక్రమములో శ్రీరామబ్రహ్మంగారు, శ్రీ యమ్. దినకర్ గారు తదితర సోదరీసోదరులు పాల్గొన్నారు.
నాన్నగారి ఆరాధనోత్సవ సందర్భంగా శ్రీనవనాగేశ్వరాలయములో సోదరీసోదరులు నాన్నగారి నామసంకీర్తన నిర్వహించారు.
19-2-2022 : హైదరాబాదు వాస్తవ్యులు శ్రీ పొత్తూరి రహి ప్రకాష్ – శ్రీమతి సూర్య లక్ష్మిదంపతులు తమ 25వ వివాహ వార్షికోత్సవ సందర్భముగ నేడు జిల్లెళ్ళమూడి వచ్చి “అమ్మకు శ్రీ హైమవతీదేవికి పూజలు గావించారు. అందరికీ అన్నప్రసాదవితరణ గావించారు.
20-2-2022 : హెూమశాలలో సంకష్టహర గణపతి హెూమము జరిగినది. హెూమములో సోదరీ సోదరులు పాల్గొన్నారు.
22-2-2022 : బహుళషష్ఠి శ్రీ హైమవతీ వ్రతము, “అమ్మ” నామ ఏకాహము జరిగినవి.***