1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అర్కపురి విశేషాలు

అర్కపురి విశేషాలు

Kumari Visali
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : February
Issue Number : 7
Year : 2022

24-12-2021 నుండి 26-12-2021 వరకూ జిల్లెళ్ళమూడి హోమశాలలో శ్రీ విశ్వజననీపరిషత్ – టెంపుల్ ట్రస్ట్ మరియు శ్రీ విశ్వజననీపరిషత్ వారి సంయుక్త ఆధ్వర్యములో “144” ఆవృతులతో మహా సౌరహోమ కార్యక్రమము జరిగినది.

24-12-2021 ఉదయము శ్రీ గణపతి పూజ, పుణ్యాహవాచనము, మంటపారాధన, కలశస్థాపన, షట్పాత్రము, మహాసౌరహోమము, అరుణహోమము, పూర్ణాహుతి, సూర్యనమస్కారములు నిర్వహించారు.

25-12-2021 ఆవాహిత దేవతలకు పూజ, షట్పాత్రము, మహాసౌరహోమము, అరుణహోమము, సూర్యనమస్కారములు నిర్వహించారు.

26-12-2021 ఆవాహిత దేవతలకు పూజ, షత్రం, మహాసౌరహోమము, సూర్యనమస్కారములు, పూర్ణాహుతి, కార్యక్రమాలతో, మహాసౌరహోమ కార్యక్రమములు విజయవంతంగా పూర్తి అయినవి. శ్రీ వారణాసి ధర్మసూరి గారు, స్థానికులు, ఇతర ప్రాంతముల నుండి వచ్చిన సోదరీసోదరులు పాల్గొన్నారు. హోమ కార్యక్రమములు నిర్వహించిన శ్రీ చుండి నవీన్ శర్మ గారు, శ్రీ మురికిపూడి సందీప్ శర్మ గారు, ఋత్విక్కులు శ్రీ లక్ష్మీగణపతి సోమయాజులుగారు తదితరులను శ్రీ విశ్వజననీ పరిషత్ వారితరఫున, శ్రీ ధర్మసూరి గారు నూతన వస్త్రములు దక్షిణలతో సత్కరించారు.

25-12-2021 బహుళ షష్ఠి శ్రీ = హైమవతీ వ్రతము, ‘అమ్మ’నామ ఏకాహము జరిగినవి. 

26-12-2021 జిల్లెళ్ళమూడి మాతృశ్రీ మెడికల్ సెంటర్ డాక్టర్ శ్రీమతి ఇనజకుమారి గారు హాస్టల్ విద్యార్థినులకు స్వెటర్లు బహూకరించారు.

23-12-2021 నుండి 26-12-2021 వరకూ నాన్నగారు శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావు గారి ఆరాధనోత్సవ సందర్భముగ 28-12-2021 నుండి 26-12-2021 వరకూ జిలెళ్ళమూడి ప్రాచ్య కళాశాల విద్యార్ధినీ విద్యార్ధులకు ఆటలపోటీలు జరిగినాయి.

బాలురకు నిర్వహించిన పోటీలు : క్రికెట్, వాలీబాల్, షటిల్, షాట్పుట్, డిస్క్ త్రో, రన్నింగ్ (100 – 200 మీ) క్యారమ్స్, చెస్.

ఈ పోటీలు శ్రీ లాలన్నయ్య కళాశాల ప్రిన్స్వల్ శ్రీ యస్.వరప్రసాద్ గారు, శ్రీ మురళీ మాస్టారు గార్ల ఆధ్వర్యములో జరిగినాయి.

బాలికలకు నిర్వహించిన పోటీలు: రన్నింగ్, చెస్, షాట్పుట్, క్యారమ్స్, స్కిప్పింగ్, మ్యూజికల్ చైర్స్, టెన్నికాయిట్స్, త్రో బాల్, షటిల్. బాలికల హాస్టల్ వార్డెన్ శ్రీమతి నంబూరి నాగమణి గారి ఆధ్వర్యములో పోటీలు జరిగినాయి.

30-12-2021 బహుళ ఏకాదశి, శ్రీ అనసూయావ్రతము. ‘అమ్మ’నామ ఏకాహము జరిగినవి. జిల్లెళ్ళమూడి వాస్తవ్యులు శ్రీ చక్కా శ్రీమన్నారాయణ దంపతులు శ్రీ అనసూయేశ్వరగుప్త దంపతులు శ్రీ అనసూయావ్రతము చేసుకున్నారు.

31-12-2021 2022 నూతన ఆంగ్ల సంవత్సర ఆగమన సందర్భముగ, మాతృశ్రీ ప్రాచ్యకళాశాల విద్యార్థినీ విద్యార్థులు 31-12-2021 సాయంత్రం 6గం|| నుండి 1-1-2022 సాయంత్రం 6 గం॥ వరకూ ‘అమ్మ’నామ ఏకాహము చేశారు. రాత్రి 11 గం.కు శ్రీ అనసూయేశ్వరాలయములో సోదరీ సోదరులు అమ్మనామ సంకీర్తన గావించారు. రాత్రి 12 గం॥కు శ్రీ అనమాయేశ్వరాలయములో శ్రీ హైమాలయములో సోదరీ సోదరులు శ్రీ యమ్.వి.ఆర్.సాయిబాబు గారు శ్రీమతి అనంత సీతాలక్ష్మి దంపతులు, శ్రీ బుద్ధిమంతుడు అన్నయ్య దంపతులు పూజా కార్యక్రమములు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేశారు.

అమ్మ సన్నిధిలో 2022 సంవత్సరము అమ్మ వర్ణ చిత్రమున్న నూతనసంవత్సర క్యాలండర్ల ఆవిష్కరణ జరిగింది. సోదరీ సోదరులు పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

01-01-2022 శ్రీ అన్నపూర్ణాలయ వేదికవద్ద అమ్మ ప్రసాదముగ టీ, రస్కులు ఇచ్చారు. నూతన సంవత్సర క్యాలెండర్లను సోదరీసోదరులందరికీ ఇచ్చారు. కార్యక్రమములలో సోదరీసోదరులు ఆనందోత్సాహములతో పాల్గొన్నారు.

01-01-2022 నూతనసంవత్సరారంభ సందర్భముగ శ్రీ అనసూయేశ్వరాలయము, శ్రీ హైమాలయము, శ్రీనవనాగేశ్వరాలయము, శ్రీ వరసిద్ధి వినాయకాలయములను అధికసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.

05-01-2022 శ్రీమతి బ్రహ్మాండం వసుంధర అక్కయ్యగారి నిర్వహణలో సాయంత్రం 6 గం.కు శ్రీ అన్నపూర్ణాలయ వేదికవద్ద సందెగొబ్బెమ్మ పేరంటము జరిగింది. శ్రీమతి నండూరి నాగమణిగారు, విద్యార్థినులు అమ్మ చిత్రపటమునకు, గొబ్బెలకు పూజచేసి పేరంటము ప్రారంభించారు. విద్యార్ధినులు ఉత్సాహంగా కోలాట నృత్యం ప్రదర్శించారు. వేద విద్యార్థి చి||శ్రీనివాస్ హరిదాసై వచ్చాడు. శ్రీమతి శైలజ, కుమారి యమ్.వి. సుబ్బలక్ష్మి, కుమారి మనీషా వచ్చి పాటలు శ్రవణా నందకరంగా పాడారు. కార్యక్రమానంతరం వచ్చిన వారందరికీ పండ్లు, తాంబూలములు ఇచ్చారు.

హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ లక్కరాజు హరిప్రసాద్ శ్రీమతి విజయ దంపతులు తమ కుమారుడు శ్రీ లక్కరాజు

ఆదిత్యతేజస్వీ కోడలు శ్రీమతి శ్రీ సౌమ్య మనుమడు చి॥ కృతిన్ తో జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను దర్శించుకొని పూజలుగావించి అందరికీ అన్నప్రసాద వితరణ  గావించారు.

09-01-2022 శ్రీవాత్సల్యాలయ సభా మందిరమునందు శ్రీ విశ్వజననీ పరిషత్వారి సహకారముతో శ్రీమతి బ్రహ్మాండం వసుంధర అక్కయ్య గారికి శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ ఛారిటబుల్ ట్రస్ట్ తరపున అత్యంత వైభవంగా స్వర్ణాభిషేకము  గావించారు. 

12-01-2022: రాత్రి 9 గం. కు వాత్సల్యాలయములో ‘అమ్మ’నామ సంకీర్తన, మహాహారతి జరిగినవి. పాల్గొన్నారు.

13-01-2022 శుద్ధ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి సందర్భముగ వేకువనే ఉత్తరద్వార దర్శనము, ఆలయములలో పూజాకార్యక్రమములు జరిగినవి. శ్రీ విష్ణుసహస్రనామపారాయణ, నామ సంకీర్తన, తిరుప్పావై పఠనములు జరిగినవి. శ్రీ అనసూయేశ్వరాలయములో స్థానికులు, ఇతరప్రాంతములనుండి వచ్చిన సోదరీ సోదరులు అనసూయావ్రతము జరుపుకున్నారు. పూజాకార్యక్రమములలో అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అమ్మనామ ఏకాహము జరిగినది.

13-01-2022 ధనుర్మాసము ముగిసింది. ధనుర్మాసమంతా వేకువనే భగవన్నామ సంకీర్తన పూజాకార్యక్రమములకు సోదరీసోదరులు భక్తిశ్రద్ధలతో వచ్చి పాల్గొన్నారు. ధనుర్మాసమంతా నామసంకీర్తన నిర్వహించిన శ్రీ పిల్లలమర్రి సుబ్రహ్మణ్యందంపతులకు తిరుప్పావై పఠనము గావించిన కుమారి యమ్.వి. సుబ్బలక్ష్మి గారికి అమ్మ ఆశీర్వచనపూర్వకముగ విశ్వజననీపరిషత్ వారు నూతన వస్త్ర బహూకరణ గావించారు. భోగిపండుగ సందర్భముగ సాయంత్రం 6 గం.కు శ్రీ అనసూయేశ్వరాలయములో శ్రీహైమాలయ ప్రాంగణములో భోగిమంట వేడుక జరిగింది. శ్రీ విన్నకోట దేవిచరణ్ శ్రీమతి నాగస్వీటీ శ్రీ అనసూయేశ్వరా లయములో పూజా కార్యక్రమములు ప్రారంభించారు. సోదరీ సోదరులందరూ ‘అమ్మ నాన్నగారు’ శ్రీ హైమవతీదేవి శ్రీచరణములను భోగిపండ్లు పుష్పములతో అర్చించుకున్నారు.

ఆలయ అర్చకులు ఆశీర్వచన పూర్వకముగ భోగిపండ్లు పోశారు. పిల్లల పెద్దల సందడితో  బోగి సరదాగా సందడిగా జరిగింది.

14-01-2022 మకరసంక్రాంతి సందర్భముగ హోమశాలలో సౌరహోమము జరిగినది.

15-01-2022 మతృశ్రీ గోశాల 5వ వార్షికోత్సవము సందర్భముగ శ్రీ చక్కా శ్రీమన్నారాయణ గారి నిర్వహణలో గోశాలలో గోపూజా, శ్రీదుర్గాహోమ కార్యక్రమములు జరిగినవి. శ్రీ చుండి నవీన్ శర్మగారు నిర్వహించారు. సోదరీసోదరులందరూ కార్యక్రమములో పాల్గొన్నారు. అనంతరము తీర్థప్రసాద వితరణ జరిగినది. 

17-01-2022 పౌర్ణమి – శ్రీ హైమనామ ఏకాహము జరిగినది. 

21-01-2022 హోమశాలలో సంకష్టహర పండుగ గణేశహోమము జరిగినది.

23-01-2022 బహుళ షష్ఠి – శ్రీ హైమవతీ వ్రతము ‘అమ్మ’నామ ఏకాహము జరిగినవి.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!