13-11-21: ప్రముఖ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మిగారు 13-11-2021 సాయంత్రం వాత్సల్యాలయ సభామందిరములో హాస్యరస ప్రధానంగా ప్రసంగం చేశారు. అది అందరినీ అలరించింది. ఆ సందర్భంగా శ్రీ కామరాజు గారు మాట్లాడుతూ అమ్మ ఆలయ ప్రవేశానంతరము కూడా “అమ్మ”ను ప్రత్యక్షంగా దర్శించుకున్న ధన్యజీవి శ్రీమతి విజయలక్ష్మిగారని. తెలిపారు. శ్రీమతి విజయలక్ష్మి గారు విద్యార్థినీ విద్యార్థులకు తమ ఆశీస్సులందజేస్తూ విద్యతో పాటు సంఘ సేవా కార్యక్రమాలలో పాల్గోవాలని “అమ్మ దివ్యసన్నిధిలో విద్యనభ్యసిస్తున్న పిల్లలందరూ ఉన్నత విద్యావంతులై మంచి పేరు తెచ్చుకోవాలని కోరు కుంటున్నానని తెలియజేశారు.
25-11-21: బహుళషష్ఠి – శ్రీ హైమవతీదేవి 79వ జయంతి ఉత్సవములు శ్రీ విశ్వజననీపరిషత్ వారి నిర్వహణలో వైభవంగా జరిగినాయి. ఉదయం 7 గంటలకు అన్నపూర్ణాలయ వేదిక పై పరిషత్ కార్యనిర్వహణాధికారులు శ్రీ డి.వి.యన్. కామరాజుగారు, శ్రీ వల్లూరి రమేష్ బాబు గారు శ్రీ ఐ. రామకృష్ణగారు. తదితరులు “అమ్మ” చిత్రపటమునకు పూజలు గావించి, శ్రీ లలిత కోటి నామపారాయణ కార్యక్రమము ప్రారంభించారు. కార్యక్రమములో ఆవరణలోని వారు, మాతృశ్రీ పాచ్యకళాశాల, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్ధినీ విద్యార్థులు, స్థానికులు, ఇతర ప్రాంతముల నుండి వచ్చిన సోదరీ సోదరులు పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకు మొదలై సాయంత్రం 6 గం.30 ని. లకు కోటి, అరవై రెండు లక్షల తొంభై వేలు పారాయణ జరిగినది. శ్రీ హైమవతీ దేవి జయంతి సందర్భంగా హైదరాబాద్ వాస్తవ్యులు సోదరులు శ్రీ పొత్తూరి ప్రేమగోపాల్ గారు 2022 నూతన సంవత్సర శ్రీ హైమవతీదేవి క్యాలండర్లను సమర్పించారు. ఉదయం 11 గంటలకు శ్రీ బ్రహ్మాండం రవి అన్నయ్యగారు, శ్రీ ప్రేమ గోపాల్ పరిషత్ కార్యనిర్వహణాధికారులు శ్రీ అనసూయేశ్వరాలయంలో, శ్రీ హైమాలయములో క్యాలండర్లను ఆవిష్కరించారు. కోటి నామార్చనలో పాల్గొన్న వారికి, సందర్శకులకు క్యాలండర్లు ఇచ్చారు.
25-11-21: శ్రీ హైమవతీదేవి జయంతి సందర్భంగా 7-10-2021 నుండి 24-11-2021 వరకు జరిగిన “అమ్మ” నామ సప్తసప్తాహములలో పాల్గొని అమ్మ నామ సంకీరన గావించిన సోదరీ సోదరులకు హైదరాబాద్ వాస్తవ్యులు సోదరులు శ్రీ వారణాసి ధర్మసూరి గారు, శ్రీమతి భగవతి దంపతులు “అమ్మ” ఆశీర్వచన పూర్వకముగా నూతన వస్త్ర బహూకరణగావించారు.
శ్రీ వాత్సల్యాలయ సభామందిరములో కీ.శే. కొండముది రామకృష్ణ అన్నయ్యగారు రచించిన “అమ్మ” పాటలను వారి కుమారుడు శ్రీ కొండముది రవిబాబు గానం చేసిన సి.డి.ల ఆవిష్కరణ కార్యక్రమములో పరిషత్ పెద్దలు, సోదరీ సోదరులు పాల్గొని, శ్రీ రవిబాబుగారిని అభినందించారు.
శ్రీ హైమవతీదేవి జయంతి సందర్భంగా శ్రీ హైమాలయ వంటశాలలో ఎంతో శుచిగా పవిత్రముగా చేసిన 79 రకముల పిండివంటలను శ్రీ హైమవతీదేవికి నివేదన ఇచ్చారు. హైదరాబాద్ వాస్తవ్యులు సోదరులు, శ్రీ వఝ ప్రసాదరావుగారి కుటుంబసభ్యులు 79 రకములు పిండివంటలు నేతితో చేయించి జిల్లెళ్ళమూడి తీసుకొని వచ్చి శ్రీ హైమవతీదేవికి నివేదన చేశారు. జిల్లెళ్ళమూడి కళాశాల విద్యార్థినులకు, ఇంకా కొందరు కన్యలకు శ్రీ హైమవతీదేవి ప్రసాదముగ నూతన వస్త్ర బహూకరణగావించారు. పూజా ప్రదక్షిణల అనంతరం అందరికీ తీర్థప్రసాద వినియోగం జరిగింది.
26-11-21: ఆశ్లేషా నక్షత్రము “అమ్మ”నామ ఏకాహము జరిగినది.
27-11-21: శ్రీ హైమవతీదేవి నిర్మాల్య నిమజ్జనోత్సవము జరిగినది. సోదరీ సోదరులు విద్యార్థినులు కార్యక్రమములో పాల్గొన్నారు.
30-11-21: ఏకాదశి శ్రీ అనసూయావ్రతము “అమ్మ” నామ ఏకాహము జరిగినది. 1-12-21: కార్తీకమాన సందర్భముగ శ్రీ విశ్వజననీపరిషత్ వారు వనభోజనములు ఏర్పాటు చేశారు. శ్రీ అనసూయేశ్వరాలయ ప్రాంగణములో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమములో సోదరీ సోదరులు పాల్గొన్నారు.
6-12-21: గుంటూరు వాస్తవ్యులు శ్రీ ఆంగిరేకుల రత్నకుమార్ శ్రీమతి సాయిసౌజన్య దంపతులు వారి కుమారుడు చి. శ్యామ్ ప్రఖ్యాత్ అన్నప్రాశన కార్యక్రమములను శ్రీ అనసూయేశ్వరా లయములో జరుపుకొని అందరికీ అన్నప్రసాద వితరణ గావించారు.
9-12-21: శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భముగ శ్రీ నవనాగేశ్వరాలయములో శ్రీ నాగేశ్వరస్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, రుద్రత్రిశతి అర్చనాకార్యక్రమములు జరిగినవి.
12-12-21: రాత్రి 9 గంటలకు వాత్సల్యా లయములో “అమ్మ” నామ సంకీర్తన మహాహారతి జరిగినవి.
14-12-21: శుద్ధ ఏకాదశి, శ్రీ అనసూయా వ్రతము- “అమ్మ” నామ ఏకాహము జరిగినవి.
16-12-21: ధనుర్మాసము ప్రారంభమయినది. వేకువనే ఆలయములలో పూజాకార్యక్రమములు జరుగుచున్నవి. శ్రీ అనసూయేశ్వరాలయములో శ్రీమతి. పి. పద్మావతి, శ్రీ సుబ్రహ్మణ్యం దంపతులు నామసంకీర్తన నిర్వహణ – కుమారి ఎమ్.వి. సుబ్బలక్ష్మి తిరుప్పావై పఠనము గావిస్తున్నారు. అందరింటి సోదరీ సోదరులు స్థానికులు కార్యక్రమములో పాల్గొంటున్నారు. అనంతరం తీర్థ ప్రసాద వినియోగములు జరుగుచున్నది. విద్యార్థినులు ఆవరణ అంతారంగుల రంగులతో ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెట్టారు.
18-12-21: రాత్రిగల పూర్ణిమ – శ్రీ హైమనామ ఏకాహము జరిగినది.
22-12-21: బహుళచవితి – హోమశాలలో శ్రీ సంకష్టహర గణేశహోమము జరిగినది.
23-12-21: ఆశ్లేషా నక్షత్రము – “అమ్మ” నామ ఏకాహము జరిగినది.