- 2. 2021: హైదరాబాదు వాస్తవ్యులు శ్రీ V.S.R. ప్రసాదరావుగారు శ్రీమతి అరుణశ్రీ దంపతులు తమ 54 వ వివాహ వార్షికోత్సవము – శ్రీ అనసూయేశ్వ రాలయములో జరుపుకొని ‘అమ్మకు, నాన్నగారికి ‘ శ్రీ హైమవతీదేవికి పూజలు గావించి అందరికీ అన్నప్రసాద వితరణ గావించారు.
26.2.2021: ఆశ్లేషానక్షత్రము ‘అమ్మ’నామ ఏకాహము జరిగినది…
26.2.2021: రాత్రిగల పూర్ణిమ – శ్రీ హైమనామ ఏకాహము జరిగినది.
- 3. 20 బహుళచవితి హోమశాలలో సంకష్ట హరగణపతి హోమము జరిగినది.
- 3. 2021: బహుళ షష్ఠి శ్రీ హైమవతీవ్రతము, అమ్మనామ ఏకాహము జరిగినది.
05.3.2021: హైదరాబాదు వాస్తవ్యులు శ్రీ M.V.R సాయిబాబుగారు శ్రీమతి అనంతసీతాలక్ష్మి దంపతులు తమ 45వ వివాహవార్షికోత్సవం శ్రీ అనసూయేశ్వరాలయములో జరువుకాని అమ్మకు, నాన్నగారికి, శ్రీ హైమవతీదేవికి పూజలుగావించి అందరికీ అన్నప్రసాద వితరణ గావించారు.
06.3.2021: అమెరికా వాస్తవ్యులు శ్రీ M. సత్యనారాయణగారు శ్రీమతి శ్రీలక్ష్మి దంపతుల పిల్లలు హైదరాబాదు వాస్తవ్యులు శ్రీ B. వెంకట్రామశాస్త్రి, శ్రీ మతి ఉమ దంపతుల మనుమడు, మనుమరాలు చి|| నాగ వెంకట్, చి|॥శ్రీ పూర్ణిమ విద్యాభివృద్ధికొరకు ‘అమ్మకునాన్నగారికి’ శ్రీ హైమవతీదేవికి పూజలు జరిపించి అందరికీ అన్నప్రసాద వితరణగావించారు.
08.3.2021: జిల్లెళ్ళమూడి వాస్తవ్యులు శ్రీ మన్నవ లక్ష్మీనరసింహారావుగారు, శ్రీమతి శేషు దంపతులు, శ్రీ హైమాలయములో శ్రీ హైమవతీదేవికి పనుపు, కుంకుమలతో బియ్యముతో పూజాకార్యక్రమములు జరువుకున్నారు. అందరికీ అన్నప్రసాద వితరణ గావించారు.
- 3. 2021: బహుళఏకాదశి శ్రీ అనసూయా వ్రతము, అమ్మనామ ఏకాహము జరిగినవి.
10.3.2021: డా॥ శ్రీమతి ఇనజకుమారిగారు. (పాపక్కయ్యగారు) అమ్మతనను అర్ధాంగిగా స్వీకరించిన శుభవివాహ వార్షికోత్సవము సందర్భముగ శ్రీవారి చరణనన్నిధిలో అర్చన చేశారు. శ్రీవిశ్వజననీ పరిషత్ వారు వేదాశీర్వచనముతో ‘అమ్మ’ ప్రసాదముగ నూతన వస్త్రాల్ని అందించారు.
11.3.2021: మహాశివరాత్రి సందర్భముగ ఉదయము హోమశాలలో ఏకాదశ రుద్రహోమము శ్రీలక్ష్మీగణపతిహోమము, శ్రీసుబ్రహ్మణ్య హోమము మహాసుదర్శన హోమము, శ్రీ దుర్గామాూక్తము, శ్రీ సూక్తహోమ కార్యక్రమములు జరిగినవి. శ్రీరాచర్ల రహి కుటుంబసభ్యులు శ్రీ వారణాసి ధర్మసూరి కుటుంబ సభ్యులు, తదితర సోదరీసోదరులు పాల్గొన్నారు. రాత్రి లింగోద్భవకాలములో శ్రీ అనసూయేశ్వరాలయములో శ్రీ హైమాలయములో శ్రీ నవనాగేశ్వరాలయములో 11 మంది ఋత్విక్కులచే మహన్యాసపూర్వక మహా రుద్రాభిషేకము, శ్రీవరసిద్ధివినాయకుని ఆలయములో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు జరిగినవి.
అభిషేకములు, పూజాకార్యక్రమములలో శ్రీ రవీంద్రరావుగారు శ్రీమతి వైదేహి దంపతులు శ్రీమతి బ్రహ్మాండం శేషు అక్కయ్య, శ్రీమతి వసుంధర అక్కయ్య శ్రీ విశ్వజననీ పరిషత్ కార్య నిర్వహణాధికారులు పాల్గొన్నారు. ‘అమ్మ’నామ ఏకాహము, మాతృశ్రీ పాదుకాలయములో “నాన్నగారి’ నామ ఏకాహము జరిగినవి.
12.3.2021: జాండ్రపేట విద్యానగర్ “శ్రీబాలచౌడేశ్వరి సీతారామ” మహిళామండలి భక్తసమాజము వారు, శ్రీకటికహనుమయ్యగారు, శ్రీ K.S.S. ప్రసాదరావు మాస్టారుగారి నిర్వహణలో శ్రీఅనసూయేశ్వరాలయములో “అమ్మనామ” సంకీర్తన గావించారు.
వాత్సల్యాలయములో రాత్రి 9 గం.కు అమ్మనామ సంకీర్తన మహాహారతి జరిగినవి.
14.3.2021: 2వ ఆదివారము హోమశాలలో సౌరహోమము జరిగినది.
హైదరాబాదు వాస్తవ్యలు శ్రీ అచ్యుతుని పిచ్చయ్యశర్మగారు కుటుంబసభ్యులతో జిల్లెళ్ళమూడి వచ్చి “అమ్మకు, నాన్నగారికి, శ్రీ హైమవతీదేవికి అర్చనలు జరిపించుకొని “మాతృశ్రీ గోశాలకు” గోదానము చేశారు.