- 11. 2019 – శ్రీవిశ్వజననీ పరిషత్ వారు శ్రీ అనసూయేశ్వరాలయ ప్రాంగణములో కార్తీక మాస సందర్భముగ వనభోజనములు ఏర్పాటు చేశారు.
2.12.2019 సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భముగ శ్రీ నవనాగేశ్వరాలయములో శ్రీ నాగేశ్వర స్వామికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, విశేష పూజా కార్యక్రమములు జరిగినవి.
7-12-2019: శుద్ధ ఏకాదశి- “శ్రీ అనసూయా వ్రతము” -“అమ్మ” నామ ఏకాహము జరిగినవి.
వివిధ ప్రాంతముల నుండి వచ్చిన “జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరింటల్ కళాశాల పూర్వ విద్యార్థులు (2010-2015) నేడు “అమ్మను, నాన్నగారిని” “శ్రీ హైమవతీదేవిని దర్శించుకొని అందరికీ అన్నప్రసాద వితరణ గావించారు.
8-12-2019 : 2వ ఆదివారం సందర్భముగ హోమశాలలో సౌరహోమము జరిగినది.
సోదరులు, శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావుగారు, శ్రీమతి వైదేహి దంపతుల కుమారుడు, శ్రీ ప్రేమచైతన్య, శ్రీమతి పావని దంపతులు జిల్లెళ్ళమూడిలో నిర్మించుకున్న నూతన గృహప్రవేశము చేసి శ్రీ అనసూయావ్రతము చేసుకొన్నారు. శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ వ్రతకథలు చదివారు. కార్యక్రమమునకు విచ్చేసిన బంధుమిత్రుల ఆవరణలోని సోదరీసోదరులు శ్రీ ప్రేమ చైతన్య దంపతులకు, శుభాశీస్సులు, అభినందనలు తెలిపారు. కార్యక్రమానంతరము అందరికీ అన్నప్రసాద వితరణ గావించారు.
గీతాజయంతి సందర్భముగ విద్యార్థినీ విద్యార్థులు అధ్యాపకులు, సోదరీ సోదరులు పాల్గొన్నారు… శ్రీ రామబ్రహ్మంగారు శ్రీమద్ భగవద్గీత విశిష్టతను వివరించారు. కార్యక్రమములో శ్రీ ఎమ్. దినకర్ గారు, శ్రీ టి.టి. అప్పారావుగారు పాల్గొన్నారు. విద్యార్థినీ విద్యార్థులకు కార్యక్రమమునకు వచ్చిన సోదరీ సోదరులకు భగవద్గీత పుస్తకములు ఇవ్వబడినవి.
9.12.2019: జిల్లెళ్ళమూడిలో శ్రీ సత్యసాయి సేవాసమితి వారు ‘పశువైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ బసవపున్నయ్య గారు. (సంగం డైరీ డైరెక్టర్) డాక్టర్ పున్నయ్య గారు (రిటైర్డ్ ఎ.డి) హైదరాబాద్, డాక్టర్ రజనీకాంత్ (గుంటూరు) డాక్టర్ తిరుమల తేజగారు. (కంకటపాలెం) “గోపాలమిత్ర” ఈశ్వర్ గారు, “వర్ష” కంపెనీ మెడికల్ రిప్రజెంటేటివ్, ఎమ్. కిరణ్ గారు తదితరులు కార్యక్రమములో పాల్గొని పశువైద్య పరీక్షలు నిర్వహించారు. పశువుల యజ మానులకు తగిన సూచనలు సలహాలనందించారు. జిల్లెళ్ళమూడి “మాతృశ్రీ గోశాలలోని గోవులను పరీక్షించి తగు సూచనలు చేశారు. కార్యక్రమములో గోశాల నిర్వాహకులు శ్రీ చక్కా శ్రీమన్నారాయణగారు పాల్గొని వైద్యులకు, సిబ్బందికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు.
10.12.2019: వివిధ ప్రాంతముల నుండి వచ్చిన (2004-2009) మాతృశ్రీ, ఓరియంటల్ కళాశాల పూర్వ విద్యార్థులు నేడు అమ్మను నాన్నగారిని, శ్రీ హైమవతీదేవిని దర్శించుకొని అందరికీ అన్నప్రసాద వితరణ గావించారు.
12–12–2019: పూర్ణిమ సందర్భముగ “శ్రీహైద” నామం ఏకాహము జరిగినది. వాత్సల్యాలయములో రాత్రి 9 గంటలకు అమ్మనామ సంకీర్తన, మహాహారతి జరిగినవి.
13-12-2019: వివిధ ప్రాంతముల నుండి వచ్చిన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పూర్వ విద్యార్థులు (2009-2014) ‘అమ్మను, నాన్నగారిని’ హైమవతీదేవిని దర్శించుకొని అందరికీ అన్నప్రసాద వితరణ గావించారు.
13-12-2019: హైదరాబాద్ వాస్తవ్యులు డాక్టర్ శ్రీమతి జి.పద్మజగారు, వాత్సల్యాలయ సభామందిరంలో ఏర్పాటయిన సభా కార్యక్రమములో పాల్గొని విద్యార్థిను లకు, వ్యక్తిత్వ వికాసము, ఆచరణాత్మక క్రియా స్ఫూర్తి గురించి వివరించారు. వారి ప్రసంగం ఎంతో వివరణా త్మకముగా హృద్యంగా, విద్యార్థినులకు ఉత్సాహపరిచింది.
14-12-2019: డాక్టర్ ఎ. ఇనజకుమారి గారు విద్యార్థినులకు హెల్త్ & వెల్త్ కార్యక్రమము నిర్వ హించారు. ఆరోగ్యపరిరక్షణ విధానములు వివరించారు.
15.12.2019: బహుళ చవితి- హోమశాలలో సంకష్టహర గణపతి హోమము జరిగినది.
16.12.2019: ఆశ్లేషా నక్షత్రము – “అమ్మ” నామ ఏకాహము జరిగినది.
17-12-2019: ధనుర్మాసారంభము – శ్రీ అనసూయేశ్వరాలయములో వేకువనే “నామసంకీర్తన” తిరుప్పావై పఠనము జరుగుచున్నది. విద్యార్థినులు రంగుల రంగవల్లుల్లో గొబ్బెమ్మలను పెడుతున్నారు. జిల్లెళ్ళమూడిలోని అద్భుత ఆధ్యాత్మిక వాతావరణం సందర్శకులకు గొప్ప ఆధ్యాత్మికానుభూతినందిస్తున్నది.
17-12-2019: చిలకలూరిపేట మండలం, పురుషోత్తమపట్నం, శ్రీ సాయిబాబా ఆలయ దత్తమాల దీక్షాపరులు 80 మంది, బాబా ఆలయ ప్రధాన పూజారి శ్రీ మురిగిపూడి లక్ష్మీనారాయణ స్వామి (రుద్రప్రయాగ ఉత్తరాంచల్) గారలతో, నేడు జిల్లెళ్ళమూడి మహాక్షేత్ర సందర్శనమునకు వచ్చి ఆలయముల సందర్శనము చేసుకొని “అమ్మను నాన్నగారిని” శ్రీ హైమవతీదేవిని దర్శించుకొని – అర్చనలు జరిపించుకొని తమ సంతృప్తిని సంతోషమును తెలియజేశారు.