1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అర్కపురి విశేషాలు

అర్కపురి విశేషాలు

K lathika
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : September
Issue Number : 2
Year : 2010

08-07-2010 : అమ్మ ఆలయప్రవేశం జరిగి 25 సంవత్సరం గడచిన సందర్భంగా 14/6 నుండి 8/7 వరకు 25 రోజులు అమ్మ అఖండనామం జరిగింది. ఇందులో ఆవరణలోని వారు జిల్లెళ్ళమూడి గ్రామ భజన బృందాలు అతి ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమం విజయవంతంగావించారు. ఊరిలోని భజన బృందాల వారికి దాదాపు 65 మందికి వారణాసి ధర్మసూరిగారు అమ్మ ప్రసాదంగా నూతన వస్త్రాలు బహుకరించారు. రెడ్డిసుధ ఆధ్వర్యంలో గ్రామభజన బృందాలు పాల్గొన్నాయి.

21-07-2010 : తొలి ఏకాదశి సందర్భంగా అమ్మ నామ ఏకాహం జరిగింది. అనసూయా వ్రతం జరిగింది.

23-07-2010 : ఆయల వరలక్ష్మి (తళుకు) (యు.యస్.ఎ.) నుండి వచ్చి తన పిల్లలు చి॥ రామేశ్వర కౌండిన్య, కుమారి గాయత్రీ కౌండిన్యలతో కలసి హైమవతీ కున్నారు. వ్రతం చేసుకున్నది. అన్నపూర్ణాలయ వేదిక వద్ద కుమారి గాయత్రి హిందుస్థానీ సంగీతం గానం చేసి అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఆమె సోదరుడు చి|| రామేశ్వర్ తబలాపై సహకారం అందించారు. అమ్మ నామంతో పై కార్యక్రమం పరిసమాప్తి గావించారు. ఆవరణలోని వారికి కాలేజి పిల్లలకు మొత్తం 108 మందికి వస్త్రాలు (చీరెలు) హైమ అక్కయ్య ప్రసాదంగా అందచేశారు.

25-07-2010 : ప్రతి ఆదివారం ఉదయం శ్రీ ఎమ్.యస్. శరత్ చంద్రగారు ఆవరణలోని వారికి, కాలేజీ విద్యార్థినులకు, అమ్మ నామం మరియు కర్నాటక సంగీతం నేర్పించడం ప్రారంభించారు.

గురుపూర్ణిమ సందర్భంగా హైమాలయంలో హైమవతీదేవి నామ ఏకాహం చేసారు. సాయంత్రం సంధ్యావందనం అనంతరం వాత్సల్యాలయంలో ఓంకారంపై జ్యోతులు, వరండా అంతా దీపాలు పెట్టి లలితాసహస్రనామం పారాయణ గావించారు. శ్రీ హనుమబాబుగారు అమ్మలోని గురుతత్వాన్ని వివరించారు. పిల్లలమణ్ణి సుబ్రహ్మణ్యంగారు, అమ్మ నామం గానం చేశారు. పైకార్యక్రమం కుమారి మన్నవ సుబ్బలక్ష్మి నిర్వహించగా, కాలేజి విద్యార్థినులు సహకారం అందించారు.

29-07-2010 : సంకట గణేశ హోమము జరిగింది.. సాయంత్రం వినాయకాలయంలో వివిధ రకాల పూలతో, గరికతో, పండ్లరసాలతో గకార గణపతికి పూజ అభిషేకం శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణగారు, శ్రీమతి కమల అక్కయ్య ఆధ్వర్యంలో జరిగింది.

02-08-2010 : శ్రీవారణాసి రామకుమారశర్మ దంపతులు తమ చిన్నారి చి||నాగశివసాయిమూర్తి ద్వితీయ జన్మదినం సందర్భంగా కుటుంబసమేతంగా వచ్చి అనసూయా వ్రతం చేసుకున్నారు

14-08-2010 : శ్రీ గంగవరపు రాంబాబు, శ్రీమతి సుగుణాదేవి తమ పుత్రిక చి॥ల|| సౌ॥ బిందుమాధవి, (అత్తలూరు) వివాహ సందర్భంగా జిల్లెళ్ళమూడిలో హైమాలయంలో వసుంధరక్కయ్యచే పెండ్లికుమార్తెను గావించు కున్నారు. 

నాగులచవితి, నాగపంచమి సందర్భంగా నవనాగనాగేశ్వరాలయంలో విశేషపూజలు జరిగాయి. 13/8న నాగేశ్వరస్వామికి ఆవుపాలతో ఏకాదశ రుద్రాభిషేకం నిత్యహోమాలతో పాటు చండీహోమము జరిగింది. సాయంత్రం లలితా సహస్రనామ పూజ జరిగింది.

సుబ్రహ్మణ్యహోమము, సర్పసూక్తహోమము, రుద్ర హోమము, పూర్ణాహుతి జరిగాయి. గుంటూరు వాస్తవ్యులు శ్రీ సుబ్రహ్మణ్య దీక్షితులుగారు నిర్వహించారు. శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణగారు శ్రీమతి కమల, హైదరాబాద్ నుండి ధర్మసూరిగారు, బెంగుళూరు నుండి రాచర్ల రహి, శ్రీమతి బ్రహ్మాండం శేషు, తెనాలి వాస్తవ్యులు తురిమెళ్ల వెంకటసత్య ఫణికిరణ్ కుమార్ ఇందులో పాల్గొన్నారు.

14-08-2010 నుండి 20-08-10 వరకు అమ్మ సమర్త పేరంటం అన్నపూర్ణాలయం వేదిక వద్ద కడు వైభవంగా జరిగింది. వసుంధర అక్కయ్య ఆధ్వర్యంలో శ్రీ హనుమబాబు గారి సహాయ సహకారాలతో విద్యార్థినులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆవరణలోని అందరూ సాయంత్రం పేరంటానికి హాజరైనారు. మొదటిరోజు హనుమబాబుగారు రెండవరోజు బొళ్ళ వరలక్ష్మి కుమారైలు శ్రీమతి తులసి శ్రీమతి సరోజిని, 3వరోజు శ్రీమతి మన్నవ శేషు, 4వరోజు చీరాల వాస్తవ్యులు వై.వి.సుబ్రహ్మణ్యం (బుద్ధిమంతుడు), 5వరోజు కటిక హనుమయ్య, 6వ రోజు రాచర్ల లక్ష్మీనారాయణగారు 7వరోజు ఎస్.వి.జె.పి. వారు నిర్వహించారు. ఆ రోజు సాయంత్రం సవర్తపేరంటంతో పాటు పెళ్లూరి లక్ష్మి (శేషు అక్కయ్య చెల్లెలు) తమ కుమార్తె పి.శ్రీ హైమకు ఓణీల పేరంటం కూడా చేసారు.

17-08-2010: శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళవారం నోములు నవీనశర్మ భార్య సుందరి, వల్లూరి రమేష్ కూతురు అనూహ్యప్రియలు చేసుకున్నారు.

20-08-2010 : శ్రావణ శుక్రవారం సందర్భంగా హైమవతీదేవి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం మన్నవ శేషు ఆధ్వర్యంలో జరిగింది. ఇతర ప్రదేశాల నుండి వచ్చినవారు, ఆవరణలోని వారు, గ్రామంలోని వారు అందరూ వ్రతం

24-08-2010 : అమ్మ రజస్వలోత్సవ సందర్భంగా 11రోజు పురస్కరించుకుని శ్రీమతి బోళ్ల వరలక్ష్మి అక్కయ్య అమ్మకు నేతి అరిశలు నివేదించి అందరికీ ప్రసాదం పంచారు. జొన్నాభట్ల సీత అక్కయ్య అమ్మ నమర్తపేరంటం పురస్కరించుకుని 11వరోజు ఆలయంలో అమ్మకు పూజ చేసుకుని చిమ్మిలి నివేదించి, అందరికీ పండు తాంబూలం చిమ్మిలి ప్రసాదం పంచారు.

వివిధ కేంద్రాలలో వార్తలు

24-08-2010 : కొండముది ప్రేమకుమార్ శ్రీమతి సుబ్బలక్ష్మి బాపట్లలో 23.7.10న తాముకొన్న నూతన గృహప్రవేశం సందర్భంగా అనసూయావ్రతం చేసుకొన్నారు.

05-08-2010 : అమ్మ ఆగమనోత్సవ సందర్భంగా చీరాల వాస్తవ్యులు శ్రీ పోలిశెట్టి శ్రీరామచంద్రమూర్తి శ్రీమతి సుశీల అక్కయ్య దంపతులచే శ్రీ లలితా లక్షనామార్చన జరుపబడినది. సాయంత్రం శ్రీ సుబ్రహ్మణ్యంగారిచే మహా సంకీర్తన, అమ్మ సంధ్యావందనం నిర్వహింపబడినవి.

08-08-2010 : అమ్మ అనంతోత్సవ సంవత్సర సంబంధంగా పైవారి ఇంటి యందే అమ్మనామ ఏకాహం జరిగింది. ఉదయం సుప్రభాతం సాయంత్రం సంధ్యావందనం, లలితా సహస్రనామ పారాయణ జిల్లెళ్ళమూడి విద్యార్థులు చేసారు. రాత్రి 8 గంటలకు అమ్మ కళ్యాణోత్సవం సి.డి. ప్రదర్శింపబడినది. పై రెండు కార్యక్రమాలు ఎస్.వి.జె.పి. సహకారంతో శ్రీ హనుమబాబు నిర్వహించారు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!